
సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి.
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి సంబరం అంబరాన్ని తాకింది. ఈ నెల 24న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా శక్తివేషాలు, కోటాలం, థింసా నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇసుక వేస్తే రాలనంతగా దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వేలాది మందితో రహదారి కిక్కిరిసిపోయింది. ఆలయం వద్ద అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి గరగలను వైభవంగా ఊరేగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతపల్లి సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అందరిపై ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలి
ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లిని ఆదివారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెను ఉత్సవ కమి టీ ప్రతినిధులు సన్మానించి, ముత్యాలమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.

సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి.