శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ విరాళం | Former Cricketer Vvs Laxman Donated Decoration For Srivari Temple - Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ విరాళం

Published Sat, Oct 21 2023 4:58 PM | Last Updated on Sat, Oct 21 2023 6:22 PM

Former Cricketer Vvs Laxman Donated Decoration Of Srivari Temple - Sakshi

తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు.

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు.

దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు.
చదవండి: ‘గగన్‌యాన్‌’ TV-D1 ప్రయోగం సక్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement