
కాకినాడ: మత్స్యకార భరోసా జాబితాలో అనర్హులుగా పలువురి పేర్లు తొలగించడంపై గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట అనేది ఉద్యోగం కాదని, మత్య్స కారులకు రూ. 20 వేల చొప్పున వేట నిషేధ పరిహారం ఇస్తే, రాష్ట్రం ఏమైనా శ్రీలంక అయిపోతుందా? అంటూ ఏటిమొగకు చెందిన మత్స్యకారులు సంగాడి ఈశ్వరరావు, మల్లిఖార్జున రావులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘అమరావతికి రూ.70 వేల ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు ..మాకు రూ.20 వేలు ఇవ్వడానికి నిబంధనలు ఏమిటీ?, కరెంటు బిల్లు అధికంగా ఉందని నిజమైన వేటగాళ్ళ పేర్లను బాబితా నుండి తొలగించారు.వేట అనేది ఉద్యోగం కాదు. కూటమీ అధికారంలోకి వచ్చి ఏడాది లోపే చంద్రబాబు రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశాడు.ఇప్పటికీ ఒక్క సంక్షేమ పధకం అమలు చేయలేదు. గత జగన్ ప్రభుత్వం లో మత్స్యకార భరోసా మాకందింది. మాకు మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నాయి. టీడీపీలో తిరిగి టిడిపి ఓటు వేసినందుకు మాకు మత్స్యకార భరోస లేకుండా పోయింది’ అంటూ వారు నిలదీస్తున్నారు.