
అనంతపురం: హత్యలు చేయడం, ఆపై వారికి సానుభూతి తెలపడం పరిటాల కుటుంబానికి అలవాటేనని మద్దెలచెర్వు సూరీ సతీమణి గంగుల భానుమతి విమర్శించారు. అనంతపురంలో మాట్లాడిన ఆమె.. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యలను ఖండించారు.
‘పరిటాల రవీంద్ర హత్యతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం లేదు. మద్దెలచెర్వు సూరీ సహా అనేక మందిని పరిటాల కుటుంబం పొట్టన పెట్టుకుంది. మద్దెలచెర్వు సూరీ, సానే చెన్నారెడ్డి కుటుంబాలను అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్న పరిటాల విమర్శలు అర్థరహితం. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీ నేత కురుబ లింగమయ్య ను పరిటాల సునీత బంధువులే చంపారు’ అని గంగుల భానుమతి మండిపడ్డారు.
