
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో దారుణం జరిగింది. మెకానిక్ మహబూబ్ బాషాపై రౌడీషీటర్ రెమో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ బాషా.. కుప్పం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కారులో మితిమీరిన వేగంతో వెళ్లిన రౌడీషీటర్ రెమో.. మహబూబ్ బాషాతో ఘర్షణ పడ్డాడు.
ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో మహబూబ్ బాషా కూప్పకూలిపోయాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి బంధువులు.. రౌడీషీటర్ రెమోను అరెస్ట్ చేయాలని నిరసన చేపట్టారు. కర్ణాటక నుంచి కుప్పంకు మద్యం అక్రమ రవాణా చేస్తున్న రెమో.. బెల్టుషాపులు నిర్వహిస్తున్నాడు.