
చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది.
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు సమాచారం.
చదవండి: మార్గదర్శి కేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. రేపు(మంగళవారం)ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉందని రాజా అన్నారు.