
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీన గుంటూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.