ఏఐ స్కిల్స్‌ ఉంటే వేతన ధమాకా! | Artificial Intelligence skills can increase salaries by as much as 40 percent | Sakshi

ఏఐ స్కిల్స్‌ ఉంటే వేతన ధమాకా!

Published Tue, Feb 18 2025 2:58 AM | Last Updated on Tue, Feb 18 2025 2:58 AM

Artificial Intelligence skills can increase salaries by as much as 40 percent

40 శాతం వరకూ జీతం పెరిగే చాన్స్‌

 మిగిలిన వారికి 15 శాతంలోపు 

భారత్‌–2025 జాబ్‌ మార్కెట్‌పై ఆశావహ దృక్పథం

సాక్షి, అమరావతి: భారత్‌ –2025 జాబ్‌ మార్కెట్‌పై ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరి్టఫిíÙయల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) వంటి ప్రాముఖ్యత, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఉద్యోగుల వేతనాలు సైతం 6 నుంచి 15 శాతం లోపు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రముఖ దిగ్గజ రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ అయిన మైఖేల్‌ పేజ్‌ ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ.. ఏఐ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ఏకంగా 40 శాతం వేతన పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసింది. నివేదికలోని అంశాలను పరిశీలిస్తే..

ఈ ఏడాది కార్పొరేట్‌ సంస్థల జీతాలు సగటున 6 నుంచి 15 శాతం  వరకు పెరిగే అవకాశాలున్నాయి.  

ఇదే సమయంలో ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి స్కిల్స్‌ ఆధారిత ఉద్యోగుల జీతాలు 40 శాతం వరకు పెరగనున్నాయి.

కార్పొరేట్‌ ఇండియాలో అన్ని రంగాల్లో జీతాల పెరుగుదల భారీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ,  నాయకత్వ స్థానాల్లో ఉన్న వారికి భారీగా వేతన పెరుగుదల ప్రయోజనం కలగనుంది. వీరి వేతనాలు 20 నుంచి 30 శాతం పెరిగితే నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి ఏకంగా 40 శాతం వరకు పెరుగుతాయి.

ఏఐ, ఎంఎల్‌ ఆల్గోరిధమ్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ , సైబర్‌ సెక్యూరిటీ,  రెన్యువబుల్‌ ఎనర్జీ వంటి రంగాలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఈ రంగాల్లో విదేశీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్విసెస్, తయారీ, రియల్టీ, హెల్త్‌కేర్‌ లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.  

ప్రస్తుతం ప్రపంచ ఆరి్థక పరిస్థితి అనిశి్చతిలో ఉండటంతో తాత్కాలిక ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.  

ఉద్యోగులను కాపాడుకోవడానికి పాట్లు
ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకోవడానికి, కొత్త వారిని ఆకర్షించడానికి  భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఓనర్‌íÙప్‌ (ఈసాప్స్‌) పేరిట ఉద్యోగులకు కంపెనీ షేర్లను కేటాయించడంతో పాటు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకించి సీనియర్‌ స్థాయిలో ఉన్న ఉద్యోగుల విషయంలోనే కంపెనీలు ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 50 శాతం మహిళా ప్రాతినిధ్యం లక్ష్యంగా, స్పష్టమైన వేతన విధానాలు, సౌకర్యవంతమైన పని విధానాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి.  

డిమాండ్‌ ఉన్న టాప్‌ 5 జాబ్‌ ప్రొఫైల్స్‌  
మెషిన్‌ లెరి్నంగ్‌ ఇంజనీర్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఆర్కిటెక్ట్స్‌ (ఎంటర్‌ప్రైజ్, డేటా క్లౌడ్‌), వెబ్‌3 డెవలపర్స్, ఉమెన్‌ ఇంజనీరింగ్‌ లీడర్స్‌

డిమాండ్‌ ఉన్న స్కిల్‌ కోర్సులు
ఏఐ, ఎంఎల్‌ ఆల్గోరిథమ్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఎక్స్‌పరై్టజ్, డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, సైబర్‌ సెక్యూరిటీ

స్పెషలిస్టులను కోరుతున్న మార్కెట్‌ 
ఉద్యోగంలో మంచి వేతన పెరుగుదలకు ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండాలి. జా­బ్‌ మార్కెట్‌ సా­దా­సీదా మామూలు ఉద్యోగు­లను కాకుండా, స్పెషలిస్టులను కోరుతోంది. – అంకిత్‌ అగర్వాల్, మైఖేల్‌ పేజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement