విజయనగరం జిల్లా కోనాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం..
కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శిలాఫలకాలు ధ్వంసం
సాక్షి నెట్‌వర్క్: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసాలు శనివారం రాత్రి, ఆదివారం కూడా కొనసాగాయి.
» విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం బజారు కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమం సందర్భంగా విగ్రహానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో తట్టుకోలేక విగ్రహం చేతిని విరగ్గొట్టడంతోపాటు తల వెనక భాగంలో రాడ్డుతో కొట్టారు. కోనాడ బజార్‌లో ఉన్న సీసీ కెమెరా వైర్లను కట్‌చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సమాచారం అందుకున్న పూసపాటిరేగ ఎస్.ఐ. సన్యాసినాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుంటామని ఎస్.ఐ. చెప్పారు. గ్రామ వైఎస్సార్‌సీపీ నేతలు దాడిశెట్టి త్రినాథరావు, అమర గురువులు, బొడ్డు ఎల్లాజీ, దారపు లక్ష్మణరెడ్డి, దాడిశెట్టి గోవింద, విజ్జపు కిరణ్, కంబపు రామిరెడ్డి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.
ప్రశాంతతకు మారుపేరైన కోనాడలో అసాంఘిక శక్తులు బరితెగించి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
» డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం జిల్లేళ్ళవారిపేటలో వాటర్ ట్యాంకు శిలాఫలకాన్ని మాయం చేశారు. జిల్లేళ్ళవారిపేట ఎస్సీ గ్రామానికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీ‹Ùకుమార్ జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.54 లక్షలతో 40 వేల లీటర్ల ట్యాంకు, పైపులైన్ పనులు, ఇంటింటా కుళాయిల పనులు పూర్తిచేసి ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇప్పుడు మాయం చేశారు. వారం రోజుల కిందట గ్రామంలో చర్చికి వెళ్లే పంచాయతీ పైపులైన్‌ను టీడీపీ కార్యకర్తలు కట్ చేశారు.
» ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో ఇటీవల నిర్మించిన గ్రామ సచివాలయ భవనంపై ఉన్న ఫొటోలను పగులగొట్టారు. ఈ భవనానికి ఘంటా రంగారావు తన తండ్రి పేరిట 12 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారు. దీంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనను జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
» పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామ పంచాయతీ బీసీ కాలనీలో కొవ్వూరి గంగిరెడ్డి స్మారక మందిరం వద్ద 2021లో సీసీ రోడ్డు ప్రారం¿ోత్సవం సందర్భంగా వేసిన శిలాఫలకాన్ని శనివారం రాత్రి కూల్చేశారు. రూ.కోటితో నాలుగు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సచివాలయ భవన విస్తరణ పనులు చేసిన తరువాత 2021 సెప్టెంబరు 5న మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు ప్రారంభించి శిలాఫలకాలు ఆవిష్కరించారని సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి చెప్పారు. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ఇప్పుడు కూల్చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment