
ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ
రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీ టోల్‌గేట్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ వెంకట సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు...రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంగిమళ్ల నుంచి రాయచోటికి వస్తుండగా టోల్‌గేట్ సమీపంలో బొలెరో వాహనానికి టైరును మారుస్తుండగా వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొంది. మండల పోలీసులు వెంటనె సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ ప్రసాద్‌రెడ్డి, కండక్టర్ నరసింహులుతో పాటు 14 మంది ప్రయాణికులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో వంగిమళ్లకు చెందిన రామాంజులరెడ్డి, చిన్నబాబు, సుమిత్ర, రెడ్డిరాణి, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆస్మా, మన్విత, మాన్యత, పొలిమేరపల్లెకు చెందిన రమాదేవి, జగదీష్, గీతావాణి, మహేష్, ఉప్పరపల్లెకు చెందిన రాణెమ్మ, సుండుపల్లె చౌడయ్య, వీరబల్లి మండలానికి చెందిన సుమిత్ర, గంగనేరుకు చెందిన జమున ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం రామాంజులరెడ్డి, రాదేవి, జగదీష్, బాబు, గీతావాణిలను కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ రామాంజులరెడ్డి(80) మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఒకరి మృతి, 14 మంది
ప్రయాణికులకు గాయాలు