పింఛన్ల మంజూరులో అనర్హులకు పెద్దపీట వేస్తున్నారంటూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీడీవోను నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రంలో అధికార టీడీపీ నాయకులు చెప్పిన వారికే పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటూ సోమవారం ఎంపీడీవో కాశీవిశ్వనాథంపై మండిపడ్డారు.
పింఛన్ల మంజూరులో అనర్హులకు పెద్దపీట వేస్తున్నారంటూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీడీవోను నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రంలో అధికార టీడీపీ నాయకులు చెప్పిన వారికే పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటూ సోమవారం ఎంపీడీవో కాశీవిశ్వనాథంపై మండిపడ్డారు. గ్రామాల్లో పర్యటించి, అర్హులనే ఎంపిక చేస్తామని వారికి ఎంపీడీవో హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి సురేష్‌ముఖర్జీ, మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌రావు తదితరులు కొందరు అర్హులైన లబ్ధిదారులతో కలసి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోను కలిశారు.