
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు.
22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు.