attacks
-
టీడీపీ గూండాల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై రాడ్లతో దాడి
పల్నాడు జిల్లా : జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. నార్రెడ్డి వెంకటరెడ్డి అనేవైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్రలు, ఇనుప రాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు టీడీపీ గూండాలు. ఈ దాడిలో వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరెడ్డిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలోవైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదంటూ టీడీపీ నాయకులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సామేలు, బత్తుల రాజేష్, చల్లా వీరయ్య వారి అనుచరులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి చెబుతున్నాడు.కాగా, కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలు తారాస్థాయికి చేరాయి. రెడ్ రాజ్యాంగం అంటూవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి దిగుతున్నారు. అనంతపురం జిల్రల్లా రాప్తాడు నియోజవర్గానికి చెందిన కురబ లింగమయ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. . అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ దాడులకు దిగుతోంది. -
విరామం అంటూనే విరుచుకుపడింది
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే సమరనినాదం చేసింది. మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా డోనెట్సక్ ప్రాంతంలోని నగరాలపై 150 డ్రోన్ల దాడులు జరిగాయి. వీటితోపాటు కీవ్, ఝిటోమిర్, చెరి్నహీవ్, పోల్టావా, ఖర్కీవ్, కిరోవోహార్డ్, డినిప్రోపెట్రోవ్సŠక్, చెర్కసే ప్రాంతాలపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. ఉక్రెయిన్ సైతం డ్రోన్లకు పనిచెప్పింది. రష్యా ప్రాంతాలపై డ్రోన్ దాడులుచేసింది. 57 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ‘‘కాల్పుల విరమణ చర్చల వేళ ఇలా దాడులతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో చర్చలు రైలు పట్టాలు తప్పే ప్రమాదమొచ్చింది’’ అని రష్యా రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. -
హౌతీలపై అమెరికా దాడులు
వెస్ట్ పామ్ బీచ్ (యూఎస్): అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగించే అమెరికా రవాణా నౌకలు, యుద్ధనౌకలే లక్ష్యంగా రాకెట్ దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై ట్రంప్ సర్కారు విరుచుకుపడింది. శనివారం హౌతీ స్థావరాలపై బాంబులు, రాకెట్లు, క్షిపణి దాడులతో బెంబేలెత్తించింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ రెబెల్స్ ఆదివారం ప్రకటించారు. ‘‘మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. 101 మందికి పైగా గాయపడ్డారు’’ అని హౌతీల ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య శాఖ ఆదివారం పేర్కొంది.హౌతీలకు ఇక మూడిందని ఈ సందర్భంగా ట్రంప్ ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘‘ఉగ్రవాదుల స్థావరాలు, వారి నేతలు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా సముద్రయానం చేయకుండా ఏ ఉగ్ర శక్తీ ఇక అమెరికాను ఆపలేదు. స్వేచ్ఛాయుత సరకు రవాణాయే మా లక్ష్యం’’ అని తన సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హౌతీలకు ఇకనైనా మద్దతు మానుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు.అమెరికా వైమానిక దాడుల వల్ల యెమెన్ రాజధాని సనాతో పాటు ఉత్తర ప్రావిన్స్ సాదలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున హొదైదా, బైదా, మరీబ్ ప్రావిన్స్‌ల్లోనూ వైమానిక దాడులు జరిగినట్లు హౌతీలుధ్రువీకరించారు. వైమానిక దాడులు ఇక రోజూ కొనసాగవచ్చని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటికి బెదిరేది లేదని హౌతీలన్నారు. ‘‘అమెరికాకు దీటుగా బదులిస్తాం. గాజాకు తోడుగా నిలుస్తాం. ఎలాంటి సవా ళ్లు ఎదురైనాసరే ఒంటరిగా వదిలేయలేం’’ అని హూతీ మీడియా కా ర్యాలయం ఉపసారథి సస్రుద్దీన్ అమీర్ ప్రకటించారు.రవాణాకు అడ్డంకి ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ నౌకలపై మాత్రమే దాడులు చేస్తున్నామని హౌతీలు గతంలో చెప్పారు. కానీ వారి దాడులతో ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, బాబ్ ఎల్–మ్యాన్డేబ్ జలసంధి, అరేబియా సముద్రాల్లో సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడం తెల్సిందే. వారిప్పటిదాకా 100కుపైగా రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు. దాడుల భయంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తుండటంతో సరుకు రవాణా సమయం, వ్యయం భారీగా పెరిగిపోతున్నాయి. -
మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు
సలమ్: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది. ఒరెగాన్లోని షోరూమ్‌పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్‌పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్‌లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్(DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.#ICYMI Two people were federally charged in separate incidents of attacks on Tesla dealerships in Colorado and Oregon.@ATFDenver @FBIDenver @PoliceLoveland investigating: https://t.co/HExwL3I3Z4@ATF_Seattle @FBISeattle @SalemPoliceDept investigating: https://t.co/YXkpdAhJQi pic.twitter.com/Ll7KD0af5k— ATF HQ (@ATFHQ) March 14, 2025 -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా?
ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్‌పై విరుచుకుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటిలాగే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్‌తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు. గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్‌ఫోన్ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీదా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్ లాక్కుని.. నగదు దోచుకుని..ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కార్మికురాలు తన సెల్లో వీడియో తీస్తుండగా జనసేన కార్య కర్తలు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగదును ట్రాన్సఫర్ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివైద్యులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన తెలిపింది. -
పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దాడులు..దౌర్జన్యాలు..కిడ్నాప్ యత్నాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతల అరాచకాలతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక నాలుగోసారి మంగళవారం కూడా వాయిదా పడింది. ఎన్నికల్లో ఓటేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకలు దాడికి దిగాయి. వైఎస్సార్సీపీ తరఫున తొలి నుంచీ వెన్నంటి నిలిచిన 18 మంది కౌన్సిలర్లలో 10 మంది మహిళలుండగా, వీరిలో ఇద్దరు ముగ్గురు గర్భిణులు ఉన్నారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు కౌన్సిలర్లపై మూకుమ్మడిగా దాడిచేయడం, కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో మహిళా కౌన్సిలర్లు భయంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు చర్చలు జరిపారు. దాడి జరగకుండా రక్షణ కల్పిస్తామన్న డీఎస్పీ మాటలు నమ్మశక్యంగా లేవని, టీడీపీ మూకలు పోలీసుల సమక్షంలోనే అరాచకాలకు పాల్పడుతుంటే ఎలాగని రాజా నిలదీశారు. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ము కాస్తూ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల అధికారులు నిర్దేశించిన గడువు 12 గంటలకు ముగియడంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి, డీపీవో రవికుమార్ ప్రకటించారు.‘చలో తుని’ని అడ్డుకున్న పోలీసులుతునిలో టీడీపీ అరాచకాలపై మంగళవారం తలపెట్టిన ‘చలో తుని’ నిరçసన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున జాతీయ రహదారులపై మోహరించి పార్టీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధాలకు గురి చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకూ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు 41 నోటీసులు అందజేశారు. అయినప్పటికీ కాకినాడ నుంచి తుని బయల్దేరిన వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ కో–ఆర్డినేటర్లు, నేతలను గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌లను పోలీసులు రాజమహేంద్రవరంలో గృహ నిర్బంధం చేశారు. పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, కో –ఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాశరావు, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వలేదు.నిలిచిన పాలకొండ చైర్మన్ ఎన్నికపాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా నిలిచిపోయింది. ఎన్నికల అ«ధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, జేసీ శోభికలు చైర్మన్ ఎన్నికను మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. కూటమికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నుంచి కూటమిలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు.వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎన్నికల అధికారిని కోరారు. కోరం లేకపోవడంతో ఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని చెప్పారు. -
దాడిశెట్టి రాజాపై టీడీపీ గుండాల దౌర్జన్యం
-
ఈ అరాచకాలపై ఎవ్వరూ నోరు మెదపరేం?
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి నేతల అరాచకాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ.. చోద్యం చూస్తూ ఉండిపోయింది. టీడీపీ గుండాల దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, రెండో బాస్ లోకేష్‌లు పట్టనట్లు ఉంటున్నారు. మరోవైపు.. ఆమధ్య ఏపీలో శాంతిభద్రల గురించి ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మౌనంగా ఉండిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అన్యాయాలు జరిగాయో కళ్లారా చూసింది ఏపీ. అధికార పార్టీలు ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసేశాయి. బలం లేనిచోట్ల కూడా బలవంతంగా కూటమి నేతలను గెలిపించుకుంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో.. వైఎస్సార్సీపీ నుంచి సభ్యులను తమ దారికి తెచ్చుకున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. తాము బెదిరింపులతోనే ఓటేశామని భూమన వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు మొరపెట్టుకున్న పరిస్థితి చూసిందే. హిందూపురం సహా మరికొన్ని చోట్లా అదే పరిస్థితి. పాలకొండ, పిడుగురాళ్ల, తునిలో అయితే కూటమి ఎఫెక్ట్‌తో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.చివరికి ఎమ్మెల్సీలకూ రక్షణలేని దుస్థితితో పోలీసు బాసులు ఉన్నారు. నిర్మోహమాటంగా కూటమి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారు. ఏపీలో అఘాయిత్యాలపై ప్రశ్నించిన పవన్.. ఆ తర్వాత ఏమైందోగానీ చల్లబడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి. టీడీపీ దాడులపై ప్రశ్నించే దమ్ము వాటికి లేకుండా పోయింది. దీంతో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఈ అరాచకాలతో ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పటికైనా ఏపీ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్‌షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
మార్కెట్‌పై దాడి.. 54 మంది హతం
కైరో: సూడాన్‌లో మిలటరీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న పారామిలటరీ బలగాలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. ఇటీవలే దార్పుర్లోని ఎల్ ఫషెర్లోని ఆస్పత్రిపై దాడి చేసి 70 మంది అమాయకుల్ని బలి తీసుకున్న వీరు శనివారం మార్కెట్‌పై దాడి చేసి 54 మందికి పైగా చంపేశారు. ఒంబుర్మన్ నగరంలోని సబ్రెయిన్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. ఘటనలో మరో 158 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారంది. ఘటనపై పారా మిలటరీ బలగాలు స్పందించలేదు. మిలటరీ, పారామిలటరీ బలగా లు ఆధిపత్యం కోసం 2023 ఏప్రిల్ నుంచి ముఖాముఖి పోరు సాగిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనల్లో రాజధాని ఖార్టూమ్‌తోపాటు పొరుగునే ఉన్న ఒంబుర్మన్, తూర్పు, సెంట్రల్ ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాల్లో మిలటరీ పైచేయి సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న గెజిరా ప్రావిన్స్ రాజధాని వాద్ మెదానీని కూడా సైన్యం తిరిగి స్వాధీనం పర్చుకుంది. -
ఇంటర్ విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి
చైతన్యపురి (హైదరాబాద్) : కాలేజీకి వెళుతున్న ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడ్‌తో దాడి చేసిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన కండె కృష్ణాజోష్, మంజు జోష్ దంపతులు నగరానికి వలస వచ్చి వాసవీ కాలనీలోని టీఎన్ఆర్ విహారి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.వారి కుమార్తె (16) స్థానిక ఎస్ఆర్ గాయత్రీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమె కాలేజీకి వెళుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె చేతులు గట్టిగా పట్టుకుని రెండు చేతులపై బ్లేడ్‌తో గాయపరిచారు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ పరిశీలస్తున్నట్లు తెలిపారు. -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ నేత భూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు. దాడిని చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు. కృష్ణ కుమారుడు గోపిచంద్ ఫోన్‌ను ఎమ్మెల్యే కొలికపూడి ధ్వంసం చేశారు. భూక్య కృష్ణ భార్యను కూడా కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపంతో కృష్ణ భార్య పురుగుల మందు తాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు వైద్యులు రిఫ్ చేశారు. కొలికపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.భూక్యా కృష్ణ- భూక్యా నాగేశ్వరరావు, భూక్యా భీమ్లా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉండగా, ఆస్తి పంపకాలు సవ్యంగా చేస్తామని గతంలో పెద్ద మనుషులు ఒప్పించారు. భూక్యా కృష్ణ ఆమోదంతో అతని స్థలంలో నుంచి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. స్థలం వివాదం తేలకపోవడంతో తన స్థలంలో నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా భూక్యా కృష్ణ తీగ వేశారు.ఇదిలా ఉండగా, గోపాలపురం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. గోపాలపురం 5వ వార్డు వైఎస్సార్సీపీ సభ్యుడిగా ఉన్న భూక్యా కృష్ణపై ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా భూక్యా కృష్ణ ఇంటికెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. వారిపై దాడి చేశారు. సంఘటనను ఫోన్లో చిత్రీకరిస్తున్న భూక్యా కృష్ణ కుమారుడు గోపీచంద్‌పైనా దౌర్జన్యం చేశారు. -
కాంగ్రెస్, బీజేపీ పరస్పర దాడులు
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: హైదరాబాద్‌లోని నాంపల్లి వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకాగాందీని ఉద్దేశించి ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. కర్రలతో దాడికి ప్రయత్నించడంతో ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి ఉపక్రమించారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఘర్షణ వాతావరణం నెలకొనగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రాళ్లదాడిలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యకర్త నందు తలకు తీవ్ర గాయమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ కూడా గాయపడ్డారు. వారిని పార్టీ నేతలు పక్కనే ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించారు.అబిడ్స్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయేల్‌కు కూడా గాయాలయ్యాయి. అనంతరం బీజేపీ కార్యాలయానికి కొంత దూరంలో రమేశ్ బిదూరీ దిష్టి»ొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ ఘర్షణ దాదాపు గంటపాటు కొనసాగింది. అనంతరం ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా, కేసులు నమోదయ్యాయి. అబిడ్స్ డివిజన్ పోలీసులతోపాటు అదనపు పోలీసు బలగాలు పలువురిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించేశాయి. గాంధీభవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడికి ప్రతిగా బీజే పీ కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకొని బారి కేడ్లు తొలగించి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కల్పించుకొని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాదనకు దిగారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడున్న కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను చించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు హెల్మెట్లను గాం«దీభవన్పైకి విసి రారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంతో గాందీభవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరని ఒక ప్రక టనలో హెచ్చరించారు. దాడుల విషయంలో బీజేపీ మరో నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని హెచ్చరించారు. పోలీసులను వెంట తీసుకొని బీజేపీ కార్యాలయ మెయిన్ గేటు వద్దకు వచ్చి బీజేపీ కార్యకర్తలపై, పార్టీ ఆఫీసుపై కర్రలు, రాళ్లతో దాడిచేయడం దుర్మార్గమన్నారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు దాడి చేస్తున్నా పోలీ సులు ప్రేక్షకపాత్ర వహించారు. దీనిపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్పందించాలి’అన్నారు. మేం తలుచుకుంటే..: కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాందీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే.. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. సీఎం బాధ్యత వహించాలి: లక్ష్మణ్ ఈ దాడులకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి గూండా రాజకీయాలు సాగవు.. మిస్టర్ రేవంత్‌రెడ్డి ఖబడ్దార్. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ ఘటన వెనుక రేవంత్ కుట్ర దాగుంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంపై గూండాలు, రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి సీఎం రేవంత్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పార్టీ కార్యాలయాల మీద దాడిచేసే సంస్కృతి సిగ్గుచేటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. -
మా ముందు చెప్పులతో నడవొద్దు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మా వీధుల్లో మీరు తిరగకూడదు.. మా ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు.. దళితులు ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీచేసి వెళ్లిపోండి’.. అంటూ టీడీపీ నేతలు దళితులపై విరుచుకుపడ్డారు. సిమెంటు రోడ్డు నిర్మాణ విషయమై టీడీపీ వారికి, సర్పంచ్‌కు మధ్య వివాదం ఏర్పడడంతో ‘పచ్చ’మూకలు అధికార బలంతో ఇలా పేట్రేగిపోయారు. ఇది చినికి చినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. టీడీపీ నేతలు మండల ప్రధాన కార్యదర్శి, మరికొందరు చేసిన ఈ వ్యాఖ్యలపై దళితులూ తిరగబడ్డారు.ఈ ఘటన చిత్తూరు జిల్లా, నగరి మండలం, తడుకుపేట గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడుల్లో దళితవాడకు చెందిన విక్కీ (20), సంతోష్ (17), ప్రవీణ్‌కుమార్ (23), శ్రీధర్ (27), రమేష్ (43), శ్రీశాంత్ (18), సిద్ధు (14)తో పాటు వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీకి చెందిన గోపి (45)కి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, రాజేష్ కూడా గాయపడ్డారు. అయితే, గాయపడ్డ దళితులను, వైఎస్సార్సీపీ వారిని ఇళ్లలోనే నిర్బంధించిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతలే తమపై దాడిచేశారంటూ రాస్తారోకో చేసి వాహనాలను రోడ్డుపై ఆపేసి హంగామా చేశారు. ఒకవైపు రాస్తారోకో చేస్తూనే మరోవైపు టీడీపీ రౌడీమూకలు దళితులకు చెందిన ఆరు బైక్‌లను కాల్చేశారు. కానీ, దళితులు, వైఎస్సార్సీపీ నేతలు 13 మందిపై కేసులు నమోదు చేశారు. మరికొందరిని కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, నిర్బంధంలో ఉన్న దళితులు శుక్రవారం ఉదయం బయటకు రాగానే వారికి జరిగిన అన్యాయం కూడా వెలుగుచూసింది. మాపై దాడిచేసి వారే నిరసనలు చేస్తున్నారు : దళిత మహిళల ఆందోళన నిజానికి.. తమపై దాడిచేసిన టీడీపీ వారే నిరసనలకు దిగడం విడ్డూరంగా ఉందని దళిత మహిళలు మండిపడ్డారు. ఊర్లో దళితులు తిరగకూడదంటూ టీడీపీ నేతలు హుకుం జారీచేస్తున్నారని.. వాళ్ల ముందు చెప్పులు వేసుకుని నడవకూడదని, చెప్పులు తలపై పెట్టుకుని వెళ్లండని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఊర్లోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని.. తమ పిల్లలు పాఠశాలకు వెళ్తే వారిని తిరిగి పంపేశారని, ఇదేం న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక దళితవాడకు చెందిన ఐదుగురు యువకులు కనిపించడంలేదని, వారెక్కడున్నారో తమకు తెలియాలన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగామని టీడీపీ అధికారంలోకి రావడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు.రోడ్లపై వెళ్తుంటే చెప్పులతో కొట్టడానికి వస్తున్నారని, బూతులు తిడుతూ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తామేం చెయ్యలేమంటూ పోలీసులు చేతులెత్తేస్తున్నారని.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కలెక్టర్, ఎస్పీ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నా కొడుకు ఏమయ్యాడో.. రాత్రి నుంచి నా కొడుకు కార్తీక్ కనిపించడంలేదు. ఏమయ్యాడో వాడిని ఏంచేశారో తెలీడంలేదు. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. దళితులు ఈ బాధలన్నీ అనుభవించాలా? అధికారులు దయచేసి నా కొడుకును నా వద్దకు పంపండి. – నీలవేణి, తడుకుపేట దళితవాడ ఊర్లో ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి? దళితులు ఊర్లోనే ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి? నడిరోడ్డుపై కూర్చున్న టీడీపీ నేతలు దళితులు ఊర్లోనే ఉండకూడదంటూ అరుస్తూ నిరసనలు చేస్తుంటే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం వారిది.. మేమేమీ చెయ్యలేమని పోలీసులే చెబుతున్నారు. మా మామను కొట్టేశారు మాకు దిక్కెవరు? – సుప్రియ, తడుకుపేట దళితవాడ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ పరిస్థితిలేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. అందరూ కలిసే ఉండేవారు. ప్రభుత్వం మారడంతో గ్రామస్తుల్లో ప్రవర్తన మారింది. మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ఎదిరిస్తే కొడుతున్నారు. పాలప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉంది. పిల్లల్ని పాఠశాలకు పంపడానికి కూడా భయపడుతున్నాం. – స్వప్న, తడుకుపేట దళితవాడ శాంతిభద్రతలు అదుపులోకి తెస్తున్నాం.. రెండువర్గాల మధ్య గొడవల్లో ఇప్పటికే ఒక వర్గం వారు ఇచి్చన ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదుచేశాం. మరో వర్గం వారు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశాం. అదనపు బలగాలను తీసుకొచ్చి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. – మహేశ్వర్‌రెడ్డి, సీఐ, నగరి -
ప్రేమ, సామరస్యమే క్రీస్తు బోధనల సారం
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్‌లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. -
రష్యాలో ఎత్తయిన భవనాలపై డ్రోన్ దాడులు
-
అధికారం మనదే.. లోడెత్తండి!
ఆళ్లగడ్డ: మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. చివరకు చెరువులను సైతం వదిలి పెట్టడం లేదు. రేయింబవళ్లు ప్రొక్లెయిన్లతో యథేచ్ఛగా తవ్వేస్తూ భారీ టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డు చెబితే వారిపై దాడులకు కూడా వెనుకాడడం లేదు. ‘మేం ఎమ్మెల్యే భర్త తాలుకా.. అధికారం మాది.. మీరెవరు అడగడానికి..’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయినా మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించడానికి బరితెగించారు. ఈ దారుణాలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వేదికైంది. ఈ ప్రాంతంలో ఇటుకల బట్టీలు ఎక్కువ. వాటికి అవసరమయ్యే ఎర్ర మట్టిని చలి కాలంలో తోలుకుని నిల్వ చేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన నియోజకవర్గం టీడీపీ కీలక నేత.. తన మనుషులను పెట్టి, కోటకొండ చెరువులో భారీగా ప్రొక్లెయినర్లు మోహరించి రాత్రిళ్లు తవ్వకాలు సాగించి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 35 టన్నుల చొప్పున రోజూ 100 టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఫిర్యాదులందినప్పటికీ.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ, మైనింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు మట్టి తరలించేటప్పుడు 20 మంది గూండాలు కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల చొప్పున ఇటుకల బట్టి నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.25 లక్షలు వెనకేసుకుంటున్నారు. కోటకొండ నుంచి గాజులపల్లె వరకు ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ కట్టపై నుంచి మట్టి తరలిస్తున్నారు. 35–40 టన్నుల బరువున్న వాహనాలు వెళ్తుండటం వల్ల కట్ట ధ్వంసం అవుతోంది. తమ పొలంలోకి వెళ్లేందుకు కట్టను కాస్త చదును చేస్తే మాత్రం కేసులు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతుల నుంచి భూమి లీజుకు తీసుకుని మట్టి తరలించే వ్యాపారులకు మాత్రం అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తుండటం గమనార్హం. ‘జేసీబీలు పెట్టకూడదు. మూడు అడుగులు కంటే లోతు తీయకూడదు. పెద్ద మిషన్లు, టిప్పర్లు ఉపయోగించకూడదు. దారిలో దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టాలి’ అని చెబుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాను మాత్రం గాలికొదిలేశారు.కట్ట ధ్వంసం చేసి.. రోడ్డేసి..ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్ ట్రెంచ్ ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేసి అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా, అంత బలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మట్టి దందా గురించి మైనర్ ఇరిగేషన్ ఏఈ రఘురాంను వివరణ కోరగా.. ‘చెరువులో మట్టిని తోలుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టి తోలుతున్నట్లు మా దృష్టికి రాలేదు. తక్షణమే పరిశీలించి అక్రమ మట్టి తవ్వకాలు సాగించే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
ఆరు నెలల అరాచకం
రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. ఏమిటిదంతా అనుకుంటున్నారా!.. ఆరు నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. స్వయంగా చంద్రబాబు, లోకేశ్ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది.ఇక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూఅదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి.అరాచకాలే బ్రాండ్.. అదే బాబు పాలన ట్రెండ్ చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో యథేచ్ఛగా దాడుల చేయాలని ఆదేశించింది. అందుకు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది. పచ్చ మూకల కీచకపర్వం ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఒకప్పటి చంబల్ లోయలోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు.6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం పడుతోంది. వారిలో 12 మందిపై అత్యాచారం జరిపి హత్య చేయడం రౌడీ మూకల బరితెగింపునకు నిదర్శనం. ఇవన్నీ అధికారికంగా కేసులు నమోదైన ఘటనలే. కూటమి పెద్దలు, గూండాలకు భయపడి బాధితులు ఫిర్యాదులు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తిస్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హత్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కారు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం పోలీస్ శాఖ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్ అధికారులు పీఏఎస్‌ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి తదితరులతోపాటు వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. -
కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..
