మానవత్వం: రోజూ కూలీలే.. అన్నదాతలు | Andhra Pradesh: Inspiring Story Of Dady Helping Foundation Food Banks | Sakshi
Sakshi News home page

Food Banks: రోజూ కూలీలే.. అన్నదాతలు

Published Fri, Aug 6 2021 2:57 PM | Last Updated on Sat, Aug 7 2021 7:46 AM

Andhra Pradesh: Inspiring Story Of Dady Helping Foundation Food Banks - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ‘కరోనా’ పలువురిని బలి తీసుకుని ప్రపంచాన్ని గడగడలాడించడమేకాదు.. పలువురు వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చి మానవత్వాన్ని, దయాగుణాన్ని, సాటి మానవునికి ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించాలనే తపనను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్ట కాలంలో గ్రామాలనుంచి వచ్చిన అనేకమందికి స్వచ్ఛందంగా ఆకలి  తీర్చాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన  20 మంది యువకుల వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమే  ‘డాడీ హెల్పింగ్‌ ఫౌండేషన్‌’ పేరుతో  వెలసిన ఫుడ్‌ బ్యాంకులు.. వాటిపై ప్రత్యేక కథనం. 

రోజు కూలీలే.. అన్నదాతలు.. 
అన్నదానం చేస్తున్న డాడీ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ సభ్యులు శ్రీమంతులు కారు. అలాగని ఉద్యోగస్తులూ కాదు. కూలి, ఇతరత్రా పనులు చేసుకుని బతికేవారే. ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు ట్యాక్సీ డ్రైవర్, మిగతా వారు రకరకాల కూలి పనులు చేసుకునేవారే. తమకు తగినంత స్థోమత లేకపోయినా అన్నార్తుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో.. గుజ్జల సూర్యనారాయణ (ప్రభాస్‌ సూర్య) ఫౌండర్‌గా, శ్రీనివాసరావు మేనేజర్‌గా డాడీ హెల్పింగ్‌  ఫౌండేషన్‌ పేరుతో 2019లో సంస్థను స్థాపించారు. అనంతరం మరో 18మంది యువకులు ఆ సంస్థలో సభ్యులయ్యారు. స్థానికంగా ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే స్వచ్ఛందంగా వారికి అవసరమైనవి సమకూరుస్తూ వస్తున్నారు. 

ఫుడ్‌ బ్యాంకులు ఎలా ఆవిర్భవించాయంటే.. 
కరోనా ఉధృతంగా ఉన్న  సమయంలో వ్యాధి బారిన పడి చికిత్స కోసం మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులను పెద్ద ఎత్తున  రోగులు ఆశ్రయించేవారు. వారికి నయమయ్యేవరకు సంబంధీకులు అక్కడే ఉండేవారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. దాంతో దూర ప్రాంతాల నుంచి వచి్చన రోగుల సహాయకులు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటించేవారు.  అలాంటి వారికి అండగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహారం అందించాయి. అయితే ఆహారం అందుబాటులోకి వస్తున్నా అనేక మంది ఆకలితోనే ఉండిపోయేవారు. మొహమాటంతో ఆహారం తీసుకోవడానికి సిగ్గుపడేవారు. చూసిన వారు ఏమైనా అనుకుంటారేమోనని ఉద్ధేశంతో ఆకలిని సైతం చంపుకునేవారు.

ఇలాంటి వారిని గమనించి, వారికి ఇబ్బంది లేకుండా ఏమైనా చేయగలమా అని డాడీ హెలి్పంగ్‌ ఫౌండేషన్‌ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఆ సమయంలో వారి మదిలో నుంచి వచి్చందే ఫుడ్‌ బ్యాంకుల ఏర్పాటు. వాటిని కరోనా సమయానికే పరిమితం కాకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మండుటెండైనా, జోరు వానైనా శ్రీకాకుళంలోని డే అండ్‌ నైట్‌ జంక్షన్, సెవెన్‌ రోడ్డు జంక్షన్, సూర్యమహల్‌ జంక్షన్‌లో రెండు పూటలా రుచికరమైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. రోజూ రెండు పూటలా సాంబారు, రెండు కూరలు, అన్నం, పెరుగుతో కూడిన పార్సిల్స్‌ను వాహనంలో తీసుకెళ్లి ఫుడ్‌ బ్యాంకులో పెడతారు. ఆకలితో ఉన్న ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. మధ్యాహ్నం 150 మందికి, రాత్రి 105 మందికి భోజనం ప్యాకెట్లను ఫుడ్‌ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుతున్నారు.  

ఆకలితో ఉండకూడదని.. 
కోవిడ్‌ బాధితులకు సేవలందించే సమయంలో కొందరు భోజనం అడిగేందుకు  మొహమాటం పడేవారు. చాలా మంది కష్టాలు చూశాం. అలాంటి వారి కోసమే ఫుడ్‌ బ్యాంకు ఏర్పాటు ఆలోచన చేశాం. 


– గుజ్జల సూర్యనారాయణ , డాడీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు. శ్రీకాకుళం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement