
సాక్షి,పులివెందుల: ఎల్లో మీడియాపై మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని గతంలో నన్ను విపరీతంగా కొట్టారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్... నాపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించాడు.
సీబీఐ ఎస్పీ రాంసింగ్ చెప్పినట్లుగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి నన్ను బెదిరించింది. నేను తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే.. తన భర్త జైలుకు వెళ్తాడని సునీతారెడ్డి చెప్పింది’ అని అన్నారు.