తాండూరు రూరల్: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్‌తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ విఠల్‌రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, దాడులు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే.. తాము కూడా వారిని టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం టీజీఓ భవన్లో సంఘం విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. పెండింగ్ బిల్లులు త్వరగా పరిష్కరించాలి సంఘం కార్యకవర్గ సమావేశంలో అన్ని కేటగిరీల్లో ని ఉద్యోగులకు సంబంధించి 500 సమస్యలపై చర్చ జరిగిందని, ఇందులో కీలకమైన అంశాలు 53 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో ఆరు అత్యంత ప్రధానమైనవని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను డిసెంబర్ నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచి్చనా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మనుగడలో లేకుండా పోయిందని, ప్రైవేటు అద్దె వాహనాలతోనే వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు.. ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా సీఎం, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్ హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్ బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం లోక్‌సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. కోల్‌కతాలో ఇస్కాన్ ర్యాలీ చిన్మయ్ కృష్ణ దాస్నను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని అల్బర్ట్ రోడ్లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్‌కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్’నిర్వహించారు. దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నదీతీరంలో మఠం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్న స్వామిపై దాడిచేశారు. దారి ఆక్రమిస్తుండటాన్ని ప్రశ్నించినందుకు రాడ్డుతో తలపగులగొట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు మహేంద్రస్వామి తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన మహేంద్రస్వామి స్వర్ణముఖినది ఒడ్డున నిజరూపమఠం ఏర్పాటు చేసుకున్నారు. మఠం పక్కన నది వెంబడి ఉన్న దారిని శనివారం విజయ్‌కుమార్ అనుచరులు ఆక్రమించుకుని యంత్రాలతో పనులు చేపట్టారు. ఈ ఆక్రమణను మహేంద్రస్వామి ప్రశ్నించారు. తమ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ చెబితేనే పనులు చేస్తున్నామని, అడగడానికి నువ్వు ఎవడివి అంటూ వారు దురుసుగా చెప్పారు. వెంటనే వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మహేంద్రస్వామి వెళ్లకపోవడంతో రాడ్లతో దాడిచేసి తలపగులగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మహేంద్రస్వామిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు కుట్లువేశారు. టీడీపీ వస్తే దాడులు చేస్తున్నారు తెలుగుదేశం అ«ధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మహేంద్రస్వామి ఆవేదనతో చెప్పారు. గతంలోను ఊకా విజయ్‌కుమార్ పలుమార్లు తనపై దాడిచేసినట్లు తెలిపారు. గతంలో తన పళ్లు రాలగొట్టారని, పలుమార్లు రుయా ఆస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. న్యాయం చేయకపోతే తాను మరణించినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ కబ్జాలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అవి పెరిగాయని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరతానని తెలిపారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆయన చెప్పారు. -
పరిశ్రమలకు 'కూటమి' కాటు
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకాలకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ వెనకడుగు వేసింది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఇదీ జరిగింది..వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆగిపోయిన జిందాల్ స్టీల్ పరిశ్రమవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. వైఎస్సార్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ పరిశ్రమ నిలిచిపోయింది.కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులుగత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదుకొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. -
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
పేజర్ దాడులు.. యస్ మా పనే
జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు -
మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం
సాక్షి టాస్‌్కఫోర్స్: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు మరీ శ్రుతిమించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన రహమత్బీ అన్న ఇస్మాయిల్ వైఎస్సార్సీపీ తరఫున చురుగ్గా పనిచేసేవాడు. అతడిపై కొందరు టీడీపీ నాయకులు అక్కసు పెంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్మాయిల్ గ్రామం వదలి వేరేచోట తలదాచుకున్నాడు. పది రోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన యువతిపై ఇస్మాయిల్ దాడి చేశాడంటూ అనంతపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ టీడీపీకి చెందిన దాసరి అనిల్, దాసరి ఈశ్వరయ్య, మిలటరీ ఈశ్వరయ్య, దాసరి నీరజ ద్విచక్ర వాహనాలపై వచ్చి రహమత్బీ ఇంట్లోకి చొరబడ్డారు.బూతులు తిడుతూ ఆమెతో పాటు కులసింబీ, అమనాబీలపై చెప్పులతో దాడి చేశారు. మెడలో ఉన్న నల్లపూసల దండలు తెంచేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరోసారి దాడి చేశారు. -
ఇంకా ఇన్కా సంబరాలు
దక్షిణ అమెరికా భూభాగంలో ఒకప్పుడు వర్ధిల్లిన ఇన్కా నాగరికత స్పానిష్ దాడుల దెబ్బకు పదహారో శతాబ్ది నాటికి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఇన్కా నాగరికత అవశేషాలు ఇక్కడి జనాల్లో ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. ఇన్కా నాగరికత నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల వేడుకల్లో ప్రతిఫలిస్తుంటాయి. పెరులోని ప్యూనో ప్రాంతంలో జరిగే ప్యూనో వారోత్సవాలు నేటికీ పురాతన ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఏటా నవంబర్ మొదటివారంలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లోనూ నవంబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘ప్యూనో డే’ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు.పెరు ఆగ్నేయ ప్రాంతంలో ప్యూనో ప్రావిన్స్ ఉంది. దీని రాజధాని ప్యూనో నగరం. టిటికాకా సరోవర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పెయిన్ అధీనంలోకి వచ్చాక, స్పానిష్ రాజప్రతినిధి పెడ్రో ఆంటోనియో ఫెర్నాండేజ్ డి క్యాస్ట్రో 1668లో ప్యూనో నగరాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు ఈ ప్రాంతలో ఇన్కా నాగరికత ఉజ్వలంగా వర్ధిల్లింది. స్పానిష్ పాలకుల ప్రభావంతో స్థానిక కెచువా ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా, తమ పూర్వ ఆచారాలను వదులుకోలేదు. ఇన్కా సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మాంకో కాపాక్ జయంతి సందర్భంగా నవంబర్ 5న ‘ప్యూనో డే’ జరుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇన్కా ప్రజలు ‘ఇన్టీ’గా పిలుచుకునే సూర్యుడి కొడుకు మాంకో కాపాక్. అతడే ఇన్కా ప్రజలకు మూలపురుషుడని చెబుతారు. ఇన్కా నాగరికత కాలంలో ఈ ప్రాంతంలో కూజ్కో నగరం ఉండేది. ప్యూనో వారోత్సవాలను ఇక్కడి ప్రజలు ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు. ఇన్కా సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. సంప్రదాయ వాద్య పరికరాలను మోగిస్తూ, వీథుల్లో తిరుగుతూ పాటలు పాడతారు. ప్యూనో నగర కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికలపై సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. టిటికాకా సరోవరంలో సంప్రదాయ పడవల్లో నౌకా విహారాలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మాంకో కాపాక్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు. పురాతన పద్ధతుల్లో జరిగే ఈ ప్యూనో వారోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. -
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్లాన్..?
టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 77 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని బీట్ లాహియాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 77 మంది పాలస్తీనియన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం.BREAKING: The death toll has risen to 77, including 25 children, following the horrific Israeli massacre in Beit Lahiya, northern Gaza, according to local sources. The majority of the victims are from the Abu Nassr clan. pic.twitter.com/j660WyvzYK— 🇵🇸 Palestine Watermelons 🍉 (@PalestineMelons) October 29, 2024 శిథిలాల నుంచి మరింత మందిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)పై ఇజ్రాయెల్ నిషేధం విధించటంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్య.. సహించరానిది, చట్టవిరుద్ధమైదిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది -
హత్యకు యత్నం.. స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు స్టేషన్లోనే.. విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు. మీరిలా పోలీసు స్టేషన్లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మధ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది? ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్ఐఎర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
జెరూసలేం: ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడులతో విరుచుకుపడుతోంది.Israel strikes ‘military targets’ in Iran, IDF says, the Capitol of Iran, and Karaj city | at least 5 to 10 loud explosions have been heard already is that #true🇮🇷💔🇵🇸 #Hizbullah"World War 3"#Netanyahu#Hamas#iran#tehran#BlockElon#Gaza pic.twitter.com/AJspXIgAWz— Hasan LaLa Meister (@KPK_chronicles) October 26, 2024‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతోంది. ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించాం. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయి’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.అక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై పెద్దఎత్తున మిసైల్స్‌తో మెరుపుదాడికి దిగింగి. దాదాపు 200 మిసైల్స్‌ను ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ప్రయోగియోగించింది. ఆరు నెలల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ రెండోసారి ప్రత్యక్ష దాడికి దిగింది. లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ చెందిన కీలక నేతను ఇజ్రాయెల్ అంతం చేయటంతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది.అక్టోబరు 7, 2023న పాలస్తీనాకు చెందిన హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసి.. ఇజ్రయెల్‌పై పౌరులను గాజాకు బంధీగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా గాజాపై దాడులు చేస్తోంది. మరోవైపు.. గాజాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతుగా ఇరాన్, హెజ్బొల్లా గ్రూప్ చేరాయి.దాడులపై స్పందించిన ఇరాన్ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడుల కారణంగా పెద్దస్థాయిలో నష్టం జరగతేదు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.చదవండి: సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా? -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
దళిత యువతి సహానాది ప్రభుత్వ హత్యే
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. -
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం
ఓబులవారిపల్లె/రాజంపేట రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సోమవారం అన్నమయ్య జిల్లాలో దళితులపై హత్యాయత్నానికి తెగబడ్డారు. భూకబ్జాను అడ్డుకున్నందుకు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1150లో దాదాపు 221 ఎకరాల భూమిని పెరుమాళ్లపల్లె దళితవాడ గ్రామస్తులు తాతల కాలం నుంచి వినియోగించుకుంటున్నారు. చదును చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమకు పట్టాలివ్వాలని గతం నుంచే అధికారుల్ని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కాకర్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. సోమవారం జేసీబీ యంత్రాలతో చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పెరుమాళ్లపల్లి దళితవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి పథకం ప్రకారం తెచ్చుకున్న కర్రలతో ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. వీళ్లు తీవ్రంగా కొట్టడంతో పంట కృష్ణయ్య, పంట నరసింహులు, మడగలం ప్రభుదాస్, జనార్దన్, మరికొందరు గాయపడ్డారు.వీరిలో కృష్ణయ్య, నరసింహులు, ప్రభుదాస్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు, కస్తూరి ఉమా, కస్తూరి శివయ్యనాయుడు, కస్తూరి కోటయ్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమన్వయం పాటించాలని, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రైల్వేకోడూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.కార్యకర్తల కోసం ప్రాణమిస్తా.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలొస్తే వాటి పరిష్కారం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడతానని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నేతల హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన రాజంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. భూ కబ్జాలు, దాడులు సర్వసాధారణం అయిపోయాయని వాపోయారు. మహిళలకు సైతం రక్షణ లేకపోవడం బాధిస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలపై దాడి చేయటం హేయమైన చర్యగా అభిప్రాయ పడ్డారు. ఉన్నతస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
నడివీధిలో ఎస్సై చొక్కా పట్టుకుని..లాగేసి.. చింపేసి.. దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం అండ చూసుకుని టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి పోలీసులపై కూడా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారు. నీ అంతు చూస్తామంటూ.. నడివీధిలో ఏకంగా ఒక ఎస్సైని చొక్కా పట్టుకుని లాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పోలీస్ అధికారి యూనిఫాం బటన్స్ తెగిపోవడంతోపాటు చొక్కా చిరిగిపోయింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం మేరకు.. గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు బతుకమ్మ ఊరేగింపు చేస్తున్నారు. కొంత సేపటి తర్వాత ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే వద్ద వివాదం తలెత్తింది. బందోబస్తులో ఉన్న ఎస్సై రాజా జోక్యం చేసుకుంటూ సర్ది చెప్పారు. గొడవ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా వినిపించుకోక పోవడంతో గొడవకు కారణమని భావించిన ఒక యువకుడి వీపుపై తడుతూ వెళ్లిపొమ్మని చెప్పారు.దీంతో ఆగ్రహించిన ఆ యువకుడి బంధువులు, టీడీపీ నాయకులు ‘మావాడిపై చేయి చేసుకుంటావా.. కొట్టడానికి నువ్వు ఎవరు.. నీ సంగతి చూస్తాం..’ అంటూ మూకుమ్మడిగా ఎస్సైపైకి దూసుకువెళ్లారు. చొక్కా పట్టుకుని గట్టిగా లాగేశారు. దీంతో బటన్స్ ఊడిపోయి, చొక్కా చిరిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తన పైకి దాడికి రావడంతో దిక్కుతోచని ఎస్సై వెనక్కు తగ్గాడు. గొడవ పడొద్దని చెప్పడమే పాపమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటి ఘటన ఏమీ జరగలేదని, ఎటువంటి వివాదం లేకుండా ఊరేగింపు జరిగిందని చెప్పారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతం
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తాము చేసిన దాడుల్లో మరో ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. హూలా ఫ్రంట్ కమాండర్, వందలాది క్షిపణి దాడులకు కారణమైన అహ్మద్ ముస్తఫా అల్ హజ్ అలీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని మీస్ ఎల్ జబాల్ ప్రాంతంలో హెజ్బొల్లా యాంటీ-ట్యాంక్ యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరించిన మహ్మద్ అలీ హమ్దాన్లు తమ దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తమ దేశా పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే హెజ్బొల్లా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేవరకు తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.🔴2 Hezbollah terrorists were eliminated in precise strikes:1. Ahmad Moustafa al-Haj Ali, commander of the Houla Front. Responsible for hundreds of missile and anti-tank missile attacks toward the Kiryat Shmona area. 2. Mohammad Ali Hamdan, commander of Hezbollah’s anti-tank… pic.twitter.com/0RX2mxgmbV— Israel Defense Forces (@IDF) October 10, 2024 గతేడాది అక్టోబర్ 7 తేదీన హామాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం.. ఇజ్రాయెల్ హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే.. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. -
వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు: హెజ్బొల్లా
ఇజ్రాయెల్ పౌరులు మరింత మంది నిరాశ్రయులవుతారని హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నైమ్ ఖాసీం అన్నారు. ఇజ్రాయెల్‌లో తమ రాకెట్ దాడులను మరింత విస్తరించినట్లు తెలిపారు. ఆయన మంగళవారం టెలివిజన్ ప్రసంగంలో మాట్లారు. అక్టోబరు 7 దాడుల మొదటి సంవత్సరం వార్షికోత్సవం తర్వాత తొలిరోజు చేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.‘‘ఇజ్రాయెల్పలో మా రాకెట్ దాడులు విస్తరించాం. మేము చేసే దాడుల్లో మరింత మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు. హెజ్బొల్లా సామర్థ్యాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇటీవలి దాడుల్లో మృతిచెందిన కమాండర్ల స్థానాలను కొత్తవారితో భర్తీ చేశాం.Hizbullah Genel Sekreter Yardımcısı Naim Kasım şu anda canlı yayında bir açıklama yapıyor. Lübnan başkanlık sarayındaki basın mensupları pür dikkat dinliyor. pic.twitter.com/bNV64IwsH9— Faruk Hanedar (@farukhanedar) October 8, 2024 ప్రతిఘటన కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశాం. వందలాది రాకెట్లు, డజన్ల కొద్ది డ్రోన్లను పేల్చుతున్నాం. ఇజ్రాయెల్ నుంచి నిరాశ్రయులుగా వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకువస్తామని చెబుతోంది. కానీ మేము వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను నిరాశ్రయులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మనల్ని బలహీనపరుస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. కానీ, ప్రతిఘటించడం, పట్టుదలతో ఉండటమే మా వద్ద ఉన్న ఏకైక పరిష్కారం’’ అని అన్నారు. -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
Israel-Hamas war: గాజా మసీదుపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జబాలియా దిగ్బంధం ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బీరుట్లో ఆరుగురి మృతి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. -
ఇజ్రాయెల్‌కు మూడింది
టెహ్రాన్: బద్ధ శత్రువైన ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంపై ఇటీవల తాము చేసిన క్షిపణి దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూదు పాలకుల నేరాలకు ఇది కనిష్ట శిక్ష అని పేర్కొన్నారు. తమ సైనిక దళాలు అద్భుతమైన కార్యం నిర్వర్తించాయని కొనియాడారు. అవసరమైతే హెజ్‌పోల్లా, హమాస్ తదితర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్‌పై మరోసారి దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, లెబనాన్‌లో జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తున్నాం. శత్రువును ఓడించి తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘అఫ్గానిస్తాన్ నుంచి యెమన్ దాకా, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ దాకా ముస్లిం దేశాలన్నీ ఈ ప్రయత్నంలో ఒక్కటి కావాలి.ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌కు మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉనికిలో ఉండబోదని జోస్యం చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవలి క్షిపణి దాడుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలకు దర్శనమిచ్చారు. శుక్రవారం టెహ్రాన్‌లోని మొసల్లా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జన సందోహాన్నిఉద్దేశించి చరిత్రాత్మక ప్రసంగం చేశారు. రైఫిల్ చేబూని ఆద్యంతం భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఖమేనీ బహిరంగంగా మాట్లాడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హెజ్‌పోల్లా చీఫ్ నస్రల్లాను బంకర్ బాంబులతో ఇజ్రాయెల్ హతమార్చిన వెంటనే ఆయనను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు వార్తలు రావడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇలా జనం మధ్యలోకి రావడమే గాక చరిత్రాత్మక మసీదును వేదికగా చేసుకుని ప్రసంగించడానికి చాలా ప్రాధాన్యత ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపడంతో పాటు ఆ దేశంపై పోరులో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని పశ్చిమాసియాలోని హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు భరోసా ఇవ్వడం ఖమేనీ ఉద్దేశమని విశ్లేíÙస్తున్నారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని కూడా ఖమేనీ ప్రసంగం సంకేతాలిచి్చందంటున్నారు. ప్రధానంగా ఫార్సీలోనూ, పాలస్తీనా, లెబనాన్ మద్దతుదారు కోసం మధ్యలో అరబిక్‌లోనూ ఆయన 40 నిమిషాలపాటు మాట్లాడారు. ‘‘గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో పాలస్తీనా ప్రజలు చేసిన దాడిలో న్యాయముంది. పాలస్తీనా పౌరుల చర్య చట్టబద్ధమే. ఇజ్రాయెల్‌పై మా దాడులు కూడా చట్టబద్ధమే’’అని ఉద్ఘాటించారు. నస్రల్లా మార్గం స్ఫూర్తిదాయకం ఖమేనీ ప్రసంగానికి ముందు టెహ్రాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తోపాటు ఇరాన్ ఉన్నతాధికారులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్స్ హాజరయ్యారు.చేతిలో రైఫిల్ వెనక...ఖమేనీ తన ప్రసంగం సందర్భంగా రైఫిల్ చేతబట్టడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది రష్యాలో తయారైన డ్రాగనోవ్ రైఫిల్. ఇజ్రాయెల్ విషయంలో వెనుకడుగు వేసే సమస్యే లేదని, తీవ్ర ప్రతిఘటన తప్పదని తన చర్య ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలిచి్చనట్టు భావిస్తున్నారు. శత్రువుపై పోరాడాలని, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రజలకు ఖమేనీ పిలుపునివ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో డీలా పడ్డట్టు కని్పస్తున్న సైన్యంతో పాటు దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ప్రయత్నించారంటున్నారు.ఆ మసీదే ఎందుకు?ఖమేనీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు రాజధాని టెహ్రాన్‌లోని చరిత్రాత్మక ఇమామ్ ఖొమేనీ మసీదును ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్లో విశేషమైన ప్రాముఖ్యముంది. దీన్ని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. నగరంలో ఇదో ల్యాండ్‌మార్క్. ప్రజా పోరాటాలకు, నిరసన గళానికి చిహ్నం. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లావీని గద్దె దించారు. అనంతరం అయతొల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది. ఇస్లామిక్ జాతీయవాద నినాదం కింద పలు రాజకీయ పక్షాలు ఏకమవడానికి ఈ మసీదు వేదికగా ఉపయోగపడింది. -
ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం
టెల్ అవీవ్: దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం సంభవించింది. హెజ్బొల్లాపై యుద్ధంలో తమ జవాన్లు ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు బుధవారం ప్రకటించారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపారు. తాము వెనుకడుగు వేయబోమని, హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. మరోవైపు హెజ్బొల్లా సైతం వెనక్కి తగ్గడంలేదు. ఇజ్రాయెల్ సేనలపై విరుచుకుపడుతోంది. లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదాతి దళానికి అండగా యుద్ధ ట్యాంకులు సైతం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు కొందరు గాయపడ్డారని హెజ్»ొల్లా తెలియజేసింది. 50 గ్రామాలు, పట్టణాలు ఖాళీ! దక్షిణ లెబనాన్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలు, పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించారు. దీంతో జనం సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలిపోయారు. దాదాపు 50 గ్రామాలు, పట్ణణాలు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం. హెజ్బొల్లా కబంధ హస్తాల నుంచి లెబనాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికే సైనిక చర్య ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఆగవని అంటోంది. -
యుద్ధ భయం!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ కురిపించిన క్షిపణుల వర్షం రక్షణ నిపుణులతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభ సూచికేనంటూ వెల్లువెత్తుతున్న విశ్లేషణలతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆన్లైన్లో లక్షలాది పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండేళ్లు దాటినా ఆగే సూచనలు కన్పించడం లేదు. ఇటు గాజాపై ఇజ్రాయెల్ తెరతీసిన దాడులకు ఏడాది నిండనుంది. అవీ ఇప్పట్లో ఆగే సూచనల్లేవు. ఇరాక్, యెమన్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పాలస్తీనాకు దన్నుగా ఇజ్రాయెల్‌పై అడపాదడపా దాడులకు దిగుతూనే ఉన్నాయి. తద్వారా ఆయా దేశాలను కూడా ఇజ్రాయెల్‌తో యుద్ధం దిశగా లాగుతున్నాయి. వీటికి తోడు లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్»ొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్ తాజా భూతల దాడులకు కూడా దిగింది. ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి చందంగా మారింది. తమపై క్షిపణి దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఆ ప్రతీకార దాడులు బహుశా కనీవినీ ఎరగనంత తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలను నేలమట్టం చేయడానికి దీన్ని అందివచ్చిన అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అదే జరిగితే ఇరాన్, పశ్చిమాసియాలోని దాని మిత్ర దేశాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందించే ఆస్కారముంది. మొత్తమ్మీద పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ‘‘అక్కడి పరిస్థితి మందుపాతరను తలపిస్తోంది. ఇప్పుడు తేలాల్సింది దానిపై ముందుగా ఎవరు కాలేస్తారన్నదే!’’ అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు. తారస్థాయికి చేరుతున్న ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఆశ్చర్యం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రంగం సిద్ధం...? తమపై ప్రతిదాడులకు దిగితే మరింతగా విరుచుకుపడతామన్న ఇరాన్ హెచ్చరికలను ఇజ్రాయెల్ ఖాతరు చేసే అవకాశాలు లేనట్టే. క్షిపణి దాడులకు భారీ స్థాయి ప్రతీకారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకు మిత్రదేశం అమెరికాతో పాటు నాటో కూటమి కూడా దన్నుగా నిలవడం ఖాయమే. మంగళవారం నాటి ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో అమెరికా సాయపడింది కూడా. మధ్యదరా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చేశాయి. అంతేగాక పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న తమ సైనికులకు తోడుగా మరికొన్ని వేలమందిని పంపుతామని అమెరికా ప్రకటించింది. యుద్ధ విమానాల మోహరింపునూ పెంచనుంది. ఇరాన్‌పై దాడిలో కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో దన్నుగా నిలిస్తే దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఎరుపెక్కిస్తున్న ఎర్రసముద్రం యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైనం ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలను చెరబడుతూ, లూటీ చేస్తూ హౌతీలు కలకలం రేపుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ వర్తకం, ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా భారీగా ప్రభావితమవుతున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అంతేగాక దేశాల నడుమ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలను ఈ పరిణామం మరింతగా ఎగదోస్తోంది.అవున్నిజమే మనమిప్పుడు కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధపు ముంగిట్లో నిలిచాం. ప్రపంచంలో ఏ మూల చూసినా ఎటు చూసినా యుద్ధమో, యుద్ధ భయాలో, యుద్ధపు హెచ్చరికలో కన్పిస్తున్నాయి. అమెరికాను పాలిస్తున్న అసమర్థులు (అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్‌లను ఉద్దేశించి) ఏమీ చేయలేకపోతున్నారు – అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అగ్ర రాజ్యాలు చెరోవైపు! అపార చమురు నిల్వలకు ఆలవాలమైన పశ్చిమాసియాపై పట్టు కోసం అమెరికా, రష్యా ప్రయత్నాలు ఇప్పటివి కావు. అగ్ర రాజ్యాలు రెండూ ప్రాంతీయ శక్తులనే పాచికలుగా మార్చుకుని ఎత్తులూ పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి. సౌదీకి అమెరికా దన్నుంటే ఇరాన్, సిరియా తదితరాలకు రష్యా ప్రాపకముంది. వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమాసియా వరకు రష్యాకు చైనా, ఉత్తర కొరియా కూడా మద్దతుగానే ఉంటున్నాయి. నాటో ముసుగులో తన ముంగిట్లో తిష్ట వేయాలన్న అమెరికా ప్రయత్నాలకు చెక్ పెట్టడానికే ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు దిగింది. ఆ పోరుకు అంతం ఇప్పట్లో కనిపించడం లేదు. పశ్చిమాసియా రగడ ముదిరితే తమ మిత్ర దేశాలకు మద్దతుగా అటు అమెరికా, ఇటు రష్యా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.పర్యవసానాలుఊహించలేంఈ అణ్వస్త్ర యుగంలో మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే దాని పర్యవసానాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి. కనుక యుద్ధజ్వాలలను ఆ స్థాయికి రగిల్చే దుస్సాహసానికి ఏ దేశమూ ఒడిగట్టకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తినా ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు భారత్‌తో సహా పలు దేశాలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాయి కూడా. కనుక ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చన్న అభిప్రాయాలకూ కొదవ లేదు. కాకపోతే పశ్చిమాసియా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చెప్పలేని పరిస్థితి!పశ్చిమాసియాలో ఎవరెటువైపు...!పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చినికి చినికి గాలివానగా రూపుదాలుస్తోంది. అటు లెబనాన్‌కు పాకడంతో పాటు తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భారీ ఘర్షణలకు దారి తీస్తోంది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది రెండు దేశాలకే పరిమితం కాబోదు. మిగతా దేశాలన్నీ చెరో వైపు మోహరించడం ఖాయం. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఏవి ఎవరి వైపన్నది ఆసక్తికరం. దీనికి సంబంధించి గత ఏప్రిల్‌లోనే ట్రయిలర్ కనిపించింది. ఇజ్రాయెల్‌పై ఉన్నట్టుండి దాడికి దిగిన ఇరాన్‌కు లెబనాన్‌తో పాటు యెమన్ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు. ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలు మద్దతిచ్చాయి.ఇజ్రాయెల్ వైపుసౌదీ అరేబియా యూఏఈ (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు నాటో దన్ను)ఇరాన్ వైపుసిరియా యెమన్ (హౌతీలు) పాలస్తీనా (హమాస్) హెజ్బొల్లా (లెబనాన్) తటస్థ దేశాలు ఖతర్ (ఇజ్రాయెల్ వైపు మొగ్గు) జోర్డాన్ (ఇజ్రాయెల్ వైపు మొగ్గు) ఈజిప్ట్ (ఇరాన్ వైపు మొగ్గు) తుర్కియే (ఇరాన్ వైపు మొగ్గు) -
ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
ఇరాన్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్‌ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్‌మీడియా ఖాతాల్లో వైరల్‌గా మారటం గమనార్హం.La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024 ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోందని వివరణ ఇచ్చారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్ -
మీకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ పీఎం హెచ్చరిక
Iran Attacks Israel Live Updatesజెరూసలెం: పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకు పడుతుంది. టెల్ అవీవ్,జెరుసలేంతో పాటు ఇతర నగరాల్లో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. తొలిసారిగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై హైపర్సోనిక్ ఫట్టా క్షిపణులను ఉపయోగించాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తాము చేసిన దాడులు 90 శాతం ఫలితాల్ని ఇచ్చినట్లు ఇరాన్ ఆర్మీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపిందిఈ తరుణంలో తమ దేశంపై వైమానిక దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇరాన్,హెజ్బొల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. దాడులు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు. ‘ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇరాన్ పెద్ద ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందంటూ’ హెచ్చరించారు. కమ్ముకున్న యుద్ధ మేఘాలుఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత జులైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్పొరుషన్ను హతమార్చినందుకు ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది.400 మిసైళ్లతో దాడిజెరూసలెం, టెల్ అవీవ్ నగరాలపై ఏకకాలంలో 400 మిసైళ్లతో దాడులు చేసింది. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా సైతం బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది.ఓవైపు ఇజ్రాయెల్‌పై వైమానికి దాడులకు పాల్పడుతూనే టెల్అవీవ్లో ఇరాన్.. ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది. టెల్‌అవీవ్‌లోని ఓ మెట్రో స్టేషన్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది.ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్అవీవ్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.విమానాల రాకపోకలపై ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ ప్రభావం పడింది. ప్రపంచ దేశాలు పశ్చిమాసియా మీదిగా విమానాల రాకపోకలను రద్దు చేసుకున్నాయి. 👉ఇదీ చదవండి : టపాసుల్లా పేలిన హెజ్బొల్లా ఉగ్రవాదుల పేజర్లు -
మధ్యప్రాచ్యంలో యుద్ధ భేరి.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
జెరుసలేం/టెహ్రాన్/వాషింగ్టన్: మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. దాడులు, ప్రతి దాడులు, ప్రతీకార దాడులతో భగ్గుమంటోంది. లెబనాన్‌ను కొద్ది రోజులుగా వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం భూతల దాడులను తీవ్రతరం చేసింది. లెబనాన్‌కు దన్నుగా నిలుస్తున్న ఇరాన్ కూడా కాసేపటికే ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.నిమిషాల వ్యవధిలో వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్ అవీవ్‌తో పాటు సమీపంలోని జెరుసలేం తదితర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా కూడా టెల్ అవీవ్‌పైకి మిసైళ్లు ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు, సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీశారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి.రంగంలోకి అమెరికా యుద్ధనౌకలుఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేసుకునేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కని్పస్తున్నాయి.ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. గత ఏప్రిల్‌లో కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ అనూహ్యంగా దాడికి దిగడం తెలిసిందే. అయితే అది ప్రయోగించిన క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుంది. ప్రతిదాడులకు దిగారో...: ఇరాన్ ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)’ ప్రకటించింది. ‘‘గత జూలైలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్»ొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్ఫొరుషన్ను హతమార్చినందుకు, అసంఖ్యాకులైన అమాయక లెబనీస్, పాలస్తీనా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాం’’ అని పేర్కొంది.‘‘ఇది ఆరంభం మాత్రమే. మాపై ప్రతి దాడులకు దిగితే మరింత భారీగా విరుచుకుపడతాం’’ అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్ దాడులను ధ్రువీకరించింది. వాటిని అడ్డుకునేందుకు భారీగా ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు ప్రయోగించింది. ఇరాన్ దాడులు విస్తరించవచ్చని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగరీ అభిప్రాయపడ్డారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని ప్రకటించారు. ఇరాన్ దాడులు ఆగాయని. ప్రస్తుతానికి ముప్పు లేనట్టేనని పేర్కొన్నారు. హెచ్చరించి మరీ లెబనాన్‌లోకి... ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. హెజ్»ొల్లా మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అర్ధరాత్రి నుంచే లెబనాన్‌లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లోని లెబనాన్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలాలని ముందుగానే హెచ్చరించి మరీ రంగంలోకి దిగింది. దక్షిణ సరిహద్దుకు, లితానీ నదికి మధ్యన 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నవారంతా తక్షణం ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దళాలు భారీ సంఖ్యలో సరిహద్దు దాటి కిలోమీటర్ల కొద్దీ చొచ్చుకెళ్లాయి. లెబనాన్‌పై లక్షిత భూతల దాడులు మొదలైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.‘‘అక్కడి హెజ్»ొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకున్నాం. మిలిటెంట్లు భారీగా ఆయుధాలను దాచిన బంకర్లు, టన్నెళ్లు తదితరాలను స్వా«దీనం చేసుకున్నాం’’ అంటూ వీడియోలు విడుదల చేసింది. ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఒక రాకెట్ బీరూట్‌లో ఇరాన్ దౌత్య కార్యాలయానికి అతి సమీపంలో పడింది. దాంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఎర్రసముద్రంలోని హొడైడా నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం వేళ ఇజ్రాయెల్ తొలి దాడి జరిగినట్టు తెలుస్తోంది. తర్వాత కాసేపటికే అక్కడి ఉత్తర దిశగా రెండో దాడి జరిగిందని బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్‌లోని అతి పెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన సిడాన్‌లోని ఎన్ ఆల్ హిల్వే శిబిరంపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురి దాక మరణించినట్టు చెబుతున్నారు. వీరిలో పాలస్తీనా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్‌కు చెందిన ఫతా గ్రూప్ సారథి జనరల్ మునీర్ మగ్దా కొడుకు, కోడలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఉగ్ర కాల్పుల్లో ఆరుగురి మృతియుద్ధజ్వాలల నడుమ ఇజ్రాయెల్‌లో భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. జెరూసలేంలో ఇద్దరు ఉగ్రవాదులు విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి ముష్కరులిద్దరినీ మట్టుబెట్టారు.లెబనాన్‌లో 900 మంది భారత సైనికులు!లెబనాన్ దక్షిణ సరిహద్దుల వద్ద ఐరాస శాంతి పరిరక్షక దళంలో 900 మంది దాకా భారత సైనికులున్నట్టు తెలుస్తోంది. అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐరాస దళంలో భాగంగా ఉన్న దృష్ట్యా వారిని ఇప్పటికిప్పుడు వెనక్కు పిలవడం సరైన చర్య కాబోదని కేంద్రం అభిప్రాయపడుతోంది. ‘‘మన సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’ అని తెలిపింది. -
దాడులు కొనసాగించండి!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శత్రువుల భరతం పట్టాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆయన తాజాగా అమెరికాకు పయనమయ్యారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగిస్తారు. హెజ్బొల్లా్లతో చర్చల ప్రతిపాదన వచి్చన మాట వాస్తమేనని, అయితే దానిపై తాము ఇంకా స్పందించలేదని చెప్పారు. మరోవైపు హెజ్బొల్లా్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు ఇజ్రాయెల్‌లో వినిపిస్తున్నాయి. చర్చలు అవసరం లేదని నెతన్యాహూ మద్దతుదారులు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయ రక్తసిక్తంగా మారుతోంది. హెజ్బొల్లా ఆయుధ నిల్వలతోపాటు పలు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం అర్ధరాత్రి తర్వాత నిప్పుల వర్షం కురిపించింది. భారీగా క్షిపణులు ప్రయోగించింది. 75 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడుల చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. 23 మంది సిరియన్లు మృతి లెబనాన్‌లోని యూనైన్ పట్టణంలో మూడంతస్థుల భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 23 మంది సిరియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిసింది. లెబనాన్‌లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియన్లు తలదాచుకుంటున్నారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరంతా ప్రాణరక్షణ కోసం లెబనాన్‌కు చేరుకున్నారు. హెజ్బొల్లా విషయంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ గురువారం స్పష్టంచేశారు. హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మృతి?హెజ్బొల్లా డ్రోన్ విభాగం కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గురువారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరుట్‌పై మళ్లీ దాడులకు దిగింది. దహియెలోని అపార్టుమెంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయ పడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరౌర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించుకోగా హెజ్బొల్లా స్పందించలేదు.లెబనాన్ నుంచి వెంటనే వెళ్లిపోండిజెరూసలేం: యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లెబనాన్‌కు భారత పౌరులెవరూ రావొద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. లెబనాన్‌లో ఉండే భారతీయులు సాధ్యమైనంత త్వరగా దేశాన్ని వీడాలని, ఉండాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో అడ్వైజరీ జారీ చేసింది. -
తెలంగాణలో గూండారాజ్!
శివ్వంపేట (నర్సాపూర్): తెలంగాణలో ప్రజా పాలన కాకుండా గూండారాజ్ నడుస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి స్వగ్రామం గోమారంలోని ఆమె ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి గోమారంలోని సునీతారెడ్డి నివాసం వద్ద బాణసంచా కాలుస్తూ, ఇటుకలు విసురుతూ కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం, ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య గొడవ జరగడం నేపథ్యంలో.. హరీశ్‌రావు సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు. సునీతారెడ్డి నివాసాన్ని పరిశీలించి, స్థానిక నేతల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే..సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరుగుతు న్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలోని తన కార్యాలయంపై, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, ఇప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులతో దాడులు చేయించారని మండిపడ్డారు. గోమారంలో బీఆర్ఎస్ వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్న విషయం వీడియో లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి దాడులతో తెలంగాణ కు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు.బాణసంచా పేల్చి.. ఇటుకలు విసిరి!నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన శి వ్వంపేట మండలం గోమారంలో ఆదివారం రాత్రి వినాయక శోభాయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ఈ యాత్ర ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు చేరుకుంది. ఈ సమయంలో కొందరు బాణసంచా కాల్చుతూ ఆమె ఇంటిపైకి విసిరారు. కొందరు ఇటుకలు విసిరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. అక్కడ కాపలాగా నిద్రిస్తున్న పలువురు యువకులు బాణసంచా, ఇటుకలు విసురుతున్నవారిని అడ్డుకోవడానికి ప్రయత్నించా రు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు వెంటనే సునీతారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.పథకం ప్రకారమే దాడి: సునీతారెడ్డికాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే ఆదివారం అర్ధరాత్రి తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. తన ఇంటి వద్దకు వినా యక శోభాయాత్ర రాగానే.. పథకం ప్రకారం ఇంటిపైకి బాణసంచా విసురుతూ, రాళ్లతో దాడి చేశా రని చెప్పారు. ఇంట్లో పడుకున్న వారిని కొట్టారని.. అడ్డువచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. శనివారం ఇజ్రాయెల్ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష -
సహించరాని ఉన్మాదం
ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది. ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి. తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట. బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్వేర్ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే. మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు. -
యుద్ధం అంచున..
బీరుట్: చేతిలో ఇమిడే చిన్నపాటి పేజర్లు, వాకీటాకీలను పేల్చేసి హెజ్బొల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ శుక్రవారం ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్విమానాలతో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలుళ్లతో వేలాది మంది హెజ్బొల్లా సాయుధుల, పౌరుల రక్తం కళ్లజూసిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో సమరాగ్నిని మరింత రాజేసింది.ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బొల్లా దీటుగా బదులిస్తున్నాయి. ఈ సందర్భంగా అల్–మర్జ్ ప్రాంతంలో హెజ్బొల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని 43 ఏళ్ల రిజర్వ్ మేజర్ నేయిల్ ఫార్సీ, 20 ఏళ్ల సర్జెంట్ టోమర్ కెరెన్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ ఎన్12 న్యూస్ వార్తాసంస్థ ప్రకటించింది. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు తక్కువ ఎత్తులో చెవులు చిల్లులుపడేలా ధ్వని వేగంతో దూసుకుపోవడంలో అసలేం జరుగుతుందో తెలీక జనం భయపడి పోయారు. తాము చాలా డ్రోన్లను ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూశామని స్థానికులు చెప్పారు.హెజ్బొల్లా స్థావరాలపై దాడులుహెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తుండగానే∙ హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాదాపు 150 రాకెట్ లాంఛర్లను ధ్వంసంచేసింది. హెజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని హెజ్బొల్లాపై ఆరోపణలు గుప్పించింది. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఆరోపించింది. ‘‘ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులతో తరలిపోయిన ఇజ్రాయెలీలు మళ్లీ సరిహద్దు ప్రాంతాల సొంతిళ్లకు తిరిగి చేరుకోవడం మాకు ముఖ్యం. వారి రక్షణ, భద్రత లక్ష్యంగా ఎలాంటి సైనిక చర్యలకైనా మేం సిద్ధం.సమస్యను మరింత జఠిలం చేస్తూ, ఆలస్యం చేసేకొద్దీ హెజ్బొల్లా మరింతగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ హెచ్చరించారు. ‘‘ ఈ దాడులు ఆగవు. అయితే హెజ్బొల్లాతో పోరు చాలా సంక్లిష్టతో కూడుకున్న వ్యవహారం’’ అని సైన్యాధికారులతో భేటీలో గాలంట్ వ్యాఖ్యానించారు. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని ఇరుపక్షాలకు అమెరికా, ఫ్రాన్స్ సూచించాయి.ఈ విపరిణామంతో లెబనాన్‌లో ప్రజారోగ్యం కుదేలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసిస్ ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యే వీలుంది. యుద్ధభయాలతో అక్కడి తమ పౌరులు లెబనాన్‌ను వీడాలని బ్రిటిషర్లకు బ్రిటన్ విదేశాంగ శాఖ శుక్రవారం అత్యవసర అడ్వైజరీ జారీచేసింది. మరోవైపు లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌లో పేజర్, వాకీటాకీలపై నిషేధంవేలాది పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో కొంతమంది మరణాలు, వేలాదిగా హెజ్బొల్లా సభ్యులు క్షతగాత్రులైన ఘటనతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికుల, పౌర విమానయాన సంస్థల విమానాల భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా బీరుట్ నగరంలోని రఫీక్ హరీరీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ఏ విమానంలోనూ పేజర్, వాకీటాకీలను అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఈ నిషేధం అంశం తెలియజేయాలని విమానయాన సంస్థలకు సూచించింది.రెడ్‌లైన్ దాటి భారీ తప్పిదం చేసింది: నస్రల్లాపరస్పర దాడులు మొదలుకావడానికి ముందే గుర్తుతెలియని ప్రదేశం నుంచి హమాస్ చీఫ్ నస్రల్లా టెలివిజన్‌లో ప్రసంగించారు. ‘‘పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వేలాది మంది ప్రాణాలు హరించేందుకు బరితెగించి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. వేల మందిని రక్తమోడేలా చేసి యుద్ధనేరానికి పాల్పడింది. పరికరాల విధ్వంసంతో మా కమ్యూనికేషన్‌కు భారీ నష్టం వాటిల్లిన మాట వాస్తవమే. అయినాసరే దాడులతో మాలో నైతిక స్థైర్యం మరింత పెరిగింది. ఇజ్రాయెల్‌పై పోరుకు మరింత సంసిద్ధమయ్యాం. అనూహ్య పేలుళ్లతో శత్రువు తన పరిధి దాటి ప్రవర్తించాడు.అన్ని నియమాలను, రెడ్‌లైన్‌ను దాటేశాడు. వాళ్లు ఊహించినట్లే దాడులు చేస్తాం. ఊహించనంతగా దాడి చేస్తాం. గాజాలో దాడులు ఆపేదాకా మేం ఉత్తరలెబనాన్ సరిహద్దులో దాడులు ఆపబోం. మా దాడుల దెబ్బకి పారిపోయిన సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలు ఎన్నటికీ తమ సొంతిళ్లకు రాలేరు. దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెడితే అది మాకు సువర్ణావకాశం. వాళ్లు దారుణ ఫలితాలను చవిచూస్తారు’’ అని అన్నారు. -
దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: తనను హత్య చేసేందుకు జరిగే ప్రయత్నాలను దేవుడు అడ్డుకొని రక్షించాడని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లిక్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనపై జరిగిన దాడులను విఫలం చేసిమరీ దేవుడు కాపాడాడని పేర్కొన్నారు. ట్రంప్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘నాపై జరిగిన హత్యా ప్రయత్నాలను దేవుడే విఫలం చేసి నన్ను బతికించాడు. అందుకే మళ్లీ మన దేశంలోకి మతాన్ని తిరిగి తీసుకురాబోతున్నాం. సుమారు 40 ఏళ్లలో న్యూయార్క్ స్టేట్‌ను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ అభ్యర్థి తానే అవుతాను. ఈ దాడులు నా సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. హత్యచేసే ప్రయత్నాలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు. నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఈసారి ఎన్నికల్లో మనం న్యూయార్క్‌ను గెలవబోతున్నాం. చాలా ఏళ్ల తర్వాత రిపబ్లికన్లు నిజాయితీగా చెప్పడం ఇదే తొలిసారి. మనం గెలిచి చూపించబోతున్నాం. న్యూయార్క్ ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇక్కడ రికార్డు స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తీవ్రవాదులు, నేరస్థులు పెరుగుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుంది.వాటి నుంచి బారినుంచి బయటపడాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి’ అని అన్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ దేవుడు, మతంపై వంటి అంశాల మీద చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక.. ఇటీవల ట్రంప్ ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లోని గోల్ఫ్ ఆడుతుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సర్వీసెస్ అప్రమత్తమైన ఆయన్ను రక్షించిన విషయం తెలిసిందే.JUST IN - Trump: "God has now spared my life…. We’re going to bring back religion into our country"pic.twitter.com/yJcTAJx1ts— Insider Paper (@TheInsiderPaper) September 18, 2024 -
పేజర్ల పేలుళ్ల ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ అలర్ట్!
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది పేజర్లు ఒకేసారి పేలడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను హిజ్బుల్లా హెచ్చరించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పేజర్లను వాడితే ఇజ్రాయెల్‌కు దొరక్కుండా ఉండొచ్చని హిజ్బుల్లా వ్యూహకర్తల ప్లాన్. ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపడానికి వీటినే వాడుతోంది. ఇటీవల తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్‌లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్‌కు దిగుమతి చేసుకుంది. వాటిలో అత్యధికంగా ఆ కంపెనీకి చెందిన ‘పీ924’మోడల్‌వే ఉన్నాయి. దీంతోపాటు మరో మూడు మోడల్స్ కూడా హిజ్బుల్లా వద్దకు చేరాయి.The Zionist terrorist didn’t target Hezbollah members. They targeted everyone with a pager including doctors and nurses, killing a child. This is a nation wide terrorist attack. pic.twitter.com/9ojtlDMuHg— Syrian Girl 🇸🇾 (@Partisangirl) September 17, 2024అయితే, హిజ్బుల్లాకు చేరిన పేజ్లరలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చినట్టు యూరోపోల్‌కు సైబర్ అడ్వైజర్ మిక్కో హైపోనూన్ వెల్లడించారు. తయారీ ప్రదేశంలో లేదా.. సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ మొత్తం ఆపరేషన్‌లో కచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హిజ్బుల్లా అనుమానిస్తోంది. పేజర్ల దాడిలో దాదాపు మూడు వేల మంది గాయపడగా.. తొమ్మిది మంది మరణించారు. గాయపడిన వారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా పేజర్ల పేలుడు ఘటన నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ హిజ్బుల్లా ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని అనుమానం వ్యక్తం చేసింది. ఇక, హిజ్బుల్లా హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇది కూడా చదవండి: ట్రంప్ ఎన్నికల స్టంట్.. రంగంలోకి మోదీ! -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ ఆఫీస్ ధ్వంసం, కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా జిల్లాలో పచ్చ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. భాకరాపేటలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలోని భాకరాపేటలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ సందర్బంగా ఆఫీసులో ఉన్న ఫర్నీచర్, ఇతర సామాన్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది. దీంతో, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త తులసిరెడ్డిని అరెస్ట్ చేశారు.ఇక, పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనైన తులసిరెడ్డి కానిస్టేబుల్‌పైనే దాడి చేశాడు. అధికారం మాది నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ రెచ్చిపోయి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు.అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో, వారిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ నేతలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇది కూడా చదవండి: ‘మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం’ -
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
చేతకాని సీఎం వల్లే దౌర్భాగ్యం
గచ్చిబౌలి (హైదరాబాద్): చేతకాని ముఖ్యమంత్రి ఉండటం వల్ల రాష్ట్రానికి దౌర్భాగ్యం దాపురించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై సీఎం రేవంతే గూండాలను దాడికి పురిగొల్పారని ఆరోపించారు.శనివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ.. ఫిరాయింపులపై కోర్టు తీర్పు వచ్చిన రోజే స్పీకర్ కార్యాలయం అరికెపూడి గాందీని పీఏసీ చైర్మన్‌గా నియమించడం ఏమిటి? ఇది సాంప్రదాయాలకు విరుద్ధం కాదా?కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఉండటంతోనే ఇలా చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలి. కాంగ్రెస్ విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన అరికెపూడి గాంధీ.. పీఏసీ చైర్మన్‌గా నియామకం కాగానే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ తీరును ప్రశి్నస్తూ.. ఏ పార్టీలో ఉన్నావని మా వాళ్లు ప్రశ్నించడం తప్పా?’’అని ప్రశ్నించారు. ఇలాంటి గూండాగిరీ ఎన్నడూ లేదు ‘‘ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ భారీగా గూండాలను వెంటేసుకుని.. డీసీపీ, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, పోలీసుల ఎస్కార్టులో భారీ కాన్వాయ్‌గా రావడం.. గేటెడ్ కమ్యూనిటీలో దౌర్జన్యం చేయడం ఏమిటి? పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఒక్కటైనా చోటు చేసుకున్నాయా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దాడికి గూండాలను ఉసిగొల్పిన దౌర్భాగ్యపు, చరిత్ర హీనమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమ వాళ్లేనని.. గత పదేళ్లలో ఒక్క ప్రాంతీయ విద్వేష ఘటన జరగలేదని గుర్తు చేశారు. నీలాంటోళ్లను చాలామందిని చూశాంరాష్ట్రంలో నెలలో 28 హత్యలు జరిగినట్టు పత్రికల్లో వచ్చిందని.. రాష్ట్రానికి ఏమయిందనే ఆందోళన వ్యక్తమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి ఎవరో తెలియదని, సీఎం 22 సార్లు ఢిల్లీకి వెళ్లినా చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి చాలా మంది పెద్ద నాయకులను చూశాం. వారి కంటే చాలా చిన్నోడివి. నీలాంటి బుల్లబ్బాయ్, చిట్టి నాయుళ్లను చాలా మందిని చూశాం..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలో ‘పాలమూరు’ సందర్శన సాక్షి, నాగర్‌కర్నూల్: మేడిగడ్డ తరహాలో త్వరలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ బృందం సందర్శిస్తుందని కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినే నేపథ్యంలో.. కేటీఆర్ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం నేరళ్లపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, ఇంకా పది శాతం పనులే మిగిలి ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. రూ.5 వేల ఖర్చుతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంటుందని.. కానీ సీఎం రేవంత్ తొమ్మిది నెలలుగా పాలమూరు ప్రాజెక్ట్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. -
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు
అనకాపల్లి, సాక్షి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులుపై దాడులు ఆగటం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో మరోసారి టీడీపీ నాయకులు బరితెగించారు. బుధవారం అర్ధ రాత్రి వైఎస్సార్సీపీ నాయకులుపై పచ్చ నాయకులు దాడి చేశారు. దేవరపల్లి మండలంలో కరెంట్ కట్ చేసి.. మహిళలపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.రోజు రోజుకీ కూటమి నాయకులు అరాచకాలు పెరిగిపోతున్నాయని బాధితులు రోదిస్తున్నారు. అర్ధ రాత్రి ముషిడిపల్లి కోళ్ల ఫారంపై కూడా టీడీపీ నాయకులు దాడి చేసి పరారైరయ్యారు. టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సోమిరెడ్డితో పాటు అతని అనుచరులు తమపై దాడి చేశారని బాధితురాలు రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగని తోడేళ్ల దాడులు.. వృద్ధురాలి గొంతు కొరికి..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ఐదు తోడేళ్లను పట్టుకున్న తర్వాత కూడా నరమాంస భక్షక తోడేళ్ల బెడదకు అడ్డుకట్టపడలేదు. మంగళవారం రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో బాలికలపై దాడి చేసిన తోడేళ్లు బుధవారం రాత్రి కూడా ఒక వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు నిద్రిస్తుండగా, ఇంటిలోకి దూరిన తోడేలు ఆమె గొంతుకొరికి, మంచంపై నుంచి కిందికి లాగి పడేసింది. ఈ దాడిలో వృద్దురాలి మెడకు బలమైన గాయమైంది. ఈ దాడి నేపధ్యంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియన్ పూర్వా తప్రా గ్రామంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పుష్పాదేవి అనే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో తోడేలు ఆమెపై దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో ఆమె కోడలు వచ్చి, తోడేలును తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో ఆ తోడేలు పారిపోయింది. బాధితురాలికి తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, ఆ తరువాత బహ్రయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.గత రెండు రోజుల్లో నరమాంస భక్షక తోడేళ్లు దాడి చేయడం ఇది మూడోసారి. ఇలా తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం గురించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ మీడియాకు పలు వివరాలు తెలిపారు. ఆ తోడేళ్లు రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడమో కారణంగా అవి ఇలా ప్రవర్తిస్తున్నాయన్నారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణ అంశమని, గత పదేళ్లలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని అన్నారు. దీనిపై అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. దాడులకు పాల్పడుతున్న తోడేళ్ల నమూనాలను విశ్లేషించడం ద్వారా వాటి దాడుల వెనుకనున్న కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని యాదవ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
కాళ్లు పట్టుకో.. వదిలేస్తా
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమిలో వర్గపోరుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బ్యానర్ చించిన ఘటనలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ నేత ఒకరు రంగప్రవేశం చేసి, జనసేనలోని ఓ వర్గం నాయకుడితో కాళ్లు పట్టించుకొని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.ఇదీ జరిగింది..కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం పరాసుపేట సెంటరులో జనసేన పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి బ్యానరు కట్టారు. ఈ బ్యానర్లో అదే పార్టీకి చెందిన యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఫోటోలు లేవు. తమ ఫొటోలు లేకుండా తమ నుంచి చందాలు ఎలా తీసుకుంటారని నాని సోమవారం అక్కడి నిర్వాహకులను ప్రశ్నించారు. అక్కడి బ్యానర్‌ను నాని చేతితో కొట్టడంతో అది చిరిగిపోయింది. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన వర్గం నానితో వాగ్వాదానికి దిగింది. నాని క్షమాపణ చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. సోమవారం సాయంత్రం నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్‌ను పూర్తిగా చించేశాడు. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లి సామాన్లను ధ్వంసం చేశారు. వారిద్దరినీ రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టి వచ్చేశారు. నాని తిరిగి తమపై దాడి చేస్తారన్న భయంతో టీడీపీ నాయకుడు శంకు శ్రీను, మరికొందరిని తీసుకొని నాని, శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లారు. వారిద్దరినీ కా ళ్లతో తంతూ చితకబాదారు. జనసేన నాయకుడు నాని టీడీపీ నాయకుడు శంకు శ్రీనును కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. చివరికి రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలపూడి సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. -
పులుల కంటే ఎక్కువగా బలిగొన్నాయని తెలుసా?
-
రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా: నంబూరు శంకరరావు
గుంటూరు, సాక్షి: గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించమని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పెదకూరపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట పొలాల నస్థానికి 15 రోజుల్లోనే నష్టం పరిహారం ఇవ్వడం జరిగింది. రైతుల పరామర్శకి వెళ్తే దాడి చేస్తారా?. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాకూడదా? లేమల్లకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వాసు అనే వ్యక్తి కారు ధ్వంసం చేశారు....పోలీసుల వైఫల్యం వల్లనే దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని తట్టుకోలేక దాడులు చేస్తున్నారు. నియోజవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. నియోజకవర్గం ఎవరి సొంతం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?’’ అని అన్నారు. -
యూపీలో ఆగని తోడేళ్ల బెడద.. బాలుడిపై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. కనిపిస్తే కాల్చేసేందుకు తుపాకులు పట్టుకుని షూటర్లు తిరుగుతున్నా అవి వెనక్కు తగ్గడం లేదు. తాజాగా గురువారం(సెప్టెంబర్ 5) రాత్రి ఓ తోడేలు పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. కొత్వాలీ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై తోడేలు విరుచుకుపడింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. తోడేళ్ల వరుస దాడులతో భయం గుప్పిట్లో బతుకుతున్న బహ్రెయిచ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా దాడితో మరింత భయాందోళనలకు గురవుతున్నారు. బహ్రెయిచ్‌లో ఇప్పటివరకు జరిగిన తోడేళ్ల దాడుల్లో 8 మంది దాకా మరణించగా 35 మంది గాయప డ్డట్లు తెలుస్తోంది . తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయడానికి షూటర్లను రంగంలోకి దింపింది. అయితే వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరుచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినపుడు మాత్రమే తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిచ్‌లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తోడేళ్లది దాడికి పాల్పడే స్వభావం కాదని నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఇదీచదవండి.. రక్తం మరిగిన తోడేళ్లు -
తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు. అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు. -
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. ఏడుగురి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్ నగర మేయర్ వెల్లడించారు. అపార్టమెంట్ శిథిలాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్‌పై రష్యా దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
పెళ్లి విందులో మటన్ ముక్కల లొల్లి!
పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. నవీపేట: మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన పెళ్లి విందులో ఇరు వర్గాలకు చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడడంతో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారికి సరిగ్గా వడ్డించడం లేదని మరో వర్గానికి చెందిన వ్యక్తులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ ముదిరి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఫంక్షన్ హాల్‌కు చేరుకుని శాంతింపజేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు. -
యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఎనిమిది మంది చిన్న పిల్లలే కావడం గమనార్హం.గ్రామస్తుల భయాందోళనలతో.. తోడేళ్ల గుంపును తరిమికొట్టేందుకు జిల్లా అటవీశాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమికొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా.. ఇద్దరు చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమై తల్లిదండ్రులు వాటి వెంటపడడంతో.. పిల్లలను వదిలేసి అవి పారిపోయాయి. తీవ్రమైన గాయలైన చిన్నారులకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై.. స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రివేళలో ఆయన కాపల కాస్తున్నారు ‘‘అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి. ఇప్పటికే మూడు తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవటంపై అవగాహన కల్పిస్తా. నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం’’ అని అన్నారు.VIDEO | Police and forest department team nabbed a wolf in UP's #Bahrainch, earlier today.The Uttar Pradesh government had launched 'Operation Bhediya' to capture a pack of wolves on the prowl in Mehsi tehsil in Bahraich district that has so far killed seven people.Six… pic.twitter.com/Nx5ZKFAT1e— Press Trust of India (@PTI_News) August 29, 2024ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందకు సీఎం యోగి ప్రభుత్వం‘‘ఆపరేషన్ భేడియా’’ను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు. -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ మహిళా నేతను చంపేస్తామంటూ బెదిరింపులు!
👉ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పచ్చ బ్యాచ్ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా ఎల్లో బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది..👉వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ‘చెత్త’ రాజకీయాలకు తెర లేపింది. తన ఇంటి ముందు చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. మేయర్‌తో పాటుగా ఏకంగా 14 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. దీంతో, తమపై కేసులు పెట్టడంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.👉మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ మహిళా సర్పంచ్ చాందినిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పచ్చ బ్యాచ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో సర్పంచ్ చాందిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ కడప ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా @JaiTDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి? 30 ఏళ్లుగా ఎప్పుడూ జరగని అరాచకాలు గత 3 నెలల నుంచి జరుగుతున్నాయి రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? -సురేష్ బాబు గారు, కడప మేయర్ pic.twitter.com/LQRVfymgmA— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 టీవీలో చూపిస్తానంటూ టీడీపీ వాళ్లని రెచ్చగొట్టిన బిగ్ టీవీ జర్నలిస్ట్ ప్లాన్ ప్రకారం కడప మేయర్ సురేశ్ ఇంటి ముందు చెత్త వేసిన @JaiTDP నేతలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్షన్లో సైగలతో ప్లాన్ అమలు చేసిన బిగ్ టీవీ జర్నలిస్ట్ప్రశాంతంగా ఉన్న వైయస్ఆర్ కడపలో మళ్లీ ఫ్యాక్షన్ బీజం… pic.twitter.com/1FqzgCVPvv— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
జేసీ అరాచకాలు సహించం: వైఎస్సార్సీపీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. ‘‘మా పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య. దాడులను ఆపడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఆస్తులను ధ్వంసం చేస్తుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దాడులు ఇలాగే కొనసాగితే సహించేది లేదు’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.ప్రతిపక్షం ఉండకూడదన్నదే జేసీ కుట్రలు: అనంత వెంకటరామిరెడ్డితాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నాం. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్తే తప్పేంటి?. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాంపోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్యశాంతి భద్రతలు పరిరక్షించడం లో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు రాజకీయాలు లేవు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించాలి.జేసీ రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?: మాజీ మంత్రి శంకర్ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక పాలన ప్రోత్సహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా హింసను ప్రేరేపిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. -
చంద్రబాబూ.. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.‘‘ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?’’ అని వైఎస్ జగన్ విమర్శించారు.ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే,… pic.twitter.com/Bx35uodt4P— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2024చదవండి: అచ్యుతాపురం ఘటనపై బాబు సర్కార్ ఉదాసీన వైఖరి! -
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వరుస ఉగ్రదాడులు
పాకిస్తాన్లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్‌పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు.మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాయువ్య పాకిస్థాన్‌లో జరిగిన మరో దాడిలో, ఉగ్రవాదులు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మద్ది ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఐదేళ్లలో అందరినీ చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరినీ చంపేస్తాం.. రోజు ఇళ్ల మీదకు వచ్చి కొడతాం. వైఎస్సార్సీపీ నా కొడుకులు ఎవడడ్డమొస్తాడో రమ్మను. ఒక్కొక్కరి అంతు చూస్తాం’ చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో శనివారం తెలుగుదేశం కార్యకర్తల హెచ్చరిక ఇది. మంత్రి అనగాని ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోయి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గుళ్లపల్లిలో శుక్ర, శనివారాల్లో చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు అనుచరుడైన రిటైర్డ్ ఆర్మీ జవాను సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేసి, సంపత్‌కుమార్‌తో సహా ఐదుగురిని గాయపరిచిన వారు.. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వారందరినీ చంపేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యకర్త కుమార్ మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్త సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో రాళ్లతో ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. బూతులు తిట్టి వెళ్లిపోయారు. శనివారం 15 మందితో కలిసి కుమార్ మళ్లీ సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశాడు.ఒక్కసారిగా ఇంట్లోకిదూరి బూతులు తిడుతూ దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో సంపత్‌కుమార్, ఆయన బాబాయి గాలి శ్రీనివాసరావు, తమ్ముడు గాలి శివకృష్ణ, మరో ఇద్దరు గాయపడ్డారు. గాలి శ్రీనివాసరావు దవడకు పెద్ద గాయమైంది. సంపత్‌కుమార్‌కు ఎదపైన, పొట్టమీద గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత తెలుగుదేశం వర్గీయులు మరోసారి సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. దాడులు, ఆస్తుల ధ్వంసం బాధ్యతాయుతమైన మంత్రి అనగాని నియోజకవర్గంలో రెండు నెలలుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ వారు దాడులు చేస్తున్నారు. ఆస్తులను «ధ్వంసం చేస్తున్నారు. బలహీనవర్గాలపై ఈ తరహా దాడులు పెరిగాయి. ఊళ్లు విడిచి వెళ్లకపోతే చంపేస్తామని మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఊరువదలి వెళ్లక పోతే చంపేస్తామని టీడీపీ మూకలు హెచ్చరించడంతో రెండునెలలు అజ్ఞాతంగా గడిపిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు నాలుగు రోజుల కిందట సొంత గ్రామం గుళ్లపల్లికి వచ్చారు.ఆయన రాగానే తెలుగుదేశం వర్గీయులు ఆయన అనుచరులపై దాడులకు దిగారు. ఇటీవల తమ ఇంటివద్ద అరుగుపై కూర్చుని ఉన్న వైఎస్సార్సీపీ నేతలు వాకా వెంకటేశ్వరరావు, వీరంకి శివయ్యలపై కర్రలతో దాడిచేసి కొట్టి గాయపరిచారు. కస్తూరివారిపేటలో ఆంధ్రప్రభ విలేకరి యనుముల వెంకటేశ్వరరావు ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. రాం»ొట్లవారిపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్, సర్పంచ్ల సంఘం నాయకుడు ప్రసాదరెడ్డిని గ్రామం వదలి పెట్టకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రసాదరెడ్డి గ్రామం వదలిపెట్టి వెళ్లిపోయారు. నగరం, నిజాంపట్నం తదితర మండలాల్లోను ఈ తరహా దాడులు పెరిగాయి. టీడీపీ మూకల దాడులు తట్టుకోలేక నియోజకవర్గంలోని వందలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. స్పందించని పోలీసులు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నా పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదు. దాడుల గురించి తెలిసినా తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం వర్గీయుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి వద్దకు వెళ్లి మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు. -
బంగ్లాలో హిందువుల భద్రతకు ఆయన హామీ ఇచ్చారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల భద్రతను కాపాడతామని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు యూనస్ తనతో ఫోన్లో మాట్లాడారని మోదీ తెలిపారు.కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా.. ‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ నుంచి నాకు ఫోన్‌కాల్ వచ్చింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం చర్చించుకున్నాం. ఈ సందర్భంగా బంగ్లాలో ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పాను. బంగ్లాలోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు’ అంటూ కామెంట్స్ చేశారు.Received a telephone call from Professor Muhammad Yunus, @ChiefAdviserGoB. Exchanged views on the prevailing situation. Reiterated India's support for a democratic, stable, peaceful and progressive Bangladesh. He assured protection, safety and security of Hindus and all…— Narendra Modi (@narendramodi) August 16, 2024మరోవైపు, అంతకుముందు ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల రక్షణను కూడా భారత్ కోరుకుంటోంది అని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా దేశం విడిచివెళ్లారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు పెరిగాయి. ఇండియన్ కల్చరల్ సెంటర్, ఇస్కాన్ ఆలయాన్ని కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. హిందువులపై దాడులు, వేధింపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, ఈ ఘటనపై యూనస్ స్పందించారు. హక్కులు అందరికీ సమానం. మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమే. దయచేసి సంయమనం పాటించండి అని నిరసనకారులను కోరారు. -
ఉక్రెయిన్ సైన్యం మెరుపు దాడులు.. రష్యాలో ఎమర్జెన్సీ!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్టేజ్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాను వణికిస్తోంది. రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇక, తాజాగా సరిహద్దుల్లోని బెల్గోరోడ్‌ను టార్గెట్ చేసింది. దీంతో, ఆ ప్రాంతంలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ విధించారు.కాగా, ఉక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి దూసుకెళ్తున్నాయి. రష్యా సైన్యాన్ని వెనక్కి తరుముకుంటూ ఆ దేశంలోకి ఉక్రెయిన్ సైన్యం అడుగుపెట్టింది. ఇక, ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొందని ఆ దేశ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ వెల్లడించారు. మరోవైపు.. తాజాగా రష్యా సరిహద్దుల్లోని బోల్గోరోడ్పై దాడులు మొదలుపెట్టాయి. దీంతో, అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు అక్కడి గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్వోక్ ప్రకటించారు. దేశంలో ఫెడరల్ ఎమర్జెన్సీ విధించాలని తాము కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. Belgorod Governor Vyacheslav Gladkov's declaration of a state of emergency signals a significant escalation in Ukrainian cross-border attacks, reflecting a strategic shift towards targeting deep into Russian territory. The state of emergency is not just a security measure, but…— Prof. Jamal Sanad Al-Suwaidi (@suwaidi_jamal) August 14, 2024 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సైన్యం ముందుకు వస్తుండటంతో ఇప్పటికే ఇక్కడ పలు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. గత వారం ఉక్రెయిన్ సేనలు వ్యూహం మార్చి రష్యా భూభాగంలో ఎదురుదాడులు మొదలుపెట్టాయి. ఇక, రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇతర దేశాల సైన్యం రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక బెల్గోరోడ్ ప్రాంతంలో షెబ్కినో నగరం, ఉస్టింకా గ్రామాలపై కీవ్ సేనలు డ్రోన్ దాడులు జరిపాయి. 🇺🇦Ukrainian soldiers are advancing to the front line, reinforcing their position in Kursk.#UkraineRussiaWar #Kurskregion #AFU #RussiaUkraineWar #Belgorod pic.twitter.com/gGJN0sAV4L— WorldCrisisMonitor (@WorldCrisisMoni) August 14, 2024 అయితే, ఉక్రెయిన్ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ స్పందించారు. ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందన్నారు. రష్యా రక్షణ శాఖ కూడా ఉక్రెయిన్ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్టు ప్రకటించింది. #UkraineRussiaWar Kursk operation is only the beginning, Ukraine is preparing the next strike, Putin destroying Russia #UkraineRussiaWar #Kursk #Russia #RussiaUkraineWar #RussiaUkraine #Ukraine #UkrainianArmy #UkraineRussiaConflict #Belgorod pic.twitter.com/PH8NzMTY6A— भीम सेना🦂(BALVEER SINGH JATAV) (@akshayhate) August 14, 2024 -
ఇజ్రాయెల్ Vs హమాస్: మళ్లీ యుద్ధ మేఘాలు.. దూసుకెళ్లిన రాకెట్స్
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ టార్గెట్‌గా హామాస్ రాకెట్లను ప్రయోగించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.వివరాల ప్రకారం.. హమాస్ అగ్రనేత హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. ఈ సందర్బంగా హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్.. టెలీ అవీవ్ టార్గెట్‌గా M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. హమాస్ రాకెట్ల దాడికి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్ధం కూడా వినిపించినట్టు ఇజ్రాయెల్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది. Al-Qassam Brigades say they bombed Tel Aviv and its suburbs with two missiles #hamas #iran #Isreal#hamas #GazaGenocide #TelAviv pic.twitter.com/M3bx0PR6nZ— no love no tension (@adeelriaz1991) August 13, 2024 ఇక, హమాస్ మెరుపుదాడులతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ మరోసారి హమాస్ టార్గెట్‌గా బాంబు వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అయితే, ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయనుకున్న వేళ దాడులు జరగడం గమనార్హం. ⚡️ A rocket barrage now from the #Gaza Strip 🔥🔥 pic.twitter.com/ENqdAYkunF— محمّد محفوظ عالم (@md_mehfuzalam) August 13, 2024 -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికే తెగబడ్డారు తెలుగు రాక్షసులు
-
బంగ్లాలో దాడులకు పాకిస్థానే కారణం: హసీనా కుమారుడు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచివెళ్లడంతో అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తమ దేశంలో ఈ పరిస్థితికి పాకిస్తానే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.ఇక, తాజాగా షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్ ఐఎస్ఐ ఆజ్యం పోస్తోంది. విదేశీ జోక్యంతోపాటు పాక్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘర్షణలే ఆధారాలు. దాడులు, ఆందోళనలు చాలా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది. వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. వాటిని మరింత దిగజార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఉగ్రవాద, విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరిమూకలు పోలీసులపైనే దాడులు చేసిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ అరాచకం నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేస్తాను అని కామెంట్స్ చేశారు.News Alert | Here's what Sajeeb Wazed Joy (son of former Bangladesh PM Sheikh Hasina) said in an exclusive interview with @PTI_News."Sheikh Hasina will be back in Bangladesh once democracy is restored.""Pakistan's ISI fuelling unrest in Bangladesh.""The Indian govt must… pic.twitter.com/serCZm31nu— Press Trust of India (@PTI_News) August 8, 2024ఇదే సమయంలో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి రక్షణ కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని సాజీబ్ చెప్పుకొచ్చారు. మా పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆపదలో ఉన్న పౌరులను, అవామీ లీగ్ పార్టీని షేక్ ముజిబర్ రహ్మాన్ కుటుంబం ఎన్నటికీ ఒంటరిగా వదలిపెట్టదు. బంగ్లాదేశ్‌లో అవామీ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఆమె ఆమె తప్పకుండా తిరిగి వస్తారు అని అన్నారు. -
బ్రిటన్‌లో వలసదారులపై దాడులు తీవ్రం
లండన్: వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్‌పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోం మంత్రి వివెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్‌పోర్ట్‌లో కత్తిపోట్లకు ముగ్గురు చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
'పచ్చ' మూకల దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు.. వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ కూటమి నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. టీడీపీ మూకల దౌర్జన్యాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు.ఈ క్రమంలో కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. ‘‘నిన్నటికి నిన్న టీడీపీ నేతల వేధింపులు భరించలేక అనకాపల్లిలో గొల్లవిల్లి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. ఈ రోజు అదే అనకాపల్లిలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న కక్షతో జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మనుషులం అంటూ వచ్చి జేసీబీతో ఒకరి ఇంటిని కూల్చేశారు. అప్పులు చేసుకుని ఇంటిని కట్టుకుంటే ఇలా కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు చంద్రబాబు? పవన్ కళ్యాణ్? హోంమంత్రి అనిత?’ అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్సార్సీపీ మండిపడింది..@JaiTDP కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. నిన్నటికి నిన్న టీడీపీ నేతల వేధింపులు భరించలేక అనకాపల్లిలో గొల్లవిల్లి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. ఈ రోజు అదే అనకాపల్లిలో వైసీపీ కి ఓటు వేశారన్న కక్షతో @JanaSenaParty ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మ… pic.twitter.com/T3XjiisoJt— YSR Congress Party (@YSRCParty) August 4, 2024 -
వైరల్ వీడియో.. ఉబర్ డ్రైవర్‌పై పెప్పర్ స్ప్రేతో యువతి దాడి
ఉబర్ డ్రైవర్‌పై ఓ యువతి పెప్పర్ స్ప్రేతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మన్హట్టన్లో అర్ధరాత్రి సమయంలో పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. కారులో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా ఆ మహిళ పెప్పర్ స్ప్రే కొట్టింది. దాడి చేయొద్దంటూ బాధితుడు వేడుకున్న కానీ ఆ మహిళ వినలేదు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. దాడి సమయంలో యువతితో పాటు మరో మహిళ కూడా కారులో ఉంది.నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. అయితే.. డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం తెలియలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే ఈ దాడి ఘటన తర్వాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళనకరం.. ఇది సరికాదు. హింసను సహించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నట్లు ఉబర్ వెల్లడించింది.NYCWoman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024 -
ఎన్టీఆర్ జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు..
-
9/11 దాడుల నిందితులకు ఝలక్
వాషింగ్టన్: 9/11 దాడుల నిందితులకు అమెరికా ఝలక్ ఇచ్చింది. వాళ్లు దరఖాస్తు చేసుకున్న నేరాంగీకార అభ్యర్థనను తిరస్కరించింది. మరణ శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఇందుకు సిద్ధపడినట్లు అంచనాకి వచ్చిన రక్షణ శాఖ కార్యాలయం.. ఈ మేరకు వాళ్ల పిటిషన్‌ను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 11, 2001 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఖలీద్ షేక్ మహ్మద్, అతని ఇద్దరు సహచరులు దాడి తామే చేసినట్టు ఇటీవల నేరాన్ని అంగీకరించారు. సుదీర్ఘకాలంగా వాళ్లు తమ మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా దానికి సమ్మతిస్తేనే నేరాంగీకారానికి ముందుకు వస్తామని వారు షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ నిందితులకు సంబంధించి అమెరికా రక్షణ కార్యదర్శి, గ్వాంటనామో వార్ కోర్టు ఇంచార్జ్ సుసాన్ ఎస్కాలియర్ ఒక మెమోరాండం విడుదల చేశారు. నిందితులతో విచారణకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే బాధ్యత నాపైనే ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. జూలై 31, 2024న సంతకం చేసిన మూడు ముందస్తు విచారణ ఒప్పందాలను తిరస్కరిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం నిందితులు క్యూబాలోని గ్వాంటనామో బేలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక.. 9/11 దాడుల్లో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడిగా దీనిని పేర్కొంటారు. -
9/11 నిందితుల నేరాంగీకారం.. అందుకోసమేనా?
వాషింగ్టన్: అమెరికాలో 9/11 దాడులకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 11, 2001 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఖలీద్ షేక్ మహ్మద్, అతని ఇద్దరు సహచరులు దాడి తామే చేసినట్టు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు క్యూబాలోని గ్వాంటనామో బేలోని యూఎస్ జైలు అధికారులు వెల్లడించారు.కాగా, వారు నేరాన్ని అంగీకరించింది మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకేనని పలువురు అధికారులు చెబుతున్నారు. నేరం అంగీకరరించిన నేపథ్యంలో జీవిత ఖైదు కోసం ఒక అభ్యర్థించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, వారికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, 9/11 దాడుల నిందితులు ప్రస్తుతం క్యూబాలోని జైలు ఉంటున్నారు. ఇక, 9/11 దాడుల్లో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా పేర్కొనే ఈ దాడులు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి.ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో ‘ట్విన్ టవర్స్’గా పిలుచుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఉగ్రవాదులు క్షణాల్లో కూల్చివేశారు. అమెరికాకు కీలకమైన నాలుగు భవనాలను కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బకొట్టాలని అల్‌ఖైదా ఉగ్రవాదులు భావించారు. పాకిస్థానీ మిలిటెంట్ ఖలీల్ అహ్మద్ షేక్ వ్యూహ రచనలో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. సెప్టెంబరు 11, 2001న నాలుగు విమానాలను పథకం ప్రకారం హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి భవనాలపై దాడులకు పాల్పడ్డారు. 4. Chilling footage reveals the exact moment Flight 175 struck the South Tower of the World Trade Center.#NeverForget #911Anniversary pic.twitter.com/ndd0Txeylq— Chidanand Tripathi (@thetripathi58) July 28, 2024 ఈ ప్రదేశంలోనే విమానంలోని ఉగ్రవాదులు, ప్రయాణికులు కూలిన భవనాల కింద చిక్కుకొని మృతిచెందారు. మొత్తం 2,763 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మూడో విమానం పెంటగాన్‌లో అమెరికా రక్షణ కార్యాలయంలోని ఓ భవంతిని ఢీకొట్టగా.. వైట్‌హౌజ్ లక్ష్యంగా సాగిన నాలుగో విమానం సోమర్సెట్ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు.అమెరికా ప్రతీకార దాడులు..2001, అక్టోబర్ 7న అమెరికా నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న అఫ్గాన్ సరిహద్దులపై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. తాలిబన్లను గద్దెదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమిద్ కర్జాయ్‌ను దేశాధ్యక్షుడిగా నియమించింది. దేశ పాలన, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల పాటు ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇదే సమయంలో పాక్‌లో అబోటాబాద్‌లో తలదాచుకున్న లాడెన్‌ను 2011, మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే, పాక్‌లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్‌ఖైదా నేతలనుగానీ, తాలిబన్లనుగానీ అంతమొందించలేకపోయింది. -
జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణం
పల్నాడు, సాక్షి: ఆర్థిక సాయం చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ జనసేన నాయకురాలు వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ కె.నాగేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు చేజర్ల గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణవేణి (28) కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి అతడిని పరామర్శించింది. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా.. సుమారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కాగా.. ఎన్నికలలో కృష్ణవేణి కుటుంబం జనసేనకు ఓటు వేయలేదని భావించిన జనసేన నాయకురాలు తాడువాయి లక్ష్మి ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని రెండు నెలలుగా వేధిస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పరిస్థితి కుదుటపడ్డాక చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఒత్తిడి ఆపలేదని మృతురాలి భర్త కోటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న తాను ఇంట్లో లేని సమయంలో తాడువాయి లక్ష్మి ఇద్దరు మహిళలను వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చిందని, తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె భర్త వివరించారు. వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భార్య ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసి తన భార్య ఆత్మహత్యకు కారణమైన తాడువాయి లక్షి్మని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.మునిసిపల్ చైర్‌పర్సన్‌పై హత్యాయత్నంఇంటికి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త దాష్టీ కం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చెత్త పత్రిక రోత రాతలపై పరువునష్టం దావాపెద్దాపురం: పెద్దాపురం మునిసిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారుపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు (లింగం) ఇంటి తలుపులను బద్దలుగొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుçపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మునిసిపల్ వైస్‌చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు ఆరెళ్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదాసరి రాజా, తాటికొండ వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించారు. అధికారపక్షం రెచ్చగొడితేనే తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కలి్పంచాలని చైర్పర్సన్ పోలీసులను కోరారు. రోత రాతలను సహించం అబద్ధాలు, ఆధారాల్లేని ఊహాగానాలతో ఈనాడు పత్రిక పెద్దాపురం కౌన్సిల్ సభ్యులపై తప్పుడు రాతలు రాసిందని మునిసిపల్ కౌన్సిల్ ధ్వజమెత్తింది. కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన తప్పుడు రాతలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వచి్చన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో పత్రిక తేల్చాలన్నారు. పత్రికలో వచి్చన 410 సర్వే నంబర్ పూర్తి జిరాయితీ అయితే 83 సెంట్ల భూమి రూ.4కోట్లు అంటూ తప్పుడు కథనం ఇవ్వడం సమంజసమా అని ప్రశి్నంచారు. ఈ కథనంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కథనం రాసిన పత్రిక ప్రతినిధి ఓపక్క జర్నలిస్ట్‌గా, మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్‌గా చలామణి అవుతున్నాడని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కంటతడితమ కుటుంబ సభ్యుల రేషన్ షాపు తొలగించారని మహిళా కౌన్సిలర్ ఆవేదన షాపు అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్న టీడీపీ నేతలుపుత్తూరు: కూటమి అధికారంలోకి వచి్చనప్పటినుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమేగాక వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ షాపులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పుత్తూరులో ఐదేళ్లుగా నిజాయితీగా కార్డుదారులకు సరుకులు ఇస్తూ ఎలాంటి ఆరోపణలు లేని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తొలగించారు. దీనిపై బుధవారం 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.రాధ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు. కక్షసాధింపులు తగవని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎ.హరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ సమానమేనని, అధికారపక్షం, ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇందుకు నిదర్శనం తమ కుటుంబసభ్యులు ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క మంజుల ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా రేషన్ షాపు నడుపుతున్నారని తెలిపారు. రెండురోజుల కిందట టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటివద్దకు వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాపు అవసరం లేదంటూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమవద్ద ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. అటవీ భూముల ఆక్రమణకు టీడీపీ నేతల యత్నంఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్న అధికారులుచిల్లకూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీలోని అటవీ భూముల్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నస్తున్నారు. పలువురు నాయకులు అటవీ భూముల్ని చదును చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో సర్వే నంబరు 432లో సుమారు 400 ఎకరాల అటవీభూములు ఉన్నాయి. వీటిలో సగం వరకు ఇప్పటికే ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూములను ఆక్రమించేందుకు టీడీపీ నేతలు ప్రయతి్నస్తున్నారు. ఆ భూమిని చదును చేసే పనుల్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చెరువు లోతట్టులో కూడా సుమారు 50 ఎకరాల వరకు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానికులు గూడూరు ఆర్డీవో కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వీఆర్వో శ్రీనివాసులను అడగగా.. భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. మట్టిపోసి వలంటీర్ ఇంటి దారిమూతసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్ల మట్టిపోసి వలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని ఉంటున్నాడు. బ్రహ్మయ్య వలంటీర్‌గా వైఎస్సార్సీపీకీ అనుకూలంగా పనిచేశాడంటూ కక్షతో అతడి ఇల్లు కూల్చేయాలని టీడీపీ నేతలు కుట్రచేశారు. టీడీపీకీ చెందిన పచ్చ సు«దీర్, పచ్చ అప్పయ్య, నల్లబోతు కోటయ్య, బొడ్డు లింగయ్య, మరో 20 మంది ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లోలేని సమయంలో ఆయన ఇంటికి దారిలేకుండా 20 ట్రాక్టర్ల మట్టిపోశారు. బ్రహ్మయ్య ఇంటిముందు ఎనీ్టఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఆ ఇంటిని కూల్చేయాలని ప్రయతి్నస్తున్నారు. -
ఆదుకోండి మహాప్రభో..
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న దళితుల షాపులను టీడీపీ నేతలు కూల్చేశారు. జీవనోపాధి లేకుండా చేయడంతో 3 ఎస్సీ కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం తడకలూరిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రవికుమార్, చిట్టిబాబు, రాజ్‌కుమార్ గ్రామ పంచాయతీకి చెందిన 3 దుకాణాల్లో టిఫిన్, కూల్‌డ్రింక్స్ విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పంచాయతీకి అద్దెలు సకాలంలో చెల్లిస్తుంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు గ్రామంలో రెచ్చిపోతున్నారు. సర్పంచ్ వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కావడంతో ఆయనపై దాడి చేశారు. అలాగే, రవికుమార్, చిట్టిబాబు, రాజ్‌కుమార్ దుకాణాలు ఖాళీ చేయలేదని మంగళవారం సాయంత్రం దారుణానికి ఒడిగట్టారు. జేసీబీని తీసుకొచ్చి 3 షాపులను నేటమట్టం చేశారు. అప్పటికప్పుడే ట్రాక్టర్లలో మట్టిని తరలించేశారు. దుకాణాలు కూల్చేసిన అవశేషాలు అక్కడ లేకుండా చేశారు. షాపులు కూల్చగా వచ్చిన ఇనుప చువ్వలను అమ్మేసి ఆ నగదుతో మందు పార్టీ చేసుకున్నారు.టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలు కాపాడండిమా ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు సోషల్ మీడియా ద్వారా ఓ అర్చకురాలి వినతికొత్తపేట: ‘టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలను కాపాడండి. మా ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. గతంలో వారు నా చిన్న కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు నా ఇద్దరు కుమార్తెలతోపాటు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలి.’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన అయిలూరి సంతోషలక్ష్మి అనే మహిళా అర్చకురాలు వేడుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఆవేదనను వివరిస్తూ ఓ వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో పెట్టారు. ‘నా భర్త అయిలూరి శివకుమార్ మందపల్లి ఉమామందేశ్వర(శనైశ్చర) స్వామి వారి దేవస్థానం అర్చకుడిగా పనిచేసేవారు. ఆయన 2009లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత నేను వంశపారంపర్య వారసత్వ హక్కులు పొందాను. దేవస్థానం అర్చకత్వ బాధ్యతలను చూస్తూ నా ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాను. మా గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు నా ఆస్తులను ఆక్రమించుకున్నారు. నాకు ఉన్న అర్చకత్వ ఆధారాన్ని తప్పించాలని ప్రయతి్నంచారు. వంశపారపర్యం అర్చకత్వ హక్కును కొనసాగించేలా దేవదాయశాఖ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాను. నా ఆస్తులను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి 2018లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా ఆ స్థలాల్లోనే నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో వారు నా చిన్న కుమార్తె మైనర్‌గా ఉన్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించగా, పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును మేమే కొట్టేయించాలని బెదిరిస్తున్నారు. లేకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణ మహిళను అని కూడా చూడకుండా ఇంటికి వచ్చి అసభ్యకరంగా వేధిస్తున్నారు. వారి ఆగడాలపై నా కుమార్తె కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు ఉందని మమ్మల్నే బెదిరిస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, సంతోషలక్షి్మ, ఆమె కుమార్తె తమకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, తాను వారిని బెదిరించలేదని కొత్తపేట ఎస్ఐ ఎం.అశోక్ తెలిపారు.బరితెగించిన పసుపు గూండాలువ్యాపారి ఇంటిపై 20 మంది దాడి, ఇల్లు, సామగ్రి ధ్వంసంనరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ గూండాలు బరితెగించారు. ఆర్యవైశ్య వ్యాపారి ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి ఇల్లు ధ్వంసం చేసి అడ్డు వచి్చన మహిళలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి చేసి అధికార పార్టీ గూండాయిజాన్ని ప్రదర్శించారు. ప్రకా‹Ùనగర్ 60 అడుగుల రోడ్డు సమీపంలో శివసాయి ట్రేడర్స్ పేరిట నోముల మల్లికార్జునరావు సిగరెట్, పాన్‌మసాలా హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే అల్లం పూర్ణచంద్రరావు రెండేళ్ల క్రితం మల్లికార్జునరావు వద్ద రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచి్చందని సాకు చూపి పూర్ణచంద్రరావు డబ్బులు తిరిగి చెల్లించకపోవటంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పూర్ణచంద్రరావు రూ.20 లక్షలు మల్లికార్జునరావుకు ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు చెల్లించాడు. మనసులో అక్కసు పెంచుకున్న పూర్ణచంద్రరావు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని మల్లికార్జునరావుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. మంగళవారం 20 మంది అనుచరులతో పూర్ణచంద్రరావు కర్రలు తీసుకొని మల్లికార్జునరావు ఇంటిపై దాడి చేసి సామగ్రి, పూల కుండీలను ధ్వంసం చేసి సీసీ కెమెరాలను పగుల గొట్టారు. అనంతరం మల్లికార్జునరావు దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అధికారం మాది.. ఊరు విడిచి వెళ్లిపోండి.. ఎమ్మెల్యే గారు వెళ్లి దాడి చేయమన్నాడు..అని చెప్పి దాడిలో పాల్గొన్న గూండాలు బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించినా పట్టించుకోకుండా పోలీసుల సమక్షంలోనే మరో మారు కర్రలతో మల్లికార్జునరావు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పూర్ణచంద్రరావు, జుజ్జూరి సురేంద్రస్వామి, తమ్మిశెట్టి ధనరాజ్, సింహాద్రి గంగాధర్రావుతోపాటు మరో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సీహెచ్ కృష్ణారెడ్డి తెలిపారు. పూర్ణచంద్రరావు పలు అక్రమ గుట్కా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గుట్కా వ్యాపారం అంతా తానే చేయాలని మిగిలిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
దాడిచేసింది వారే.. కేసు పెట్టింది వారే!
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ నాయకుడు గున్నయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సురేష్, అతడి బావ రాజయ్య, మామ వెంకటయ్య, మరికొందరు ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడిచేశారు. విజయకుమార్, గురునాథ్, చిట్టెమ్మ, బాబు, సుధాకర్‌లను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. బాధితులు ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకువచ్చారు. టీడీపీ నేతల ఒత్తిడితో టీడీపీ వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఆస్పత్రిలో చేరకుండా అడ్డుకుని వారిని తీసుకెళ్లి రాత్రంతా స్టేషన్లో ఉంచారు. సోమవారం వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసి న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి సబ్‌జైలుకు పంపారు. తీవ్రంగా గాయపడిన చిట్టెమ్మ ఇచి్చన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదుచేయలేదు. దీనిపై డీఎస్పీని అడగగా.. విచారించి కేసు నమోదుచేస్తామని తెలిపారు. ఈ నెల 19న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైననాటో డ్రైవర్ ఎర్రయ్యను హత్యచేసేందుకు టీడీపీకి చెందిన సురే‹Ù, మరికొంతమంది ప్రయతి్నంచారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయారు. 20వ తేదీన ఎర్రయ్య తొట్టంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి సాధారణ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని టీడీపీ నాయకులను వదిలేశారు.ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు..» కూటమి నేతలు ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తున్నారు » ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా గారపాడు మహిళల ఫిర్యాదునగరంపాలెం: కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ ల నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలోని పల్లెలో ఉంటున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము గ్రామంలో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు చెందిన మహిళలు కూడా తమ ఇళ్లల్లోకి చొరబడి గొడవలకు దిగుతున్నారని, పల్లె విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బాధితులు కూరపాటి పూర్ణ, పల్లపాటి శృతి, ఏసుపొగుల సింధు, మహాలక్షి్మ, కోటేశ్వరి, బేతపూడి రాణి తదితరులు సోమవారం గుంటూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణలో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి వైఎస్సార్సీపీ వారిని కవి్వస్తున్నారు. అధికారం మాదే, ఈ ఐదేళ్లు గ్రామంలో ఉండటానికి వీల్లేదు.. వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. గత నెల 26న తాను ఇంటివద్ద నిలబడి ఉండగా లైట్లు ఆర్పేసి కర్రలు, సీసాలతో దాడిచేసి కొట్టి గాయపరిచారని కారసాల రంగమ్మ కన్నీరుమున్నీరైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఈ దాడి గురించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల 24న తన మామ ఏసుపొగుల రవి, మరో పదిమందిపై సీసాలతో దాడిచేశారని మాధవి తెలిపింది. బయట నుంచి తాగునీరు తెచ్చుకోవాలన్నా భయమేస్తోందని చెప్పింది. ఆఖరికి పిల్లలపై పాఠశాలల వద్ద దాడిచేస్తున్నారని పలువురు తెలిపారు. 50కి పైగా కుటుంబాలు గ్రామం బయటే ఉంటున్నట్లు చెప్పారు. కారసాల ఆదాం, పల్లెపు రాంబాబు, శ్యాంబాబు తదితరులు గ్రామం విడిచి వెళ్లారని వారు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని వారిని కట్టడి చేయాలని బాధిత మహిళలు విజ్ఞప్తి చేశారు. -
అరాచకం.. ఆటవికం.. ‘రెడ్’ రూల్!
సాక్షి, అమరావతి: ‘‘ఏపీ’’ అంటే ఈరోజు అరాచకం, ఆటవికం, రెడ్‌బుక్ పాలన అన్నట్లుగా కూటమి సర్కారు మార్చేసిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధఃపాతాళానికి దిగజారినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు పెట్టారు. వీటి ద్వారా పోలీసులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? హత్యలు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతాం..! పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండని చెబుతున్నట్లే ఉంది! ఆయా ఘటనలపై కేసులు పెడితే తోలు తీస్తాం..! బాధితులపైనే తిరిగి కేసులు పెట్టండి అని అనడానికి ఇది నిదర్శనం కాదా?’ అని నిలదీశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెడ్‌బుక్ పేరిట హత్యలు..హత్యాచారాలు.. దాడులులోకేశ్ రెడ్‌బుక్‌ను చూసి గ్రామాల్లో టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. టీడీపీ విధ్వంసకాండపై మేం ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాంబిరెడ్డిపై దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆయన చనిపోయాడని భావించి వదిలేశారు. రాజకీయంగా విభేదించారని ఇలా దాడులు చేస్తారా? ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని దాడులకు తెగబడటం «ధర్మమేనా? చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలపై ఎవరూ ప్రశ్నించకూడదు! ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే ఏం జరుగుతుందోనని భయం కల్పించేందుకే ఇలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.పల్నాడులో పరాకాష్టకు సాధింపులువినుకొండలో రషీద్‌ను హత్య చేసిన నిందితుడు జిలాని స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఫోటోలు దిగాడు. ఎమ్యెల్యే, టీడీపీ నాయకులతో నిందితుడు అంటకాగినా కేసులో ఎక్కడా వారి పేర్లు లేవు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పోలింగ్‌కు ముందు అక్కడ ఎస్పీగా ఉన్న రవిశంకర్‌రెడ్డి సమర్థంగా పని చేస్తుండటంతో ఆయన్ను బదిలీ చేయించి బిందుమాధవ్‌ను తెచ్చుకున్నారు. ఆయన చేసిన ఆకృత్యాలు తెలుసుకుని ఈసీ సస్పెండ్ చేసింది. అనంతరం వచ్చిన మలికాగార్గ్ టీడీపీ నాయకుల మాట వినడం లేదని శ్రీనివాస్‌ను ఎస్పీగా తెచ్చారు. ఆ తరువాత మూడో రోజే రషీద్‌ను నడి రోడ్డు మీదే దారుణంగా నరికేశారు. మహిళల భద్రత గాలికికేవలం గత 45 రోజుల వ్యవధిలో ఎనిమిది మంది మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నలుగురిపై అత్యాచారం, హత్యా ఘటనలు జరిగాయి. 12 మంది మహిళలు, చిన్నారి బాలికలపై అత్యంత దారుణమైన ఘటనలు కూడా వెలికి చూశాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు దిశ యాప్ రక్షణ కవచంలా నిలిచింది. 1.41 కోట్ల మంది ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్న మహిళలు, యువతులు ఫోన్‌ను షేక్ చేసినా.. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులకు అలెర్ట్ వెళ్లేది. పోలీసులు తక్షణమే బాధిత మహిళకు ఫోన్ చేసేవారు. ఒకవేళ బాధితులు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేకుంటే పోలీసులే నేరుగా ఘటనా స్థలికి వెళ్లి రక్షించేవారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం మహిళల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దిశ యాప్‌తో జగన్‌కు క్రెడిట్ వస్తోందనే దుగ్ధతో దాన్ని వదిలేశారు. దిశ పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లది ఇదే పరిస్థితి! చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని నేను పరామర్శించడం, రాష్ట్రంలోని అరాచక పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సీఎం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారు. హుటాహుటిన డీజీపీ, సీఐడీ ఏడీజీని చంద్రబాబు అక్కడికి హెలికాప్టర్లో పంపారు. ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు కాలిపోతే కలెక్టరేట్, సీసీఎల్ఏలో రికార్డులు ఉంటాయి కదా? చివరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ఏదో జరిగిపోతున్నట్లు హైడ్రామా సృష్టించారు.పెద్దిరెడ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు మిథున్‌ను మూడు సార్లు ఎంపీగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాదరణ ఉన్న కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు నిందలు మోపుతున్నారు. మిథున్ కారును ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును కాల్చి వేసి రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అంటే.. కాలేజీలో చదువుకునే సమయంలో ఆయన కొట్టాడట! ఆ కక్షతో పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రిగా పనిచేసినా ఆ శాఖపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తారు. మదనపల్లెలో అగ్నిప్రమాదం జరిగితే డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్లో పంపిన చంద్రబాబు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. జూలై 7న బాలిక అదృశ్యమైతే 16న ఎస్పీ ప్రెస్‌మీట్ పెడతారు. దళితుడిని లాకప్ డెత్ చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే ఎస్పీని బదిలీ చేశారు. -
జీవనాడిని గాడిలో పెట్టిన మాపై నిందలా?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తన తప్పిదాలను కప్పిపుచ్చుతూ ఎదుటి వారిని వేలెత్తి చూపడం ఎంత వరకు సమంజసమని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. జీవనాడి పనులను గాడిలో పెట్టిన తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తి పడి తామే నిర్మిస్తామంటూ చంద్రబాబు దక్కించుకుని చారిత్రక తప్పిదం చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే కట్టకుండానే.. కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టి చంద్రబాబు మరో చారిత్రక తప్పిదం చేశారని ఎత్తిచూపారు. బాబు నిర్వాకాన్ని తాము అధికారంలోకి వచ్చాక ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టి.. శరవేగంగా సరిచేస్తూ ముందుకెళ్లామని వివరించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కాసుల కోసం కక్కుర్తితోనే ఇలా..విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సింది కేంద్రమే. కానీ.. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నాడు. అదీ 2013–14లో ఖరారు చేసిన రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేస్తామని అంగీకరించాడు. కానీ.. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33 వేల కోట్ల వ్యయం అవుతుంది. అలాంటిది కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు ఒప్పుకోవడంలో ఆంతర్యమేమిటి? ఇంత దారుణంగా చేయడమే కాకుండా కాంక్రీట్ పనుల్లో లాభాలు రావని, పెద్దగా కమీషన్లు వచ్చే మట్టి పనులు ముందుగా ప్రారంభించారు. ఇందులోభాగంగా కాఫర్ డ్యామ్ పనులను ఈనాడు రామోజీ వియ్యంకుడు నవయుగకు అప్పగించారు. మట్టి పనులు యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి అప్పగించారు. ఇవన్నీ వాస్తవాలు కావా? నేను సరైన ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నా.. చంద్రబాబూ.. సమాధానం చెప్పండి.ప్రపంచంలో ఎవరైనా ఇలా కడతారా?ప్రపంచంలో ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలంటే.. ముందుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మించాలి. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టి.. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లిస్తూ ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా.. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించడానికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మిస్తారు. కాఫర్ డ్యామ్‌ల పనులు స్పిల్ వే పనులు పూర్తయిన తర్వాతే మొదలుపెట్టాలి. కానీ, స్పిల్ వే పునాది స్థాయిలోనే వదిలేసి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చంద్రబాబు చేపట్టారు. స్పిల్ వే పూర్తి కాకపోవడంతో వరద ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాక.. రెండు కాఫర్ డ్యామ్‌లకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. దాంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల మధ్య కుంచించుకుపోయి ప్రవహించడంతో వరద ఉధృతి పెరిగి ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో నిర్మించిన పునాది డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రదాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల నుంచి 22 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. బుద్ది ఉన్న వారెవరైనా ఇలాంటి పనులు చేస్తారా? ఏదైనా ప్రాజెక్టును ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి. చంద్రబాబు చేసిన తప్పులన్నింటీనీ మేం అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టాం. ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్ టుపనులుమేం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టాం. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి కేంద్రానికి రూ.865 కోట్లు ఆదా చేశాం. కాంట్రాక్టర్‌ను మార్చి స్పిల్ వే పనులు, ఆ తర్వాత అప్రోచ్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశాం. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాం. గ్యాప్–3లోకాంక్రీట్ డ్యామ్ నిర్మించాం. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన సొరంగాలను పూర్తి చేశాం. ఇలా ప్రణాళికా బద్ధంగా అన్నీ పూర్తి చేసాం కాబట్టే 2021 జూన్ 11వ తేదీన వరద నీటిని స్పిల్ వే గేట్ల నుంచి 6.1 కి.మీల పొడవునా విజయవంతంగా సముద్రంలోకి మళ్లించగలిగాం. 2022లో గోదావరికి 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా స్పిల్ వే మీదుగా సులభంగా దిగువకు విడుదల చేశాం. కాఫర్ డ్యామ్‌కు ఏమీ కాలేదు. ఇప్పుడు కోతకు గురైన డయా ఫ్రం వాల్ స్థానంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ కట్టాలా? లేకపోతే రిపేర్ చేసి మిగిలిన పనులు చేపట్టాలా అనేది కేంద్రం నిర్ణయం మేరకు జరగాల్సి ఉంది. మూడేళ్లపాటు పోరాటం చేసి, తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించి.. పోలవరానికి నిధుల సమస్య లేకుండా చూశాం. ఇదీ వాస్తవం. చెయ్యాల్సిన పని ఏదీ చేయకుండా.. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందు కు వేరే వాళ్ల మీద వేలెత్తి చూపించడం చంద్రబాబు నైజం. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పింది ఒప్పా? తప్పా? నేను చెప్పింది వాస్తవమా? కాదా?ప్రజలు ఆలోచించాలి.కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం» వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ » టీడీపీ ప్రభుత్వ నరమేధంపై ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించాం» ఇండియా, బీజేపీ కూటముల్లోని పార్టీలను పిలిచాం» సంఘీభావం తెలిపిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఇండియా కూటమి పార్టీలు » తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబుకు సంబంధాలు.. » అందుకే ఢిల్లీలో మా ధర్నాకు సంఘీభావం తెలపని రాహుల్ గాంధీ » మణిపూర్‌లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఉంది కాబట్టే అక్కడి దాడులను ఖండించిన రాహుల్ » ఏపీలో కాంగ్రెస్ అనుకూల చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టే దాడులను రాహుల్ ఖండించలేదు» బాబుకు ఎస్కోబార్ సన్నిహితుడేమో.. అందుకే ఆయన పేరు కలవరిస్తున్నారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న నరమేధంపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రజా పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న మారణ హోమాన్ని.. అరాచక, ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఢిల్లీలో ధర్నా నిర్వహించామన్నారు. ఈ ధర్నాలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న నరమేధానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు.. ఫొటోలు ప్రదర్శించామని చెప్పారు. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు బీజేపీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ధర్నాలకు ఆహ్వానించామని.. టీడీపీ ప్రభుత్వ హత్యాకాండకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలు చూశాక.. దమనకాండను ఖండించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి రావాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశామన్నారు.తమ విజ్ఞప్తిని మన్నించి.. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఏఐడీఎంకే, శివసేన(ఉద్ధవ్ థాక్రే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆప్, వీసీకే సహా పలు పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు తమతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమంటూ ఆ పార్టీలు తమకు సంఘీభావం తెలిపాయన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ను ధర్నాకు ఆహ్వానించామని.. కానీ రాహుల్ గాంధీ ధర్నాకు సంఘీభావం తెలపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని.. అందువల్లే ఢిల్లీలో తాము నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ హాజరు కాలేదని స్పష్టం చేశారు. మణిపూర్‌లో హింస జరుగుతోందని.. అక్కడ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉంది కాబట్టే.. దాన్ని రాహుల్ గాంధీ ఖండించారని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనుకూల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే.. ఇక్కడ సాగుతోన్న నరమేధాన్ని రాహుల్ గాంధీ ఖండించడం లేదని స్పష్టం చేశారు. కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్.. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే.. ఆయన చరిత్రను వల్లె వేశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎస్కోబార్ సన్నిహితుడు కావడం వల్లే చంద్రబాబు ఆయన పేరును కలవరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా సాగుతోన్న డ్రగ్స్ దందాను బట్టి చూస్తే ఎస్కోబార్ చంద్రబాబుకు సన్నిహితుడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. -
ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు గురువారం రాత్రి, శుక్రవారం కూడా యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రానికి పెయింట్ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్సీపీ జెండాపోల్‌ను ధ్వంసం చేశారు. » పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్ రవీంద్రనాయక్ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్సార్సీపీ మండల జేసీఎస్ కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమయంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నేతలు ఖండించారు. » అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్ వేశారు. అక్కడ పికెట్‌లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్ఐ సాగర్‌తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు. » ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయం బోర్డులను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారుల పేర్లు ఉన్న శిలాఫలకాలను తొలగించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం గమనించిన శివప్రసాద్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని అంజిరెడ్డినగర్లో వైఎస్సార్సీపీ జెండా పోల్‌ను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులి ఆశ్రయించనున్నట్లు వైఎస్సాÆŠ‡సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి చెప్పారు. -
చంపాలనుకుంటే నన్ను చంపేయండి..
-
బతికున్నానని చెప్పేందుకు.. పోలీసులు సైతం షాక్ తిన్న ఘటన!
చిల్లర సొమ్ములకు, చిన్నాచితకా కారణాలకు నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజులివి. అయితే వరుస దాడులతో ఇక్కడో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అయితే అలా ఎందుకు దాడులు చేశావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. రాజస్తాన్‌లోని బాలొత్రా గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో దాడుల కేసులే ఎక్కువ ఉన్నాయి. కేవలం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవటం కోసమే ఆయన ఆ దాడులు చేశానని చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. ‘‘నేను చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది. అది తెలిసి నాకు నోట మాట పడిపోయింది. నా ఆస్తిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అలా దొంగ సర్టిఫికెట్ సృష్టించారు. అందుకే నేను బతికి ఉన్నానని సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇలా అయినా అందరికీ తెలుస్తుంది కదా’’ అని భిల్ అంటున్నారు.Villains are not born they are made pic.twitter.com/uouwZuug9y— narsa. (@rathor7_) July 24, 2024ఈ ఒక్క ఉదంతమే కాదు.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కుతున్న కేసుల సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒక కారణమైతే, అవినీతి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్ల జారీ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కేసులు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవస్థలు సక్రమంగా పని చేయడం, అధికారుల అవినీతి కట్టడి జరిగినప్పుడే రాజస్థాన్ తరహా ఘటనలు తగ్గుతాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘50 రోజుల్లో 36 హత్యలు, నలుగురిపై అత్యాచారాలు.. ఆపై హత్యలు, 16 అత్యాచారాలు, వెయ్యికి పైగా దాడులు, వందల్లో విధ్వంసాలు’ ..ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాన్ని దేశ ప్రజలకు, జాతీయ మీడియాకు తెలిపేందుకు జంతర్ మంతర్ వద్ద కళ్లకు కట్టినట్లుగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తొలుత మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఒక్కో ఫొటోను వీక్షిస్తున్న సందర్భంలో ఆ ఘటనలను గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ మీడియాకు ఒక్కో సంఘటన గురించి వివరిస్తూ వేదికపైకి వచ్చారు. కంట తడి పెట్టించిన ఫొటోలుజూలై 17న పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై టీడీపీ గూండా జిలానీ నరికి చంపుతున్న దృశ్యాలతో ఫొటో ఎగ్జిబిషన్ మొదలైంది. నడిరోడ్డుపై వేటాడి మరీ నరుకుతున్న చిత్రాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి దృశ్యాలు.. అదే సమయంలో రెడ్డప్పతో పాటు ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి ఉన్న ఆ ఇంటిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వుతున్న చిత్రాలను కళ్లకు కట్టేట్టు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి రాజ్‌కుమార్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి, మంత్రి లోకేశ్ బ్యానర్‌కు మొక్కిస్తూ, బలవంతంగా క్షమాపణలు చెప్పించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నేతలు ఇద్దరు మహిళల బట్టలను తొలగిస్తూ అరాచకానికి పాల్పడుతున్న ఫొటోలను అక్కడ ప్రదర్శించారు. ఈ ఘటన స్వయాన హోం మంత్రి నియోజకవర్గంలో జరిగిందని వివరించారు. గుంటూరు జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యాల యాన్ని ధ్వంసం చేస్తున్న, చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతలు బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ధ్వంసం చేస్తున్న, ఇదే ప్రాంతంలోని వాటర్ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ నాయకుడు కాళిదాస వెంకట సత్యనారాయ ణను కత్తితో టీడీపీ గూండాలు పొడిచిన దృశ్యాలు, కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్సీసీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై బ్యాట్లతో దాడి చేసిన ఫొటోలను అమర్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తకోటలో చాకలి సూర్యనారా యణను హత్య చేస్తున్న దృశ్యాలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ కార్య కర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరిపిన దాడుల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్రంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు, ఆస్తుల విధ్వంసం వంటి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు ఉత్తరాది ప్రజలు క్యూకట్టారు.సోషల్ మీడియాలో వైరల్ వేదికకు రెండు వైపులా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌పై జాతీయ మీడియా దృష్టి సారించింది. రెండు వైపులా ప్రతి ఒక్క ఫొటోను తమ తమ కెమెరాల్లో బంధించారు. జర్నలిస్టులు ఆ ఫొటోలను విశ్లేషిస్తూ లైవ్ రిపోర్టింగ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫొటో ఎగ్జిబిషన్‌పై జాతీయ మీడియాలో భిన్నమైన కథనాలు ప్రసారమయ్యాయి. దేశ ప్రజలంతా ఏపీలో జరుగుతోన్న దమనకాండపై చర్చించుకు నేలా జాతీయ మీడియా ఫోకస్ చేయడం విశేషం. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ధర్నా, ఫొటో ఎగ్జిబిషన్Mý ు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ ప్రియాంక చతుర్వేది, శివసేన (ఉద్ధవ్) ఎంపీలు అరవింద్ సావంత్, సంజయ్ రౌత్, ఐయూఎంఎల్ ఎంపీ అబ్దుల్ వాహబ్, హ్యారిస్ బీరన్, ఏఐఏడీఎంకే ఎంపీ నటరాజన్ చంద్రశేఖరన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, టీఎంసీ ఎంపీ నదీముల్ హక్, వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్, ఆప్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్‌లు విచ్చేసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఈ నేతల వెంట వచ్చిన వందలాది మంది నేతలు, కార్యకర్తలు దమనకాండపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్ణంగా తిలకించారు.వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం విశేషం. దీంతో ఏపీలో ఏం జరుగుతోందని ఉత్తరాది ప్రజల్లో చర్చ మొదలైంది. కొన్ని ఫొటోల గురించి అక్కడున్న వైఎస్సార్సీపీ నేతలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్‌లో ఎక్కడా జరగకుండా వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఆయా పార్టీల నేతలు, ఉత్తరాది ప్రజలు వ్యాఖ్యానించారు. -
రాజధానిలో రణభేరి.. సూపర్ సక్సెస్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల తర్వాత జరుగున్న దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యాచారాలు.. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దాడి మాత్రమే కాదని, అవి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికీ విఘాతం కలుగుతున్న నేపథ్యంలో యావత్ దేశ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. » రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోంది. అంతులేని దారుణాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, వైఎస్సార్సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తోంది. » రాష్ట్రంలో ఇప్పుడు అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం కాకుండా, లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వేమీ జరగలేదు. విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. » ఇన్ని జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే వారి మానవత్వాన్ని సవాలు చేయడమే అని నెల్సన్ మండేలా చెప్పినట్లు.. రాష్ట్రంలో దారుణ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవండి. మీ సంఘీభావం ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సాగిస్తున్న హింస, అన్యాయం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు అనేక పార్టీలు, పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు. సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, శివసేన, ఏఐటీసీ, వీసీకే, ఐయూఎంఎల్, ఎంపీలు అఖిలేష్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీవీ అబ్దుల్ వాహేబ్, ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్, తంబిదురై, ఎండీ నదిముల్ హక్వీ, అరవింద్ సావంత్, తిరుమవలన్లు అందించిన మద్దతు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్తు దేశానికి.. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది. – వైఎస్ జగన్ I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2024ధర్నా సైడ్‌లైట్స్ » వైఎస్సార్సీపీ శ్రేణుల జై జగన్ నినాదాలతో హస్తిన మార్మోగింది. జంతర్ మంతర్ రూట్లో వైఎస్ జగన్ వస్తున్న కారు కనిపించిన వెంటనే ప్రారంభమైన ‘జై జగన్’ నినాదాలు మీడియాతో మాట్లాడుతున్నంత సేపూ కొనసాగాయి. జగన్ కారు దిగి మీడియా పాయింట్ వద్దకు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తల తోపులాట మధ్య దాదాపు 15 నిమిషాల సమయం పట్టింది. » ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న వైఎస్ జగన్‌ను కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టారు. ‘జగనన్నా హౌఆర్యూ, అన్నా నా వైపు ఒకసారి చూడన్నా, జగనన్నా నీకు పెద్ద ఫ్యాన్‌ని..’ అంటూ కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి కరచాలనం కోసం ఎగబడ్డారు. » వైఎస్ జగన్ సభా వేదికపైకి రాగానే ఫొటో ఎగ్జిబిషన్ వద్దకు ఏర్పాటు చేసిన దారి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నేతలు ఆందోళనకు గురయ్యారు. అది గమనించిన వైఎస్ జగన్.. మైక్ తీసుకుని ‘అన్నా.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు మీరంతా దారి ఇవ్వాలి. మనం ఇక్కడకు వచ్చింది ఏపీలో జరుగుతోన్న దమనకాండను దేశ ప్రజలకు, నేతలకు చూపించేందుకు. అక్కడ దారిలేకపోతే ఇబ్బంది అవుతుంది కదా.. సహకరించాలి.. ప్లీజ్’ అని చెప్పగానే కార్యకర్తలు క్షణాల్లో అక్కడి నుంచి వేదిక వద్ద ఏర్పాటు చేసిన కుర్చీల్లోకి వచ్చి కూర్చున్నారు. సంబంధిత వార్త: ఏపీ నరమేధంపై జాతీయ పార్టీల కన్నెర్ర » ‘మీ వైఎస్సార్సీపీ కార్యకర్తలకంతా నా సెల్యూట్’ అంటూ అఖిలేశ్ యాదవ్ జగన్‌తో అన్నారు. అఖిలేశ్ నోటి వెంట వచ్చిన ఆ మాటతో జై జగన్, జై అఖిలేష్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. » ‘రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ప్రధాని అవుతారు’ అంటూ అబ్థుల్ వాహెబ్ తన ప్రసంగంలో అన్నారు. ఆ ఒక్క మాటకు ఐదు నిమిషాల పాటు కార్యకర్తల నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. ఎప్పుడు నినాదాలు ఆపుతారా? అంటూ వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.» వైఎస్ జగన్‌ను కలిసేందుకు, ఫొటో దిగేందుకు వేదికపైకి వందలాది మంది ఎక్కారు. ఒక్క సెల్ఫీ అన్నా అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇది గమనించిన వైఎస్ జగన్.. ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ఇబ్బంది కలగకూడదంటూ అంతకంటే ఎక్కువ రిక్వెస్ట్‌తో వాళ్లు స్టేజ్ కిందకు వెళ్లేలా చూశారు. » ‘ఏం విక్టర్ బాగున్నావా’ అంటూ మాజీ ఎంఎంసీ ఛైర్మన్(గుడివాడ) మట్టా జాన్ విక్టర్‌ను వైఎస్ జగన్ పలకరించారు. అంతమందిలో పేరుపెట్టి మరీ పిలవడంతో జగనన్నకు కార్యకర్తలంటే ఎంత ప్రేమ, ఆప్యాయత అంటూ అక్కడున్న వారంతా సంతోషంతో ఉబ్బిపోయారు. విక్టర్ పది నిమిషాల పాటు ఆశ్చర్యంతో ఆ సంతోషం నుంచి తేరుకోలేదు. » ‘అప్పుడెప్పుడో చూశాం జగన్‌ని. మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చారా? ఏక్ బార్ దేక్నాహే..’ అంటూ ఉత్తరాది ప్రజలు క్యూ కట్టారు. » మహిళా కార్యకర్తలు వైఎస్ జగన్‌ను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ కనిపించారు. :::సాక్షి, న్యూఢిల్లీ -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
రెడ్‌బుక్ పేరుతో ‘ఎల్లో’ అరాచకం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అరాచకాలపై ఎక్స్ (ట్విటర్) వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం?’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.Sri @naralokesh, టీడీపీ వాళ్ళు నడిరోడ్డు మీద పట్టపగలు వైసీపీ వాళ్ళను హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా వైసీపీ వాళ్ళే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్ బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? 1/2— Vijayasai Reddy V (@VSReddy_MP) July 23, 2024 ‘‘అంతు చూస్తా, పాదాలతో తొక్కేస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము.. నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదు, హోం మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది.. ప్రజలే కాదు.. పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.అంతు చూస్తా, పాదాలతో తొక్కెస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాము, నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతాదని అనుకోలేదు, హోమ్ మంత్రి తుపాకి పట్టుకోవాలంటోంది ... ప్రజలే కాదు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది టీడీపీ హత్యారాజకీయాలతో. 2/2— Vijayasai Reddy V (@VSReddy_MP) July 23, 2024 -
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు వి.విజయసాయిరెడ్డి, పి.మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లో అదుపు తప్పిన శాంతి భద్రతలు, అధికార పార్టీ దాడులు, విభజన హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీలకే రక్షణ లేని దుస్థితి..ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ సభ్యులకు సైతం భద్రత లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాదాపు 500 మందితో వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. దాడులకు బరి తెగించిన టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్ సీపీకి చెందిన బాధితులపై నే కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సాగించేందుకు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్హత లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 45 రోజుల టీడీపీ పాలనలో 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరిగాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వేలాదిగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ గూండాలు వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలించేది? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 300 హత్యాయత్నాలు జరిగాయంటే ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చన్నారు. మౌనపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే బుధవారం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఫోటో ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, బడ్జెట్లో ఎక్కువ వాటా, విభజన హామీల్లో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పెట్రో కెమికల్, రైల్వే జోన్, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై డిమాండ్ చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరగా మరో కీలక భాగస్వామి టీడీపీ మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. మాపై దాడి చేసి.. మాపైనే కేసులా?రెండుసార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైనా టీడీపీ గూండాలు అడ్డుకుని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. గృహ నిర్భంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి వాహనాలను దగ్ధం చేస్తే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వినుకొండలో రషీద్‌ది రాజకీయ హత్య అని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. -
ఏపీలో టీడీపీ అరాచకాలు.. రాష్ట్రపతి, ప్రధానికి వివరిస్తాం
-
Israel-Hamas war: మృత్యుంజయుడు!
దెయిర్ అల్ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భుతాలకూ వేదికగా మారుతోంది. సెంట్రల్ గాజాలోని నజరేత్ సమీపంలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ భారీగా దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓలా అద్నాన్ హర్బ్ అల్కుర్ద్ అనే 9 నెలల నిండు గర్భిణి కుటుంబమూ ఉంది. ఆ ఇంట్లో ఆరుగురు దాడికి బలవగా ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో హుటాహుటిన అల్ అవ్దా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయతి్నంచినా గాయాల తీవ్రతకు తాళలేక అద్నాన్ కన్నుమూసింది. కానీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉన్నట్టు వైద్యులకు అనుమానం వచి్చంది. అల్ట్రా సౌండ్ చేసి చూడగా చిన్నారి గుండె కొట్టుకుంటున్నట్టు తేలింది. దాంతో హుటాహుటిన సిజేరియన్ చేశారు. పండంటి మగ బిడ్డను విజయవంతంగా కాపాడారు. మృత్యుంజయునిగా నిలిచిన అతనికి మలేక్ యాసిన్ అని పేరు పెట్టినట్టు సర్జన్ అక్రం హుసేన్ తెలిపారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ అందించారు. పరిస్థితి కాస్త మెరుగు పడగానే ఇంక్యుబేటర్‌లో ఉంచి హుటాహుటిన దెయిర్ అల్ బలాలోని అల్ అక్సా ఆస్పత్రికి తరలించారు. -
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది.. రాష్ట్రపతి పాలన విధించాలి
గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం అవసరమా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏ సామాన్యుడిని కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తం అవుతోంది. టీడీపీ నాయకులు ఎవరినైనా కొట్టొచ్చు.. ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయొచ్చు.. హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడొచ్చనే రీతిలో పాలన నడుస్తోంది. అరాచకాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసి అన్ని ఆధారాలను నివేదిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కచ్చితంగా తమ పార్టీ నిరసన గళాన్ని వినిపిస్తుందన్నారు. 24వ తేదీన (బుధవారం) తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు యావత్తు దేశానికి తెలిసేలా ఢిల్లీలో ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ కోరామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఉభయ సభల వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆటవిక పాలనపై ప్రశ్నిస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేయకుండా దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల ప్రేక్షకపాత్ర..రాష్ట్రంలో దారుణమైన ఆటవిక చర్యలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చివరికి టీడీపీ నాయకుల దాడుల్లో బాధితులైన వ్యక్తులు పోలీసుల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటుంటే తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి దాపురించింది. ఇలాంటి నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతుండటం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ దారుణ హత్య పెద్ద ఉదాహరణ. గతంలో పల్నాడు జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి రవిశంకర్ ఎస్పీగా ఉంటే తెలుగుదేశం నాయకులు తమ పలుకుబడితో ఆయన్ను తప్పించేశారు. అనంతరం వారికి అనుకూలంగా పని చేసే బిందుమాధవ్‌ను ఎస్పీగా తెచ్చుకుని అరాచక పర్వానికి తెరలేపారు. బిందు మాధవ్ ఎన్నికల సమయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఎన్నికల కమిషన్ స్వయంగా సస్పెండ్ చేసింది. తర్వాత మరో మంచి అధికారి మలికా గార్గ్‌ను ఈసీ నియమిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను సైతం పంపించేశారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు సహాయ సహకారాలు అందించరనే కారణంతో మలికా గార్గ్‌ను తప్పించారు. ఇప్పుడు టీడీపీకే మద్దతు పలికే శ్రీనివాస్ అనే వ్యక్తికి పల్నాడు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగానే కత్తులతో నరికి రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించేందుకే అమాయకుడు, సాధారణ ఉద్యోగి అయిన రషీద్‌ను క్రూరంగా హత్య చేయడం దుర్మార్గం. మీడియా ముసుగులో దిగజారుడుతనం రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ టీడీపీకే కొమ్ముకాస్తోంది. వీరితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు మీడియా ముసుగులో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. రషీద్ హత్య ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దు్రష్పచారానికి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. జిలానీకి చెందిన మోటార్ బైక్‌కు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులు నిప్పుపెట్టడంతోనే ఇప్పుడు ఈ హత్యకు పాల్పడినట్టు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు.వాస్తవానికి మోటార్ బైక్ జిలానీది కాదు. వైఎస్సార్సీపీకి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిది. ఆ బైక్‌ను టీడీపీకి చెందిన మాజీ చైర్మన్ షామీమ్, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆయూబ్ ఖాన్, మరికొంత మంది టీడీపీ నాయకులు తగలబెట్టి, ఆసిఫ్‌ను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 17నే పోలీసులు కేసు నమోదు చేశారు.10/2024తో క్రైమ్ నంబర్ కూడా నమోదైంది. అయితే ఇదంతా జరగలేదన్నట్టు ఎల్లో మీడియా సృష్టించి, పోలీసులు కేసు కూడా పెట్టలేదని చెబుతోంది. వాస్తవాలను వక్రీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ ఘటన జరిగిన గంటల్లోనే బయటకు వచ్చి వ్యక్తిగత కక్షలతో జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతున్నారు.ఈ సంబంధాలేంటి?రషీద్ హత్యపై పోలీసులు కేసు పెట్టామని అంటున్నారు. ఈ కేసు జిలాని అనే వ్యక్తి మీద మాత్రమే పెట్టారు. జిలానీకి.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో ఫొటోలు దిగాడు. ఆయన భార్యకు కేక్‌లు తినిపించాడు. ఆ పార్టీ నాయకులు షమీమ్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో వారందరి పేర్లు ఎందుకు ఎఫ్ఐఆర్లో లేవు? ఇదేంటి మరి? (ఫొటో చూపుతూ) ఇందులో జిలానీ స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తున్నాడు. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వారు కేక్ కట్ చేయడం.. ఆ కేక్‌ను ఈ జిలానీ స్వయంగా ఎమ్మెల్యే భార్యకు తినిపించడం కళ్లెదుటే కనిపిస్తోంది. అంటే వీళ్ల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? (ఎమ్మెల్యేతో, ఆయూబ్‌ఖాన్, షమీమ్ఖాన్తో జిలానీ దిగిన ఫొటోలు చూపారు) మరి వీళ్లెవరూ కేసులో ఎందుకు లేరు? వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? రషీద్‌ను ఫ్యాక్షన్ మూలాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం దారుణం. ఆ కుటుంబం ఏం పాపం చేసిందని ఒక మనిíÙని చంపారు? అంతటితో ఆగకుండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తులకు సానుభూతి తెలపకుండా తప్పుడు ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వీడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వవు అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. ఎంపీలను తిరగనివ్వట్లేదు ఎంపీ మిథున్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పుంగనూరులో తిరగకూడదా? మా మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళితే.. ఆ ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి, రెడ్డెప్ప కారుకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. ఇంతకన్నా శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబే పట్టించుకోవద్దని చెప్పడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ రోజు టీడీపీ వాళ్లను కొట్టండి, చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏ అక్కచెల్లెమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఏదైనా ఆపద వస్తే మొబైల్ ఫోన్లో ‘దిశ’ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే రక్షించే వ్యవస్థను తెచ్చాం. -
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
టీడీపీ దాడులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
-
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్‌ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
వినుకొండ(నూజెండ్ల): రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే టీడీపీ గూండాలు చెలరేగిపోయి..రాష్ట్రమంతటా రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు క్షీణించి.. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండా చేతిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు గురువారం నివాళులర్పించారు. రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడు టీడీపీకి చెందిన వాడైనప్పటికీ సోషల్ మీడియాలో తమ పార్టీవాడు కాదంటూ టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇతర టీడీపీ నాయకులతో నిందితుడు సన్నిహితంగా దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల అండతోనే రషీద్ హత్య: మర్రి రాజశేఖర్వినుకొండ నడిబొడ్డున వందలాదిమంది చూస్తూండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండా జిలానీ అత్యంత కిరాతకంగా కత్తితో నరికాడంటే రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేరాలన్నింటికీ చంద్రబాబే బాధ్యత వహించాలి. టీడీపీ ఎమ్మెల్యేల చెప్పినట్లుగా జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే పల్నాడులో హత్యలు మొదలయ్యాయి. టీడీపీ నాయకుల అండదండలతోనే ఈ హత్య జరిగింది. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించి బాధ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. హత్యా రాజకీయాలు మానుకోవాలి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికూటమి పార్టీలు గెలిచినప్పటి నుంచి కేవలం నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. పల్నాడు ప్రాంతంలో 1,500కు పైగా కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. హత్యారాజకీయాలను వెంటనే మానుకోవాలి. ఇప్పటికైనా హామీల అమలు మొదలుపెట్టి..ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి.3 రేప్‌లు, 30 హత్యలుగా పాలన: కాసు మహేశ్రెడ్డిఏపీలో టీడీపీ ప్రభుత్వ పాలన 3 రేప్‌లు, 30 హత్యలుగా కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో మొహర్రం రోజున రషీద్ అనే యువకుడిని టీడీపీ గూండా హత్య చేశాడంటే..టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకూ అర్థమవుతోంది. పట్టణంలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా రషీద్‌ను అత్యంత పాశవికంగా నరికి చంపడం దారుణం. కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడవేసి..రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాం. హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్భలంతోనే జిలానీ అనే టీడీపీ గూండా నడిరోడ్డుపై వినుకొండలో అత్యంత దారుణంగా రషీద్‌ను హత్య చేశాడు. మృతుని కుటుంబానికి అండగా ఉంటాం.15 నుంచి 20 మంది యువకులు ముందుగానే రషీద్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. కేవలం ఒక యువకుడే వెంబడించి రషీద్‌ను రాక్షసత్వంగా చంపేశాడు. పోలీస్ శాఖ ఈ హత్యకు బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి పార్టీ పరంగా ఆర్థికంగా భరోసా అందిస్తాం. -
అడ్డూ అదుపు లేకుండా దాడులు
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకాలకు మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి కేంద్ర బిందువుగా మారింది.పెదవడ్లపూడికి చెందిన పాలేటి రాజ్‌కుమార్‌ను లోకేశ్ అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. మోకాళ్లపై కూర్చుని లోకేశ్ చిత్రపటానికి దండం పెడుతూ క్షమాపణలు చెప్పకపోతేహతమారుస్తామని హెచ్చరించారు.ప్రాణభయంతో రాజ్‌కుమార్ వారు చెప్పినట్టు చేశారు. దీన్ని టీడీపీ నేతలు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. లోకేశ్ నియోజకవర్గాన్ని ఆయన సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారు. చిత్తూరులో రాజు అనే యువకుడిని కిడ్నాప్ చేసి గుర్తుతెలియని ప్రాంతానికితీసుకువెళ్లి కర్రలు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు సైతం ఇటీవల ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. విజయవాడలో టీడీపీ గూండాలు ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి మరీ మద్దెల పవన్ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేశారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్చూరులోని ఎస్సీ కాలనీపై 50మందికి పైగా టీడీపీ గుండాలు దాడి చేశారు. ఇలా 40 రోజుల్లో 1,050 వరకు దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. ఇళ్లు నేలమట్టం.. కార్యాలయాలు ధ్వంసం 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 40మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 జిల్లాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అనంతరపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో టీడీపీ గుండాల దాడులతో స్వైర విహారం చేస్తున్నారు. ప్రధానంగా సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రతినిధులను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను దహనం చేస్తున్నారు. ఇలా 560 వరకు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. వీటిలో ఒక్క చిత్తూరు జిల్లాలో 100 ఘటనలు జరిగాయి.భయంతో బతకలేక.. వలసబాటఊరు వదిలి వెళ్లినకుటుంబాలు 2,700టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. విగ్రహాలపైనా అక్కసు 468 వైఎస్సార్ విగ్రహాలుధ్వంసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపైనా టీడీపీ మూకలు తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తమకు జరిగిన మేలును తలచుకుంటూ అన్ని అనుమతులతో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసుకున్న విగ్రహాలను సైతం అడ్డగోలుగా కూల్చివేస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్నారు. వైఎస్సార్ విగ్రహాల చేతులు, కాళ్లు, తల, ముక్కు.. ఇలా ఒక్కో భాగాన్ని ముక్కలుముక్కలుగా చేసి తాలిబన్ల తరహాలో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 468 విగ్రహాల వరకు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. జగన్ జాడ ఉండకూడదని..2,260 శిలాఫలకాలు ధ్వంసందేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. వాటిలో 1,35,819 మంది ఉద్యోగులను, 2.66లక్షల మంది వలంటీర్లను నియమించారు. అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు తమ ఇంటి వద్దకే చేర్చారు. ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలను చేరువచేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు ద్వారా పాడుబడిన పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాలన గురుతులను చేరిపివేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి భవనాల వద్ద ఉన్న శిలాఫలకాలు, నవరత్నాలు బోర్డులను ఘోరంగా ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి శిలాఫలకాలను సైతం కూలి్చస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,260 వరకు శిలాఫలకాలను నేలమట్టం చేశారు.ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం 490 ప్రభుత్వఆస్తుల ధ్వంసం ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. ప్రతి జిల్లాలో జూన్ 4వ తేదీ తర్వాత నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పచ్చముఠాలు దాడులు చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తద్వారా ఇక తమకు గ్రామాల్లో ఎదురులేదని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు కేవలం 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 52 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పత్రికా స్వేచ్ఛపైనా దాడి టీడీపీ అరాచకాలతో రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికల హామీని టీడీపీ తుంగలో తొక్కి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రచురించిన డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. విశాఖపట్నంలోని డెక్కన్‌క్రానికల్ కార్యాలయం బోర్డులు తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఇక నుంచి ఎవరైనా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇలానే ఉంటుందనే తరహాలో హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని జాతీయస్థాయిలో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.ఠాణా..తందానా! బీఆర్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ... లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికి దాసోహమైంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాలకు గొడుగుపడుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అరాచకానికి తెరతీస్తే... నియోజకవర్గ స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ దౌర్జన్యాలకు అడ్డువస్తే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిగా అదుపు తప్పిన శాంతిభద్రతలు మున్ముందు మరింతగా దిగజారుతాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
నేడు వినుకొండకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ రాను న్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు.టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు..రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూ టమి సర్కారు ఘోర వైఫల్యం, టీడీపీ నేతల అరాచక పర్వంపై వైఎస్ జగన్ గురువారం ‘ఎక్స్’ వేదిక గా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగు తోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘వైఎస్సార్ సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పా ల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్న వినుకొండ లో నరమేథం ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గు చేటు’ అని పేర్కొ న్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశా లతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నే రగాళ్లు, హంతకులు చెలరేగి పోతున్నారు’ అని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధా నాలు వీడాలని సీఎం చంద్రబా బును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై న తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీ లతో ప్రత్యేక విచారణ నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. టీడీపీ మూక చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ అరాచకాలకు చంద్రబాబుదే బాధ్యతపుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నరమేధానికి తెగబడి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైందని చెప్పేందుకు ఈ అరాచకాలే నిదర్శనమని, వీటికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
రాక్షస పాలనపై ప్రజా పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో సాగుతోన్న రాక్షస పాల నపై ప్రజాపోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ నడిరోడ్డుపై పాశ వికంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘట న గురించి తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. రషీద్ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.గురు వారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివా సానికి చేరుకున్న వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలిగానీ.. వైఎస్సార్సీపీని అణగదొక్కాలనే కోణంలో దారు ణాలకు పాల్పడటం హేయమన్నారు.కొత్తగా కొలు వుదీరిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ అధికారంలోకి వచ్చిన నెల న్నరలోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్‌ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ట అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజ లందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురు ద్దేశాలతో వెనకుండి ప్రోత్సహిస్తుండటం వల్లే ఇ లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని.. అంద రికీ అండగా నిలుస్తామని జగన్ భరోసా ఇచ్చారు. -
ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫ్యలంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.‘‘ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వినుకొండలో రషీద్‌ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగటం దారుణం. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యధేచ్చగా దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. I strongly condemn the attack on @YSRCParty Lok Sabha MP PV Midhun Reddy garu and former MP Reddeppa garu by those associated with @JaiTDP. This incident comes just 24 hours after the brutal murder of Rashid in Vinukonda by a TDP goon. Since coming to power, the new regime has…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024వైఎస్సార్సీపీ అత్యవసర సమావేశంరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న దాడులు, పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జగన్పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్యకు గురవ్వడం, ఇవాళ చిత్తూరు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరగడం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక.. రేపు వినుకొండకు వెళ్లనున్న జగన్.. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఏపీలో హింస తారాస్థాయికి.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఏపీలో హింస తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కులోన్మాదులు నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి జోక్ గా మారాయి’’ అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ రాజకీయ హింసలో భాగంగా వైఎస్సార్సీపీ యూత్ విభాగం నేత రషీద్ హత్యకు గురయ్యాడు’’ అని ఆయన ట్వీట్ చేశారు.This is the Andhra that is being created. Violence is at its peak, our social fabric is being destroyed. With continuous attacks on YSRCP leaders by #TDP casteist Goons, law and order has become a joke. YSRCP youth wing leader Rasheed was killed due to political violence meted…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2024మరోవైపు వినుకొండ ఘటనపై వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. ‘‘మరీ ఇంత నీచమా? ఇలా చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా?. జిలాని కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నిఇన్ని కావు’’ అంటూ వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘టీడీపీ పెద్దల అండదండలతో ఇప్పుడు రాక్షసుడిలా మారి వైఎస్సార్సీపీకి చెందిన రషీద్ నిండు ప్రాణం అత్యంత కిరాతకంగా తీశాడు. దాంతో ఇప్పుడు జనం ఉమ్మేస్తున్నారని వైఎస్సార్‌సీపీపైకి నెపం నెడుతున్నావంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా?. టీడీపీ పెద్దలతో నిందితుడు జిలాని తిరుగుతున్న ఫోటోలు ఇవిగో.. ఇప్పుడు ఏం చెప్తావ్ చంద్రబాబూ?’’ అంటూ వైఎస్సార్సీపీ నిలదీసింది.మరీ ఇంత నీచమా @JaiTDP? ఇలా చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా?జిలాని కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నిఇన్ని కావు టీడీపీ పెద్దల అండదండలతో ఇప్పుడు రాక్షసుడిలా మారి వైయస్ఆర్సీపీకి చెందిన రషీద్… https://t.co/sRNuDawtfg pic.twitter.com/lRYOvJc70x— YSR Congress Party (@YSRCParty) July 18, 2024 -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్‌నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
అర్థరాత్రి జేసీబీ లతో టీడీపీ గుండాల దాడి..
