పహల్గాం ఉగ్రదాడి.. శాంతి ర్యాలీకి వైఎస్‌ జగన్‌ పిలుపు | YS Jagan Calls For A Peace Rally Following The Pahalgam Terror Attack, More Details Inside | Sakshi
Sakshi News home page

Pahalgam Incident: పహల్గాం ఉగ్రదాడి.. శాంతి ర్యాలీకి వైఎస్‌ జగన్‌ పిలుపు

Published Wed, Apr 23 2025 2:38 PM | Last Updated on Wed, Apr 23 2025 3:21 PM

YS Jagan calls for a peace rally following the Pahalgam terror attack

తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అన్నీ జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండీల్‌ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. వైఎస్‌ జగన్‌ పిలుపుతో ఈ రోజు సాయంత్రం పార్టీ శ్రేణులు క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. 

పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్‌.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ఖండించారు.  

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement