
తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు.
‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్‌లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!