సీఎం జగన్‌తో జనం ఏమన్నారంటే? | Memantha Siddham Bus Yatra: People Response To CM Jagan Ruling | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో జనం ఏమన్నారంటే?

Published Sat, Mar 30 2024 6:09 PM | Last Updated on Sat, Mar 30 2024 6:50 PM

Memantha Siddham Bus Yatra: People Response To Cm Jagan Rule - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టి న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముచ్చటించి  వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు. 

పింఛన్‌ కోసం పడిగాపులు లేవు
పింఛన్ కోసం రెండు మూడు రోజులు బయట ఉండేవాళ్లం. గతంలో మా వికలాంగుల్లోనే వైకల్యానికి పర్సెంటేజ్ ప్రకారం తేడా చూపించేవాళ్లు. జగనన్న వచ్చాక ఆ తేడా లేకుండా మూడువేల పెన్షన్ ఇస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు.
రంగమ్మ, రాతన, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా

మన ప్రభుత్వం రాకమునుపు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 4సం.ల 10 నెలలు పెన్షన్‌ - రూ.1000. మీ బిడ్డ హయాంలో పెన్షన్‌ రూ.2 వేల నుండి రూ.3వేలకు పెంచుకుంటూ వెళ్లాం. దేశం మొత్తంలోనే మూడు వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఇంకొక్కటి లేదు. మన రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయిలు. మన తర్వాత మిగతా రాష్ట్రాలు - రెండో స్థానంలో తెలంగాణా 12వేల కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో 8వేల కోట్లు, 6 వేల కోట్లు, 4వేల కోట్లు, పెన్షన్ చూస్తే రూ.500, పక్కన ఒడిస్సాలో, ఉత్తర ప్రదేశ్ లో కూడా కేవలం రూ.500. ఒక్క మన ప్రభుత్వంలోనే అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మల మీద ప్రేమ, అభిమానం చూపిస్తూ 66లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 33 లక్షలు మాత్రమే. మనం ఇస్తున్న 66 లక్షల పెన్షన్లలో 45 లక్షలు నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలే. ఇది గుర్తించమని కోరుతున్నాను. 
- సీఎం వైఎస్‌ జగన్ 

చంద్రబాబుకు సవాల్ చేసిన అంధుడు
నీ ఓదార్పు యాత్ర మొదలు నేటి మేమంతా సిద్ధం యాత్ర వరకూ 100 కార్యక్రమాల్లో నే పాల్గొన్నాను అన్నా. పోలీసులు అడ్డుపడ్డా సరే ఆగలేదు. నాకు కళ్లు లేవు అయినా నీ కళ్లతోనే నేను చూస్తున్నాను అని భావిస్తున్నాను. ఒక్కసారి నిన్ను తాకాలని ఆశపడుతున్నాను. ఇక మా నియోజకవర్గం శింగనమలకు ఓ టిప్పర్‌ డ్రైవర్‌ను అభ్యర్థిగా పెట్టారని చంద్రబాబు అంటున్నాడు. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? అని అడుగుతున్నాను. వైయస్సార్ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌కి చంద్రబాబు భయపడుతున్నాడు అంటే మా వీరాంజనేయులు గెలుపు ఖాయం అయినట్టే అని చెబుతున్నా. నాకు కనిపించదు. కానీ బాబుకు కనిపిస్తుంది కదా.,.. చంద్రబాబూ...నువు చూడు.... రేపు శింగనమలలో జూన్‌ 4వ తారీకున గెలిచి, జెండా ఎగరేసి, జగనన్నకు నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను
-పాలమూరి వినోద్‌ కుమార్, అమ్మవారిపేట, శింగనమల, బుక్కరాయసముద్రం అనంతపురం జిల్లా.

మీ సాయం మరువలేం జగనన్నా
అన్నా నేను ట్రాన్స్‌ కోలో పనిచేసేవాడిని. ఒక ప్రమాదంలో పైనుంచి పడి నడుం విరిగింది. డ్రోన్‌ సభలో నన్ను పిలిచి మీరు ఐదు లక్షలు సహాయం అందించారు. మా నాన్నకు 3వేలు పెన్షన్ అందిస్తున్నారు. మీ మేలు మరిచిపోలేను. మిమ్మల్ని చూసేందుకే నా కుటుంబం అంతా ఇక్కడకు ఉదయం 6 గంటలకే వచ్చి ఎదురు చూస్తున్నాం. 
-బలరాం నాయక్, లక్ష్మి తాండ, తుగ్గలి, దివ్యాంగుడు

పేదవాడికి పెద్ద వైద్యం ఆరోగ్యశ్రీతోనే సాధ్యం
రెండేళ్ల క్రితం మా నాన్నగారికి రెండు కిడ్నీల్‌ ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ చేయాలని చెప్పారు. నంద్యాల, కర్నూల్‌ లో పెద్ద హాస్పటల్‌ అనడంతో గౌరీగోపాల్‌ హాస్పటల్ లో డయాలసిస్ చేయించుకోమన్నారు. ఆ ఆసుపత్రి పేరు ఎందుకు చెబుతున్నామంటే ఎంతో డబ్బు ఉంటేనో, బాగా పెద్దవాళ్లు అయితేనో మాత్రమే అక్కడ వైద్యం చేయించుకోగలరు అంటారు. అలాంటి ఆసుపత్రిలో మా నాన్నకు డయాలసిస్ జరిగింది. అది ఆరోగ్యశ్రీ వల్లే సాధ్యం అయ్యింది. దాని తర్వాత మా నాన్నకు కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చేయించుకోగలిగాం. ఆరోగ్య శ్రీ తరఫున అధికారులు మాకు వెన్నంటి ఉండి ఎంతో సాయం చేసారు. మీరు మా ఇంటి పెద్దగా మాకు అన్నీ చేసారు. అందుకే మిమ్మలన్నే మా పెద్దన్నగా భావిస్తున్నాను
-జనార్థన్‌ రెడ్డి, చెన్నంపల్లి గ్రామం, ఔకు మండలం, నంద్యాల జిల్లా

మా ధైర్యం నువ్వే 
జగనన్నా మేము రైతులం. నీవు ఇస్తున్న రైతు భరోసా డబ్బును విత్తనాలకు, ఎరువులకు ఉపయోగించుకుంటున్నాం. ఇంటిపట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరింది. మా పిల్లల చదువుల కోసం అమ్మఒడి ఇస్తున్నారు. ప్రజల గుండెల్లో నమ్మకం, ధైర్యం మీరు. ఆ నమ్మకం, ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోము. మిమ్మల్ని గెలిపించుకోవాడానికి మేమంతా సిద్ధం అన్నా
-మాధవి, మహిళారైతు, రాతన, కర్నూలు జిల్లా

మా స్కూల్ ఎంత బాగా చేసారో జగన్ మామ
నాడు నేడు పేరుతో మా స్కూల్‌ను ఎంతో బాగా తయారు చేసారు జగన్‌ మామ. కోడిగుడ్డు చిక్కీ బాగా పెడుతున్నారు. ఆరోగ్యశ్రీలో మా నాన్నకు ఆపరేషన్ కూడా జరిగింది.
విద్యార్థి 7th క్లాస్, హోసూరు, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా

నాకు స్ట్రోక్ వచ్చింది అన్న. మా ఎమ్మెల్యేగారి సాయంతోనే ఆపరేషన్ చేయించుకుని బయటపడగలిగాను.
-లాల్ బాష, బాలుడి తండ్రి

ఎప్పటికీ మీరే మాకు సీఎం
జగన్‌ సార్ నేను పేదరాలిని. నాకు రైతుభరోసా, చేయూత, ఆసరా, ఇంటిపట్టా అన్ని పథకాలూ వచ్చాయి. జగనన్న తోడు కూడా వచ్చింది. మా కలలన్నీ నిజమైనాయి. మాకు ఎవరూ వద్దు, మీరే కావాలి, మీరే రావాలి
-శ్యామల, రాతన, కర్నూలు జిల్లా

నీ వల్లే మా నాన్న మాతో ఉన్నాడు
మా నాన్నకు రెండు లంగ్స్‌ ఫెయిల్ అయ్యాయి. పెద్ద ఆసుపత్రికి వెళితే 4లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మా నాన్నకు ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మాతో ఉన్నాడు. మీ పాలనలో అందరికీ అన్ని పథకాలూ అందుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని మోసం చేసాడు. బాబు పాలనకు జగనన్న పాలనకు తేడా గమనించాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను
నరేష్, రాతన గ్రామం, కర్నూలు జిల్లా

కరోనాలో ఆదుకుంది నువ్వే
ఒక ఇల్లు నాకల. నేను చాలా పేదవాడిని. మీ పథకాలవల్ల ఎంతో లబ్ది పొందాము. దేశం అంతా కరోనాలో ఉన్నప్పుడు కరువు సమయంలో మీరు ఎంతో ఆదుకున్నారు. మా చీకటి బతుకుల్లో మీరు వెలుగులు నింపారు. అటు పొద్దు ఇటు పొడిచినా మళ్లీ నువ్వే రావాలి జగనన్నా
-శివ, హోసూరు గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా 

కులం చూడం మతం చూడం అన్న ఒకే ఒక్కడు మా సీఎం
ఈ రాష్ట్రంలో నీ వల్ల లబ్ది పొందని మనిషే లేడన్నా. నీకు ఓటు వేసినా వేయకపోయినా నీవిచ్చిన పథకాలకు లబ్దిదారులయ్యారు. వారంతా నీవే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు
-సురేష్, రాతన, కర్నూలు

జగనన్నవల్లే ఈరోజు నా కొడుకు బ్రతికి, బడికి పోతున్నాడు
నా కొడుకు అన్నా...తల్లిలేనివాడు. బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం CMRF ద్వారా 20లక్షలు వచ్చాయి. ఇదీ సమస్య అని వెళ్లి అడగగానే రెండే రోజుల్లో మా నాయకులు నా కొడుకు వైద్యానికి డబ్బులు సాంక్షన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈరోజు నా బిడ్డ స్కూల్ వెళుతున్నాడు. ఈ సాయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు
-లక్షణ, చందూరి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా

నా అన్నవే అనుకుంటున్నా..
అన్నా నా భర్త ఆరోగ్య మిత్రలో ఉద్యోగిగా చేస్తూ మరణించాడు. నాకు మీ పాలనలో అన్ని పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా పథకాలు అన్నీ అందాయి. డిగ్రీ చదివిన నాకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే మీకెంతో రుణపడి ఉంటాను అన్నా. మిమ్మల్ని నా అన్నగా అనుకొని ఈ సాయం అర్థిస్తున్నాను.
-సరస్వతి, తుగ్గలి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా

అర్హులకు అందని పథకం అంటూ లేదు
అన్నా నీ పాలనలో మాకు అందని పథకమంటూ లేదు. మా ఆయనకు ఆరోగ్య శ్రీద్వారా ఆపరేషన్ జరిగింది. తుగ్గలి మండలంలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ మాకు సాంక్షన్ చేయండి చాలు సర్.
షరీఫా, చెన్నంపల్లి గ్రామం, తుగ్గలి మండలం

తమ మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజీ కావాలని కోరిన చెల్లెమ్మ షరీఫాకు సీఎం వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు. 

'ప్రతి మండలానికీ రెండు జూనియర్ కాలేజీలు పెట్టబోతున్నామని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లలకోసమే పెడుతున్నామని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న రెండు  హైస్కూల్‌ ను జూనియర్ కాలేజీలుగా అప్‌ గ్రేడ్ చేస్తున్నట్టు తెలియజేసారు. ఇదంతా నాడు నేడు ద్వారా దశలవారీగా జరుగుతుందని మీ పిల్లలను ఇంటర్‌ వరకూ మీ మండలంలోనే చదివించుకోవచ్చని భరోసా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement