
తిరుపతి: తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా బావించే పాపవినాశనంలో ప్రవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు భూమన. ఈరోజు తిరుపతి నుంచి ప్రెస్ మీట్ లో భూమన మాట్లాడుతూ.. ‘తిరుమల పాపవినాశనంలో బోటు షికారు ట్రయిల్ రన్ చేశారు. కూబింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. అటవీశాఖ ట్రయల్ రన్ నిరతవహిస్తున్నామను అని అన్నారు. అనితర మేము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గోరంతను కొండంత చేసిన కూటమి ప్రభ/త్వం.. నేడు పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికి ఐదు రోజులైంది. కానీ టీటీడీ అధికారులు ఎవ్వరూ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.
పవన్ ఏం చేస్తున్నాడు..?
నడుం బిగించానని చెప్పిన పవన్ కు నడుం నొప్పి ప్రారంభమైంది. అటవీశాఖ పవన్ పరిధిలో ఉంటుంది, అలాంటిది పవిత్ర జలాలకు అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?, ఎందుకు స్పందించలేదు?, నిన్న బాలాజీ నగర్ లో పోలీసులు మద్యం పట్టుకొన్నారు. కొండపై మధ్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. తిరుమల కొండపై మద్యం నిషేధించి దశాబ్దాలు అయినా అక్కడ మద్యం ఏరులై పారుతోంది. తిరుమల కొండపై ఎక్సైజ్ శాఖ ఉంది. పది రోజులకు ముందు గంజాయి, మద్యం మత్తులో భక్తులపై దాడి చేశారు. వీరిని పట్టుకోవడానికి భద్రత సిబ్బంది కష్టపడాల్సివచ్చింద
15 రోజులకు ముందు ఆలయం సమీపంలో మద్యం మత్తలో ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. ఆలయ సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు?, . ఆలయం సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు

తిరుమలను బోట్లు ద్వారా పర్యాటక కేంద్రంగా మార్చాలని చూడలేదా?, .సీఎం చంద్రబాబు అన్నిదేవాలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ప్రక్షాళన చెయ్యడానికే ఈఓ శ్యామలా రావు నియమించానన్నారు సీఎం చంద్రబాబు. ఇదేనా ప్రక్షాళన అంటే చంద్రబాబు
కూటమి ప్రభుత్వంలో రోజుకో అరాచకం
వైఎస్సార్‌సీపీ పాలనలో అన్నీ అరాచకలే అన్న మీరు.. ఒక్కటి కూడా నిరూపించలేదు. కానీ నేడు కూటమి ప్రభ/త్వంలో రోజుకో అరాచకం జరుగుతుంది. ముంతాజ్ హోటల్ అనుమతి ఇచ్చిందే చంద్రబాబు, అలాంటి ముంతాజ్ హోటల్ పై పెద్దఎత్తున స్వామీజీలు నిరసనలు చేశారు. అనంతరం వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తిరుమలలో వరుస ఘటనలు ఎవరు జవాబు చెప్తారు’ అని ప్రశ్నించారు భూమన