విజయవాడలో దారుణం.. డేటింగ్‌ పేరుతో హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసి.. | Man Cheats Young Woman In The Name Of Dating In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయవాడలో దారుణం.. డేటింగ్‌ పేరుతో హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసి..

Published Sat, Apr 26 2025 3:20 PM | Last Updated on Sat, Apr 26 2025 4:01 PM

Man Cheats Young Woman In The Name Of Dating In Vijayawada

సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది.  కాగా,  నెల రోజుల నుంచి  కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్‌లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్‌లో నాగతేజను ఆ యువతి కలిసింది.

ఇద్దరి కోసం హోటల్‌లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.

వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement