
( ఫైల్ ఫోటో )
మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, తాడేపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!