Food Bank
-
విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త?
మీరు విదేశాల్లో ఉంటున్నారా? ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. స్థానిక చట్టాలు, సంస్థల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వీడియోలు తీశారా? ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఉన్న ఫళంగా పెట్టెబేడా సర్ధుకుని స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదేదో బయపెట్టే ప్రయత్నం కాదు. విదేశాల్లో ఉంటున్నవారి సంరక్షణ కోసం కాస్త అవగాహన కల్పించే ఉద్దేశమేనని గుర్తించాలని విజ్ఞప్తి. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన మేహుల్ ప్రజాపతి కెనడాలో ఉంటూ స్థానిక ప్రముఖ టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు కెనడా దేశం గురించి, అక్కడి సదుపాయాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తుంటాడు. అంతవరకు బాగానే ఉన్నా..కెనడాలో డబ్బు ఆదా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు గురించి వివరించాడు. ఫలితంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో జాబ్ లేక స్వదేశానికి తిరిగే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. this guy has a job as a bank data scientist for @TD_Canada, a position that averages $98,000 per year, and proudly uploaded this video showing how much “free food” he gets from charity food banks.you don’t hate them enough. pic.twitter.com/mUIGQnlYu6— pagliacci the hated 🌝 (@Slatzism) April 20, 2024 ఇంతకీ ఏం జరిగింది?మెహుల్ ప్రజాపతి టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతని జీతం ఏడాది రూ.81లక్షలు. అవి సరిపోకపోవడంతో డబ్బుల్ని ఆదా చేసేందుకు కెనడాలో విద్యార్ధులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంక్‌లు ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంక్‌ల నుంచి విద్యార్ధులు ఆహారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆహారాన్ని మెహుల్ ప్రజాపతి ప్రతినెల తెచ్చుకుంటున్నట్లు, తద్వారా నెలా ఆహారం, కిరాణా సామాగ్రి ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు. అంతేకాదు ఓ వీడియోలో తాను వారానికి సరిపడ బోజనాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని, వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్‌లు, పాస్తా, క్యాన్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయని ఆ వీడియోలో చూపించాడు. update: the food bank bandit was fired https://t.co/RFLqvVGJb1 pic.twitter.com/CDdrfrmbqI— pagliacci the hated 🌝 (@Slatzism) April 22, 2024 విధుల నుంచి తొలగిస్తూ దీంతో టీడీ బ్యాంక్ మెహుల్ ప్రజాపతిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌ల నుండి మెహుల్ ఎలా తెచ్చుకుంటాడు. కెనడాలో ఉంటూ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటారు. ఏడాది సుమారు 80లక్షల జీతం తీసుకుంటున్న మీరు ఫుడ్ బ్యాంక్‌ల నుంచి ఆహారం తీసుకోవడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చింది. అతడిని విధుల నుంచి తొలగించింది. సంబంధిత మెయిల్స్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్‌బ్యాంకులు
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్‌బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు. – పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్ ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్‌బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్‌బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్‌బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. ఏ శుభ, అశుభ కార్యమైనా... ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్‌బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్‌బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్‌బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు. ఫుడ్ బ్యాంకుల నిర్వహణ ఇలా... ► ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫుడ్‌బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది. ► కోటకూడలిలోని ఫుడ్‌బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది. ► ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది. ► పోలీస్ బ్యారెక్స్ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వడ్డించే పదార్థాలు అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు) ఫుడ్‌బ్యాంకులలో అన్నదానం ఇలా... ► ప్రతిరోజు ఒక ఫుడ్‌బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్‌బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు. ► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్‌బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్‌బ్యాంక్‌లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్‌బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్‌బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్‌లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి ఫుడ్‌బ్యాంక్‌ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం. – రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ ఆనందంగా ఉంది ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్‌బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది. – జె.రవితేజ, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ క్యారేజీ అవసరంలేదు.. విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – రీసు పైడితల్లి, గొట్లాం ఆకలితీర్చుతోందయ్యా.. నేను కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్ బ్యారెక్ వద్ద ఉన్న ఫుడ్‌బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి. – రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ -
ఆకలి తీర్చుతున్న ఫుడ్ బ్యాంకులు
పారబోసిన ప్రతీ మెతుకుతో మరొకరి ఆకలి తీర్చవచ్చన్న మాట.. విజయనగరంలోని పాలకులు, అధికారులు, దాతల్లో ఓ కొత్త ఆలోచనను పుట్టించింది. ఫుడ్ బ్యాంకుల ఏర్పాటుకు నాంది పలికింది. ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా పేదలకు పట్టెడన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్ బ్యాంకులను సంప్రదిస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని, ఆహారాన్ని సమకూర్చుతున్నారు. పట్టణానికి వచ్చే అభాగ్యులు.. స్థానికంగా నివసించే పేదల ఆకలి తీర్చడంలో భాగస్వాములవుతున్నారు. అన్నదాన క్రతువును నిరంతరాయంగా కొనసాగించేందుకు తమవంతు సహకరిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2018 సంవత్సరం జూలై 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరంలో రెండు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రూ.5కు భోజనం పెట్టేవారు. మిగతా ఖర్చును ప్రభుత్వం నిర్వాహకులకు చెల్లించేది. అందుకే రోజూ తినేవారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే ఆరోపణలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ఉచితంగా అన్నంపెట్టే ఫుడ్ బ్యాంక్‌లు విజయనగరంలో నాలుగుచోట్ల విజయవంతంగా పనిచేస్తున్నాయి. కరోనా తర్వాత గత ఏడాది ఆగస్టు 13 నుంచి రోజూ కనీసం 400 మంది ఆకలి తీర్చుతున్నాయి. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారం అందిస్తున్నారు. సేవాభావంతో సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: దానాల్లో అన్నదానం గొప్పదనేది నానుడి. అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఓ యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి చొరవతో ప్రతిపాదించిన ఫుడ్బ్యాంకులపై కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. అలా ప్రయోగాత్మకంగా నాలుగు ప్రాంతాల్లో ఫుడ్‌బ్యాంకులు ఏర్పాటయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, కోట జంక్షన్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్, పోలీస్ బ్యారక్స్ ప్రాంతాల్లో 2021, ఆగస్టు 13వ తేదీ నుంచి నిరాటంకంగా పేదల ఆకలిని తీర్చుతున్నాయి. ఆ ఫుడ్ బ్యాంకుల నిర్వహణకు వీలుగా ఒక్కోటి రూ.85వేల ఖర్చుతో షెడ్లను నిర్మించారు. దాతలు అందించే ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేశారు. ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.... నగరానికొచ్చే పేదలెవరైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేకుండా నాలుగు ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని అందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను పలు స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నాయి. కోట కూడలి వద్ద గల ఫుడ్‌బ్యాంక్‌ను హోటల్ అసోసియేషన్, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఫుడ్‌బ్యాంక్ పంచముఖ ఆంజనేయస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎన్సీఎస్ థియేటర్ వద్ద గల ఫుడ్‌బ్యాంకును జిల్లా గౌరీ సేవా సంఘం, పోలీస్ బ్యారక్స్ వద్ద గల ఫుడ్‌బ్యాంకు కన్యకాపరమేశ్వరి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో సాగుతోంది. ఈ నాలుగు ఫుడ్‌బ్యాంకుల ద్వారా రోజూ కనీసం 400 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలు, వివా హ వార్షికోత్సవాలు ఇతరత్రా శుభకార్యాల సందర్భాల్లో అన్నదానం చేయాలనుకునేవారికి ఫుడ్‌బ్యాంకుల్లో అవకాశం కలి్పస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో తెరిచిన రెండు అన్నా క్యాంటీన్లు పేదలకు తిండి పెట్టే మాటేమోకానీ పలు అక్రమాలకు నెలవయ్యాయి. విజయనగరం మున్సిపల్ కార్యాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్ష ప్రాంతాల్లోని అన్నా క్యాంటీన్లలో రోజూ భోజనం తినే వారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే అపవాదు మూటగట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అన్నా క్యాంటీన్ల పేరిట హడావుడి చేస్తున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరానికి ఏదో ఒక పనికోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చే పేదలకు ఉచితంగా ఆకలి తీర్చాలనేది ఫుడ్‌బ్యాంకుల లక్ష్యం. నాలుగు ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం శుభ పరిణామం. – రెడ్డి శ్రీరాములునాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ -
మానవత్వం: రోజూ కూలీలే.. అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘కరోనా’ పలువురిని బలి తీసుకుని ప్రపంచాన్ని గడగడలాడించడమేకాదు.. పలువురు వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చి మానవత్వాన్ని, దయాగుణాన్ని, సాటి మానవునికి ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించాలనే తపనను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్ట కాలంలో గ్రామాలనుంచి వచ్చిన అనేకమందికి స్వచ్ఛందంగా ఆకలి తీర్చాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది యువకుల వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమే ‘డాడీ హెల్పింగ్ ఫౌండేషన్’ పేరుతో వెలసిన ఫుడ్ బ్యాంకులు.. వాటిపై ప్రత్యేక కథనం. రోజు కూలీలే.. అన్నదాతలు.. అన్నదానం చేస్తున్న డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు శ్రీమంతులు కారు. అలాగని ఉద్యోగస్తులూ కాదు. కూలి, ఇతరత్రా పనులు చేసుకుని బతికేవారే. ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు ట్యాక్సీ డ్రైవర్, మిగతా వారు రకరకాల కూలి పనులు చేసుకునేవారే. తమకు తగినంత స్థోమత లేకపోయినా అన్నార్తుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో.. గుజ్జల సూర్యనారాయణ (ప్రభాస్ సూర్య) ఫౌండర్‌గా, శ్రీనివాసరావు మేనేజర్‌గా డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ పేరుతో 2019లో సంస్థను స్థాపించారు. అనంతరం మరో 18మంది యువకులు ఆ సంస్థలో సభ్యులయ్యారు. స్థానికంగా ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే స్వచ్ఛందంగా వారికి అవసరమైనవి సమకూరుస్తూ వస్తున్నారు. ఫుడ్ బ్యాంకులు ఎలా ఆవిర్భవించాయంటే.. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వ్యాధి బారిన పడి చికిత్స కోసం మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులను పెద్ద ఎత్తున రోగులు ఆశ్రయించేవారు. వారికి నయమయ్యేవరకు సంబంధీకులు అక్కడే ఉండేవారు. అదే సమయంలో లాక్డౌన్ కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. దాంతో దూర ప్రాంతాల నుంచి వచి్చన రోగుల సహాయకులు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటించేవారు. అలాంటి వారికి అండగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహారం అందించాయి. అయితే ఆహారం అందుబాటులోకి వస్తున్నా అనేక మంది ఆకలితోనే ఉండిపోయేవారు. మొహమాటంతో ఆహారం తీసుకోవడానికి సిగ్గుపడేవారు. చూసిన వారు ఏమైనా అనుకుంటారేమోనని ఉద్ధేశంతో ఆకలిని సైతం చంపుకునేవారు. ఇలాంటి వారిని గమనించి, వారికి ఇబ్బంది లేకుండా ఏమైనా చేయగలమా అని డాడీ హెలి్పంగ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఆ సమయంలో వారి మదిలో నుంచి వచి్చందే ఫుడ్ బ్యాంకుల ఏర్పాటు. వాటిని కరోనా సమయానికే పరిమితం కాకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మండుటెండైనా, జోరు వానైనా శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ జంక్షన్, సెవెన్ రోడ్డు జంక్షన్, సూర్యమహల్ జంక్షన్లో రెండు పూటలా రుచికరమైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. రోజూ రెండు పూటలా సాంబారు, రెండు కూరలు, అన్నం, పెరుగుతో కూడిన పార్సిల్స్‌ను వాహనంలో తీసుకెళ్లి ఫుడ్ బ్యాంకులో పెడతారు. ఆకలితో ఉన్న ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. మధ్యాహ్నం 150 మందికి, రాత్రి 105 మందికి భోజనం ప్యాకెట్లను ఫుడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆకలితో ఉండకూడదని.. కోవిడ్ బాధితులకు సేవలందించే సమయంలో కొందరు భోజనం అడిగేందుకు మొహమాటం పడేవారు. చాలా మంది కష్టాలు చూశాం. అలాంటి వారి కోసమే ఫుడ్ బ్యాంకు ఏర్పాటు ఆలోచన చేశాం. – గుజ్జల సూర్యనారాయణ , డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. శ్రీకాకుళం. -
పేదల ఆకలితీరుస్తున్న వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులు : గుంటూరు
-
గుంటూరులో వైఎస్సార్ ఫుడ్‌బ్యాంక్
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరపాలకసంస్థ స్థానిక గాంధీపార్క్ కూడలిలో వైఎస్సార్ ఫుడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి, ఆహారం అధికంగా ఉన్నవారికి వార«ధిగా నిలిచే పుణ్యకార్యక్రమం ‘వైఎస్సార్ ఫుడ్ బ్యాంక్’ అని చెప్పారు. నగరపాలక సంస్థ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఆకలితో బాధపడేవారులేని నగరంగా గుంటూరు మారాలని ఆకాంక్షించారు. మనం వృధా చేస్తున్న ఆహారాన్ని ఇకమీదట ఫుడ్‌బ్యాంక్‌లో ఉంచడం వల్ల ఎందరో అభాగ్యులకు ఆకలి తీరుతుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ అనూరాధ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మ«ధుసూధన్‌రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరులో వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులు ప్రారంభం
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు): ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార వృథాను అరికట్టి అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో ఆరుచోట్ల వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకుల్లో ఫ్రీజ్ లను అందుబాటులో ఉంచింది. ఆహారం సేకరించి వీటిల్లో నిల్వ చేసి భోజనానికి ఇబ్బంది పడే పేదల పొట్ట నింపనుంది. సోమవారం ఈ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెయ్యిలీటర్ల సామర్థ్యంతో.. నగరంలో రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్టాండ్, జీజీహెచ్, లాడ్జిసెంటర్, గాంధీ పార్కు, చుట్టుగుంట ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫుడ్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఫ్రిజ్‌లలో నాజ్‌వెజ్, వెజ్‌కు విడివిడిగా ర్యాక్‌లు ఉంటాయి. మిగిలి పోయిన ఆహారాన్ని ఈ ర్యాక్‌లలో ఉంచితే సరిపోతుంది. ఈ బ్యాంకుల నిర్వహణకు అధికారులు రెండు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. వీరు దాతల నుంచి ఆహారాన్ని సేకరించి ర్యాక్‌లలో నిల్వ చేస్తారు. అన్నార్తులు వస్తే వారికి భోజనాన్ని అందిస్తారు. ఈ ఫుడ్ బ్యాంకులపై విస్తృత ప్రచారం చేసేందుకూ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఈ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లో అమలవుతోంది. పాతదుస్తులూ సేకరణ ఈ ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని మాత్రమే కాకుండా పాత దుస్తులనూ సేకరిస్తారు. ఎవరైనా తమ పాత దుస్తులు ఇక్కడ అందజేస్తే ప్రత్యేక ర్యాక్‌లలో భద్రపరిచి అవసరం ఉన్నవారికి అందిస్తారు. ఫుడ్‌బ్యాంకుల పరిశీలన వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులను ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. -
చైనాని హెచ్చరించిన ట్రంప్
-
ఫుడ్ బ్యాంక్స్ వద్ద జనం క్యూ
వాషింగ్టన్/బీజింగ్: అమెరికాలో కోవిడ్–19 ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో మూడు పూటలా గడవని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల ఎదుట అమెరికన్లు క్యూలు కడుతున్నారు. న్యూ ఓర్లాన్సీ నుంచి డెట్రాయిట్ వరకు ఇదే పరిస్థితి. ఇలా ఫుడ్ బ్యాంకుల దగ్గరకి వెళ్లడం చాలా మందికి ఇదే మొదటిసారి. పెన్సిల్వేనియాలో ఒక ఫుడ్ సెంటర్ దగ్గర ఏకంగా వెయ్యి కార్లు క్యూలో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓహియోలో రాత్రికి రాత్రి ఫుడ్ సెంటర్లలో 30 శాతం డిమాండ్ పెరిగిపోయింది. తమ వంతు రావడానికి గంటలు గంటలు సమయం పడుతోంది. చైనాని హెచ్చరించిన ట్రంప్ కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి అంశంలో చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణం చైనాయేనని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘‘వైరస్ వ్యాప్తి గురించి చైనా తెలిసి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించిందని వెల్లడైతే తేలిగ్గా తీసుకోం. 1917 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం చూడలేదు. పరిణామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి’’అని హెచ్చరించారు. ఈ సంక్షోభ సమయంలో చైనా కోవిడ్‌పై పారదర్శకంగా లేకపోవడం, మొదట్లో అమెరికా అందించిన సాయాన్ని స్వీకరించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైరస్ భయోత్పాతం సృష్టిస్తుందని వాళ్లకి ముందే తెలుసునని అందుకే అమెరికా సాయం చేస్తానన్నా అంగీకరించలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇక మరణాల సంఖ్య విషయంలో కూడా చైనా నిజాలు దాస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా కంటే కూడా చైనాలోనే మృతుల సంఖ్య ఎక్కువ ఉండి ఉంటుందని అన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ముందున్న జో బిడెన్‌కు చైనా మద్దతు ఉందని ట్రంప్ ఆరోపించారు. బిడెన్ విజయం సాధిస్తే అమెరికాను చైనా ఆక్రమించుకుంటుందని జోస్యం చెప్పారు. బిడెన్ వాణిజ్య విధానాల వల్ల ప్రజలకి ఒరిగేదేమీ ఉండదన్నారు. ► స్పెయిన్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ఆదివారం 410 మంది మరణించారు. నెల రోజులుగా నమోదైన మృతుల్లో ఇదే అత్యంత తక్కువ. కరోనా వైరస్ రావడానికి ముందు ప్రపంచయాత్రకి బయల్దేరిన కోస్తా డెలిజియోసా అనే నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకోనుంది. 1831 మంది ప్రయాణికులతో ఉన్న ఈ నౌక 15 వారాలు ప్రపంచ యాత్ర చేసింది. అందులో ప్రయాణికులెవరికీ వైరస్ సోకలేదని నౌకని నడిపిన కంపెనీ అధికారులు ఉన్నారు. ► రష్యాలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24 గంటల్లో 6,060 కేసులు నమోదయ్యాయి. ► బ్రిటన్‌లో కరోనాతో ఇప్పటివరకు 15 వేల మందికి పైగా మృతి చెందారు. వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్ చైనాలోని వూహాన్లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డైరెక్టర్ యాన్ జిమింగ్ ఆదివారం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందంటూ మాటలు విసిరి ప్రజల్ని తప్పుదోవ పట్టించదం దురదృష్టకరమని యాన్ అన్నారు. మరోవైపు వూహాన్లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. -
హైదరాబాద్ సిటీలో ఆకుపచ్చ ఫ్రిడ్జ్‌లు!
సాక్షి, హైదరాబాద్: ఆకలికి పేదా, గొప్పా, చిన్నా, పెద్దా అనే అంతరంలేదు. ఆకలిబాధ అందరికీ అనుభవమే.. ఈ నేపథ్యంలో ఆకలేస్తే అన్నంపెడతా.. అంటోంది ఫుడ్‌బ్యాంకు. హైదరాబాద్‌లో ఇలాంటి ఫుడ్‌బ్యాంకులు అన్నార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య కూడళ్లు.. ఇలా 35 ప్రదేశాల్లో ఆకుపచ్చ ఫుడ్ ఫ్రిడ్జ్ (అన్నంపెట్టె)ల రూపంలో ఫుడ్‌బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆకలిగొన్నవారికి, ఆహారదాతలకు బ్రిడ్జ్‌లా ఈ ఫ్రిడ్జ్‌లు మారాయి. ఆహారం మిగిలిపోయిన చోటు నుంచి ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని చేర్చడం, ఆహారం పాడు కాకుండా కూడా నిల్వ ఉంచడం ‘ఫీడ్ ద నీడ్’లక్ష్యం. స్పందన బాగుంది.. కిమ్స్. నిమ్స్, నిలోఫర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌లలో ఎక్కువగా ఆహారం జమ అవుతోంది. ఇక్కడ రోజు కు 40 మంది చక్కటి ఆహారాన్ని పొందగలుగుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఎన్జీవోల సహకారం ఉన్నచోట మాత్రమే ఫ్రిడ్జ్‌ను ఏ ర్పాటు చేశారు. అవి ఒక దివ్యాంగ వ్యక్తిని ఆ ఫ్రిడ్జ్ పర్యవేక్షణ, శుభ్రత కోసం నియమించి భోజనంతోపాటు రూ.6 నుంచి 7 వేల జీతం ఇస్తున్నాయి. నీడి కాదు నీడ్ .. నగరంలో 150 అన్నపూర్ణ సెంటర్లున్నాయి. అవి మధ్యాహ్నం వేళ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ వద్దకు ఏ వేళలో అయినా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికెళ్లేవారు... ఇలా ఎవరైనా సరే ఆకలితో వస్తే ఇక్కడ ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది. దాతల కోసం యాప్... ఫీడ్ ద నీడ్ యాప్‌ను వారం క్రితం జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఇప్పటికీ 800 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే, ఇది ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌కి వారం రోజుల్లో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆహారం ఇవ్వాలనుకున్న దాతలు ఈ యాప్ ద్వారా తెలియ చేయవచ్చు. వెబ్సైట్లో ఫ్రిడ్జ్ లింక్‌లున్నాయి. ఫ్రిడ్జ్‌లు విరాళంగా అందించాలనుకునేవారు మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించవచ్చు. ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వచేయవచ్చు యాపిల్ హోం అనాథాశ్రమం వారు మొదటి ఫుడ్‌బ్యాంక్(రిఫ్రిజిరేటర్)ని శిల్పారామంలో ఏర్పాటు చేశారు. సమీప హోటళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయే ఆహారాన్ని ఈ సేవసంస్థలకు తెలిపి అవసరం ఉన్నవారికి అందేలా చెయ్యవచ్చు. తిండి పదార్థాలను ఇవ్వాలనుకునేవారు నేరుగా వచ్చి ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చు. రాబిన్‌హుడ్ ఆర్మీ వాలంటీర్లు దాతలిచ్చే ఆహారాన్ని తీసుకెళ్లి ఆకలిగా ఉన్నవారికి అందజేస్తారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో ఆహారపదార్థాలను నిల్వచేయవచ్చు. 100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తాం... ఫిబ్రవరిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో నీడి అని కాకుండా నీడ్ అని వాడాం. ఎవరికి ఆకలి అయితే వారు ఆహారాన్ని తీసుకుని తినవచ్చు. నగరంలో 35 ఫుడ్‌బ్యాంకులు ఏర్పాటు చేశాం. ఇన్ని ఫ్రిడ్జ్‌లు పెట్టిన ఘనత మన నగరానిదే. దుబాయ్ లాంటి నగరాల్లో 10 లోపే ఉన్నాయి. గత నెలలోనే ఈ ఫుడ్‌బ్యాంక్‌ల దగ్గర ఫుడ్ తీసుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. చాలామంది దాతలు ఫ్రిడ్జ్‌ల ఏర్పాటుకు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా 100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ఉన్నాం. – హరిచందన, జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ -
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
-
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
బోస్టన్ : భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరోసారి నిరూపించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ ద్వారా మిత్రుల సహకారంతో శ్రీని గొండి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారుగా 500 పౌండ్ల ఆహార పదార్థాలను వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఆకలితో ఉన్న అభాగ్యులకు అందించింది. -
ఆకలి మెడలో ఆహారం
నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు సైతం నోచుకోని నిర్భాగ్యుల కోసం ఏర్పాౖటెందే హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్. అదే సమయంలో తిండి ‘కొన’లేని వారికి, ఆహారాన్ని వృథా చేస్తున్న వారికి మధ్య వారధిగా నిలుస్తోంది ఈ సంస్థ. మీకు అవసరం లేని ఆహారం కనీసం మరో ఐదు కడుపులు నింపేందుకు పనికొస్తే.. అంతకు మించి మీకు కావాల్సిందేముంటుంది? అనే ప్రశ్నతో ఆలోచన రేకెత్తిస్తోందీ సంస్థ. అయితే మీరు దానమిచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడమని సూచిస్తోంది. ఇంట్లో తయారైన ఆహారాన్ని మాత్రమే సేకరించి పంపిణీ చేస్తామంటున్నారు వీరు. అవసరమైన వారికి డబ్బు ఇవ్వడం కన్నా నాణ్యమైన ఆహారం అందించడమే సరైందిగా భావిస్తామంటున్నారు. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి ఐదుగురు స్నేహితుల ఆలోచన... అబ్దుల్ అజీజ్, దిలీప్, ఇక్బాల్, సత్య, అబ్దుల్ సలాం... అనే ఐదుగురు స్నేహితుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ ఫుడ్ బ్యాంక్ గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 8700కి Sపైగా మంది ఫేస్బుక్ పేజీలో వీరికి బాసటగా నిలుస్తున్నారు. కనీసం 60 మంది చురుకైన వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి ఫుడ్ డ్రైవ్‌లో కేవలం 34 ప్యాకెట్ల ఆహారం మాత్రమే సేకరించి అందించగలిగారు. అదే ఇప్పుడు ఒక్కో ఫుడ్ డ్రైవ్‌కి సగటున 500కు పైనే అవసరార్థులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, రాణిగంజ్, అత్తాపూర్, దిల్సుఖ్నగర్, చార్మినార్, కూకట్పల్లి, తార్నాక, శ్రీనగర్‌కాలనీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, బేగంపేట, హెచ్ఎంటీ నగర్, మలేసియన్ టౌన్షిప్, సోమాజిగూడ, శివం రోడ్, పద్మారావునగర్, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఆహారం సేకరిస్తున్నారు. విదేశాల నుంచి కొందరు బ్రెడ్, బిస్కట్స్, లస్సీ ప్యాకెట్స్... వగైరాలను ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా వీరికి పంపిస్తున్నారు. వీరు పొరపాటున కూడా డబ్బును స్వీకరిం చరు. వృద్ధులు, నిరాశ్రయులు, వికలాంగులు, ఫుట్‌పాత్‌ల మీద నివసించే వారికి ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. లక్ష్యం.. హంగర్ ఫ్రీ సిటీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు, గృహిణులు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. హైదరాబాద్‌ని హంగర్ ఫ్రీ సిటీ (ఆకలి ఛాయల్లేని నగరం)గా మార్చాలనేదే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ప్రస్తుతం ప్రతి ఆదివారం మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వీరు.. భవిష్యత్తులో వారానికి మూడు రోజులు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఒక్కో సమయంలో ఆహారం లభిస్తున్నా సరిపడా వలంటీర్లు లేకపోవడంతో సేకరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక్కోసారి అనూహ్యంగా భారీ పరిమాణంలో లభిస్తున్న ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా కష్టమవుతోందన్నారు. ‘మరింత మంది చురుకైన వలంటీర్ల కోసం చూస్తున్నాం. మాకు ఎవరైనా ఆహారం అందించాలనుకుంటే ఇంట్లో వండిన ఆహార పదార్ధాలు, అవీ తాజాగా ఉన్నవి మాత్రమే చక్కగా ప్యాక్ చేసి అందించాల’ని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కు అందించడం మాత్రమే కాకుండా అవి పంపిణీ చేసే సమయంలో ఆసక్తి ఉంటే తమతో కలిసి రావచ్చునని చెప్పారు. ఆహారం అందించండి... ఆదుకోండి వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఒకే రోజున 4050 మందికి ఆహారం పంపిణీ చేయడం తాము చేసిన కార్యక్రమాల్లో అతి పెద్దదని చెప్పారు. అదే విధంగా చిల్డ్రన్ ఫుడ్ డ్రైవ్ కూడా చేపట్టామన్నారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, పండుగల సందర్భంగా కూడా ప్రత్యేకమైన ఫుడ్ డ్రైవ్‌లు చేపడుతున్నామని చెప్పారు. వృథా అయిందే కాకపోయినా.. వారంలో ఒక రోజు సాంబారన్నం లేదా వెజిటబుల్ రైస్, పోహ, పండ్లు, ఇడ్లీలు, దోసెలు... ఇలా ఏదైనా సరే వండి చక్కగా ప్యాక్ చేసి స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కి అందించాలని కోరారు. సేకరించిన ఆహారాన్ని ఏదో ఒక వాహనంలో తీసుకెళ్లి అవసరార్థులకు అందజేస్తామన్నారు. ఆహారం అందించాలి అనుకున్నా, గ్రూప్‌లో జాయిన్ కావాలన్నా ఈ నంబర్లలో సంప్రదించండి 9160508054, 9700524806 హైదరాబాద్ పుడ్ బ్యాంక్ సంస్థ గ్రూపు సభ్యులు