ఫుడ్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సజ్జల
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరపాలకసంస్థ స్థానిక గాంధీపార్క్ కూడలిలో వైఎస్సార్ ఫుడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి, ఆహారం అధికంగా ఉన్నవారికి వార«ధిగా నిలిచే పుణ్యకార్యక్రమం ‘వైఎస్సార్ ఫుడ్ బ్యాంక్’ అని చెప్పారు. నగరపాలక సంస్థ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఆకలితో బాధపడేవారులేని నగరంగా గుంటూరు మారాలని ఆకాంక్షించారు.
మనం వృధా చేస్తున్న ఆహారాన్ని ఇకమీదట ఫుడ్‌బ్యాంక్‌లో ఉంచడం వల్ల ఎందరో అభాగ్యులకు ఆకలి తీరుతుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ అనూరాధ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మ«ధుసూధన్‌రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment