
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్‌సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు.