ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..! | Man Ends Married Woman Life In Eluru, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!

Published Sat, Mar 29 2025 1:25 PM | Last Updated on Sat, Mar 29 2025 3:35 PM

married woman ends life in eluru

జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్‌ జబీర్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. 

ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మృతదేహంతో ధర్నా
కొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్‌సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement