Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

October 31st is the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel1
పటేల్‌కూ, నెహ్రూకూ పడదంటారా?

ఇండియా ఈ ఏడాది అక్టోబర్‌ 31నసర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్‌ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్‌ భాయ్‌ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్‌ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్‌ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్‌ భాయ్‌ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్‌ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్‌ భాయ్‌ 1925–30 కాలంలో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్‌ (గుజరాత్‌) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్‌ లండన్‌ వెళ్లి బారిష్టర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్‌ పోర్టు, టికెట్‌ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్‌ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్‌ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్‌ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్‌ పోర్టు, టికెట్‌తో నేను లండన్‌ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్‌ సరే అనడమే కాకుండా విఠల్‌ లండన్‌ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్‌ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్‌ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్‌ సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్‌ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్‌ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్‌ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్‌ గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీ, అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్‌ రాజ్‌ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్‌ వల్లభ్‌ భాయ్‌’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్‌ కౌన్సిల్‌ సారథిగా పటేల్‌ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్‌ లాల్‌ నెహ్రూ అలహాబాద్‌ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్‌ దాస్, పాట్నా టౌన్‌ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్‌ భాయ్‌ పటేల్‌ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్‌ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్‌ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్‌ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్‌’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్‌లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్‌– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్‌ భాయ్‌ పటేల్‌– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్‌ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్‌ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్‌– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్‌ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్‌ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్‌ పటేల్‌ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్‌)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్‌ – ఎ లైఫ్‌’ గ్రంథకర్త-రాజ్‌మోహన్‌ గాంధీ

Telangana govt inks Rs 10500 crore MoU with Japanese IT firms during CM Revanth visit2
పెట్టుబడులు రూ.11,062 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: జపాన్‌ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం రూ. 11,062 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎన్‌టీటీ డేటాతోపాటు ఏఐ–ఫస్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్‌ నుంచి బోర్డు సభ్యుడు కెన్‌ కట్సుయామా, డైరెక్టర్‌ తడావోకి నిషిమురా, ఎనీ్టటీ గ్లోబల్‌ డేటా సెంటర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌ బాజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్‌టీటీ గ్లోబల్‌ డేటా చైర్మన్‌ శరద్‌ సంఘీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోక్యో హెడ్‌ క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్‌టీటీ డేటా.. 50కిపైగా దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్‌–3 డేటా సెంటర్‌ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ కంప్యూట్‌ మౌలిక సదుపాయం హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్‌ క్లస్టర్‌ 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలను సమకూర్చనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్వరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ క్యాంపస్‌ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించనుందని.. రాష్ట్ర డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌కు దోహదపడుతుందని వివరించాయి. మూడో పరిశ్రమకు తోషిబా అనుబంధ సంస్థ ఓకే.. హైదరాబాద్‌ శివార్లలోని రుద్రారంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల పరిశ్రమను విస్తరించేందుకు తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (టీటీడీఐ) ముందుకొచి్చంది. రూ. 562 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. రుద్రారంలో సర్జ్‌ అరెస్టర్స్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌గేర్‌ (జీఐఎస్‌) తయారీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.ఇప్పటికే రెండు పరిశ్రమలకు తోడుగా అదనంగా ఇది మూడో పరిశ్రమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా కార్పొరేషన్‌ ఎనర్జీ బిజినెస్‌ డైరెక్టర్‌ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా పాల్గొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులు: సీఎం రేవంత్‌ తెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సింగిల్‌ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్‌ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్‌ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్‌ హబ్‌గా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి.. జపాన్‌ పారిశ్రామికవేత్తలతో సీఎం తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన టోక్యోలో జరిగిన ‘ఇండియా–జపాన్‌ ఎకనామిక్‌ పార్టనర్‌íÙప్‌ రోడ్‌ షో’లో 150 మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘టోక్యో గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్‌ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణగల వారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణులు, స్థిరమైన విధానాలను తమ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్‌ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్‌ సైన్సెస్, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు, ఎల్రక్టానిక్స్, విద్యుత్‌ వాహనాలు, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూలతలను వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పారిశ్రామికవేత్తలకు వివరించారు.సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్, జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుటానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. రాష్ట్ర పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులుతెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సింగిల్‌ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్‌ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్‌ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్‌ హబ్‌గా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.

Amit Shah escalates criticism of Tamil Nadu Chief Minister MK Stalin3
కత్తులతోనే పొత్తు పొడుపు!

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్‌ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్‌ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్‌ నాగేంద్రన్‌ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్‌ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్‌ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్‌ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్‌ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్‌ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్‌ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్‌ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి.

Government Medical Examination Centers Not Fully Useful for Poor people4
డయాగ్నొస్టిక్స్‌ డల్‌!

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌’ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. రూ. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైద్య పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత కూడా నెలకొంది. దీంతో చాలా జిల్లాల్లో పేదలు అనివార్యంగా రూ. వేలు ఖర్చుపెట్టి మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 32 జిల్లాల్లో హబ్స్‌.. 1,546 చోట్ల స్పోక్స్‌ జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) ప్రధాన హబ్‌గా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ఏర్పాటైంది. ఆపై రాష్ట్రవ్యాప్తంగా హబ్‌లను విస్తరించారు. ప్రస్తుతం నారాయణపేట, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 32 బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, పాథలాజీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్‌ ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన 1,546 చోట్ల స్పోక్స్‌ (చిన్న కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. తక్షణమే వచ్చే పరీక్షల ఫలితాలను స్పోక్స్‌లలో, ఇతర వైద్య పరీక్షలను హబ్‌లలో నిర్వహిస్తున్నారు.పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు 32 హబ్‌లలో ఉన్నాయి. సాధారణ మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదలుకొని మూత్రపిండాల వ్యాధి నిర్ధారణకు క్రియాటిన్‌ పరీక్షల వరకు, కేన్సర్‌ పరీక్షకు వినియోగించే సీరం–ఎలక్ట్రోఫొరెసిస్‌ యంత్రాల వరకు హబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. పాథాలజీ, రేడియాలజీ సేవలు, అ్రల్టాసౌండ్, టెలి ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్, 2డీ ఎకో పరీక్షలన్నీ ఈ కేంద్రాల్లో జరుగుతాయి. ఏదైనా తగ్గని జబ్బుతో రోగి బాధ పడుతుంటే ఆ జబ్బు మూలాలను కనుక్కొని, తగిన మందులు సిఫారసు చేసేందుకు వీలుగా ‘కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ’టెస్టులు కూడా ఈ హబ్‌లలో జరిపేందుకు వీలుంది. ల్యాబ్‌ టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 32 హబ్‌లలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లలో ‘కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ’పరీక్షల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన వైద్య పరికరాలను తెచ్చిపెట్టారు. అందుకు సంబంధించిన వైద్య పరీక్షలను ల్యాబ్‌ టెక్నీషియన్లు నిర్వహిస్తే వాటిని మైక్రోబయోలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తోపాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలల్లోని హబ్‌లలో తప్ప ఎక్కడా మైక్రోబయోలజిస్టులు లేక ఈ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే కేన్సర్‌ను నిర్ధారించేందుకు రూ. 50 లక్షల చొప్పున హబ్‌లలో ఏర్పాటు చేసిన సీరం–ఎలక్రో్టఫొరెసిస్‌ యంత్రాలకు అవసరమైన రీఏజెంట్లు (రసాయనాలు) అందుబాటులో లేక చాలా వరకు పరికరాలు వృథాగా పడి ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కొన్ని టెస్టులతోనే సరి.. ప్రతి హబ్‌లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీకి సంబంధించి 134 రకాల వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా చాలా హబ్‌లలో 30–40 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరతతోపాటు రేడియాలజిస్టులు, మైక్రోబయోలజిస్టులు, ఇతర డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. హబ్‌లపై సన్నగిల్లుతున్న నమ్మకం వివిధ హబ్‌లలో తరచూ పరీక్షల ఫలితాలు ఒకరివి మరొకరికి మారిపోతుండటంతో ప్రజల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌పై విశ్వాసం సన్నగిల్లుతోంది. స్పోక్స్‌ (చిన్న కేంద్రాలు)లో బీపీ, షుగర్‌ మినహా అన్ని పరీక్షలను హబ్‌లకే పంపుతుండగా అక్కడ పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులను తీసుకొస్తేనే పీహెచ్‌సీల్లో చూపించుకొనే పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో చాలా మంది ఆర్‌ఎంపీల ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. పీహెచ్‌సీల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోవడం కూడా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. కాగా, ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో తాజాగా 700 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. ⇒ ఖమ్మంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ హబ్‌లో రీ ఏజెంట్ల కొరతతో కేన్సర్‌కు సంబంధించి మూడొంతుల టెస్ట్‌లు జరగడం లేదు. ⇒ అక్కడ 134 రకాల పరీక్షలకుగాను 38 పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య పరికరాలు లేకపోవడమే అందుకు కారణం. ⇒జిల్లాలోని స్పోక్స్‌లలో రీ ఏజెంట్ల కొరతతో ఎక్కడా డయాగ్నస్టిక్‌ టెస్ట్‌లు నిర్వహించడం లేదు. శాంపిల్స్‌ సేకరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని హబ్‌కు పంపుతున్నారు. ⇒ జనగామ జిల్లాలోని హబ్‌లో వైద్య పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టులు అందుబాటులో లేక మైక్రోబయోలజీ సంబంధిత పరీక్షలు జరగడం లేదు. ⇒ పీహెచ్‌సీల నుంచి తీసుకున్న తాత్కాలిక సిబ్బందితోనే బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్‌ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించి సీఏ 125, సీఈఏ, పీఎస్‌ఏ మూడు టెస్టులు ఇప్పటి వరకు 30 వరకు చేశారు. ⇒ ఈ హబ్‌లో 17 రకాల మిషన్లతో రోజుకు 1,659 పరీక్షలను చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ⇒ మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్‌ హబ్‌లో కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్టుల కోసం పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉంచేందుకు సరైన బిల్డింగ్‌ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ⇒ నిర్మల్‌ జిల్లాలో మైక్రోబయాలజిస్టులు, పాథాలజిçస్టులు లేరు. కేన్సర్‌ టెస్టులు చేయడం లేదు. బయోకెమిస్ట్రీ, థైరాయిడ్, సీబీపీ, డెంగీ, థైరాయిడ్‌ టెస్టులను మాత్రం చేస్తున్నారు. ⇒ మంచిర్యాల టీ హబ్‌లోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్టుల పరికరాలు ఉన్నా సిబ్బంది లేక దాన్ని వాడట్లేదు. అక్కడ మైక్రోబయోలజిస్ట్‌ మాత్రం ఉన్నారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్‌ యంత్రాలు ఉన్నా సిబ్బంది లేరు. కేన్సర్‌ టెస్ట్‌కు ఉపయోగించే రీ ఏజంట్లు ఉన్నా.. టెస్టులు చేసే వారు లేరు. 134 రకాల పరీక్షలకుగాను 76 పరీక్షలు చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని 32 హబ్స్, 1,546 స్పోక్స్‌లలో రోగులకు అన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మైక్రోబయోలజీస్టులు లేనిచోట జిల్లా వైద్య కళాశాల అనుబంధ డీఎంఈ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నాం. సీరం–ఎలక్ట్రోఫోరెసిస్‌ పరీక్ష 5 జిల్లాల హబ్స్‌లో జరుపుతున్నాం. ప్రిస్క్రిప్షన్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ప్రతి డయాగ్నస్టిక్‌ హబ్‌లో 10 నుంచి 20 మంది సిబ్బంది నమూనాలు తీసుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ ఏడాది డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల నుంచి సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నాం. – ఆర్‌.వి. కర్ణన్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌

Punjab Kings beat RCB by 5 wickets5
చాలెంజర్స్‌పై పంజా...

ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్‌ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్‌ ఈ ఐపీఎల్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్‌ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్‌ 3, భువనేశ్వర్‌ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్‌ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్‌ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్‌ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్‌ ఆర్డర్‌ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్‌ (4), కోహ్లి (1), రజత్‌ పాటీదార్‌ (23), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (2), కృనాల్‌ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్‌ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్‌ డేవిడ్‌ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్‌ స్కోరు 19 కాగా... జేవియర్‌ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్‌ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్‌ సహా అంతా ఇన్నింగ్స్‌ బ్రేక్‌ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్‌ చాలా ఆలస్యంగా నోబాల్‌ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్‌ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్‌ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్‌ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్‌ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్‌సిమ్రాన్‌ (13), కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (7) ఇలా టాపార్డర్‌ వికెట్లు రాలినా... మిడిలార్డర్‌లో నేహల్‌ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్‌ అయ్యర్, ఇన్‌గ్లిస్‌ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్‌ బ్యాటింగ్‌ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ ‌ 4; కోహ్లి (సి) యాన్సెన్‌ (బి) అర్ష్ దీప్ ‌ 1; పాటీదార్‌ (సి) జేవియర్‌ (బి) చహల్‌ 23; లివింగ్‌స్టోన్‌ (సి) ప్రియాన్‌‡్ష (బి) జేవియర్‌ 4; జితేశ్‌ (సి) నేహల్‌ (బి) చహల్‌ 2; కృనాల్‌ (సి అండ్‌ బి) యాన్సెన్‌ 1; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 50; మనోజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్‌ 1; భువనేశ్వర్‌ (సి) జేవియర్‌ (బి) హర్‌ప్రీత్‌ 8; యశ్‌ దయాళ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్‌ 0; హజల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్‌: అర్శ్‌దీప్‌ 3–0–23–2, జేవియర్‌ 3–0–26–1, యాన్సెన్‌ 3–0–10–2, చహల్‌ 3–0–11–2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2–0–25–2. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) డేవిడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 16; ప్రభ్‌సిమ్రాన్‌ (సి) డేవిడ్‌ (బి) భువనేశ్వర్‌ 13; అయ్యర్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 7; ఇన్‌గ్లిస్‌ (సి) సుయశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 14; నేహల్‌ (నాటౌట్‌) 33; శశాంక్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 1; స్టొయినిస్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–26–2, యశ్‌ దయాళ్‌ 2.1–0–18–0, హాజల్‌వుడ్‌ 3–0–14–3, కృనాల్‌ 1–0–10–0, సుయశ్‌ 3–0–25–0. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్‌ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్‌ X లక్నో వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

20 lakh electric vehicles sold across the country in 2024 to 2025 6
ఈవీ @20 లక్షలు

సాక్షి, అమరావతి: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు తోడు కలవరపెడుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్‌ వాహనాల(ఈవీ)లను వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఓ నినాదం ఉద్యమంలా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోనూ విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్‌ వాహనాల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. 2023–24లో ఈ సంఖ్య 16 లక్షలు ఉండేది. జేఎంకే రీసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ విడుదల చేసిన ‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్‌ 2025’ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఈవీ విక్రయాలు ఇలా..2024–25 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 20 లక్షల విద్యుత్‌ వాహనాల్లో సగం (60 శాతం)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్‌ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24 శాతం. ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగించే త్రిచక్ర వాహనాల వాటా దాదాపు 36 శాతం. వీటి విక్రయాలు సుమారు 7 లక్షల వరకు జరిగాయి. మొత్తంగా 2020 నుంచి చూస్తే నాలుగేళ్లలో 61.66 లక్షల వాహనాల కొనుగోలు జరిగింది. ఈ ఫలితం.. గత ప్రభుత్వ పుణ్యమే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వీటికి సంబంధించి సర్వీస్‌ చార్జీలను నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు గతంలో కేంద్రం సూచించింది. ఈమేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం చొరవ చూపింది. ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) నేతృత్వంలో 266 ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలన్నీ నిలిచిపోయాయి.‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్‌ 2025’ ప్రకారం.. » ఈవీ విక్రయాలు, వినియోగంలో మొదటి ఐదు రాష్ట్రాలుః ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ » ద్విచక్ర ఈవీ విక్రయాల్లో 50 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. » తొలి మూడుస్థానాల్లో ..ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్‌ మోటార్స్, బజాజ్‌ సంస్థలు » 70 శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే. » మూడు చక్రాల వాహనాల్లో 11% పెరుగుదల » విద్యుత్‌ కార్ల విక్రయాల్లో 11 శాతం వృద్ధి » గతేడాదిలో లక్ష విద్యుత్‌ కార్ల విక్రయాలు » ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్‌56 శాతంతో ముందంజ » ఎంజీ మోటార్స్‌ 28 శాతంతో రెండో స్థానం » ఎలక్ట్రిక్‌ బస్సుల విక్రయాలు 3,834 » గతేడాది కంటే 3 శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు

Massive irregularities in capital construction work exposed7
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!

అప్పు చేసి పప్పు కూడు తినకూదదంటారు పెద్దలు..! ఎందుకంటే చేసిన అప్పును వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి..! అప్పుగా తెచ్చిన డబ్బులను ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి! రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజధానికి రుణ పాశం బిగిస్తున్నారు! అప్పు చేసి మరీ జేబులు నింపుకొంటున్నారు! రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి సర్కారు మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. అలా అప్పు తెచ్చిన నిధులతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ విలువలో పది శాతం మొబిలై జేషన్‌ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని ముఖ్యనేత నాకింత..! అంటూ వసూలు చేసుకుంటున్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి పాత రేసి.. అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పనుల టెండర్లలో ఈ సిండి ‘కేటు’ దందా తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!! సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో 2014లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497.55 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్‌ కాంట్రాక్టర్లతో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) అగ్రిమెంట్‌ (ఒప్పందం) చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.4,049.75 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239.80 కోట్లను ముఖ్యనేత వసూలు చేసుకున్నారు! అధిక ధరలకు కట్టబెట్టి.. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి రూ.5 వేల కోట్లు.. వెరసి రూ.31 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. రాజధాని నిర్మాణ పనులకు రూ.77,249 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పు తెచ్చిన నిధులతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. పనుల అంచనాలను భారీగా పెంచేశారు. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాపై తీవ్ర భారం మోపారు. » ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌) ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్లకు మించదు. ప్రస్తుత ధరల ప్రకారం మట్టి తవ్వకానికి క్యూబిక్‌ మీటర్‌కు రూ.వంద చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 నుంచి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకానికి కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజధాని వరద ముంపు నివారణ పనుల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నీరుకొండ రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు రూ.470.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆ పనిని రూ.487.41 కోట్లకు(3.54 శాతం అధిక ధరకు) ఎన్‌సీసీ సంస్థకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్‌ చేయనున్నారు. అంటే 0.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నీరుకొండ రిజర్వాయర్‌ పనులను రూ.555.41 కోట్లకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.305.41 కోట్లు పెంచేసినట్లు వెల్లడవుతోంది. » దేశంలో ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) కి.మీ.కి సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులను నిర్మిస్తోంది. కానీ అమరావతిలో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగిస్తూ 7.29 కి.మీ.ల పొడవున ఆరు వరుసలతో నిర్మించడానికి రూ.384.78 కోట్ల అంచనాతో ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో 81.92 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. అంటే.. అంచనా వ్యయం రూ.466.7 కోట్లు అన్నమాట. ఈ లెక్కన కి.మీకి 64.01 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు టెండర్‌ పిలిచినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రహదారికి కి.మీ.కి అయ్యే వ్యయం కంటే ఈ–13 రహదారి వ్యయం రూ.44.01 కోట్లు అధికంగా పెంచేశారు. » భూసమీకరణ కింద రాజధానికి 29,357 మంది రైతులు 34,773.76 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ఆ రైతులకు 17 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద రూ.14,887.64 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టు విలువలో 18 శాతం జీఎస్టీ, 0.45 శాతం సీనరేజీ, 0.1 శాతం న్యాక్‌ పన్నుల రూపంలో రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. అప్పుడు వాటి వ్యయం రూ.2,761.66 కోట్లు ఇస్తారన్నమాట. ఈలెక్కన ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టు విలువ రూ.17,649.3 కోట్లుకు చేరుతుంది. ఈ లెక్కన ఎకరంలో లే అవుట్‌ అభివృద్ధికి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్‌ను అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలకు మించదని బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. » అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042.86 చొప్పున అప్పగించడం గమనార్హం. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు.జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ రద్దు.. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల 2019–24 మధ్య ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసి రాజధాని పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రూ.40,497.55 కోట్ల విలువైన పనులు అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.1231.42 కోట్ల మేర భారం పడింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టర్లు పోటీ పడి ఖజానాకు రూ.3,500 నుంచి రూ.4 వేల కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉండేదని ఇంజినీరింగ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీఎస్సార్‌కు రూ.7,298.97 కోట్లు.. ఆర్వీఆర్‌కు రూ.6,031.79 కోట్ల పనులురాజధాని పనుల టెండర్లలో సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్‌ బిడ్‌లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298.97 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022.38 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. » టీడీపీకి బాకా ఊదే ఈనాడు కిరణ్‌ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.6,031.79 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. » ఎన్‌సీసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910.93 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » ఎల్‌ అండ్‌ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతోపాటు రూ.1,427.21 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » నారా లోకేశ్‌ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్‌కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు రూ.796.04 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్‌సీపీఎల్‌ సంస్థకు రూ.779.82 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడిన పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.309.6 కోట్ల విలువైన పనులు అప్పగించారు. మరో రూ.7,202.3 కోట్ల పనులూ సిండికేట్‌కే.. గెజిటెడ్‌ అధికారులు, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల క్వార్టర్స్‌కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్‌ దశలో ఉన్నాయి. ఈనెల 16న శాశ్వత సచివాలయం నిర్మాణంలో భాగంగా ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.553.12 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్ల దశలో ఉన్న ఈ రూ.7,202.3 కోట్ల విలువైన పనులను సిండికేట్‌ కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. రాజధానికి వరద ముప్పును నివారించేందుకు కొండవీటివాగుపై మరో ఎత్తిపోతల, గ్రావిటీ కెనాల్‌పై మరో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి.. కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఏడీసీఎల్, సీఆర్‌డీఏ కసరత్తు చేస్తున్నాయి. ఈ పనులు కూడా సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టనున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు.. రాజధాని పనులకు ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు అని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు రుణం తెచ్చారు. మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చదరపు అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించారు. అంటే అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.15,833 పెరిగింది.తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయమే ఈ స్థాయిలో పెరిగితే శాశ్వత నిర్మాణాల వ్యయం ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రూ.లక్ష కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ డబ్బంతా అప్పులు తేవాల్సిందే. అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇలా అప్పు తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలసి దోచుకుంటూ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారనే ఆందోళన అటు మేధావులు.. ఇటు అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇదీ స్థూలంగా నష్టం..!రాజధాని పనులను అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల జానాపై అదనపు భారం: రూ.1,231.42 కోట్లకుపైగాజ్యుడీషియల్‌ ప్రివ్యూ– రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయకపోవడంతో నష్టం: రూ.4,000 కోట్లుకాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించి 8 శాతం కమీషన్లు వసూళ్లతో అక్రమాలు: రూ.3,200 కోట్లకుపైగా

SIPB meeting proposed allocation of lands to it company8
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..

సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి..? ముందుగా పేరెన్నికగన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి.. అదే మా పాలసీ అంటూ మనవాళ్లకు కట్టబెట్టేయడమే. ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేశ్‌.. సీఎం చంద్రబాబుకు చెప్పడం.. వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం.. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్‌ నంబర్‌ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్‌కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్‌కి చౌకగా భూములు కేటాయించినా ఎవరూ ఏమీ అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్కు. ‘‘ఇదిగో ఇదీ మా ఐటీ పాలసీ’’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తోంది. అలా టీసీఎస్‌కు భూమి కేటాయించగానే.. ఇలా డేటా సెంటర్‌ పేరుతో ఉర్సా క్లస్టర్స్‌ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడో విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలలు క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్‌ నెంబర్‌3 లో 3.5 ఎకరాలు , కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. టీసీఎస్‌ పాలసీ ముసుగుఉర్సా క్లస్టర్‌కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్‌కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్‌కు ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకే ఇస్తే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూములను కేవలం రూ.59కే ఇచ్చే విధంగాప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్‌ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్‌ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి వరకు శంషాబాద్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో మేనేజర్‌గా పనిచేస్తున్న పెందుర్తి విజయకుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ అబ్బూరి కలిసి రూ.9.10 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం రెండు నెలల క్రితం అదీ కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయాలు నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్‌ మిలియన్‌ టవర్‌లో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తూ... దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమేనని పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్‌ ఒకరు వ్యాఖ్యానించారు.ఇలా పెట్టు.. అలా భూమి పట్టు‘ముందుగా వచ్చి మాట్లాడు.. ఆ తర్వాత వెళ్లి కంపెనీ పెట్టు.. వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో.. ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో..’ ఇప్పుడిది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గతేడాది డిసెంబర్‌ ఆఖరు వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు. వెంటనే జనవరి 3న రూ.కోటి మూలధనంతో కాన్పూర్‌ ఆర్‌వోసీలో ఇండిచిప్‌ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా రూ.14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్‌ సెమీ కండక్టర్‌ కంపెనీలో పీయూష్‌ బిచోరియా, వెబ్‌ చాంగ్, సందీప్‌ గార్గ్‌లు డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్‌ వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంత వరకు సెమీకండక్టర్‌ తయారీ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో అత్యంత విలువైన వందల ఎకరాలను ఇండిచిప్‌కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్‌ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కంపెనీలో నవయుగ గ్రూపునకు చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారులోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూపునకు గ్రీన్‌ ఎనర్జీ పేరిట వేల ఎకరాలను కట్టబెట్టనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితునిగా ఉన్న పేరున్న కిలారు సునీల్‌కి చెందిన డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్‌ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ను టీసీఎస్‌కు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు టీసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన మిలీనియం టవర్స్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములను సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Illegal case against YSRCP governments liquor policy9
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్‌’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడు­లతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్‌ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్‌ అరాచకంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్‌ ముగిసినప్పటికీ రిలీవ్‌ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్‌పీపీ 164 సెక్షన్‌ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్‌ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్‌ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్‌ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్‌ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్‌ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్‌ కాళీ మహేశ్వర్‌ సింగ్‌లను సిట్‌ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్‌ కాళీ మహేశ్వర్‌ సింగ్‌ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్‌ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్‌ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్‌ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్‌ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్‌లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్‌ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్‌ కుట్రలో భాగమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్‌ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెన్యువల్‌ కూడా చేయనే లేదు. ఇక రాజ్‌ కసిరెడ్డికి బెవరేజస్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్‌ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్‌బుక్‌ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం.

Stock market crashes: From Covid-19 to Trump tariffs10
క్రాష్‌ టు జోష్‌..!

ట్రంప్‌ టారిఫ్‌ల సునామీ ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. అనేక దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు వడ్డించడం, చైనా దీటుగా టారిఫ్‌లతో తిప్పికొట్టడంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అమెరికా టు ఆసియా స్టాక్‌ మార్కెట్లు ’బేర్‌’మన్నాయి. అక్టోబర్‌ నుంచి రివర్స్‌గేర్‌లో కొనసాగుతున్న మన సూచీలు.. ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకు తాజా 17 శాతం దిగజారాయి. సెన్సెక్స్‌ సెప్టెంబర్లో 85,978 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్టం నుంచి తాజాగా 71,425 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ట్రంప్‌ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడం, పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ బుల్స్‌ ఫేస్‌ టరి్నంగ్‌ ఇచ్చుకున్నాయి. తాజా కనిష్టం నుంచి 10 శాతం మేర ‘రిలీఫ్‌’ ర్యాలీ చేశాయి. ఈ వారంలోనే 4 శాతం జంప్‌ చేశాయి. కాగా, దేశీ మార్కెట్లు గతంలో కూడా సంక్షోభాలు, స్కామ్‌ల దెబ్బకు భారీగా పడి, బేర్‌ గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ... మళ్లీ అంతే వేగంగా రికవరీ అయ్యాయి. అమెరికా–చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ ముదురుతుండటం, ట్రంప్‌ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తారోనన్న అనిశి్చతితో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, టారిఫ్‌ల దుమారం పూర్తిగా సద్దుమణిగితే బుల్స్‌ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మన మార్కెట్లో అతిపెద్ద పతనాలు, కోలుకున్న తీరు చూస్తే...కోవిడ్‌ క్రాష్‌.. 2020లో కోవిడ్‌–19 మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతే.. స్టాక్‌ మార్కెట్లో బేర్‌ విలయతాండవం చేసింది. ఇటీవలి చరిత్రలో మార్కెట్లు ఇలా కుప్పకూలడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌లతో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో మార్చి 2020లో సెన్సెక్స్‌ 41,000 స్థాయి నుంచి 25,981 పాయింట్ల కనిష్టానికి క్రాష్‌ అయ్యింది. అయితే, సెంట్రల్‌ బ్యాంకుల సహాయ ప్యాకేజీలు, వడ్డీ రేట్ల భారీ కోతలతో మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా దూసుకుపోయాయి. నవంబర్‌ 2020 నాటికి కనిష్టం నుంచి 58 శాతం ఎగబాకి మళ్లీ క్రాష్‌ ముందస్తు స్థాయిని దాటేశాయి. వ్యాక్సిన్‌ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కుమ్మరింపుతో నాన్‌ స్టాప్‌ ర్యాలీ చేశాయి. 2021 సెప్టెంబర్‌ నాటికి 60,,000 స్థాయి పైకి చేరగా.. 2024 సెప్టెంబర్‌లో 85,978 పాయింట్లతో సరికొత్త చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం... 2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరొందిన ఆర్థిక సంస్థలతో పాటు పలు కంపెనీలు కూడా దివాలా తీశాయి. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. సెన్సెక్స్‌ మెగా పతనంతో 21,000 స్థాయి నుంచి 2009 మార్చి నాటికి 8,000 పాయింట్లకు కుప్పకూలింది. అంటే ఏకంగా 62 శాతం కరిగిపోయింది. అయితే, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఉద్దీపన ప్యాకేజీల అమలు, వడ్డీరేట్ల కోతలతో మార్కెట్ల రికవరీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడటం, విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 2010 నవంబర్‌ నాటికి సెన్సెక్స్‌ మళ్లీ 21,000 మార్కును తాకింది. రెండేళ్ల రికవరీలో 162% ర్యాలీ చేసింది. కేతన్‌ పరేఖ్‌ స్కామ్‌/డాట్‌ కామ్‌ బబుల్‌ భారత్‌ స్టాక్‌ మార్కెట్లను కుదిపేసిన కేతన్‌ పరేఖ్‌ షేర్ల కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్‌–కామ్‌ బబుల్‌ బద్దలవ్వడంతో దేశీ సూచీలు కకావికలం అయ్యాయి. 2001 ఆరంభంలో 4,200 పాయింట్ల స్థాయిలో ఉన్న సెన్సెక్స్‌ సెప్టెంబర్‌ నాటికి 2,594 పాయింట్లకు కుప్పకూలింది. అయితే, మళ్లీ 2003 నుంచి నెమ్మదిగా మార్కెట్లో జోరు మొదలైంది. 2004 మధ్య నాటికి, అంటే మూడేళ్లలో 62 శాతం ర్యాలీతో 4,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా దేశ జీడీపీ వృద్ధి పుంజుకోవడం, ఐటీ రంగం పరుగులతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు వరుస కట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి.హర్షద్‌ మెహతా కుంభకోణం దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన హర్షద్‌ మెహతా స్కామ్‌.. ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. 1992లో స్కామ్‌ బట్టబయలు కాగా, సెన్సెక్స్‌ 4,467 పాయింట్ల నుంచి 1993 మే నెలకల్లా 2,529 పాయింట్లకు (43 శాతం) పడిపోయింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, సరళీకరణ దన్నుతో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కొత్తపుంతలు తొక్కి, మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్లాయి. 1996 నాటికి సెన్సెక్స్‌ మళ్లీ 4,600 పాయింట్ల స్థాయికి (82 శాతం) అధిగమించి దుమ్మురేపింది.– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement