Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt current scam with Axis Energy Venture India Private Limited1
‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌'

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినం­దిం­చాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్‌ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్‌ అవర్స్‌లో డిమాండ్‌ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్‌ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్‌లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవన–సౌర హైబ్రీడ్‌) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ పాతికేళ్ల పాటు యూనిట్‌ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్‌’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్‌లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్‌ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్‌లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్‌ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్‌ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్‌ జగన్‌ పెంచారు. విద్యుత్‌ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్‌ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్‌ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్‌ చట్టం 2003 సెక్షన్‌ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్‌ 108 ప్రకారం.. యాక్సిస్‌ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్‌ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్‌ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్‌ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్‌ విద్యుత్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్‌ డెవలపర్‌ నుంచి యూనిట్‌ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా?

Telangana firefighting system works up to 18 floors but Buildings above 50 floors2
నిప్పుకు తెలుసు.. నీళ్లు రావని..

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ విశ్వనగరంలా మారుతోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశాన్నంటుతున్నాయా..అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హర్మ్యాలు.. అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణంతోనైనా, ఊహించని విధంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉంటోందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40–50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిల్లో ఉండే వారిని రక్షించగలిగే అధునాతన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడున్న అరకొర రక్షణ వ్యవస్థలు, ఆయా భవనాల్లోని సొంత భద్రతా ఏర్పాట్లు, వాటి పర్యవేక్షణ పరిగణనలోకి తీసుకుంటే హైరైజ్‌ నివాస, వాణిజ్య సముదాయాలన్నీ ఒకింత డేంజర్‌లో ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంలా మారుతున్నా.. రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆపై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టమేనని, ఆయా భవనాల్లో ఉన్న సొంత రక్షణ వ్యవస్థపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎంత?, భవనాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి? పర్యవేక్షణ మాటేమిటి? యాజమానుల బాధ్యతలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. జీ ప్లస్‌ 5 దాటితే అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌లో జీ ప్లస్‌ 5 అంతస్తులకు (నివాస సముదాయాలు) పైబడిన భవనాలన్నిటికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అదే వాణిజ్య, ఇతర భవనాలు జీ ప్లస్‌ 4 మించితే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నగరంలోని అన్ని హైరైజ్‌ భవనాలకూ అగ్నిమాపక శాఖే అనుమతులు ఇస్తోంది. భవనం డిజైన్, నిర్మాణం, తర్వాత ఆక్యుపెన్సీ తదితర అన్ని సందర్భాల్లో అన్నీ పరిశీలించాకే ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) మంజూరు చేస్తున్నారు. ఒకసారి ఎన్‌ఓసీ వచి్చన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే అధికారులు రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఈ పరిస్థితికి కారణమనే వాదన ఉంది. పత్రి నెలా 11వ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ), 23న డీఎఫ్‌ఓలు భవనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. సిబ్బంది కొరత నేపథ్యంలో భవనాల సంఖ్య మేరకు తనిఖీలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. మన అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎలా ఉంది? తెలంగాణ మొత్తం కలిపి 147 ఫైర్‌ స్టేషన్లు ఉన్నాయి..జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 ఫైర్‌ స్టేషన్లు, 3 అవుట్‌ పోస్ట్‌లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్‌లో 55 మీటర్ల ఎత్తు వరకు అంటే 18 అంతస్తుల వరకు వెళ్లగలిగే బ్రాంటో స్కై లిఫ్ట్‌లు రెండు ఉన్నాయి. వీటికి అదనంగా 133 వాటర్‌ టెండర్లు (ఫైర్‌ ఇంజిన్లు), 5 నీటి సరఫరా లారీలు, 56 మల్టీపర్పస్‌ టెండర్లు, 10 అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్లు, 17 వాటర్‌ బౌజర్లు సహా కీలక పరికరాలు ఉన్నాయి. ఇక 18 అంతస్తులకు మించిన భవనాల్లో అంతర్గతంగా ఉండే ఫైర్‌ పంపులు, నీళ్ల ట్యాంకులు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఫైటింగ్‌ చేయాల్సి ఉంటుంది. బిల్డర్లు, నిర్వాహకుల బాధ్యతలేమిటి? – భవనం భద్రతను బిల్డింగ్‌ నిర్వాహకులు, యజమానులు విధిగా పర్యవేక్షించాలి. – సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ప్రైవేటు ఫైర్‌ ఆఫీసర్లు, ఫైర్‌ గార్డులను నియమించుకోవాలి. – బిల్డర్లు ప్రతి ఆకాశ హర్మ్యంలో విధిగా ఓ రెస్క్యూ ప్లేస్‌ పెట్టాలి. ఆ భవనంలో అంతస్తులను బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – ప్రత్యేకంగా ఫైర్‌ లిఫ్ట్‌ ఉండాలి. అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్‌ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారు. దీనికి పవర్‌ సప్లై ప్రత్యేకంగా ఉండాలి. – నిర్వాహకులకు ఎమర్జెన్సీ ప్లాన్‌ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే ఎవరు ఎలా స్పందించాలనే ప్రణాళిక ఉండాలి. – భవనాల్లో నివాసం ఉండేవారికి, పనిచేసే సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై తరచూ శిక్షణ ఇవ్వాలి. – ఫైర్‌ అలారమ్‌లు, స్మోక్‌ డిటెక్టర్లు, వాటర్‌ స్ప్రింక్లర్లు సరిగా పనిచేస్తున్నాయా..లేదా చూసుకోవాలి. – అయితే చాలా భవనాల్లో.. నిర్మాణం, ఆక్యుపెన్సీ సమయంలో ఉండే ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు...కొన్నాళ్ల తర్వాత పనిచేసే స్థితిలో ఉండడం లేదన్న విమర్శలు ఉండటం గమనార్హం. ఢిల్లీ, మహారాష్ట్రల్లో మెరుగ్గా.. ఫైర్‌ సేఫ్టీ అంశంలో మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అక్కడ ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన చట్టాల అమలు పక్కాగా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాల నియంత్రణ మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 110 మీటర్ల స్కైలిఫ్ట్‌లు నాలుగు అందుబాటులో ఉన్నాయి. పైర్‌ ఫైటింగ్‌ పరికరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో పటిష్ట వ్యవస్థలు సింగపూర్, దుబాయ్, అమెరికా, ఆ్రస్టేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్‌ దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత పక్కాగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఈ దేశాల్లో ఫైర్‌ స్టేషన్లు అన్ని ప్రాంతాలకు సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఫైర్‌ ఫైటింగ్‌లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందుంటున్నారు. పౌరులందరికీ అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కలి్పస్తారు. ఏదైనా భవనం వినియోగంలోకి వచి్చన తర్వాత కూడా అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తరచూ తనిఖీలు, ఫైర్‌ మాక్‌ డ్రిల్స్‌ పక్కాగా కొనసాగుతుంటాయి. ఫైర్‌ ఫైటింగ్‌ ఆఫీసర్లను నియమించుకోవాలి కార్యాలయాలు, ఆసుపత్రులు ఇలా ప్రతి బహుళ అంతస్తుల భవనాల్లోనూ అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే స్పందించేలా, ఫైర్‌ ఫైటింగ్‌కు సంబంధించిన పరికరాల మెయింటెనెన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్లను పెట్టుకోవాలి. వీరందరికీ అగ్నిమాపక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ వ్యవస్థ ప్రమాదం జరిగిన మొదటి రెండు గంటలపాటు ఫైర్‌ ఫైటింగ్‌కు ఉపయోగపడుతుంది. ప్రాణ నష్టం నివారించలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు పూర్తిస్థాయిలో ఆర్పే పనితో, ప్రజా రక్షణ చర్యలు చేపడతారు. రాష్ట్రంలో ఉన్న అగ్నిమాపక వాహనాలు, పరికరాలు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వై.నాగిరెడ్డి, డీజీ, అగ్నిమాపక శాఖ తరచూ తనిఖీలు ఎంతో అవసరం బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్‌ చేయడంలో ఫైర్‌ సేఫ్టీ అంశం కూడా అత్యంత కీలకమైనది. డిజైన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం జరిగిందా లేదా? ఫైర్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? అన్నది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చే సమయంలో అధికారులు తనిఖీ చేయాలి. ఆ తర్వాత కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలి. నివాస సముదాయాల్లో కంటే హైరైజ్‌ కమర్షియల్‌ బిల్డింగ్స్‌లో అగ్ని ప్రమాదాల రిస్క్‌ ఎంతో ఎక్కువ. ప్రమాదం జరిగితే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్య భవనాల విషయంలో అదనపు జాగ్రత్తలు మరింత అవసరం. – భిక్షపతి, మాజీ డైరెక్టర్‌ జనరల్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెయింటినెన్స్‌ పట్టించుకోక పోతే కష్టమే.. మన దగ్గర వేగంగా అభివృద్ధి జరగడం, ఆ మేరకు బహుళ అంతస్తులు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. బిల్డింగ్‌ డిజైన్లలో, నిర్మాణంలో.. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్‌సేఫ్టీని పట్టించుకోవడం లేదు. ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాల మెయింటినెన్స్‌పై అటు ప్రభుత్వ విభాగాలు కానీ, ఇటు భవన యజమానులు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన హైరైజ్‌ భవనాలు డేంజర్‌లో ఉన్నట్టే. ఫైర్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైతే ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి డెవలపర్స్‌ నుంచి ఫీజులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునీకరించాలి. ప్రతి ఆరు నెలలకు ఫైర్‌ ఫైటింగ్‌ పరకరాలు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు, భవనాల యజమానులకు బాధ్యత అప్పగించి ప్రభుత్వ విభాగాలు తప్పుకోవడం సరికాదు. – సీఏ ప్రసాద్, ప్రెసిడెంట్, ప్రీ ఇంజినీర్డ్‌ స్ట్రక్చర్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైరైజ్‌ బిల్డింగుల్లో ఉండాల్సినవేమిటి? ⇒ నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) ప్రకారం.. ఎత్తైన భవనాల్లో స్మోక్‌ డిటెక్టర్లు, వాటర్‌ స్ప్రింక్లర్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ (తక్షణ రక్షణ వ్యవస్థ), తగిన నీటి సరఫరా సౌకర్యం, ఫైర్‌ పంపులు, ఫైర్‌ ఎస్కేప్‌ మార్గాలు, ఫైర్‌మెన్‌ లిఫ్ట్, సర్వీస్‌ షాఫ్ట్‌ ఎన్‌క్లోజర్‌లు, ప్రత్యేక విద్యుత్‌ వ్యవస్థ తప్పక ఉండాలి. నివాస సముదాయాలైనా, ఇతర భవనాలైనా ఇవన్నీ తప్పనిసరి. ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నది అత్యంత కీలకం. వ్యవస్థ ఇలా పనిచేయాలి ⇒ భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్‌ పంపులు, నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఎలక్ట్రిక్‌ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి. ⇒ ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇదీ పని చేయకపోతే డీజిల్‌ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం రెండు గంటల పాటు మంటలను నిలువరించి, నివాసితులు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా ఉండాలి.

Rasi Phalalu: Daily Horoscope On 05-05-2025 In Telugu3
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.అష్టమి ప.11.59 వరకు,తదుపరి నవమి, నక్షత్రం: ఆశ్లేష సా.6.04 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.6.42 నుండి 8.20 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు, అమృతఘడియలు: సా.4.20 నుండి 6.02 వరకుసూర్యోదయం : 6.37సూర్యాస్తమయం : 6.16రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం..... పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.వృషభం.. కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం.మిథునం... దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.కర్కాటకం... కొత్త పనులు చేపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.సింహం.... ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.కన్య.... నూతన విద్యావకాశాలు. మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం.. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వస్తులాభాలు.తుల.... ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం.వృశ్చికం... దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.ధనుస్సు... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు.మకరం.... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.కుంభం.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూలత. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.మీనం..... ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు.

Pakistan continues unprovoked firing for 10th day4
అవే ఉద్రిక్తతలు

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్‌లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్‌ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్‌ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్‌ పరిధిలో 12 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్‌ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్‌ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్‌ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్‌ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్‌ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్‌ను పాక్‌ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్‌ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్‌ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్‌ పార్లమెంట్‌ ప్రత్యేక భేటీ భారత్‌తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్‌ పార్లమెంట్‌ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్‌ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్‌లోని కొన్ని భూభాగాలపై భారత్‌ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్‌కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్‌ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌మంత్రి హనీఫ్‌ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

cm chandrababu naidu no response on Simhachalam incident5
ఎందుకీ కాలయాపన?

సాక్షి, అమరావతి : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు భక్తులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి మంత్రి స్థానంలో ఉన్న వారెవరైనా అందుకు బాధ్యత వహిస్తారు. తక్షణమే తప్పు ఒప్పుకుని, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే ఘనత వహించిన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను అందుకు భిన్నం అని చాటుకుంటున్నారు. తనకు కానీ, తన మంత్రి వర్గ కమిటీకి కానీ ఏమాత్రం బాధ్యత లేదని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే చంద్రబాబులో ఇసుమంత అయినా బాధ లేదు.. బాధ్యత అంతకంటే లేదని స్పష్టమవుతోంది.ఎందుకంటే ఘటన జరిగి ఐదు రోజులైనా జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వ తప్పిదంగా ఒప్పుకోడానికి ఆయనకు మనసు ఒప్పడం లేదు. పైగా నాన్చుడు ధోరణి అవలంబిస్తూ తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు విచారణ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. చందనోత్సవం సందర్భంగా ముందుగానే నలుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినప్పుడు.. ఈ ఘటనకు ముమ్మాటికీ ఆ మంత్రులనే బాధ్యులుగా చేయాలి. దేవదాయ శాఖలో ముఖ్య అధికారులకు కూడా ఇందులో బాధ్యత ఉంటుందని చెప్పాలి. ఇది వెనువెంటనే జరగాల్సిన పని.అలా చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నిన్నటికి నిన్న గోవాలోని ఓ గుడిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందో దేశం మొత్తం చూసింది. కనీసం అది చూసి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించక పోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలంలో ఈవో సెలవుపై వెళ్లారంటే ఇక అక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? మరో సమర్థవంతమైన అధికారి ఎవరూ లేరా? ఇలాంటి సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే యంత్రాంగం లేదా? లేక ఆ యంత్రాంగాన్ని పని చేయనీయక పోవడం వల్ల ఈ ఘటన జరిగిందా? ప్రభుత్వ ముఖ్యుల ఇష్టారాజ్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్పష్టమవుతోంది. వీళ్లంతా ఇన్నాళ్లు ఏం చేశారు?ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న అశోక్‌గజపతి­రాజు, దేవదాయ శాఖ ముఖ్య అధికారి ప్రభుత్వ పె­ద్దలకు కావాల్సిన వారు కావడం వల్లే విచారణ పేరు­తో కూటమి సర్కారు కాలయాపన చేస్తోందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై నలుగురు మంత్రులతో ఏర్పడిన కమిటీ రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించింది. ఆక్కడ గోడ అవసర­మనే విషయాన్ని ముందుగా ఎందుకు గుర్తించలేదు? తీరా చందనోత్సవానికి ముందు హడావు­డిగా నాలుగు రోజుల్లో అంత భారీ గోడ నిర్మించారంటే దాని నాణ్యత సంగతి ప్రత్యేకించి చెప్పా­లా? గోడ పక్కనే లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లేందుకు క్యూలైన్‌ ఏర్పాటు చేయడంలో మంత్రుల కమి­టీ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపి­స్తోంది. ఆ అధికారి అతి జోక్యం వల్లే సెలవుపై ఈవో!సింహాచలం ఆలయ ఈవో కీలక చందనోత్సవాలకు మూడు నెలల ముందు వ్యక్తిగత కారణాలతో సెల­వుపై వెళ్లడానికి దేవదాయ శాఖ ముఖ్య అధికారి అతి జోక్యమే కారణమని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆలయ రోజు వారీ కార్యకలా­పా­ల్లోనూ ఆ అధికారి అతిగా కల్పించుకునేవారని తెలు­స్తోంది. ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యా­లయంలో అడిషనల్‌ కమిషనర్‌–2గా పని చేస్తున్న రామచంద్రమోహన్‌ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలోని అధి­కా­రులు.. పెద్ద ఆలయాల ఈవోలుగా కొనసా­గుతున్న జా­యింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారుల మధ్య ఏళ్ల తరబడి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది.రామచంద్రమోహన్‌ కమిషనర్‌గా బాధ్య­తలు చేపట్టిన తర్వాత ఇది మరింత ముదిరినట్టు ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఈవోగా కొనసాగే పెద్ద ఆలయాలు ఏడు వరకు ఉండగా, ఆ ఆలయాల్లో రెండింటికే దేవదాయ శాఖకు సంబంధించిన జా­యింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు ఉన్నారు. మిగిలిన ఆలయాలకు రెవెన్యూ శాఖ నుంచి డిప్యూ­టేషన్‌పై వచ్చిన డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికా­రులు ఈవో­లుగా కొనసాగుతున్నారు. అయి­తే కొన్ని నెలలుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆల­యాల్లో అక్కడి ఈవో రోజువారీ నిర్వహించా­ల్సిన కార్యక్రమా­ల్లోనూ కమిషనర్‌ కార్యాలయ ము­ఖ్య అధికారే ఎక్కువగా జోక్యం చేసుకుంటుండడంతోపాటు ఆలయాల్లో పనిచేసే తన అనుచర సిబ్బంది ద్వారా నేరుగా నిర్ణయాలు తీసుకుంటు­న్నా­రని.. అందువల్లే కొందరు అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సింహా­చలం ఈవో మూడు నెలల క్రితం సెలవుపై వెళ్లిన­ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఆర్‌జే­సీగా కొనసాగుతున్న సుబ్బా­రావును సింహాచల ఆల­య ఇన్‌చార్జి ఈవోగా ప్రభు­త్వం నియమించింది. కీలక చందనోత్సవ సమయంలోనూ పూర్తి­స్థాయి ఈవో­ను నియమించలేక­పోయింది. ఈ పరిణా­మా­లన్నీ సింహా­చలం దుర్ఘటనకు పరోక్షంగా కారణమయ్యా­యనే చర్చ సాగుతోంది.గోదావరి పుష్కరాల ఘటనలోనూ విచారణకే పరిమితం 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విచారణకే పరిమితమైంది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత తాపీగా విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నాటి ఘటనకు కారకులు ఎవరన్న దానిని నిర్ధారించకుండానే విచారణను ముగించింది. గోవాలో తొక్కిసలాట ఘటనపై తక్షణ చర్యలు గోవా రాష్ట్రం షిర్‌గావ్‌లోని శ్రీలైరాయ్‌ దేవి ఆలయంలో రెండు రోజుల క్రితం తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే స్పందించింది. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఐదుగురు సీనియర్‌ అధికారులపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్షించింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్కారు విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొన్న తిరుపతిలో, నేడు సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నది నిర్వివాదాంశం.

Maldives president Mohamed Muizzu breaks Zelensky record by holding 15-hour press conference6
నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం

మాలే: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (46) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు! ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ముయిజ్జు విలేకరుల సమావేశం శనివారం ఉదయం పదింటికి ప్రారంభమైంది. 14 గంటల 54 నిమిషాలపాటు కొనసాగింది. కేవలం ప్రార్థనల కోసం మధ్యలో కాసేపు విరామం ఇచ్చారు. ‘‘దాదాపు 25 మంది విలేకరుల ప్రశ్నలకు ముయిజ్జు విరామం లేకుండా సమాధానాలిచ్చారు.15 గంటల పాటు మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు’’ అని మాల్డీవ్స్‌ ప్రభుత్వం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ 14 గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదొక రికార్డుగా నిలిచిపోయింది. అంతకుముందు రికార్డు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషేంకో పేరిట ఉండేది. ఆయన ఏడు గంటలపాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముయిజు్టకు ముందు మాల్దీవ్స్‌ అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్‌ నషీద్‌ కూడా ఒక రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ప్రపంచంలోనే తొలిసారి సముద్రం అడుగు భాగాన కేబినెట్‌ సమావేశం నిర్వహించారు! వాతావరణ మార్పులతో సముద్రమట్టం పెరిగిపోతోందని, ఫలితంగా తమ దేశం మునిగిపోయే ప్రమాదముందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికే ఈ సాహసానికి పూనుకున్నారు.

Paddy Stocks Soaked In Unseasonal Rains: Andhra pradesh7
అన్నదాతకు గుండెకోత

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: వరి రైతుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం పెనువిపత్తుగా పరిణమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన కుండపోత వర్షాలకు ధాన్యం రాశులు, కోత కోసిన వరి పనలు నీటమునిగాయి. ఇతర పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయ­కపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కాకినాడ జిల్లాలో 7 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమి­కంగా అంచనా వేసింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పనల మీద వరి, నీట మునిగిన ధాన్యపు రాశుల్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉప్పల­గుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. ఈ మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని భద్రపరుచు­కోవడానికి నానా అవస్థలు పడ్డారు. చేలలోనే ధాన్యం రాశులు ఉండటంతో.. వాటిపై బరకాలు కప్పినప్పటికీ కింది భాగంలో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వగా.. ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల మెట్రిక్‌ ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరో దాదాపు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉంది. సంచులు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నిలిపి­వేయడంతో కల్లాల్లోనే ధాన్యం మిగిలిపోయింది.ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందిధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచేసింది. గడిచిన వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వర్ష సూచనపై తీవ్ర హెచ్చరికలు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఫలితంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. కళ్లెదుటే కష్టార్జితం నీటిలో నానిపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ధాన్యం రాసులపై కనీసం కప్పడానికి పట్టాలు కూడా లేని దయనీయస్థితిలో ధాన్యం నింపడానికి సంచులు లేని దుస్థితిలో ఉరుకులు పరుగులు తీశారు. నేలవాలిన రైతు ఆశలుప్రస్తుత వాతావరణ మార్పులతో తడిసిన ధాన్యం రంగు మారడం, మొలకలొచ్చే ప్రమాదంతో పాటు ముక్క విరుగుడు సమస్య తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించినప్పటి నుంచి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుసేవా కేంద్రాల్లోకి వెళ్లిన రైతులకు నిరాశ తప్ప ధాన్యం కొంటామనే మాట వినిపించట్లేదు. దళారులు, మిల్లర్లు పచ్చజెండా ఊపితేనే రైతు ధాన్యం లోడుకు మోక్షం లభిస్తుంది. ఇలా చేస్తే మద్దతు ధరలో 75 కిలో బస్తాకు రూ.300–రూ.450 దళారీకి, మధ్యవర్తికి ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వం దళారుల దందాకు గేట్లు బార్లా తెరవడంతోనే రైతులు మద్దతు ధర కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది.ఇంత అరాచక వ్యవస్థను తట్టుకోలేని రైతులు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. ఉంగుటూరులోని బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం సాయంత్రం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ ధర్నాకు దిగారు. ఏలూరు మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు మద్దతు ధరను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తోంది. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు పట్టాలు, గోనె సంచులు, వాహనాలు, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతోంది.ధాన్యం సేకరణలో ప్రభుత్వం కపట నాటకాలు ప్రదర్శిస్తోంది. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్‌ ఇవ్వడం తప్ప క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కనీసం ప్రభుత్వం తరఫున ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చలేని దుస్థితి. ఇక్కడా మిల్లరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రబీలో ధాన్యం దిగుబడులు 48 లక్షల టన్నులకుపైగా వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. కానీ, ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం 13 లక్షల టన్నులే. ఈ క్రమంలోనే 60–70 శాతం మేర కోతలు పూర్తయినా.. చాలాచోట్ల రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు అయిపోయాయని కొనుగోళ్లు నిలిపివేశారు. ఉద్యాన పంటలకు దెబ్బఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి తదితర నియోజకవర్గాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో అరటి పంట దెబ్బతింది. కృష్ణా జిల్లా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి తడిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న గింజ, కండెలు తడిసిపోవటంతో నాణ్యత దెబ్బతింటుందని, మార్కెట్‌లో ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిసరా­ల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి తోటల్లో కోతకు వచ్చిన మామిడి కాయ నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం గోసాలలో అరటి తోటలు నేలవాలాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో అరటి, జూపూడిలంకలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరటి రైతులకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు పడిపోయాయి. కల్లాల్లో పసుపు తడిసి­పోయింది. మొక్కజొన్న కంకులు తడిసి పోయాయి. బాపట్ల జిల్లాలో భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొల్లూరు మండలంలో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. రాయల సీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఉద్యాన పంటలకు తీవ్ర దెబ్బతగిలింది. బొప్పాయి, దానిమ్మ, కూరగాయలు, మామిడి, అరటి, నిమ్మ, ఆయిల్‌పామ్‌ రైతులకు నష్టం వాటిల్లింది.సుమారు 1,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. కర్నూలులో బొప్పాయి, దానిమ్మ, శ్రీసత్యసాయి జిల్లాలో కూరగాయలు, అరటి, మస్క్‌మిలన్, మామిడి, నంద్యాలలో అరటి, బొప్పాయి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో అరటి, వైఎస్సార్‌ జిల్లాలో అరటి, మామిడి, కూరగాయలు, ప్రకాశంలో అరటి, బొప్పాయి, దానిమ్మ, అనంతపురంలో అరటి, మామిడి, బొప్పాయితో పాటు కూరగాయ పంటలు, పల్నాడులో బొప్పాయి, కూరగాయలు, చిత్తూరులో అరటి, మామిడి, బొప్పాయి, కొబ్బరి, ఏలూరులో నిమ్మ, ఆయిల్‌ పామ్‌ పంటలు దెబ్బతి­న్నాయి. వ్యవసాయ పంటలకు ప్రాథమిక నష్టం జరిగినట్టు అధికారికంగా రిపోర్ట్‌ కాలేదని వ్యవసాయ అధికారులు చెప్పడం గమనార్హం.

Sakshi Guest Column On Caste census by Central government decision8
కులగణన... చరిత్రాత్మక నిర్ణయం

జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు. అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.మారిన పార్టీల అవగాహనఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్‌ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్‌ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌’లో అంబేడ్కర్‌ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్‌ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు. మండల్‌ కమిషన్‌ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్‌ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్‌ యాదవ్, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్‌... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్‌ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్‌ స్టడీస్‌ ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్‌ ప్రభుత్వ మండల్‌ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే. కుల నిర్మాణ చట్రంఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు. భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి. కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్‌ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

Warren Buffett To Step Down: Greg Abel Named New CEO of Berkshire Hathaway9
బఫెట్‌ వారసుడొచ్చాడు..!

ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ (94) ‘బెర్క్‌షైర్‌ హాతవే’ చైర్మన్‌గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్‌ చైర్మన్‌ గ్రెగ్‌ అబెల్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్‌కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్‌ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్‌ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్‌ ప్రకటించారు.దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్‌కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్‌ పక్కనే గ్రెగ్‌ అబెల్‌ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్‌షైర్‌ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్‌ నాయకత్వంలో బెర్క్‌షైర్‌ భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్‌ తెలిపారు.ఇప్పటికే కీలక బాధ్యతలు..బఫెట్‌ భవిష్యత్‌ వారసుడిగా గ్రెగ్‌ అబెల్‌ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్‌ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్‌ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్‌ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్‌ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్‌షైర్‌ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్‌ అబెల్‌కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.ఇకపై ఇన్సూరెన్స్‌ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్‌ డాలర్లు) అబెల్‌ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్‌ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్‌ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్‌ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్‌షైర్‌ ఎస్‌అండ్‌పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్‌ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం వారెన్‌ బఫెట్‌ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

IPL 2025: KKR Beat RR By 1 Run10
కోల్‌కతా బతికిపోయింది!

వరుసగా రెండో రోజు మరో ఉత్కంఠ భరిత పోరు. ఆఖరి బంతిదాకా విజయం కోసం రెండు జట్ల సమరం. చివరకు పరుగు తేడాతో ఒక జట్టు గట్టెక్కితే... మరో జట్టు పోరాడి ఓడింది. 6 బంతుల్లో 22 పరుగులు చేస్తేనే రాజస్తాన్‌ రాయల్స్‌ను విజయం వరిస్తుంది. ఇది రాయల్స్‌కు క్లిష్టమైంది. కోల్‌కతాకు కలిసొచ్చేది. వైభవ్‌ అరోరా వేసిన ఈ ఓవర్లో 5 బంతులు ముగిసేసరికి 2, 1, 6, 4, 6లతో 19 పరుగులు వచ్చేశాయి. ఇక 1 బంతి 3 పరుగులు... ఇది ఇరుజట్లను మునికాళ్లపై నిలబెట్టేసింది. అప్పటిదాకా సిక్స్‌లు, ఫోర్‌ బాదిన శుభమ్‌ దూబే భారీషాట్‌ ఆడలేకపోయాడు. ‘టై’ కోసం రెండు పరుగులు తీసే ప్రయత్నం కూడా ఆర్చర్‌ రనౌట్‌తో వృథా ప్రయాసే అయ్యింది. చివరకు ఒకే ఒక్క పరుగుతేడాతో నైట్‌రైడర్స్‌ ఊపిరి పీల్చుకుంది. కోల్‌కతా: ఇకపై ప్రతీ మ్యాచ్‌ నెగ్గితేనే ముందుకెళ్లే పరిస్థితుల్లో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిచి ‘ప్లే ఆఫ్స్‌’ రేసులో నిలిచింది. ఆదివారం ఉత్కంఠరేపిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఫిఫ్టీ సాధించాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు), గుర్బాజ్‌ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.ఆర్చర్, పరాగ్, తీక్షణ, యుధ్‌వీర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జోరు కనబరిచాడు. టాపార్డర్‌లో వైభవ్‌ సూర్యవంశీ (4), కునాల్‌ రాథోడ్‌ (0), మిడిలార్డర్‌లో ధ్రువ్‌ జురేల్‌ (0), హసరంగ (0) నిరాశపరిచినా... కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 95; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. హెట్‌మైర్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక దశలో షరామామూలుగా చేతు లెత్తేశాడు. శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆఖరి బంతిదాకా జట్టు గెలిచేందుకు నిలిచినా... ఆర్చర్‌ (12) రనౌట్‌తో ఆశలు కూలాయి. మొయిన్‌ అలీ, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) తీక్షణ 35; నరైన్‌ (బి) యు«ద్‌వీర్‌ 11; రహానే (సి) జురేల్‌ (బి) పరాగ్‌ 30; రఘువంశీ (సి) సబ్‌–అశోక్‌ (బి) ఆర్చర్‌ 44; రసెల్‌ (నాటౌట్‌) 57; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–13, 2–69, 3–111, 4–172. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–30–1, యు«ద్‌వీర్‌ 2–0– 26–1, తీక్షణ 4–0–41–1, ఆకాశ్‌ 3–0– 50–0, హసరంగ 4–0–35–0, పరాగ్‌ 3–0–21–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రింకూ సింగ్‌ (బి) మొయిన్‌ అలీ 34; వైభవ్‌ (సి) రహానే (బి) వైభవ్‌ అరోరా 4; కునాల్‌ (సి) రసెల్‌ (బి) మొయిన్‌ అలీ 0; పరాగ్‌ (సి) వైభవ్‌ అరోరా (బి) హర్షిత్‌ 95; ధ్రువ్‌ జురేల్‌ (బి) వరుణ్‌ 0; హసరంగ (బి) వరుణ్‌ 0; హెట్‌మైర్‌ (సి) నరైన్‌ (బి) హర్షిత్‌ 29; శుభమ్‌ దూబే (నాటౌట్‌) 25; ఆర్చర్‌ (రనౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–66, 4–71, 5–71, 6–163, 7–173, 8–205. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–50–1, మొయిన్‌ అలీ 3–0–43–2, హర్షిత్‌ రాణా 4–0–41–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–32–2, సునీల్‌ నరైన్‌ 4–0–27–0, రసెల్‌ 1–0–11–0. పరాగ్‌... 6 బంతుల్లో 6 సిక్స్‌లు ఒకే ఓవర్‌ కాకపోయినా... పరాగ్‌ తానెదుర్కొన్న వరుస ఆరు బంతుల్లో (వైడ్‌ మినహా) ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ముందుగా మొయిన్‌ అలీ 12వ ఓవర్లో తొలి బంతికి హెట్‌మైర్‌ పరుగు తీశాడు. 2వ బంతి నుంచి స్ట్రయిక్‌ తీసుకున్న పరాగ్‌ 6, 6, 6, 6, వైడ్, 6లతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మళ్లీ మరుసటి ఓవర్లో హెట్‌మైర్‌ సింగిల్‌ తీయగా, పరాగ్‌ 6 బాదడంతో రెండు ఓవర్లలో వరుసగా 6 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఈ 8 బంతుల్లో సాధించిన 39 పరుగులతోనే జట్టు లక్ష్యఛేదనలో ఆశలుపెంచింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement