
ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల
మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ అందుబాటులో..
సాక్షి, అమరావతి: మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటరీ్మడియెట్ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్లతోపాటు ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్‌ఈఏపీ) మొబైల్ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ద్యార్థులు వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, విద్యార్థి హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. లీప్ మొబైల్ యాప్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్టు తెలిపారు.