
కలెక్టరేట్ ఎదుట ఆయుష్మాన్ సీహెచ్‌ఓల ధర్నా
అనంతపురం అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆయుష్మాన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ (ఏపీ మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘం) జిల్లా అధ్యక్షుడు గణేష్‌కుమార్ మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్‌ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆరేళ్ల సర్వీసు దాటిని వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా వేతనంతో పాటు ఇన్సెంటీవ్, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలన్నారు. హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలువులు, తదతర వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ బాధ్యతతో కూడిన శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌ను ఆయన చాంబర్ వద్ద నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గౌరి, కార్యనిర్వాహక కార్యదర్శి షీబా ప్రియాంక, జిల్లా నాయకులు హరినాథ్‌రెడ్డి, సుధీర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, సుబహాన్, హరి, తదితరులు పాల్గొన్నారు.