Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Modi meeting With Air Force Chief Air Marshal Amar Preet Singh1
ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్‌ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.Indian Air Force Chief Air Marshal Amar Preet Singh is meeting Prime Minister Narendra Modi right now: Sources pic.twitter.com/qytnt88F0G— ANI (@ANI) May 4, 2025

Pak MPs funny reply to India Pak war query goes viral2
‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’

కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్‌ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

Punjab Kings Picks BBL Sensation Mitch Owen As Replacement for Maxwell3
మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.... పంజాబ్‌ ప్రకటన

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell) స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ ఓవెన్‌ (Mitchell Owen)తో పంజాబ్‌ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.గాయం కారణంగా దూరంకాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పంజాబ్‌ ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను రూ. 4.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్పిన్నర్‌గా ఫర్వాలేదనిపించినా బ్యాటర్‌గా మాత్రం మాక్సీ తేలిపోయాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన అతను 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. అయితే, వేలికి గాయం కావడంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మ్యాక్స్‌వెల్‌ అందుబాటులో ఉండడని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బుధవారం (ఏప్రిల్‌ 30) స్పష్టం చేశాడు.రూ. 3 కోట్లకుచెన్నైతో మ్యాచ్‌కు ముందు పంజాబ్‌ సారథి శ్రేయస్‌ మాట్లాడుతూ... ‘అనుకోకుండా మ్యాక్స్‌వెల్‌ గాయపడ్డాడు. అతడి వేలు విరిగింది. మ్యాక్స్‌వెల్‌ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అన్నాడు. అయితే, తాజాగా మాక్సీ స్థానాన్ని మిచెల్‌ ఓవెన్‌తో భర్తీ చేశారు. రూ. 3 కోట్లకు పంజాబ్‌ అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టాస్మేనియాకు చెందిన మిచెల్‌ ఓవెన్‌ 34 ఇప్పటికి టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.బీబీఎల్‌ సంచలనంఇక ప్రస్తుతం ఓవెన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్‌ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, అతడు త్వరలోనే పంజాబ్‌ కింగ్స్‌తో చేరతాడు. 2024-25 బిగ్‌బాష్‌ లీగ్‌లో 452 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. 200కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్‌ చేసి హోబర్ట్‌ హ్యారికేన్స్‌ తొలిసారి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.కాగా సౌతాఫ్రికా స్టార్‌ కార్బిన్‌ బాష్‌ స్థానంలో మిచెల్‌ ఓవెన్‌ పెషావర్‌ జల్మీలో చేరాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడేందుకు బాష్‌ కాంట్రాక్టు రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఓవెన్‌ మాత్రం ప్లే ఆఫ్స్‌ సమయానికి పంజాబ్‌ కింగ్స్‌తో చేరతాడని.. అంతవరకు పీఎస్‌ఎల్‌లో కొనసాగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పీఎస్‌ఎల్‌ మే 18తో ముగుస్తుండగా.. మే 20 నుంచి ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.వారి పేర్లు వినిపించాయిఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో పంజాబ్‌ కింగ్స్‌ సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి.. పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ విధ్వంసకరవీరుడికి యాజమాన్యం పిలుపునివ్వడం విశేషం.కాగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారయ్యే ముందు మ్యాక్స్‌వెల్‌ జట్టుకు దూరమవడంతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు లెస్‌ డు ప్లోయ్, అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ సలామ్‌ ఖైల్‌లో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చనే అంచనాలు నెలకొనగా.. అనూహ్యంగా మిచెల్‌ ఓవెన్‌ జట్టులోకి వచ్చాడు.చదవండి: RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని

Warren Buffett To Retire From Berkshire Hathaway4
బెర్క్‌షైర్‌ హాత్‌వేను వీడనున్న వారెన్‌ బఫెట్‌: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?

శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్‌ బఫెట్‌' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్‌ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా గ్రెగ్ అబెల్‌ పేరును ప్రస్తావించగానే.. గ్రెగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. గ్రెగ్‌ను సీఈఓగా నియమించాలనే నిర్ణయం తన కుటుంసభ్యులకు తప్ప, గ్రెగ్‌కు కూడా తెలియవని బఫెట్‌ పేర్కొన్నారు.కంపెనీని నడిపించడానికి.. రెండు దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న గ్రెగ్ అబెల్‌ సరైన వ్యక్తి అని కొందరు భావించినప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బఫెట్ సమాధానమిస్తూ.. గ్రెగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నా సంపద మొత్తానికి కంపెనీలో పెట్టుబడిగా పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. నా సారథ్యంలో కంటే.. గ్రెగ్ సారథ్యంలో కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన బఫెట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మంచంలో సగం అద్దెకు: కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్న మహిళఎవరీ గ్రెగ్ అబెల్?62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. రెండు దశాబ్దాలకు పైగా బెర్క్‌షైర్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన అబెల్ చిన్నప్పుడు బాటిల్స్ సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో ఉన్నతమైన విలువలను పొందారు. 1984లో ఆల్బెర్టా యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివారు. బెర్క్‌షైర్ హాత్వేలో చేరిన తరువాత దినదినాభివృద్ధి చెందిన.. కీలకమైన పదవులను అలంకరించారు. ఇప్పుడు ఈయనను సీఈఓ పదవి వరించింది.

Pakistan Again Nuclear Warning To India5
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

Tension In Hindupur During Balakrishna Visit6
బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత

సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్‌లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్‌ పూర్‌ సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Minister Bandi Sanjay Sensational Comments On Maoists7
మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదుకేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది.పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

coin sized nuclear battery with a 50 year lifespan8
ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ

ఒకసారి ఛార్జ్‌ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్‌ న్యూక్లియర్‌ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్‌ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్‌ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. డైమండ్ సెమీకండక్టర్ల ద్వారా ఈ చర్యలో విడుదలైన శక్తిని విద్యుత్తుగా మారుస్తున్నట్లు పేర్కొంది.బీవీ 100 న్యూక్లియర్ బ్యాటరీ ఫీచర్లుపరిమాణం: ఒక చిన్న నాణెం (15x15x5 మిమీ) పరిమాణంలో ఉంటుంది.పవర్ అవుట్ పుట్: 3 వోల్ట్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీ 100 మైక్రోవాట్ల పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటినికి 1 వాట్ పవర్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీలను తయారు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.జీవితకాలం: ఈ న్యూక్లియర్‌ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే మళ్లీ ఛార్జ్‌, మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేస్తుంది.సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే 10 రెట్లు అధికం సామర్థ్యంతో పని చేస్తాయి.ఇదీ చదవండి: పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?సేఫ్టీ: విపరీతమైన ఉష్ణోగ్రతల్లో (-60°C నుంచి +120°C) మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల మంటలు లేదా పేలుడు ప్రమాదాలను జరగవని కంపెనీ తెలుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ బ్యాటరీలు వినియోగంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఉపయోగాలు: వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఏఐ వ్యవస్థలు, డ్రోన్లు.. వంటి నిరంతరం విద్యుత్‌ అవసరమయ్యే పరికరాలకు ఈ బ్యాటరీలో ఎంతో అనువైనవిగా సంస్థ చెబుతుంది.

One Police Constable Suspended Become Actor Vijay9
హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్‌ అయ్యాడు. తమిళగ వెట్రి కళగం నేత విజయన్‌ను కలిసిన పోలీసు కానిస్టేబుల్‌ కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ మధురై పోలీసు కమిషనర్‌ లోకనాథన్‌ ఆదేశాలు జారీ చేశారు. విజయ్‌ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జన నాయగన్‌ షూటింగ్‌ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్‌కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్‌కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్‌ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్‌లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్‌ను కలిసి వచ్చారు. అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్‌ తన యూనిఫామ్‌ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

APTDC Employee CCTV Footage Viral At Vijayawada10
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు

సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్‌ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్‌ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్‌ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement