
సంపూర్ణ పోషణతోనే మాతాశిశు మరణాల నివారణ
చింతపల్లి: సంపూర్ణ పోషణ అమలు ద్వారా మాతాశిశుమరణాలను అరికట్టవచ్చని సీ్త్ర,శిశుసంక్షేమశాఖ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా తాజంగిలో బుధవారం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ గర్భిణులు తప్పని సరిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. సీడీపీవో రమణి, ఏసీడీపీవో రామలక్ష్మి, వైద్యాధికారి భవాని, మాజీ సర్పంచ్‌లు కాంతమ్మ, రామస్వామి, సూపర్‌వైజర్లు విజయకుమారి, గౌరి, అప్పలనర్స, గౌర్నిషా తదితరులు పాల్గొన్నారు.