
సాక్షి, అమరావతి: నేడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు.
భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.#LalBahadurSastry
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2021