
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా.. 41 ఏ నోటీస్ ఫాలో కావాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంవ్యాఖ్యలు చేయొద్దని రజినికి కోర్టు స్పష్టం చేసింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఏసీబీ చేత నమోదు చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు.
అయితే తమపై కక్ష పూరితంగా కేసులుట్టారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి విడుదల రజిని తో పాటు ఆమె పీఏ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది.