Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Cheap Politics1
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్‌ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్‌ చెప్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025

IPL 2025: Lucknow Super Giants Beat Rajasthan Royals By 2 Runs2
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్‌.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో రాయల్స్‌ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (74), వైభవ్‌ సూర్యవంశీ (34), రియాన్‌ పరాగ్‌ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్‌ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్‌ గెలుస్తుందనుకుంటే సూపర్‌ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్‌ ఖాన్‌ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

Audio Release: Raj Kasireddy Said Dont Believe Vijaya Sai Says3
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్‌ చేసిన రాజ్‌ కసిరెడ్డి

సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్‌ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్‌ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్‌ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

We Should Shut Parliament BJP MP Nishikant Dubey On SC4
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’

రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’

RR VS LSG: Youngest IPL Debutant Vaibhav Suryavanshi Smashes First Ball Six5
కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ

14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌ కెరీర్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్‌లో) సిక్సర్‌ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్‌వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్‌ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్‌ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్‌ (52), రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

UP Man Ends Life Over His Wife6
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు

భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్‌లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొ‍న్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 15వ తేదీన సూసైడ్‌ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Robert Kiyosaki Advised People To Put Their Money In Gold Silver And Bitcoin7
మార్కెట్‌ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు

రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్‌కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్‌కాయిన్‌లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.2035 నాటికి.. ఒక బిట్‌కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్‌ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.MAKES ME SAD: In 2025 credit card debt is at all time highs. US debt is at all time highs. Unemployment is rising. 401 k’s are losing. Pensions are being stolen. USA may be heading for a GREATER DEPRESSION.I get sad because as I stated in an earlier X….Tweet….I warned…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 18, 2025 Note: బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Womens Cricket: West Indies Chase 168 In 10.5 Overs But MISS OUT To Bangaldesh On World Cup Qualification8
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!

మహిళల వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచినా కరీబియన్‌ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరిగిన డు ఆర్‌ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్‌రేట్‌ తేడాతో వరల్డ్‌కప్‌ బెర్త్‌ను కోల్పోయింది. పాయింట్ల పరంగా విండీస్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 ​మ్యాచ్‌ల్లో తలో మూడు గెలువగా, రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.కాగా, పాక్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్‌, బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించగా.. పాక్‌, బంగ్లాదేశ్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా క్వాలిఫై అయ్యాయి.‌

Woman Attempts To Jump From Hospital Building In Banjara Hills9
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్‌చల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్‌ చేస్తోంది.

Uddhav and Raj Thackeray hint at burying the hatchet10
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!

ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప‍్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్‌ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్‌ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్‌ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్‌ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement