దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’ | Industrial growth is running in the state | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’

Published Tue, May 30 2023 3:53 AM | Last Updated on Tue, May 30 2023 3:53 AM

Industrial growth is running in the state - Sakshi

రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు,  మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి.

ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్,  జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి  తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి

ఐటీలోనూ మేటి.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, టెక్‌ మహీంద్రా, డబ్ల్యూఎన్‌ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్‌ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్య­కలా­పాలు ప్రారంభిస్తున్నాయి.

వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్‌ బిజి­నెస్‌ పార్క్‌­ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చి­లో విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు
రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత­్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్‌ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్‌ ల్యాండ్‌లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారి­డార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభు­త్వం అభివృద్ధి చేస్తోంది.

కోవిడ్‌ సంక్షోభంలోనూ కొ­ప్ప­­ర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రి­­యల్‌ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజి­స్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వ­క­ల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభు­త్వ­ం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. 

లక్షలాది మందికి ఉపాధి..
సీఎం జగన్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది.

ఇందులో సీఎం జగన్‌ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్‌ 2019 డిసెంబర్‌ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి.

వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement