
పీఎం జన్మన్నుసద్వినియోగం చేసుకోవాలి
● 20 సూత్రాల పథకం చైర్మన్ దినకర్
అరకులోయటౌన్: పీఎం జన్మన్ను సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనంతగిరి మండలంలోని పైనంపాడు, కాకరపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాయంత్రం అరకులోయ మండలంలోని శిమిలిగుడలో పర్యటించి, పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల స్థితిగతులు, సమస్యలను గుర్తించేందుకే పీవీటీజీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. జన్మన్ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పీఎం జన్మన్ పథకంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, పనిముట్లు, రుణాలు అందిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను శుక్రవారం పాడేరులో కలెక్టర్‌తో జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ తేజ, అరకులోయ తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో అడపా లవరాజు, ఎంపీటీసీ లక్ష్మి, హౌసింగ్ ఏఈ కాంతి, ఆర్ఐ బలరామ్, వీఆర్వో ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.