-
పోదొడ్డిలో బరితెగించిన టీడీపీ శ్రేణులు
డోన్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తదితరులపై శుక్రవారం మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ సమీపంలోని వశిష్ట క్రషర్ మిషన్‌లో పనులు జరగకుండా టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నారాయణ, ఆయన అనుచరులు కూలీలను అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్నారు. క్రషర్ నడవాలంటే స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుమతి తీసుకోవాలని, కప్పం కట్టాలని నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శుక్రవారం మూడోసారి క్రషర్ దగ్గరకు వెళ్లి మూసేయాలని బెదిరించారు. క్రషర్ మిషన్ ఏర్పాటుకు సహకరించిన వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తిని దుర్భాషలాడటమేగాక ఆయన అంతుచూస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి క్రషర్ మిషన్ వద్దకు వెళ్తుండగా గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న టీడీపీ నాయకుడు నారాయణ, అతడి అనుచరులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి, రామరంగడు, శేషు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సందర్భంగా కృష్ణమూర్తి అనుచరులు ప్రతిఘటించడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, నడిపి ఓబులేసు, శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నా వశిష్ట క్రషర్ నిర్వాహకులు, కూలీలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ క్రషర్ నిర్వాహకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు బంధువులనే కారణంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో మండల, గ్రామ టీడీపీ నాయకులు క్రషర్‌పై దాడులకు దిగుతుండటం గమనార్హం. చెలరేగుతున్న తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా కోట్ల ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. ఇటీవల డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదాలో ఒక వర్గానికి చెందిన మాధవయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. అతడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాధవయ్య అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడిచేసి ద్విచక్రవాహనాలు, టీవీలు, నిత్యావసర వస్తువులు ధ్వంసం చేయడమేగాక పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారికి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెపాన్ని వైఎస్సార్సీపీ నాయకులపైకి నెట్టేందుకు ప్రయతి్నంచడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్వారీ నాది కాదు...అయినా టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారుక్వారీ అక్రమమో.. సక్రమమో? తేల్చాల్సింది ప్రభుత్వమేమాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లాలో ప్యాపిలి మండలం పోదొడ్డిలోని కంకర క్వారీ తనది కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి స్థానిక టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ.. క్వారీపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వేటకొడవళ్లతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారని.. వేయింగ్ బ్రిడ్జిని లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల తీరుతో పోదొడ్డి గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో చివరకు గ్రామంలోని మరొక వర్గం టీడీపీ అరాచకాలను ప్రశ్నించడంతో ఘర్షణ తలెత్తిందని చెప్పారు. తనకు సంబంధం లేకపోయినా.. తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్వారీ సక్రమమా? లేదా అక్రమమా? అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే గానీ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు, ఆ పారీ్టకి చెందిన గూండాలు కాదన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్న టీడీపీ గూండాల తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. -
‘పచ్చ’ అరాచకాలు.. ఏపీలో తాలిబన్ల తరహా పాలన
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తాలిబన్ల తరహా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆగడం లేదు. హత్యలు, ఆస్తుల విధ్వంసాలు నిత్యం కొనసాగుతున్నాయి. ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలుపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి మాజీ సీఎం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ ఉన్మాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాష్టవ్యాప్తంగా పచ్చమూకల దాడులుఎన్నికల ఫలితాలు వెలువడి నెలదాటినా రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల అరాచకాలకు అంతులేకుండాపోతోంది. పచ్చమూకల దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ప్రభుత్వ పెద్దలకు, పోలీసులకు పట్టడంలేదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కూడా స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నా ఆయనలో చలనంలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పుంగనూరు, కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలిచ్చారంటూ పోలీసు వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడం ఇక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.పైగా.. పత్రికల వారికి సమాచారం ఇస్తున్నారన్న నెపంతో మళ్లీమళ్లీ దాడులకు తెగబడుతూ వికృతానందం పొందుతున్నారు. అలాగే, ఈ ఘటనలకు ప్రచారం కల్పిస్తున్నారంటూ విలేకరులను సైతం వారి ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి మూకలు చెలరేగిపోతున్నాయి. ఫలితంగా.. ప్రతిరోజూ నలుగురైదుగురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందలేని దుస్థితిలో బాధితులున్నారు. వైఎస్సార్సీపీకి ఓటేశారని పది కుటుంబాలపై పగ.. పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిధిలో నంజంపేట కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటేశారని ఓ పది కుటుంబాలను రెండు వారాలుగా నిర్బంధించి దాడులకు పాల్పడుతూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ అరాచకాలు భరించలేక టీడీపీ కార్యకర్తే ఒకరు మీడియాకు వీడియోలు, ఫొటోలతో సమాచారం ఇస్తుంటే.. అవి కూడా వైఎస్సార్సీపీ వాళ్లే పంపుతున్నారంటూ తిరిగి ఆ పది కుటుంబాల వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.దీంతో.. వీరిలో ఒకటైన సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం అడవిలోకి వెళ్లి తలదాచుకుంది. వీరి ఆచూకీ కోసం మిగిలిన కుటుంబాలను నానా రకాలుగా వేధిస్తున్నారు. టీడీపీ వారికి అనుకూలంగా పేపర్లపై సంతకాలు పెట్టి, కాళ్లు పట్టించుకుని క్షమించమని వేడుకుంటే ఊర్లో బతకటానికి అవకాశమిస్తామని చెబుతున్నట్లు తెలిసింది. బాధితులు గత్యంతరంలేక.. చిత్రహింసలు భరించలేక వారు చెప్పినట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు.. సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం గ్రామంలోకి వస్తే నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయాలని భావించిన టీడీపీ శ్రేణులు వారిపై దుష్ప్రచారానికి తెరతీశారు. ఆ కుటుంబం గ్రామంలో అప్పులుచేసి పరారైందని.. వారిని అప్పజెప్పిన వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తామని దంపతుల ఫొటో పెట్టి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. పాలు కొనుగోళ్లు బంద్.. పొలంలోనే టమాటా పంట.. ఇక వైఎస్సార్సీపీకి ఓట్లేసిన ఆ పది కుటుంబాల పంట దిగుబడులను విక్రయించకుండా కూడా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. దీంతో సుమారు 12 ఎకరాల్లోని టమాటా పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అలాగే, ఆ కుటుంబాల వారి పాలు కూడా గ్రామంలో ఎవ్వరూ కొనుగోలు చేయటానికి వీల్లేదని హుకుం జారీచేసినట్లు తెలిసింది. అదే విధంగా.. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం సింగసముద్రానికి చెందిన అశోక్ వైఎస్సార్సీపీకి ఓటేశాడని అతనిపై తప్పుడు కేసు పెట్టించారు. పోలీసులు అశోక్‌ని రోజూ స్టేషన్‌కి పిలిపించుకుని టీడీపీ నేతల తిట్ల దండకం అనంతరం పొద్దుపోయాక విడిచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్న అశోక్‌తోపాటు అతని కుటుంబంలోని వారందరిపైనా స్థానిక టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. వృద్ధులని కనికరించకుండా ఇళ్లకు తాళాలు..అలాగే, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మిట్టమీద కండ్రిగలో వైఎస్సార్సీపీకి ఓటేశారని 11 కుటుంబాలపైనా టీడీపీ శ్రేణులు కక్షగట్టారు. వారి నివాసాలు అక్రమమంటూ ఇళ్లకు తాళాలువేశారు. లోపల అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులున్నారని కూడా కనికరించలేదు. దీంతో వారు భయంతో కేకలు వేయడంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వారిని రక్షించారు. టీడీపీ నేతలకు స్థానిక వీఆర్వో అండగా నిలిచినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టాలున్నా తమపై కావాలనే కక్ష సాధిస్తున్నారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.సర్పంచ్ సహా అజ్ఞాతంలో మరో 70 కుటుంబాలు..ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు సర్పంచ్ కొండయ్య ఉంటున్న ఈశ్వరయ్య కాలనీలో వైఎస్సార్సీపీకి ఓటేసిన కుటుంబాల ఇళ్లలోకి టీడీపీ నేతలు చొరబడి చిన్నాపెద్దా తేడాలేకుండా బరితెగించి దాడులు చేశారు. గతనెల 11, 12, 28 తేదీల్లో జరిగిన దౌర్జన్యాలు, దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన సర్పంచ్ కొండయ్య కుటుంబంతో పాటు మరో 70 గిరిజన కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి.వీరంతా ఎక్కడున్నారో ఇంతవరకు ఆచూకీ లేదు. ఇంకా అనేకమంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ శ్రేణుల హెచ్చరికలతో అజ్ఞాతంలోనే ఉన్నారు. ఊర్లోకి వస్తే గంజాయి, సారా కేసులుపెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఇలా ప్రతిరోజూ దాడులు జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈశ్వరయ్య కాలనీ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పైగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200కు పైగా దాడులు జరిగితే నమోదైన కేసులు మాత్రం 22 మాత్రమే. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి నెట్వర్క్:ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు నెల రోజులు దాటినా నేటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటేయలేదనే అనుమానంతో ఓటర్లపైన.. వైఎస్సార్సీపీకి ఓటేయించారనే నెపంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన ప్రతాపం చూపిస్తున్నారు. చివరకు మధ్యాహ్న భోజన పథకం వంట మహిళలనూ టీడీపీ నేతలు వదలటం లేదు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాడనే కక్షతో దాడిచిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం గంగమ్మ జాతరలో టీడీపీ నేతలు బుధవారం రాత్రి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అశోక్, అతడి బావమరిది విఘ్నేష్ (సుబ్రహ్మణ్యం)లను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల కథనం ప్రకారం.. సింగసముద్రం గ్రామానికి చెందిన అశోక్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయించాడని అతడిపై కక్ష పెంచుకున్నారు. బుధవారం గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా అశోక్ బావమరిది విఘ్నేష్‌ని టీడీపీ నేతలు కొడుతున్నారన్న సమాచారం తెలియడంతో అశోక్ జాతర వద్దకు వెళ్లాడు. దీంతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఆగ్రహంతో ఊగిపోతూ ‘అశోక్ వచ్చాడు. వీడే మన టార్గెట్’ అంటూ 40 మందితో కలిసి అశోక్‌పై మూకుమ్మడిగా దాడిచేశాడు. గాయపడిన అశోక్ గురువారం ఉదయం రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్, విఘ్నేష్ భయపడి గ్రామం వదిలి కుప్పం వెళ్లిపోయారు. దాడులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.పులివెందులలో మామా అల్లుళ్లపై..వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్, ఆయన మామ కుల్లాయప్పపై టీడీపీ కార్యకర్తలు శ్రీను, సంజీవ్, ఫయాజ్, సుమంత్ బుధవారం రాత్రి దాడి చేశారు. అబ్దుల్‌కు, కుల్లాయప్ప ఇంట్లో ఉండగా టీడీపీ కార్యకర్తలు దాడి జరిపి గాయపరిచారు. క్షతగాత్రులిద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన అబ్దుల్, కుల్లాయప్పను పార్టీ మునిసిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నప్ప పరామర్శించారు. అనపర్తి మండలంలో బీజేపీ, టీడీపీ కలిసి..తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు కూటేశ్వరస్వామి కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్త కర్రి కోటేశ్వరరెడ్డిపై రామవరం, కుతుకులూరు గ్రామాలకు చెందిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి కారణంగా కోటేశ్వరరెడ్డి చెవి కర్ణభేరికి రంధ్రం పడినట్టు గుర్తించారు. దాడితో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటేశ్వరరెడ్డి గతంలో గుండె ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నారని, దాడి సమయంలో ఆందోళనకు గురై అతడు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అన్యాయంగా దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ నాయకుడి వాహనం ధ్వంసంవైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బంగారు నాగేంద్ర కారును బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు బంగారు నాగేంద్ర తన కారును ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ బ్యానర్లను చించివేశారు. ఘటనపై బాధితుడు పెనమలూరు పోలీసులకు నాగేంద్ర బుధవారం ఫిర్యాదు చేశారు. వంట మహిళపైనా టీడీపీ దౌర్జన్యంఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. కుదప గ్రామానికి చెందిన పోతురాజు పద్మావతి 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థుల కోసం వంట చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని మార్చాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాల హెడ్మాస్టర్ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరపగా.. మెజార్టీ సభ్యులు పద్మావతి వంట ఏజెన్సీ నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే.. టీడీపీ నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇష్టం వచ్చిన మనుషుల్ని మేం పెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో. వంట చేయడానికి వీల్లేదు’ అంటూ తనపై దౌర్జన్యం చేశారని పద్మావతి వాపోయారు. ఈ ఘటనపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. రాడ్లు, కర్రలతో దాడిఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి తెగబడ్డారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేతలు దిన్నెపాటి రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు గురువారం రాత్రి మండల కేంద్రానికి రాగా.. టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, చిన్ని కృష్ణ, శివకుమార్ తదితరులు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు టీడీపీ నేతలను ప్రతిఘటించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పంచాయతీపై టీడీపీ ఫ్లెక్సీఅనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం నీలిగుంటలో పంచాయతీ కార్యాలయంపై టీడీపీ నాయకుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై సర్పంచ్ కన్నంరెడ్డి వరహాలబాబు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాజకీయ పరమైన ఫ్లెక్సీని పంచాయతీ కార్యాలయం నుంచి తొలగించాలని కోరారు. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల గ్రామంలో ఇరుపార్టీల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇళ్లలో శుభకార్యానికి హాజరైన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు వినోద్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. అతడిని అడ్డగించి ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారు. ఇంటికి తాళం వేసి మహిళ నిర్బంధంవైఎస్సార్ సీపీకి ఓటేసిందనే అనుమానంతో నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంట్లో ఉండగా.. ఆ ఇంటికి తాళం వేసి నిర్బంధించిన ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మిట్టమీదకండ్రిగలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, మరో 10 మందికి వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. నాగేశ్వరరావు కుటుంబం గృహం నిర్మించుకుని అందులోనే కాపురం ఉంటోంది. ఈ క్రమంలో నాగేశ్వరరావు కుటుంబం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేసిందనే అనుమానంతో ఓ టీడీపీ నాయకుడు కక్షపూరితంగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారుల ద్వారా గురువారం నాగేశ్వరరావు ఇంటికి తాళం వేయించాడు. నడవలేని స్థితిలో ఇంటిలో ఉన్న మునెమ్మ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయంపై తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా.. వీఆర్వో లోకేశ్వరి పొరబాటుగా ఇంటికి తాళం వేయడంతో మందలించినట్టు చెప్పారు. ఇల్లు ధ్వంసం చేసి.. ఇద్దరిపై దాడిపల్నాడు జిల్లా శ్రీరామపురం తండాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌లకు చెందిన గృహాన్ని బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌పై టీడీపీ నేత పాత్లావత్ అంజి, మరో 10 మంది రాడ్లు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన గోవిందు నాయక్, అంజి నాయక్‌లను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.ముస్లింలపై విరుచుకుపడిన టీడీపీ శ్రేణులువక్ఫ్ బోర్డు అధికారి లెక్కలు చూస్తుండగా ముస్లింలపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దాదేపల్లెలో గురువారం చోటుచేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మసీదు మరమ్మతు పనులకు సంబంధించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దీన్ గ్రామానికి చేరుకుని లెక్కలు పరిశీలిస్తుండగా.. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఘటనలో ఎస్.బావాజాన్, ఎస్.సనావుల్లా, పి.షేర్‌ఖాన్, ఎస్.మషాయక్, ఎస్.మహమ్మద్ ఖైఫ్, ఎస్.జహీర్లకు గాయాలయ్యాయి. బావాజాన్ ఎముకలు విరగడంతో అపరస్మారక స్థితికి చేరాడు. సనావుల్లాకు ముఖం, ఛాతిపై బలమైన గాయాలయ్యాఇ. ఈ ఘటనతో దాదేపల్లెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి, ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నంపొలంలో నిద్రిస్తుండగా కత్తులతో దాడి చేసిన టీడీపీ నాయకులుతీవ్ర గాయాలతో అటవీ ప్రాంతంలోకి పారిపోయి ప్రాణం దక్కించుకున్న బాధితుడుపీలేరు ఆస్పత్రిలో చికిత్ససాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద పంచాయతీ ఎగువపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత కిరణ్ గురువారం పొలంలో నిద్రించగా..టీడీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణభయంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసి అన్నమయ్య జిల్లా పీలేరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎగువపల్లెకు చెందిన కిరణ్ వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ ఎగువపల్లెలోని తన టమాటా తోటలో పడుకుని ఉండగా.. టీడీపీ నాయకులు కిరణ్‌పై కత్తులు, కర్రలతో ఒక్కసారిగా దాడి చేశారు. కిరణ్ తలపై కత్తులతో నరికారు. ఛాతీపై కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ ప్రాణ భయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో కొంత తేరుకున్నాక పుంగనూరు నియోజకవర్గ నాయకులకు ఫోన్‌చేసి తన పరిస్థితిని వివరించాడు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు జరగడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. -
నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
ఇజ్రాయెల్ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోగల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ దాడులలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.నాలుగు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కు సమీపంలోని అబాసన్‌లోని అల్-అవ్దా పాఠశాల గేట్ వద్ద ఈ దాడి జరిగింది. గతంలో జరిగిన మూడు దాడులకు తామే బాధ్యులమంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మూడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు ఇతర పౌర సౌకర్యాలను ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. -
ఆగని విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసాలు శనివారం రాత్రి, ఆదివారం కూడా కొనసాగాయి. » విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం బజారు కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమం సందర్భంగా విగ్రహానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో తట్టుకోలేక విగ్రహం చేతిని విరగ్గొట్టడంతోపాటు తల వెనక భాగంలో రాడ్డుతో కొట్టారు. కోనాడ బజార్లో ఉన్న సీసీ కెమెరా వైర్లను కట్‌చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పూసపాటిరేగ ఎస్.ఐ. సన్యాసినాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుంటామని ఎస్.ఐ. చెప్పారు. గ్రామ వైఎస్సార్సీపీ నేతలు దాడిశెట్టి త్రినాథరావు, అమర గురువులు, బొడ్డు ఎల్లాజీ, దారపు లక్ష్మణరెడ్డి, దాడిశెట్టి గోవింద, విజ్జపు కిరణ్, కంబపు రామిరెడ్డి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రశాంతతకు మారుపేరైన కోనాడలో అసాంఘిక శక్తులు బరితెగించి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం జిల్లేళ్ళవారిపేటలో వాటర్ ట్యాంకు శిలాఫలకాన్ని మాయం చేశారు. జిల్లేళ్ళవారిపేట ఎస్సీ గ్రామానికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీ‹Ùకుమార్ జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.54 లక్షలతో 40 వేల లీటర్ల ట్యాంకు, పైపులైన్ పనులు, ఇంటింటా కుళాయిల పనులు పూర్తిచేసి ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇప్పుడు మాయం చేశారు. వారం రోజుల కిందట గ్రామంలో చర్చికి వెళ్లే పంచాయతీ పైపులైన్‌ను టీడీపీ కార్యకర్తలు కట్ చేశారు. » ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో ఇటీవల నిర్మించిన గ్రామ సచివాలయ భవనంపై ఉన్న ఫొటోలను పగులగొట్టారు. ఈ భవనానికి ఘంటా రంగారావు తన తండ్రి పేరిట 12 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారు. దీంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనను జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. » పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామ పంచాయతీ బీసీ కాలనీలో కొవ్వూరి గంగిరెడ్డి స్మారక మందిరం వద్ద 2021లో సీసీ రోడ్డు ప్రారం¿ోత్సవం సందర్భంగా వేసిన శిలాఫలకాన్ని శనివారం రాత్రి కూల్చేశారు. రూ.కోటితో నాలుగు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సచివాలయ భవన విస్తరణ పనులు చేసిన తరువాత 2021 సెప్టెంబరు 5న మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు ప్రారంభించి శిలాఫలకాలు ఆవిష్కరించారని సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి చెప్పారు. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ఇప్పుడు కూల్చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. -
మరోసారి చంద్రబాబును హెచ్చరిస్తున్నా: జగన్
వైఎస్సార్, సాక్షి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకూ టీడీపీకి తిప్పికొడుతుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం పరామర్శించిన జగన్.. ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. చంద్రబాబు రాష్ట్రంలో భయాకన వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయి. అధికారం మారిన రోజున.. ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే పది శాతం ఓట్లు పడ్డాయన్న జగన్.. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతిని ప్రొత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు.వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్ కార్యకర్త దాడి గురించి తెలుసుకున్నారు. నేరుగా కడప ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని అజయ్‌కు ఆయన భరోసా ఇచ్చారు. -
పుంగనూరులో ‘అధికార’ అరాచకం
సాక్షి, టాస్‌్కఫోర్స్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో అధికార మదంతో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచక కాండ ఇది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. నివాసాల్లోకి చొరబడి తరిమి తరిమి కొడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కూల్చివేస్తున్నారు. టీడీపీ శ్రేణుల దాడులతో తీవ్రగాయాలైన అనేక మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఊళ్లొదిలి రహస్య ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో సుబ్రమణ్యంరెడ్డి, ఇంతియాజ్ బాషా, ప్రసాద్, భానుప్రకా‹Ù, రమే‹Ù, మునీశ్వర్, మోహన్‌బాబు, గంగులప్ప నివాసాల్లోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కమ్మపల్లిలో వంద మందికి పైగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యం రెడ్డి ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలికి జొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుబ్రమణ్యంరెడ్డిని ఈడ్చుకొచ్చి కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆయన ఇటుకల బట్టీలోని లక్ష ఇటుకలను దౌర్జన్యంగా ట్రాక్టర్లతో తరలించుకెళ్లారు. బట్టీని ధ్వంసం చేశారు. ఫోటోలు, వీడియోలు తీయకుండా మొబైల్ ఫోన్లు లాక్కుని నేలకేసి కొట్టి నాశనం చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో ప్రాణ భయంతో సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం ఊరొదిలి వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలో గత నెల రోజుల్లో అనేకం జరిగాయి. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. టీడీపీ నేతల దాడుల విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. తాగు నీటి ట్యాంకులూ కూల్చివేత వైఎస్సార్సీపీ హయాంలో నిరి్మంచిన ప్రభుత్వ ఆస్తులను సైతం టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారు. కరువు ప్రాంతాల్లో ఒకటైన పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల తాగు నీటి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు. 20 వేల లీటర్ల సామర్థ్యంతో నియోజకవర్గం మొత్తం రూ.60 కోట్లతో 550 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రజలకు మంచి నీరందించే ఈ ట్యాంకులను కూడా టీడీపీ నేతలు కూల్చివేస్తున్నారు. రొంపిచెర్ల మండలం బోడిపాటివారి పల్లిలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకును రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చివేసి, పనులకు తెచ్చిన ఇనుప కమ్మీలను ఎత్తుకెళ్లిపోయారు. రొంపిచెర్ల క్రాస్ కురప్పల్లి వద్ద రూ. 15 లక్షలతో రెండో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. దీనిని కూడా జేసీబీలతో కూల్చివేశారు. ప్రజాధనంతో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం కూల్చివేయడం టీడీపీ నీచ మనస్తత్వానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార మదం పుంగనూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీరి్ణంచుకోలేకపోతోంది. వారిద్దరూ పుంగనూరులో పర్యటిస్తే అక్కడ టీడీపీకి పుట్టగతులుండవన్న విషయం ఆ పార్టీ నేతలకు అర్ధమైంది. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలనే పుంగనూరులో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులతో ఇద్దరినీ హౌస్ అరెస్టు చేయించారు. దాడుల పరంపర సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికార గూండాయిజం కమ్మపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి నివాసంలోకి జొరబడ్డ టీడీపీ గూండాలు ఆయన్ని చితక్కొట్టారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలను తరలించి, ఆ బట్టీని ధ్వంసం చేశారు. ఫోన్లను నాశనం చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయారు. ఖాకీల కాఠిన్యం ఓ పక్క టీడీపీ గూండాల దాడులకు బెంబేలెత్తుతున్న ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తే వారికి ఊహించని సమాధానం ఎదురవుతోంది. మీరే ఊరొదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోండంటూ పోలీసు అధికారులు కొందరు సమాధానమివ్వడం బాధితులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.పింఛన్లు నిలిపివేత ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మపల్లిలో పొన్నెమ్మ, యశోదమ్మ, శివారెడ్డితో పాటు సోమల మండలం పరిధిలో 75 మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు సరఫరా నిలిపివేయండి కమ్మపల్లిలో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన పది కుటుంబాలకు పాలు కూడా అందకుండా టీడీపీ నేతలు దాషీ్టకం ప్రదర్శిస్తున్నారు. ఈ కుటుంబాలకు పాల సరఫరా నిలిపివేయాలని టీడీపీ నేతలు డెయిరీ యజమానులకు ఫోన్‌చేసి హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోయారు. వారికి పాలు సరఫరా చేస్తే వ్యాను తగులబెట్టేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం. అప్పు తీసుకోకపోయినా చెల్లించాలట పుంగనూరులో దుస్తుల దుకాణం నడుపుతున్న కె. జయంతి వైఎస్సార్సీపీకి ఓటేశారని టీడీపీ శ్రేణులు ఆమెకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా.. పోలీసుల ద్వారా ఆమెకు ఫోన్ చేయించి ‘మీరు రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారంట. వెంటనే చెల్లించకపోతే కేసు నమోదు చేస్తాం’ అని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఆమెను సంప్రదిస్తే తాను ఎవ్వరికీ బకాయిలేనని, ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఊరొదిలి వెళ్లి దాక్కోండి టీడీపీ దాడులతో కమ్మపల్లి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా ఊరొదిలి వెళ్లిపోవాలని చెబుతుండటంతో మరింత భయకంపితులవుతున్నారు. టీడీపీ నేతలు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కలి్పంచాల్సిన పోలీసులే బాధ్యత లేకుండా వ్యవహరించటంపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అండగా నిలుస్తాం.. ధైర్యంగా ఉండండి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టీడీపీ విధ్వంసాలు, అరాచకాలకు బలై ఊరొదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా నిలుస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. త్వరలోనే తిరిగి స్వస్థలాలకు వచ్చి ఇళ్లలో ఉండేలా న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ లీగల్ సెల్ నేతలను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వైఎస్ జగన్‌ను కలిసి వారి ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి వివరించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వీరికి జగన్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న సంఘటనల గురించి కాసు మహే‹Ùరెడ్డి జగన్‌కు వివరించారు. టీడీపీ వరుస దాడులతో పలువురు నేతలు, అభిమానులు పక్క రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు వలస వెళ్లారని చెప్పారు. ఆయా ప్రాంతాలకు వలస వెళ్లిన వారి తరుఫున వచ్చిన ప్రతినిధులను జగన్‌కు పరిచయం చేస్తూ.. పరిస్థితిని వివరించారు. వారందరి కష్టాలు విన్న జగన్.. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులను పిలిపించి అక్కడికక్కడే పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఊరు విడిచి వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వచ్చేలా న్యాయ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా, టీడీపీ దాడులతో ఎంతో మంది ఊళ్లు వదిలారని బీబీసీలో వచ్చిన కథనం గురించి ఈ భేటీలో చర్చకు వచ్చి0ది. -
అమ్మో ఏపీకా?
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకున్న వారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో వెలుగులీనిన విశాఖ నగరం... ఇప్పుడు విలవిల్లాడుతోంది. ఒక్క విశాఖ నగరమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ పరిశ్రమలు రావాలంటేనే మొహం చాటేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలంటే.. అమ్మో.. ఏపీకా.. అంటూ భయపడుతున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్కుబై బై చెబుతున్నాయి. విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఇప్పుడు వెనకడుగు వేసి, చెన్నైకి చెక్కేసింది. ఆరు నెలలుగా విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో కూడా ఆలోచనలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, హింసా వాతావరణంతో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు జంకుతున్నారు. ఒక్కసారిగా కుదుపువిభిన్నమైన ఐటీ పాలసీని మెచ్చి.. గత మూడేళ్లుగా దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా.. దిగ్గజ కంపెనీలన్నీ.. ఏపీలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రశాంత వాతావరణం కాస్తా.. అశాంతి వాతావరణంగా మారడంతో అన్ని సంస్థలూ పునరాలోచనలో పడిపోయాయి. ఏపీలో అడుగు పెట్టాలంటేనే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు భయపడిపోతున్నాయి. ఇందుకు క్యాప్జెమినీనే ఉదాహరణ. అడుగడుగునా దాడులు.. బెదిరింపులు నెల రోజులుగా రాష్ట్రంలో వరుస దాడులు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార దిగ్గజాలను బెంబేలెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వ్యాపార సంస్థలపై కూడా వరుస దాడులు జరిగాయి. రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలను మూయిస్తున్నారు. నిన్నటికి నిన్న మామూళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ‘మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్ని రోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీల లారీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ రైస్ మిల్లును మూయించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముడి సరుకు తీసుకొస్తున్న లారీలను ఆపేశారు. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పగులగొడుతున్నారు. ఊళ్లొదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారాల్లో ఉచిత వాటాలు కోరుతూ.. ఒప్పుకోని వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు. మేం ఫలానా వాళ్ల తాలూకా.. మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. మేం లోకేశ్ తాలూకా.. అంటూ బండ్లు, వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులకు దిగుతుండటం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బండ్ల నంబర్ ప్లేట్లు తీసేసి ఇలా రాసుకుని తిరుగుతూ వ్యాపారులను, ప్రజలను భయపెడుతున్నారు. అందుకే పలు సంస్థలు మరో దారి రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడకు రావాలని నిర్ణయించిన పలు సంస్థలు మరో దారి చూసుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సాహసమే అవుతుందని ఆలోచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయమై.. దేశంలోని ఇతర నగరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో, ఇండోర్, జైపూర్, కొచ్చి, నాగ్‌పూర్, చండీగఢ్ తదితర నగరాలవైపు అడుగులు వేస్తున్నాయి. విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో సంస్థ కూడా.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రంలో పరిస్థితి వారిని కలవరపెడుతోందని సమాచారం. కొన్నాళ్లు వేచి చూసి.. తదుపరి నిర్ణయం తీసుకోవాలని విప్రో ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని ఐటీ అనుబంధ సంస్థలు, బీపీవోలు కూడా విశాఖలో శాఖలు ఏర్పాటు చేయాలని భావించినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని ఐటీ రంగ ప్రముఖుడొకరు తెలిపారు. అధికార పార్టీ నేతల తీరు వల్ల ఐటీ రంగం మళ్లీ కునారిల్లే దుస్థితి వచ్చిందని ఐటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.విశాఖ కంటే.. చెన్నై బెటర్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు తమ కార్యక లాపాల్ని సాగరనగరిలో విస్తరించేందుకు గతంలో సన్నద్ధమైంది. క్యాప్ జెమినీ సంస్థ కూడా తమ శాఖను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇతర నగరాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల మధ్య క్యాప్ జెమినీ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ జాబితాలో వైజాగ్‌ని కూడా చేర్చింది. క్యాప్‌జెమినీలో పని చేస్తున్న వారిలో ఇప్పటి వరకు సింహభాగం ఉద్యోగులు విశాఖను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో కూడా ఇదే విధమైన సర్వే చేశారు. ఫిబ్రవరిలో క్యాప్ జెమిని సంస్థ ప్రతినిధులు సైతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమినీ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే నెల రోజులుగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన సంస్థ.. చెన్నైలో విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,000కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 2027నాటికి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అనుకూల వాతావరణం కనిపించి ఉంటే కచ్చితంగా ఈ సంస్థ శాఖ విశాఖలో విస్తరించేది. టీడీపీ, జనసేన నేతల దాడులు, విధ్వంస పర్వంతో రాష్ట్రంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుండటంతో ఇది సరైన వేదిక కాదని మానసు మార్చుకుని క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఇదేమి రాజ్యం.. మెచ్చుతారా జనం?
ఒక్కోసారి రాజకీయ నేతలు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన చర్యలు వైరల్ అవుతుంటాయి. తమ నేత తోపు, తురుము అని అనుచరులు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు. కానీ, సామాన్య జనం మాత్రం ఇలాంటి చేష్టలను అస్సలు భరించలేరు. మరీ ముఖ్యంగా.. అధికారంలో ఉన్నవాళ్ల విషయంలో!..ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ప్రతీకార దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు అధికార పార్టీ నేతలు తమ తమ చేష్టలతో వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఓ ఎస్సైపై రుసరుసలాడారు. నిన్న ఎమ్మెల్యే కొలికపూడి.. వైఎస్సార్సీపీ నేత ఇంటిని జేసీబీతో కూల్చేసేందుకు జేసీబీతో నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ టీడీపీ అనుకూల మీడియానే ‘అత్యుత్సాహం’ పేరిట ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం. అయితే.. ఇలాంటి వ్యవహారాలతో వారికే కాదు, పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుంది. గత పాలనలో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్షాల అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అవి జనంలోకి బాగా వెళ్లాయి. వైఎస్సార్సీపీ ఓటమి కారణాల్లో అది కూడా ఉందనే చర్చా నడిచింది. కానీ, ఇప్పుడు ఏకంగా.. అధికారంలో ఉన్నవాళ్లు మాటలతో సరిపెట్టుకోవడం లేదు. ప్రతీకార చర్యలతో చేతలకు దిగుతున్నారు. మంత్రి భార్య, కొలికపూడి మాత్రమే కాదు.. జేసీ లాంటి వాళ్లు అధికారుల్ని నరికేస్తామని హెచ్చరించినా, టీడీపీ వాళ్లు వెళ్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని అధికారుల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించినా, తమకు తగ్గట్లు నడుచుకోవాల్సిందేనని మిగతా మంత్రులు హెచ్చరించినా.. ఇవన్నీ అధికారం ఇప్పటికే వాళ్లకు తలకెక్కిందనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా పంపించక మానదు. అధికారం ఉందని.. అడిగేవారు లేరని అనుకోవద్దు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి, జనాలు ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను మెచ్చరనే విషయం ఇప్పటికైనా కూటమి నేతలు గుర్తిస్తే మంచిది. ::: సోషల్ మీడియాలో ఓ సిటిజన్ -
టీడీపీ నేతల దాడులు పెరుగుతున్నాయి
-
తిట్టుకుని.. కొట్టుకుని
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్‌పై చైర్మన్ చేయి చేసుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు. -
ఊరొదలకపోతే చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/సాక్షి, టాస్‌్కఫోర్స్ : బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అధికార టీడీపీ నేతల అరాచక పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదుతున్నారు. ఇళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. బలహీన వర్గాలపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఊరు విడిచి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామని నేతలు, కార్యకర్తలను మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తుండటం విస్తుగొలుపుతోంది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఊర్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి కొందరు గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు చెన్ను కోటేశ్వరరావు కుటుంబం 20 రోజులుగా అజ్ఞాతంలో గడుపుతోంది. కోటేశ్వరరావు 1995 నుంచి వరుసగా మూడు దఫాలుగా గుళ్లపల్లి సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. 2021 నుంచి ఆయన సతీమణి సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామ పంచాయతీలోనే కాక మండల స్థాయిలో పేరున్న నేత. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు చెన్ను కోటేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వీరి హయాంలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలన్నింటినీ ధ్వంసం చేశారు. కోటేశ్వరరావును గ్రామస్తుల సమక్షంలో దుర్భాషలాడారు. చంపేస్తామంటూ ఏకంగా మైకులో గ్రామం మొత్తం తిరిగి అనౌన్స్మెంట్ చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా మారణాయుధాలతో ఇంటి వద్దకు వెళ్లి గ్రామం వదలి వెళ్లకపోతే చంపేస్తామని నేరుగా హెచ్చరించారు.దీంతో కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామం గుళ్లపల్లి వదిలి వెళ్లిపోయారు. తర్వాత ఆయన వాటర్ ప్లాంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఆయన అనుచరుడి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి గ్రామానికి చెందిన 8 మంది టీడీపీ కార్యకర్తలతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన లేదు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి అనగాని చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటకు చెందిన ఆంధ్రప్రభ విలేకరి ఎనుముల వెంకటేశ్వరరావు ఇంటిని బుధవారం టీడీపీ నేతలు జేసీబీతో ధ్వంసం చేశారు. కొత్త ఇల్లు ని ర్మించుకొని మూడు నెలల క్రితమే ఆయన గృహ ప్రవేశం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న కక్షతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోలీసులు కనీసం ఫిర్యాదు పత్రం కూడా తీసుకోలేదు. ఇదే మండలం రాం»ొట్లవారిపాలెంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడి దారుణంగా కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ప్రసాదరెడ్డిని చంపేస్తామని బెదిరించారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆయన ఊరు వదిలి వెళ్లారు. ఇలా పలువురు నేతలు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. నగరం, నిజాపట్నం తదితర మండలాల్లో సైతం ఈ తరహా దాడులు పెరిగాయి. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే వందల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. మంత్రి కనుసైగ మేరకే దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, మంత్రి స్పందించక పోవడమే ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో బాధితుల నుంచి పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా స్వీకరించక పోవడం గమనార్హం.ఊరొదిలిన గిరిజన, దళిత కుటుంబాలు శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలో టీడీపీ శ్రేణుల దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన 55 కుటుంబాలు, వాగివేడులో 17 కుటుంబాలు, నారాయణపురంలో 3 కుటుంబాలు.. మొత్తం 75 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి. ఇందులో ఎంపేడు సర్పంచ్ కొండయ్య కుటుంబం కూడా ఉంది. సర్పంచ్ కుటుంబం ఎక్కడకు వెళ్లిందో తెలియట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరొదిలి వెళ్లిన వారిలో సూళ్లకు వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి కోసం స్కూల్ టీచర్లు తోటి విద్యార్థులను నివాసాలకు పంపించారని స్థానికులు తెలిపారు.ఆస్తులు ధ్వంసం చేస్తున్న కూటమిపుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం పెద్దగొట్టికల్లుకు చెందిన మాధవరెడ్డి, జనార్థన్‌రెడ్డి ఆస్తులను కూటమి నేతలు ధ్వంసం చేశారు. పీలేరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచర్ల క్రాస్ వద్ద ఉన్న వీఎంఆర్ కన్వెన్షన్ హాలు ముఖ ద్వారం ఆర్చిని గురువారం అర్ధరాత్రి కూలదోశారు. జనార్ధన్‌రెడ్డికి చెందిన సెరికల్చర్ షెడ్డును పడగొట్టారు. కొంత కాలంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నా.. పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య కాలనీలో జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో షికారీలపై మరోసారి దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నారు.. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని పోలీసులు సలహా ఇచ్చినట్లు సమాచారం. చంద్రగిరి నియోజక వర్గం పాకాల మండల యూత్ అధ్యక్షుడు చంటిపై గురువారం రాత్రి దాడి జరిగినా, పోలీసులు పట్టించుకోలేదు.ఫ్యాన్‌కు ఓటేసినందుకు ఊళ్లో ఉండొద్దు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఫ్యాను గుర్తుకు ఓటేసిన షికారీలు, దళితులను ఊర్ల నుంచి వెళ్లగొడుతున్నారు. ఊరు విడిచి వెళ్లని వారి నివాసాల్లోకి దూరి తరిమి తరిమి కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరి కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓటేసిన, పార్టీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇంకొందరికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అప్పులిచ్చిన వాళ్లను నివాసాలకు పంపి ఒత్తిళ్లు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పటికే రూ.12 కోట్లు విలువ చేసే నివాసాలను కూల్చి వేశారు. శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలోని ఈశ్వరయ్యకాలనీలో టీడీపీ శ్రేణులు శుక్రవారం షికారీల (గిరిజనులు) ఇళ్లలోకి చొరబడి కర్రలు, రాళ్లతో తరిమి కొట్టారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో పలువురు కాలనీ విడిచి వెళ్లిపోయారు. ఈ నెల 12న ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురంలో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నివాసాల్లోకి చొరబడి చిన్నా , పెద్దా తేడా చూడకుండా విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు, మహేశ్వరి (బాలింత), రవీన (గర్భిణి), ఎంజీఆర్ (వృద్దుడు)తో పాటు మరి కొందరు ఉన్నారు. -
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి ఘర్షణల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దౌర్జన్యం చేయడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై 20 రోజులు దాటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండ ఆపకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం సైతం శిలాఫలకాల ధ్వంసం వంటి ఘటనలు కొనసాగాయి. తిరుపతిలో ఆగని విధ్వంసం తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు శిలాఫలకాన్ని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటి మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 22 రోడ్లను నిర్మించారు. ప్రతి మాస్టర్ ప్లాన్ రోడ్డుకు కవులు, మహానీయుల పేర్లు పెట్టారు. అందులో భాగంగానే తిరుపతి జీవకోన ప్రధాన మార్గంలోని సత్యనారాయణపురం మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ‘విరజా మార్గం’గా నామకరణం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీసీ నేతలు ఇలా కక్ష సాధింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ చర్యతో ఇరువాడలో ఉద్రిక్తత సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను ఎందుకు పెట్టలేదంటూ సచివాలయ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన అచ్యుతాపురం మండలం ఇరువాడలో గురువారం చోటుచేసుకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గునపాలతో శిలాఫలకాలు ధ్వంసం చేసి పెకలించడంతో సచివాలయ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడంతో వీడియోల ఆధారంగా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ ఫొటో ధ్వంసం వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె రైతు భరోసా కేంద్రం భవనంపై నవరత్నాలు పేరుతో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫొటోను రాళ్లతో పగులగొట్టారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువనేతపై హత్యాయత్నంబీరు సీసాలు, మారణాయుధాలతో దాడి పాకాలలో చిత్తూరు రౌడీ గ్యాంగ్ బీభత్సం చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు నుంచి దిగుమతి అయిన రౌడీమూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి పాకాల మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు (చంటి)పై చిత్తూరు నుంచి బైకులపై వచ్చిన ఐదుగురు సభ్యుల రౌడీ గ్యాంగ్ బీరు సీసాలు, మారణాయుధాలతో దాడిచేసి అతడిని హతమార్చేందుకు యత్నించారు. యుగంధర్ తలను బీరు బాటిల్‌తో పగులగొట్టారు. మారణాయుధాలతో ఒళ్లంతా గాయాలు చేశారు. ‘మా అన్న పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి పనిచేస్తావా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుగారిపల్లి సమీపంలోని తన మామిడి తోటలో ఉండగా.. గుర్తు తెలియని ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై తోటలోకి చొరబడి హతాయత్నం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి తోటలోని తన గెస్ట్‌హౌస్‌లో ఉన్న గృహోపకరణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగితే ప్రాణాలతో ఉంచబోమని బెదిరించారని తెలిపారు. చిత్తూరు నుంచి కిరాయి మూకలను రప్పించి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించి ఓ నేత పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితుడు మండిపడ్డాడు.ఇది ప్రజాస్వామ్యమా .. అరాచకమా?దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ స్పందించాలి మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సాక్షి,అమరావతి/ రైల్వేకోడూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 25 రోజులుగా కొనసాగిస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, దాషీ్టకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక అరాచక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తమకు ఊహ వచి్చనప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజలపై జరుగుతున్న దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కోరారు. పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం.. ఎస్టీ కాలనీ వాసుల ఇళ్లను రెవెన్యూ, ఏపీఎండీసీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకాపుపల్లె ఎస్టీ కాలనీ వాసుల గృహాలను బుధవారం జేసీబీతో అధికారులు కూల్చి వేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లల్లో బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలున్నారని చూడకుండా తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
టీడీపీ, జనసేన నేతల వీరంగం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి విధ్వంసం సృష్టించారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో 11 మంది కార్లలో సైరన్ మోగించుకుంటూ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం కింద బాణసంచా కాల్చి హడావుడి చేశారు. బలవంతంగా కార్యాలయం పైకి చేరుకున్నారు. సర్పంచ్ రూమ్‌లోకి చొరబడి గోడకు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను ధ్వంసం చేశారు. మరోపక్క ఫ్లెక్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్చిత్రపటాన్ని పీకి పడేశారు. సర్పంచ్ టేబుల్‌పై కేక్ కట్‌చేసి టేబుల్‌కు, గోడలపైన పులిమారు. కార్యాలయం భవనానికి టీడీపీ జెండా కట్టి నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్న సమయంలో పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కొందరు సిబ్బంది ఉన్నారు. కార్యాలయంలో విధ్వంసం గురించి సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు, వార్డు, ఎంపీటీసీ సభ్యులకు సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కార్యాలయానికి చేరుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ప్రవర్తించడంపై భయాందోళనలకు గురైన సిబ్బంది విధులు నిర్వర్తించలేమంటూ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ భాస్కరరావు, పటమట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం : సర్పంచ్ పూర్ణచంద్రరావు పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చెలరేగి ప్రవర్తించడంపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఎనికేపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యాలయం గోడలపై మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలతోపాటు వేరే పార్టీలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్, జగన్ చిత్రపటాలను, మాజీ ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉంటే తనపైనా దాడిచేసేవారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తుంటే పంచాయతీ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే విచారించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కక్ష సాధింపు నోటీసులురాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు ఏడు రోజుల్లో కట్టడాలు తొలగించాలంటూ హెచ్చరిక ఉండి/పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాల మీద కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వైఎస్సార్ విగ్రహాలు, ప్రభుత్వ భవన శిలాఫలకాలను ఓవైపు ధ్వంసం చేస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యాలయాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం, పార్వతీపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని కార్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరిట నోటీసులు ఈ నెల 22న, 25న జారీ చేసినట్లు ప్రస్తుత, పాత తేదీల్లో ముద్రించి నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం గోడలకు అతికించారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లో కట్టడాలను కూల్చాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేశారు. అయితే పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కార్యాలయానికి నోటీసులు నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలో సుమారు 1.5 ఎకరాల రెవెన్యూ స్థలంలో నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. తమ శాఖ ముందస్తు అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భవన నిర్మాణం చేశారని, ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్లానింగ్ అధికారి భాస్కర్ పేరుతో ఉన్న నోటీసును పౌడా అధికారి రఘురామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ అంటించారు. ఎన్నికల ముందే భవన నిర్మాణం పూర్తికాగా, ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కేవలం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు. -
విధ్వంసం... అరాచకం..
సాక్షి నెట్వర్క్: టీడీపీ కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పలుచోట్ల ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం సచివాలయ భవన నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, మండల ప్రజాప్రతినిధుల పేర్లతో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయగా.. దానిని పగులగొట్టారు. టీడీపీ నాయకుడు, సర్పంచ్ యర్రా రామకృష్ణ ఇంటి ముందు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. జెండా దిమ్మె ధ్వంసం తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను మంగళవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. జగనన్న కాలనీలో రాళ్లు ధ్వంసం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రులో టీడీపీ నాయకులు దాషీ్టకానికి తెగబడ్డారు. జగనన్న కాలనీలో సరిహద్దు రాళ్లు ధ్వంసం చేశారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు కొల్లాటి గోవిందరాజు, బస్వాని పోతురాజు, బర్రి నాగరాజు, జల్లా బుజ్జి, బొమ్మిడి పోతురాజు, ఒడుగు సామోరు, కొయ్యలగడ్డ బాలాజీ తదితరులు వచ్చి పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారని గ్రామస్తులతోపాటు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. లబి్ధదారులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని, జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పనులను అడ్డుకుంటున్నారని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురి మృతి
కీవ్: రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ఆదివారం డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. వాటిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రిమియా ద్వీపకల్పంలోని సెవస్టోపోల్ తీరపట్టణంపై ఉక్రెయిన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కోరారు. -
మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్‌గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్‌గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు. -
కొనసాగిన శిలాఫలకాల ధ్వంసం
తెనాలి అర్బన్/భీమవరం (ప్రకాశం చౌక్)/నాగులుప్పలపాడు: అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం యథేచ్ఛగా గత ప్రభుత్వంలో ఏర్పాటైన అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అలాగే దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పగులకొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి 13వ వార్డులో రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాన్ని తాజాగా టీడీపీ కార్యకర్తలు పగులకొట్టారు. అలాగే ఐదో వార్డులో కౌన్సిలర్ తోట రఘురామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. భీమవరంలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శిలాఫలకాలను జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం టూటౌన్లో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జనసేన, టీడీపీకి చెందిన అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ప్రశాంతమైన భీమవరంలో ఈ దుశ్చర్య దారుణమని స్థానికులు మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నడిరోడ్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద బండరాయితో తొలుత మెడ భాగంలో పగలగొట్టి తల భాగం తీసేయాలని ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో ఎడమ చేతిని బండరాయితో బలంగా కొట్టడంతో ఆ భాగం పూర్తిగా విరిగిపోయింది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఇంటిపై రాళ్ల దాడికొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 4వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చేపలుప్పాడలో కొండబాబు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఎలివేషన్ అద్దాలు పగిలిపోయాయి. రాత్రి పెద్ద శబ్దాలు రావడంతో బయటకు వచ్చి చూశానని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కొండబాబు తెలిపారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో ఎవరు దాడి చేశారో కనబడలేదన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారమివ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారని, వారిని చూసి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. శనివారం భీమిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని తెలిపారు. దాడులు చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాడిపత్రిలో టీడీపీ నాయకుల బరితెగింపుతాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతూపొంతూ ఉండటం లేదు. శనివారం తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సజ్జలదిన్నె రాజు అనుచరుడు వేణుగోపాల్‌రెడ్డికి చెందిన నాపరాళ్ల ఫ్యాక్టరీలో బండలను ధ్వంసం చేశారు.దాదాపు 20 చదరాల బండలు ధ్వంసం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వారే ధ్వంసం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రవీంద్రారెడ్డి తన రెండెకరాల పొలంలో నెల క్రితం సాగు చేసిన పత్తి పంటను టీడీపీ వర్గీయులు శనివారం దున్నేసి నాశనం చేశారు. అదే గ్రామానికి చెందిన ఆలూరు రామాంజులరెడ్డి, జూటూరు రామాంజులరెడ్డి ట్రాక్టర్‌తో తన పంటను దున్నేసినట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు స్వీకరించలేదు. -
వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై కక్షసాధింపు
చంద్రగిరి (తిరుపతి జిల్లా): చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి మండలం కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు రామిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిపై కక్ష సాధింపు శృతిమించుతోంది. ఎన్నికల రోజు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు దాడిచేసి ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిపోయింది. అయినా వారు సర్పంచ్‌పై ఇంకా కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. సర్పంచ్ ఇంటికి దారిలేకుండా చేయాలనే కుట్రతో ఆలయం పేరుతో నాటకానికి తెరలేపారు. సర్పంచ్ ఇంటి ముందు 10 అడుగుల దారి ఉంది. ఆ పక్కనే ప్రైవేటు ఇంటి స్థలాలూ ఉన్నాయి. దీంతో శుక్రవారం టీడీపీ నేతలు ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకుని ఆలయం ముసుగులో అక్రమ నిర్మాణాలను ప్రారంభించారు. దీంతో స్థలాల యజమానులు తమ స్థలాలను కొనుగోలు చేసి తమకు డబ్బులిస్తే వెళ్లిపోతామన్నారు. రిజి్రస్టేషన్ అయిన స్థలాలను సైతం ఆక్రమించుకోవడం దారుణమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్ ఇంటికి దారిలేకుండా చేసి ఆయన్ను గ్రామంలోకి రానీయకూడదన్నదే వీరి లక్ష్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కూచువారిపల్లిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకూ యత్నం.. ఇదిలా ఉంటే.. కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల కబ్జాకూ పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మీకు దిక్కున్నచోట చెప్పకోండంటూ శుక్రవారం బెదిరింపులకు పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల మేరకు.. రామిరెడ్డిపల్లి సర్వే నంబరు 413, 414లో సుమారు 2.77 ఎకరాల కుంట పోరంబోకు స్థలం ఉంది. ఇందులో పాడి రైతులు కొందరు పశువుల కోసం తాత్కాలిక షెడ్లు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. అయితే, కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు మురళీనాయుడు, సునీల్ మరికొంతమంది శుక్రవారం జేసీబీ తీసుకొచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నేతలు మహిళలపట్ల అసభ్య పదజాలంతో దూషించారు. అడ్డుకోబోయిన వీఆర్ఓపైన విరుచుకుపడ్డారు. ఇక్కడే ఉంటే కొడతామని బెదిరించడంతో రైతులు, మహిళలు వెనుదిరిగారు. ‘ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టమొచ్చినట్లు మేం చేస్తాం.. మీవల్ల ఏమికాదు’.. అంటూ బెదిరించారు. ఇక్కడకు పోలీసు, రెవెన్యూ అధికారులు వచ్చినప్పటికీ ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది. -
కక్షగట్టి దాడులు.. విధ్వంసాలు
తోపల్లిగూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కావల్‌రెడ్డి రంగారెడ్డికి చెందిన ట్రాక్టర్, ఏయిరేటర్లు, ఆక్వా సామగ్రికి టీడీపీ నేతలు గురువారం రాత్రి నిప్పంటించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సమీప బంధువైన రంగారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పనిచేశారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులు అధికారం అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, ఈ ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రంగారెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని, దానిని విస్మరించి టీడీపీ గూండాలు ఇలా ఆటవిక దాడులు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ దాడులను ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. దాడులు ఆపనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులు దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, కావల్‌రెడ్డి రవీంద్రరెడ్డి, కావల్‌రెడ్డి రంగారెడ్డి, కొడూరు దిలీప్‌రెడ్డి, కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, తూపిలి ఉదయకుమార్‌రెడ్డి, చెరుకూరు శ్రీనివాసులనాయుడు, మన్నె చిరంజీవులగౌడ్, విశ్వనాథ్‌రెడ్డి, ఆగాల శ్రీనివాసులరెడ్డి, దగ్గు సతీ‹ష్, పామంజి దుర్గ పాల్గొన్నారు. -
కొనసాగుతున్నవిధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు. ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసంఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు. ‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం
రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్ ఖాన్ కొంతమంది రౌడీలతో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్ హారూన్ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పీఏ నిస్సార్ అహ్మద్‌ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ నాటి నుంచే వరుస దాడులు..ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.అలాగే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ రామ్మోహన్ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్‌లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.టీడీపీ రౌడీమూకల దాడులు దారుణంరాయచోటిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
ఆగని శిలాఫలకాల ధ్వంసం
సాక్షి, నెట్వర్క్: టీడీపీ అధికారంలోకి వచ్చి 15 రోజులు గడిచినా ఆ పార్టీ నేతలు తమ విధ్వంసాలను ఆపడం లేదు. అధికారం అండగా విచ్చలవిడిగా, యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు బుధవారం పగులకొట్టారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలను, వైఎస్సార్సీపీ జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేరుతో ఉన్న శిలాఫలకాన్ని పగులకొట్టారు. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సురేశ్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరి సీఐ బాబుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాథపురంలో ఆర్బీకేలు, సచివాలయాలకు అతికించిన వైఎస్ జగన్ చిత్రాన్ని, నవరత్నాల వివరాలతో కూడిన శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట విజయలక్ష్మీనగర్లో సీసీ రోడ్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, తదితరులు ఈ దుశ్చర్యపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రాలను చెరిపివేశారు. శిలాఫలకం ధ్వంసంపై సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని విరగకొట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని తొలగించారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపాల్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జి.అగ్రహారంలో ఒంగోలు–కర్నూలు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు పాలడుగు రమేశ్, తానికొండ బాలకోటయ్య జేసీబీతో ధ్వంసం చేశారు. అలాగే జెండా దిమ్మె పక్కన కొమ్ముల కోటమ్మ రేకుల షెడ్డును కూడా కూల్చారు. -
చిత్తూరులో ఆగని టీడీపీ హింసాకాండ
-
కొనసాగుతున్న టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ జెండా దిమ్మ, ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని గమేషన్ మిల్లు సెంటర్లో వైఎస్సార్సీపీ మండల కార్యాలయం సమీపంలోని ఆ పార్టీ జెండా దిమ్మను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధాం గ్రామంలో సచివాలయ శిలాఫలకాన్ని సోమవారం తెలుగుదేశం కార్యకర్త పొలుగుతో పొడిచి ధ్వంసం చేశాడని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ జెండా దిమ్మను, సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినవారిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రమణ్యం, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రహీమ్రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ గణపవరం పంచాయతీ వార్డు మెంబరైన పి.నాగరాజురెడ్డిపై ఇటీవల దాడిచేసిన వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిలో కర్లపాలెం ఎంపీటీసీ సభ్యుడు ఎస్కె ఆసిఫ్ అలీ, పేరలి సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, పెదగొల్లపాలెం సర్పంచ్ యల్లావుల సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి జయభారత్‌రెడ్డి, సలగల ధర్మేంద్ర, తాజుద్దీన్, షంషీర్, మనోహర్, మహేష్, నాగరాజురెడ్డి తదితరులున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎంపీ కోటా నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. తిమ్మాపురం నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించారు. అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ కొమిరేపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం ధ్వంసం చేశారు. ఆ శిథిలాలను మంగళవారం వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పులవర్తి సంతోష్, పార్టీ నాయకులు రాజు, గంటా పండు, దిలీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి రాకపోకలకు నరకాన్ని చవిచూశామని చెప్పారు. గత ఎన్నికల్లో కొఠారు రామచంద్రరావు పల్లె నిద్ర సమయంలో కొమిరేపల్లికి తారురోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొఠారు అబ్బయ్యచౌదరి ఎమ్మెల్యేగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి కిలోమీటరున్నర మేర రూ.కోటికిపైగా వ్యయంతో తారురోడ్డు నిర్మించారని చెప్పారు. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఫొటోలున్న శిలాఫలకాన్ని కూల్చివేయడం, అగౌరవపర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన శిలాఫలకం ఫొటోలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏపీ ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలోని గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాన్ని తెలుగుదేశం కార్యకర్త మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పాలా శారదా శ్రీనివాస్‌ను అడగగా.. తాను కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఈ దుశ్చర్య జరిగినట్టు తెలిసిందన్నారు. దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్‌టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడుయూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడుకూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శిచట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీఅన్యాయంగా కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలుఐక్యతతో ముందుకు సాగాలి రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరురాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిరాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన 77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