Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

CJI 30 Supreme Court judges sensational decision Check the details here1
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, సాక్షి: భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. తద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేననే సంకేతాలిచ్చారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒకవైపు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో ఉంచి ఆశ్చర్యపరిచింది కూడా.ఈ నేపథ్యంతో.. ఏప్రిల్‌ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు తెలియజేయాల్సి వచ్చేది. ఆపై ఆ వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల చిట్టా ఆ వెబ్‌సైట్‌లో ఉంది కూడా.అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ వివరాలేవీ అప్‌డేట్‌ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడం లేకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు జస్టిస్‌ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.#BREAKING All Supreme Court Judges unanimously agree in a full court meeting to declare their assets to the Chief Justice of India.The declaration of the Judges' assets will be uploaded on the Supreme Court's website.#SupremeCourt pic.twitter.com/XT9OvDaNmo— Live Law (@LiveLawIndia) April 3, 2025

CSK To Modify IPL 2025 Squad, Mumbai Batter Ayush Mhatre Called For Trials Amid Teams Lean Run2
IPL 2025: సీఎస్‌కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ రుతురాజ్‌, ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర మాత్రమే రాణించారు. మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి అవకాశం వచ్చిన మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్‌ హుడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన శివమ్‌ దూబే ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్‌ కూడా ఆడలేదు. మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న విజయ్‌ శంకర్‌ కూడా ఫెయిలయ్యాడు. జడేజా, ధోని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ బ్యాటింగ్‌ విభాగాన్ని బలపరచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రేను ట్రయల్స్‌కు పిలిచింది. దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సీఎస్‌కే గత సీజన్‌లో కూడా ట్రయల్స్‌కు పిలిచింది. అతని పెర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేదు.మాత్రే గతేడాది జరిగిన U19 ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. 44 సగటున, 135.38 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం స్టైలిష్‌ బ్యాటర్‌ అయిన మాత్రే.. గత సీజన్‌ విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. 65.43 సగటున, 135.50 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు.మాత్రేను ట్రయల్స్‌కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్‌కే యాజమాన్యం అవసరమైతేనే (ఎవరైనా గాయపడితే) అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరినీ జట్టులో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి, ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన సీఎస్‌కే తమ నాలుగో మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఏప్రిల్‌ 5వ తేదీ మధ్యాహ్నం (3:30) ఆడుతుంది.బెంచ్‌ కూడా బలహీనమేఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్‌ కూడా చాలా బలహీనంగా ఉంది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పిస్తే ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎంపిక చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ ఒక్కడే రాణిస్తున్నాడు. పతిరణ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌, జేమీ ఓవర్టన్‌ తేలిపోయారు. బ్యాటింగ్‌లో రచిన్‌ రవీంద్ర ఒక్కడే రాణిస్తున్నాడు. డెవాన్‌ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది.సీఎస్‌కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఎంఎస్‌ ధోని (వికెట్‌కీపర్‌), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్‌కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్‌ రషీద్‌, శ్రేయస్‌ గోపాల్‌, డెవాన్‌ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి

Along Hyderabad Rains Fall In Telangana April 3rd 2025 News3
హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్‌లోనూ కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మెర్క్యూరీ హోటల్‌ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్‌ స్టాప్‌గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌లో పిడుగు ధాటికి ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యుములో నింబస్‌ కారణంగా.. ఉత్తర తెలంగాణకు వడగండ్లు, ఉరుములు మెరుపులతోనూ వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లు తెలుస్తోంది.

Visakha Incident: Daughter inquires about mother through gestures4
నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి

విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉ‍న్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానిక​ఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచ­క్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘ­ట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్‌ పరిచయమ­య్యా­డు. నవీన్‌ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్‌ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించా­డు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.

KSR Comments Over Chandrababu P-4 Program5
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్‌ కో!

వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్‌ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.వైఎస్‌ జగన్ పాలన సమయం‌లో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్‌సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.2004లో వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్‌ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్‌ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్‌ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Supreme Court again faults CM Revanth Reddy over comments on bypolls6
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్‌ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్‌ తరఫున సీఎం ఎలా కామెంట్‌ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్‌ ఆర్యమ వాదించారు.దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. .. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్‌ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. రేవంత్‌ ఏమన్నారంటే..మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం రేవంత్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్‌ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

China urged the US to cancel its new tariffs7
‍అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్‌ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.

Prakash Raj Comments On Pawan Kalyan Political Decisions8
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్‌ రాజ్‌

సౌత్‌ ఇండియా పాపులర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్‌ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్‌ అవుతున్నాయి.పవన్‌ కల్యాణ్‌ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్‌ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్‌ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్‌ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్‌ కంఫర్టబుల్‌గా ఫీల్‌ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్‌ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్‌ రాజ్‌అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్‌ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025

Live Updates On Telangana Defections Petition Supreme Court Hearings April 3rd9
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం

న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్‌ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్‌ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్‌ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్‌ తరఫున సీఎం ఎలా కామెంట్‌ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్‌ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్‌ గవాయ్‌(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్‌ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ గవాయ్‌ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్‌ఎస్‌ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

Meet Viral IPL Girl Aaryapriya Bhuyan Gains 100K Followers Overnight!10
రాత్రికి రాత్రే‌ సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్‌ గర్ల్‌?

సోషల్‌ మీడియాలో పుణ్యమా అని క్షణాల్లో వైరల్‌ అయిపోతున్నారు. సరైన సామర్థ్యం ఉండాలేగానే డిజిటల్‌ మాద్యమంతో అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. డిజిటల్‌ ఎరా పవర్‌ అలాంటిది మరి. కన్నుమూసి తెరిచే లోపే వైరల్‌ కంటెంట్‌తో సోషల్ మీడియా సూపర్‌స్టార్లుగా మారిపోతున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ వీరాభభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సీఎస్‌కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌ (IPL) మ్యాచ్ (RR vs CSK) లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అవుట్‌కు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్‌ పాపులర్‌ గర్ల్‌ రాత్రికి రాత్రే లక్షల ఫాలోయర్లను సంపాదించుకుని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్లకొద్దీ అభిమానులను సంపాదించుంది. కొన్ని సెకన్ల క్లిప్‌తో సూపర్‌ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ (Aaryapriya Bhuyan) గౌహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీఎస్‌కే, ధోనిని పరిచయం చేసింది. అంతే అప్పటినుంచి సీఎస్‌కే అన్నా, మన మిస్టర్‌ కూల్‌ అన్నా పిచ్చి అభిమానం అట.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్‌ వీడియో ధోనీ ఔట్‌ : ఏం జరిగిందంటే?చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో అభిమానులను నిరాశపర్చింది. ఈక్రమంలో స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిర్ఘాంతపోయింది. ‘అరె ఏంట్రా ఇది’ అన్నట్టు ఫీలింగ్స్‌ ఇచ్చింది. క్యాచ్‌ పట్టుకున్న క్రికెటర్‌ని చంపేద్దామన్నంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కె మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటివరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72K లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో షేర్‌ చేశారు. మరికొందరు క్రష్‌ అంటూ కమెంట్‌ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గా, 'మీమ్ గర్ల్'గా మారిపోయింది.#IPL cameramen supremacy 🤩🤩#Dhoni Fan Girl reaction when #dhoni got out 🥲Chooo cute 🥰🥰🥰#CSKvsRR #RRvCSK #IPL2025 #IPL #IPLOnJioStar pic.twitter.com/7hbhMkh7hr— 𝑅𝒶𝓃𝓃𝒱𝒥💫 (@Rannvijju) March 31, 2025ఆర్యప్రియ ఏమందంటే..తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడపుడు జస్ట్‌ ట్రావెల్‌ ఫోటోలు మాత్రమే పోస్ట్‌ చేస్తూ ఉంటాను. ఎంఎస్‌ ధోని వికెట్‌పై తన స్పందనను చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్‌ మీడియాతో చెప్పింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు... ధోని క్యాచ్ అవుట్ అవ్వగానే షాక్ అయ్యా..అందుకే అలాంటి రియాక్షన్‌ వచ్చింది. ఇది యాదృచ్చికంగా వచ్చింది అంతే అది వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement