Top Stories
ప్రధాన వార్తలు

చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.

Justice BR Gavai: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్స్
ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) నియమితులు కానున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్స్ చేసింది.

వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు.

National Herald: సోనియా, రాహుల్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ (ఏజేఎల్)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.మరోవైపు.. రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్ ఖాన్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్ దంపతులు బుధవారం సోషల్ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేయగా.. జహీర్- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్ సింబల్‌తో విషెస్ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్ ఖాన్.. లెఫ్టార్మ్ మీడియం పేసర్. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్లో కొనసాగిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి

దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by ACTC Events (@actc_events) చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్..

అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)
అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్.. మూడో భారతీయ సింగర్‌గా రికార్డు!
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
‘ఆ టీచర్’ మాకొద్దు..
నిర్మాత దిల్ రాజు 'ఏఐ' కంపెనీ.. ఇకపై తెలుగు సినిమాల్లో
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
అన్నయ్య సారీ రా...
ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
జస్ట్ 9999 నెంబర్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు పైనే..!
అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
సొరంగం జిందాబాద్..!
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
Tirumala: తిరుమలలో మరో అపచారం
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా
నీట్ రూల్స్ వెరీ టఫ్
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
భారత్‌తో చైనా దోస్తీ.. భారతీయులకు గుడ్‌న్యూస్
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి'
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ట్రంప్‌కు కీలెరిగి వాత
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
అనూష గర్భంలో ఆడబిడ్డ
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
ఫుల్ మాస్...
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
హైదరాబాద్‌లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసం
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మూడు నెలలుగా జీతాల్లేవ్
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్.. మూడో భారతీయ సింగర్‌గా రికార్డు!
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
‘ఆ టీచర్’ మాకొద్దు..
నిర్మాత దిల్ రాజు 'ఏఐ' కంపెనీ.. ఇకపై తెలుగు సినిమాల్లో
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
అన్నయ్య సారీ రా...
ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
జస్ట్ 9999 నెంబర్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు పైనే..!
అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
సొరంగం జిందాబాద్..!
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
ఇంతకాలం రాజకీయాల్లో ఉంటున్నారంటే ఇదేకదా సార్!
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
Tirumala: తిరుమలలో మరో అపచారం
ఎమర్జెన్సీ.. ప్రాణం కాపాడిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా
నీట్ రూల్స్ వెరీ టఫ్
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
భారత్‌తో చైనా దోస్తీ.. భారతీయులకు గుడ్‌న్యూస్
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి'
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ట్రంప్‌కు కీలెరిగి వాత
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారవృద్ధి
అనూష గర్భంలో ఆడబిడ్డ
కొత్తగా వచ్చేదేముంది సార్! గత పదేళ్లుగా పోలీసు యూనిఫాం వేసుకుని మరీ ‘పచ్చపార్టీ’కి పని చేస్తున్నారు కదా!
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
ఫుల్ మాస్...
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
హైదరాబాద్‌లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
వాట్సాప్‌లో కొత్త తరహా సైబర్ మోసం
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
మూడు నెలలుగా జీతాల్లేవ్
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
సినిమా

దేవి శ్రీప్రసాద్కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by ACTC Events (@actc_events) చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్..

కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
పెరిగిన వయసును పైకి కనిపించకుండా దాచేయాలని చూస్తుంటారు సెలబ్రిటీలు. ఎప్పటికప్పుడు మరింత అందంగా, నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushbu Sundar) కూడా తానింకా పడుచుదాన్నే అంటోంది. కాస్త సన్నబడిపోయి, షిమ్మరీ డ్రెస్‌తో హెయిర్ లీవ్ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్యాక్ టు ద ఫ్యూచర్ అని రాసుకొచ్చింది.అంతా ఇంజక్షన్ మహిమ!ఇది చూసిన అభిమానులు ఖుష్బూ కొత్త లుక్ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సన్నగా ఎలా అయింది? అయినా ఎంత సన్నబడ్డా నీ ముఖంలో ముసలితనం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఇంకా హద్దులు మీరుతూ.. ఇంజక్షన్ మహిమ వల్లే ఇలా సన్నగా అయిపోయారు. నువ్వేం ఇంజక్షన్ తీసుకున్నావో ఫాలోవర్లకు చెప్పొచ్చుగా! అప్పుడు వాళ్లు కూడా అదే వాడతారు అని విమర్శించాడు.నువ్వో చెండాలం..ఇది చూసిన ఖుష్బూకు ఒళ్లు మండిపోయింది. మీలాంటివాళ్ల బాధేంటో నాకర్థం కాదు. మీరు సోషల్ మీడియాలో కనీసం ముఖాలు కూడా చూపించరు. ఎందుకంటే మీరు ఎంత చెండాలంగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి! పాపం, మీ తల్లిదండ్రుల గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఘాటుగా రియాక్ట్ అయింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఖుష్బూ.. చివరగా వనవాస్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్ చేస్తోంది. అలాగే ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl— KhushbuSundar (@khushsundar) April 15, 2025 చదవండి: ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు

'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది
'గేమ్ ఛేంజర్' దెబ్బకు మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు వాళ్లందరి కళ్లు 'పెద్ది'(Peddi Movie)పైనే ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్.. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా రిలీజైంది. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే చకచకా షూటింగ్ జరుగుతోంది. తాజాగా తను నటించిన '45' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. 'పెద్ది' షూటింగ్ సంగతులు కూడా చెప్పుకొచ్చాడు. షూటింగ్ మొదలవడానికి 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చానని, దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు నేర్చుకున్నానని అన్నాడు.(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) అలా తెలుగు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సెట్స్ లో అడుగుపెట్టానని చెప్పిన శివరాజ్ కుమార్.. తెలుగులోనే డైలాగ్స్ చెప్పానని, పెద్ది సినిమా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తోందని చెప్పాడు. 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నని.. వర్షం కురిసి ప్రకృతి తనకు స్వాగతం పలికిందని చెప్పుకొచ్చాడు. పెద్ది గ్లింప్స్ అయితే తనకు చాలా నచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పెద్ది'లో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు)

ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? అప్పట్లో కన్నుగీటిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె.. తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఓ సినిమాలో నటించి హిట్ కొట్టింది. దీంతో ఈమె ఎక్కడ లేని గుర్తింపు వస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) 2018లో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్.. 2019లో రిలీజైన 'ఒరు అడార్ లవ్' హీరోయిన్ అయింది. కన్నుగీటి ఫేమస్ అయింది ఈ మూవీతోనే. కాకపోతే పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత తెలుగులో చెక్, ఇష్క్ నాట్ ఏలవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాదాపు ఏడెనిమిది ఏళ్లనుంచి ఇండస్ట్రీలో ఉండటమైతే ఉంది గానీ పేరు రాలేదు. కానీ రీసెంట్ గా రిలీజైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఈమె విలన్ గా చేసిన అర్జున్ దాస్ ప్రియురాలిగా నటించింది. ఇతడితో కలిసి సుల్తానా పాటకు డాన్స్ చేసింది. ఇది గతంలో సిమ్రాన్ చేసిన పాటకు మళ్లీ అలానే స్టెప్పులేసి ప్రియా వారియర్ ఫేమస్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?)
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్ హ్యాట్రిక్
లాహోర్: మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు విజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫర్జానా (57; 6 ఫోర్లు), షర్మిన్ అక్తర్ (57; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ బ్రైస్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ప్రియనాజ్ (63 బంతుల్లో 61; 7 ఫోర్లు), రాచెల్ (73 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా 4, జన్నతుల్ 2 వికెట్లు తీశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో ఐర్లాండ్ 46 పరుగుల తేడాతో థాయ్‌లాండ్ జట్టుపై గెలిచింది. ఇది కూడా చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుదుబాయ్: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మార్చి నెలకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కింది. చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చినందుకుగానూ అయ్యర్‌ను ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వివరాలు వెల్లడించింది. చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో అయ్యర్ అత్యధిక పరుగులు (243) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ కూడా ఈ పురస్కారం కోసం పోటీపడగా... ఆ ఇద్దరినీ వెనక్కి నెడుతూ అయ్యర్ విజేతగా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీ హస్తగతం చేసుకోవడంతో పాటు అవార్డు గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని అయ్యర్ అన్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారాన్ని భారత ఆటగాడు శుబ్‌మన్ గిల్ దక్కించుకున్నాడు.

KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ విధించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. పటిష్ట పంజాబ్ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.తప్పంతా నాదే.. ‘‘మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్ స్టంప్స్‌ను మిస్ అయింది. కానీ లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో నాకు స్పష్టత లేదు.అతడు కూడా నాతో అదే అన్నాడుఅంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్ కాల్ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమిమా బ్యాటింగ్ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.రివ్యూకు వెళ్లకుండా తప్పు చేశాడుకాగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ ఓవర్‌ను పంజాబ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహానే విఫలం కాగా.. బంతి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో పంజాబ్ అప్పీలు చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇంపాక్ట్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా తేలింది. ఒకవేళ రహానే గనుక రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌గా ఉండేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. నిజానికి అప్పటికి కేకేఆర్‌కు ఇంకా రెండు రివ్యూలు మిగిలే ఉండటం గమనార్హం. ఇలా స్వీయ తప్పిదం కారణంగా జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక రహానే పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కేకేఆర్వేదిక: మహరాజ యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, చండీగడ్టాస్: పంజాబ్.. బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కేకేఆర్ స్కోరు: 95 (15.1)ఫలితం: 16 పరుగుల తేడాతో కేకేఆర్‌పై పంజాబ్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (4/28).చదవండి: IPL 2025:చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3— IndianPremierLeague (@IPL) April 15, 2025The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4— IndianPremierLeague (@IPL) April 15, 2025

KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఐపీఎల్-2025 (IPL 2025 )లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) అనూహ్య విజయంతో ఆకట్టుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో సంచలన రీతిలో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇందుకు ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal).రూ. 18 కోట్లకు కొనుగోలుఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్‌ను పంజాబ్ ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సీజన్ ఆరంభం నుంచి ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్... 112 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు చహల్. ఈ మణికట్టు స్పిన్నర్ దెబ్బకు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.మణికట్టు స్పిన్నర్ మాయాజాలంచహల్ ధాటికి కెప్టెన్ అజింక్య రహానే (17) సహా అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. ఇలా కేకేఆర్‌కు చెందిన నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 11 బంతుల్లో 17 పరుగులతో కేకేఆర్ శిబిరంలో ఆశలు రేపినా మార్కో యాన్సెన్ అతడి ఆట కట్టించడంతో.. పంజాబ్ గెలుపు ఖరారైంది. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే సంతోషం పట్టలేకపోయారు. స్టాండ్స్‌లో పరిగెడుతూ సహచరులతో ఆనందం పంచుకున్నారు. Along with Kohli, Want to see Preity Zinta winning IPL trophy soon❤️Such a passionate supporter for 18 years without fail👌pic.twitter.com/viyPn107oV— Gss🇮🇳 (@Gss_Views) April 15, 2025అంతేకాదు.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహల్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.కేకేఆర్ చేజేతులాకాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఫలితంగా 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తుందనుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా 16 పరుగులు తేడాతో పంజాబ్ సొంత మైదానంలో జయభేరి మోగించింది. మార్కో యాన్సెన్ (3/17), చహల్ (4/28) కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IPL 2025: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025Preity Zinta was really happy with performance of Punjab Kings Today.congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025

సాత్విక్ - చిరాగ్ జోడీ పునరాగమనం
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్‌లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈనెల 27 నుంచి చైనాలోని జియామెన్ నగరంలో ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’కు తెర లేవనుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. బ్యాడ్మింటన్‌లో ప్రముఖ టీమ్ ఈవెంట్స్ అయిన థామస్ కప్, ఉబెర్ కప్‌లలో... ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లలో భారత జట్లు పతకాలు సాధించాయి. కానీ 36 ఏళ్ల చరిత్ర కలిగిన సుదిర్మన్ కప్‌లో మాత్రం ఇప్పటి వరకు భారత్ పతకాల బోణీ కొట్టలేదు. అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులతో చైనాకు బయలుదేరనున్న భారత బృందం ఈసారి పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.న్యూఢిల్లీ: మొత్తం ఐదు మ్యాచ్‌లు... అందులో మూడు గెలిస్తే చాలు విజయం ఖరారు... పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు స్టార్లు... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్... పురుషుల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ... ఈ మూడు విభాగాల్లో మనవాళ్లు సహజశైలిలో విజృంభిస్తే భారత్‌కు గెలుపుతోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న పతకం అందుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సుదిర్మన్ కప్‌లో విశేషంగా రాణిస్తేనే పతకాన్ని మెడలో వేసుకోవడం సాధ్యమవుతుంది. ఈనెల 27 నుంచి మే 4 వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో పోటీపడనున్న భారత జట్టును మంగళవారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. చిరాగ్ శెట్టి వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ నెలలోనే జరిగిన ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ జోడీ పాల్గొనలేదు. ప్రస్తుతం చిరాగ్ ఈ గాయం నుంచి తేరుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సుదిర్మన్ కప్‌లో ఈ జోడీ పునరాగమనం చేయనుంది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఐదు టోర్నీల్లో ఆడి రెండింటిలో సెమీఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో మినహా మిగతా నాలుగు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. భారత నంబర్‌వన్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఈ జంట సుదర్మిన్ కప్‌లో ఆడటంలేదు. ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లోనూ గాయత్రి–ట్రెసా జోడీ బరిలోకి దిగలేదు. గాయత్రి–ట్రెసా జోడీ స్థానంలో ప్రియా–శ్రుతి మిశ్రా ద్వయం సుదిర్మన్ కప్‌లో ఆడనుంది. నాలుగు విభాగాల్లో బ్యాకప్ ప్లేయర్లను ఎంపిక చేసిన ‘బాయ్’ మహిళల డబుల్స్‌లో ఒక్క జోడీనే ఎంపిక చేయడం గమనార్హం. క్లిష్టమైన ‘డ్రా’... ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా సుదిర్మన్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘డి’లో భారత్, మాజీ చాంపియన్ ఇండోనేసియా, మాజీ రన్నరప్ డెన్మార్క్‌తోపాటు ఇంగ్లండ్ జట్లున్నాయి. ఇంగ్లండ్ జట్టుపై భారత్ గెలిచే అవకాశం ఉన్నా... ఇండోనేసియా, డెన్మార్క్‌లపై నెగ్గాలంటే స్టార్ క్రీడాకారులు పూర్తిస్థాయిలో విజృంభించాల్సి ఉంటుంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగిశాక నాలుగు గ్రూప్‌ల నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ చేరుకున్న జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి.సుదిర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ జట్టుపురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ (ప్రపంచ 18వ ర్యాంక్), హెచ్ఎస్ ప్రణయ్ (ప్రపంచ 30వ ర్యాంక్). మహిళల సింగిల్స్: పీవీ సింధు (ప్రపంచ 18వ ర్యాంక్), అనుపమ ఉపాధ్యాయ్ (ప్రపంచ 44వ ర్యాంక్). పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ప్రపంచ 11వ ర్యాంక్); హరిహరన్–రూబన్ కుమార్ (ప్రపంచ 42వ ర్యాంక్). మహిళల డబుల్స్: ప్రియా కొన్జెంగ్బమ్–శ్రుతి మిశ్రా (ప్రపంచ 39వ ర్యాంక్). మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (ప్రపంచ 17వ ర్యాంక్), సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ (ప్రపంచ 33వ ర్యాంక్).
బిజినెస్

యూఎస్‌తో వాణిజ్య ఒప్పందానికి చాన్స్
యూఎస్ టారిఫ్‌లతో తలెత్తే సంక్షోభాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు వేగంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన నేపథ్యంలో పురి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. చైనాపై 145 శాతం సుంకాలు ప్రకటించినప్పటికీ కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ తదితర కొన్ని ఎల్రక్టానిక్ ప్రొడక్టులను మినహాయించారు. ప్రతీకార టారిఫ్‌ల అమలు జులై 9 వరకూ వాయిదా పడినప్పటికీ యూఎస్ ఎగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమపై టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని పురి పేర్కొన్నారు. అయితే భారత్ వీటిని పటిష్టస్థాయిలో ఎదుర్కోగలదని అంచనా వేశారు. పలు దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకునేందుకు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాదిలోనే ఈయూ, యూకేతోపాటు యూఎస్‌తోనూ ఒప్పందాలపై సంతకాలకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.మార్చిలోనే చర్చలు మొదలుయూఎస్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి(బీటీఏ) మార్చిలోనే చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం తొలి దశను సెప్టెంబర్–అక్టోబర్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030కల్లా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించే లక్ష్యంతో ఇందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌టీఏ, సమీకృత ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), బీటీఏలుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. తద్వారా భాగస్వామ్య దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తుసంబంధ వాణిజ్యంపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం చేస్తాయి.ఇదీ చదవండి: ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్స్వల్ప కాలానికి అనిశ్చితులువినియోగ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలానికి అనిశ్చితులను ఎదుర్కోవలసి ఉంటుందని పురి తెలియజేశారు. అయితే పోటీతత్వం, డిజిటైజేషన్, ఫ్యూచర్ రెడీ పోర్ట్‌ఫోలియో తదితరాల ద్వారా భారత్ నిలదొక్కుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాల అనిశ్చితి, అంచనాలకు అందని పరిస్థితులు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చునని, దీంతో భారత్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావానికి చాన్స్ ఉందని విశ్లేషించారు.

ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
చెన్నై: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఒక కొత్త బీమా ఉత్పత్తిని ఆవిష్కరించే ప్రణాళికతో ఉన్నట్టు ‘గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ల భిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకురానున్నట్టు చెప్పారు. అదే మాదిరి ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు ప్రత్యేక ప్లాన్లపైనా దృష్టి సారించినట్టు ప్రకటించారు. స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన గెలాక్సీకి ఫ్యామిలీ టీవీఎస్ వేణు శ్రీనివాసన్‌తోపాటు, హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వెటరన్, స్టార్ హెల్త్ వ్యవస్థాపకుడు వి.జగన్నాథన్ సహ ప్రమోటర్లుగా ఉన్నారు.‘ఏదైనా భిన్నంగా చేయాలన్న లక్ష్యంతో ఈ రెండు కుటుంబాలు కలసి గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఏర్పాటు చేశాయి. కస్టమర్లకు కచ్చితంగా వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలతో ఉత్పత్తులను తీసుకొస్తాం’ అని జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ క్లెయిమ్ దరఖాస్తును వేగంగా పరిష్కరించడంతోపాటు పూర్తి మొత్తాన్ని చెల్లించే విధంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద కంపెనీగా అవతరిస్తామని ప్రకటించారు. ఆరంభంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ దృష్టి పెడతామని చెప్పారు. ఇదీ చదవండి: ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులకు అనుమతి రూ.200 కోట్ల ప్రీమియంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుతం 60 ప్రాంతాల్లో కంపెనీకి కార్యాలయాలు ఉంటే, వీటిని 100కు పెంచుకోనున్నట్టు చెప్పారు. 90 శాతం వ్యాపారం రిటైల్ కస్టమర్ల నుంచి, మిగిలిన 10 శాతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి ఉంటుందన్నారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమ ఉత్పత్తులు జబ్బున పడినప్పుడే ఆదుకునే విధంగా ఉండకుండా.. కస్టమర్లు ఆరోగ్యంగా జీవించేందుకు సాయపడతాయని చెప్పారు. తమ ఉత్పత్తుల్లో వెల్నెస్ (ఆరోగ్య సంరక్షణ) అంతర్భాగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లలో లేని ఔట్ పేషెంట్ చికిత్సలపైనా తాము దృష్టి సారిస్తామని తెలిపారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే బీమా విస్తరణ మెరుగ్గా ఉందంటూ.. అదే సమయమంలో ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారికి సైతం తగినంత రక్షణ లేకపోవడాన్ని గుర్తించినట్టు శ్రీనివాసన్ వెల్లడించారు.

ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులకు అనుమతి
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మాతృ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్‌లో వాటాల కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఈ జాబితాలో టెక్ టైకూన్ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్ ఫ్యామిలీ ఆఫీస్, 360 వన్ అసెట్ చేరాయి.ఆకాశ ఎయిర్ దేశీయంగా ప్యాసింజర్, కార్గో రవాణా సర్వీసులందిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న 360 వన్ ఆల్టర్నేట్స్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా పీఐవోఎఫ్(ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ), పీఐ ఎగ్జిక్యూటివ్స్, క్లేపాండ్(పాయ్ కుటుంబ సంస్థ), 360 ఫండ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు సీసీఐ పేర్కొంది. భారీ వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా అజీమ్ ప్రేమ్జీతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల కన్సార్షియంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకాశ ఎయిర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..మరోవైపు ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌లో 45.97 శాతం వాటాను కలిగిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కుటుంబం సైతం అదనపు పెట్టుబడులు అందించేందుకు అంగీకరించింది. సంస్థ సీఈవో, వ్యవస్థాపకులలో ఒకరైన వినయ్ దూబే వాటా 16.13 శాతంకాగా.. సోదరులు సంజయ్, నీరజ్ విడిగా 7.59 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా మాధవ్ భట్కులీకి 9.41 శాతం, పీఏఆర్ క్యాపిటల్ వెంచర్స్ ఎల్ఎల్సీకి 6.37 శాతం చొప్పున వాటా ఉంది. అయితే ఇతర సంస్థలు కొత్తగా ఇన్వెస్ట్ చేయనున్న నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌లో ప్రస్తుత వాటాదారుల వాటాలు దిగిరానున్నాయి.

హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్ నెలకొందని పేర్కొంది. ‘భారత్‌లో అధిక జనాభా, భారీ కన్జూమర్ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్ కోసం భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్ 4.4%, కోల్కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా... అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది(2024) న్యూయార్క్‌లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్‌కాంగ్‌లో 6%, సియాటిల్‌లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..అయితే లండన్‌లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్‌లో 1.2%, సింగపూర్ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి.
ఫ్యామిలీ

వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!
హైడ్రేషన్.. వేసవిలో ఈ పదం మన ఆరోగ్యానికే కాదు, మన జీవితానికీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో వేడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ కష్టాలు, ఎయిర్ కండిషనర్ల నీడలో గడిచే జీవితాలు.. ఇలాంటి కారణాలతో మన శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గుతుంది. దాదాపు 70 శాతం పైగా నీరుండే మానవ శరీరం డీహైడ్రేషన్‌తో తాత్కాలిక ఆరోగ్య సమస్యలు మొదలు ప్రాణాపాయ పరిస్థితులకూ చేరుకుంటుంది. ప్రధానంగా చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ సమస్య జటిలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పళ్లరసాలు వేసవి తాపానికి, దాహానికి, దేహానికి సహజమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. హైడ్రేషన్ కోసం సహజమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం అందిస్తున్నాయి. వేసవిలో సైతం పండే పండ్లలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల.. ఇవి తక్షణ హైడ్రేషన్‌ను కలిగిస్తాయి. ద్రాక్ష, మామిడి, కర్భూజ, పుచ్చకాయ, నేరేడు, నారింజ వంటి పండ్లు పోషక సమ్మేళనంగా రసాలతో పాటు విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్–సీ, పొటాషియం, ఫైటో న్యూట్రియంట్స్ వంటి పోషకాలుంటాయి. ఇవి శరీరానికి జలాభిషేకం చేయడమే కాదు, హీట్ స్ట్రోక్, చెమట వల్ల వచ్చే అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి. డీహైడ్రేషన్‌ను ఎలా తగ్గిస్తాయి? వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) కోల్పోవడం సర్వసాధారణం. పళ్లరసాల్లో ఉండే సహజ పొటాషియం, సోడియం లాంటి ఖనిజాల వల్ల ఈ లోపాలను భర్తీ చేయడం సాధ్యపడుతుంది. ముఖ్యంగా నారింజ రసం శరీరానికి తక్షణ శక్తిని అందించగలవని ఆరోగ్య నిపుణుల సూచన. ముఖ్యంగా పుచ్చకాయ రసంలో 90 శాతానికి పైగా నీరు ఉండటంతో ఇది సహజ కూలెంట్గానూ పనిచేస్తుంది. కూల్ డ్రింక్స్ ఎందుకు మంచివి కావు? హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో అధికంగా వినియోగించే కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కార్బన్డయాక్సైడ్ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా శరీరానికి చల్లదనాన్ని కలిగించినట్టు అనిపించినా, అసలైన హైడ్రేషన్‌ను కలిగించవు. పైగా.. అధికంగా తీసుకుంటే మధుమేహం, దంత సమస్యలు, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక ప్రమాదాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం కార్యాలయానికి లేదా ఇతర పనుల మీద బయలుదేరేముందు ఓ గ్లాసు తాజా పళ్ల రసం తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఈ పండ్ల రసాలు రోడ్ల మీద దొరికేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం శ్రేయస్కరం. షుగర్ లేని, ప్లాస్టిక్ ఫ్రీ, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గం ఇదేనని వెల్నెస్ ట్రైనర్ల అభిప్రాయం. వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే.. చల్లని నీళ్లు కాకుండా, ఆరోగ్యవంతమైన పళ్లరసాలు ఎంచుకోవడం ఉత్తమం. ఎండదెబ్బ నుంచి రక్షణనిచ్చే పళ్ల రసాలు మామిడి పానకం : సహజ చక్కెరతో, తేనెతో తయారు చేస్తే శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. నారింజ/మోసంబి రసం : విటమిన్–సీ అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుచ్చకాయ రసం : శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో ఉత్తమమైనది. ద్రాక్ష రసం : హైడ్రేషన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తాజా కొబ్బరి నీరు : సహజమైన ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. (చదవండి: ఖరీదైన పండ్లకు కేరాఫ్‌గా భాగ్యనగరం..! ఏకంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చిలీ..)

Biruduraju Ramaraju తెలుగు సంస్కృతీరాజం రామరాజీయం
ఆచార్య బిరుదురాజు రామరాజు గురించిన ఆలోచన రాగానే సంస్కృతి, సంప్రదాయం, సాధన, విద్వత్తు మూర్తీభవించిన వ్యక్తిని మనోనేత్రంతో చూస్తాం. 55 ఏళ్ళనాడు పరిచయమైన రామ రాజుగారు కీర్తిశేషులయ్యే వరకు నా మీద చూపిన వాత్సల్యం ఎప్పటికీ గుర్తుంటుంది. వయసులో చిన్నవాళ్ళయినా ప్రేమతోబాటు గౌరవం చూపే సౌజన్యం ఆయనది. దీన్ని ఎన్నో సందర్భాలలో నేను చవిచూచాను. 24 సంవత్సరాల వయస్సులోనే నన్ను ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు పిలిపించి తెలుగు ఎం.ఎ. విద్యార్థులకు జానపద సాహిత్యం మీద ఉప న్యాసం ఇప్పించారాయన. 26 ఏళ్ళ వయస్సులోనే పిహెచ్.డి. పరీక్షకునిగా చేశారు. 27 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు ప్రాదుర్భావ సందర్భంగా నాచేత ప్రధానోపన్యాసం ఇప్పించారు. ‘గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః’ అనే వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ రామరాజుగారు. హైదరాబాదుకు ఎప్పుడైనా వెళ్ళానంటే చిక్కడ పల్లిలో రామరాజుగారి నివాసానికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడవలసిందే. జానపద విజ్ఞానంలో జరుగుతున్న కొత్త పరిశోధనలను గురించి అడిగి తెలుసుకొనే ఆయన ఆసక్తి ఆశ్చర్య పరిచేది. ‘నేను చెప్పిందే చివరి వాక్యం. చేసేదేదో చేసేశాను. ఇక చేయవల సింది ఏదీ లేదు’ అనే మనస్తత్వం కాదు రామరాజుగారిది. ఆయన చేసిన పరి శోధన, జానపద సాహిత్యంలో ఆయన కృషి తక్కువదేమీ కాదు. ‘జానపద సాహిత్యంలో పరిశోధన చేయడానికి ఏముంది?’ అని భావించే రోజుల్లో పట్టుబట్టి జానపదగేయ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసు కున్న సందర్భం తెలుగులో జానపద పరిశోధనకు నాందీ వాక్యం పలికింది. తెలుగులో విస్తృతంగా జానపద విజ్ఞాన పరిశోధన జరగడానికి మూలకారణం రామరాజుగారే. జానపద సాహిత్య సేకరణ, వర్గీకరణ, వివేచన విషయంలో ఆయనదే ఒరవడి.సంస్కృతి, సంప్రదాయాలు అంటే రామరాజుగారికి విపరీతమైన అభిమానం. అందువల్లనే మనకు తరతరాల వారసత్వంగా సంక్రమించిన జానపద సాహిత్యాన్ని ఆయన అంతగా అభిమానించారు. కాని అభిమా నించడంతో ఆగిపోలేదాయన. జానపద సాహిత్య పరిశోధనపైన దృష్టి సారించారు. పరిశోధనతో ఆగిపోక పోవడం ఆయన ముందుచూపునకు నిదర్శనం. ఆయన పరిశోధన గ్రంథాన్ని రెండోసారి ప్రచురించేటప్పుడు 1976లో నేను ప్రచురించిన ‘జానప సాహిత్య స్వరూపం’ పుస్తకాన్ని చూచినట్లుగా అందులో ఉటంకించారు. ఇది వారి హృదయ వైశాల్యాన్ని తెలుపుతుంది. జానపద విజ్ఞాన అధ్యయనాన్ని గురించి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఆయన ఆసక్తిని తెలుపుతుంది.బిరుదురాజు రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధనతోనే ఆగిపోలేదు. వారి సమకాలికులైన దిగ్దంతులవంటి పండితులతో సమానంగా వ్యవహరించాలని సంస్కృతంలో కూడా ఎం.ఎ. చేశారు. ప్రాచీన తెలుగు కావ్యాలవైపు దృష్టి సారించారు. ప్రాచీన రచనలను పరి చయం చేయడమే కాకుండా ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో విస్మృత కవులను గురించి ప్రచురించారు. ప్రాచీన తెలుగు కావ్యాలనే కాకుండా కొన్ని సంస్కృత గ్రంథాల్ని సేకరించి ప్రచురించారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక ఆంగ్లంలో కూడా రామరాజు గారు ప్రావీణ్యం గడించారు. ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా ‘ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ‘జానపద సాహిత్య బ్రహ్మ’ అనిపించుకోవడమే కాకుండా ప్రాచీన సాహిత్య పరిశోధన, నిఘంటు రచన, చారిత్రక నవలారచన, అముద్రిత గ్రంథాల పరిష్కరణ వంటి రంగా లలో కృషి చేసిన బిరుదురాజు రామరాజుగారు చిరస్మరణీయులు. -ఆర్వీయస్ సుందరం వ్యాసకర్త సాహితీ విమర్శకులు(నేడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంఎన్టీఆర్ కళామందిరంలో బిరుదురాజు రామరాజు శత జయంతి సదస్సు)

ఖరీదైన పండ్లకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!
హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి. న్యూజిలాండ్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫలాలు వస్తున్నాయి. ప్రధానంగా యాపిల్, కివీ, ప్లం, పియర్, డ్రాగన్, ఖర్జూర, చెర్రీ వంటి ఖరీదైన పండ్లు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి. విదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వెరైటీల పండ్లు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రూట్స్ ఏడాది పొడవునా..మరికొన్ని సీజన్ వారీగా విపణిలో అందుబాటులో ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి, నారింజ, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పైనాపిల్, జాక్ ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి. మోసంబీ, సీతాఫలం, బొబ్బాయి, మామి డి, జామ, పుచ్చకాయ వంటి పండ్లు రంగారెడ్డి, వికారాబాద్‌లతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో సాగవుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రధానంగా బాటసింగారం, మోజంజాహీ, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి పండ్ల మార్కెట్లు ముఖ్యమైనవి. పోషక అవసరాలను తీర్చడంలో ఉద్యానవన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా తర్వాతి నుంచి ప్రజల ఆహార అలవాట్లలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఒత్తిడి, బిజీ పనుల కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. దీంతో పండ్లు, కూరగాయల వినియోగం పెరిగింది. దీంతో రైతులు కూడా వైవిధ్యమైన తోటలను సాగు చేస్తున్నారు. మరోవైపు ఉద్యానవన సాగుతో కార్మిక శక్తికి ఉపాధి అవకాశాలను అందించినట్లవుతుంది. బాటసింగారం మార్కెట్లోకే 2023–24లో 4,65,633 టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలిపింది. రంగారెడ్డిలో 94 వేల ఎకరాల్లో సాగు.. గ్రేటర్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఉష్ణమండలం, సహజ వనరులు, అనువైన నేలలతో పాటు విస్తారమైన భూమి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 94,139 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానాల సాగు విస్తీర్ణం వాటా 30–40 శాతం వరకు ఉంటుంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జామ, తీపి నారింజ, దానిమ్మ, ఆమ్ల నిమ్మ, పుచ్చకాయ ప్రధానంగా సాగు అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఉద్యానవన పంటలు లాభదాయకయమైన రాబడిని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాసెసింగ్ పరిశ్రమకు ముడి పదార్థాలను అందించడం, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వంటి కారణాలతో గణనీయమైన ప్రాముఖ్యతను పొందుతుంది.ఖరీదు ఎక్కువే.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదైనవే ఉంటున్నాయి. డ్రాగన్, కివీ, ఖర్జూర, చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధర పలుకుతుండగా.. సాగు, సీజన్‌ను బట్టి మామిడి, యాపిల్, దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి. నగరంలో డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్‌కు రూ.1,13,610లుగా ఉండగా.. పియర్ రూ.30 వేలు, కివీ రూ.18,471, చెర్రీ రూ.24,975, నల్ల ద్రాక్ష రూ.17,344, ఖర్జూర రూ.16,100, మామిడి రూ.13,338, యాపిల్ రూ.15,927, దానిమ్మ రూ.14,225లుగా ఉన్నాయి. ఇక సపోటా, మోసంబీ, బొప్పాయి, నారింజ, అరటి వంటి లోకల్ ఫలాలు ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉన్నాయి.(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!)

రూ.10,980కే గానుగ నూనె యంత్రం
ఆరోగ్య రక్షణలో గానుగ నూనెల ప్రాధాన్యాన్ని ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఆరోగ్యాభిలాషులు గానుగ నూనెల కొనుగోలుకు వెనుకాడటం లేదు. మన దేశంలో గానుగ నూనెల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. దీని వార్షిక వ్యాపారం (సిఎజిఆర్) 2024–2032 మధ్యకాలంలో సుమారు 6% పెరుగుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. ప్రజల్లో ముఖ్యంగా నగర, పట్టణవాసుల్లో గానుగ నూనెల పట్ల మక్కువ పెరగటంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటంతో గానుగ నూనెల వ్యాపారానికి భవిష్యత్తులో విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. ఎద్దును కట్టి గానుగ తిప్పి నూనె వెలికి తీసే సంస్థలతోపాటు విద్యుత్తుతో కట్టె గానుగలు నడుపుతూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఎవరి ఇంట్లో వాళ్లు పెట్టుకొని నడుపుకోగలిగిన చిన్నవి, ఇంకో చోటికి సులభంగా తీసుకెళ్ల గలిగిన చిన్నపాటి గానుగ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటి ధర, నాణ్యతలో ప్రామాణికత లోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాన్పూర్ ఐఐటి ఒక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పోర్టబుల్ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందించింది. ఐఐటి కాన్పూర్‌లోని రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ (రుటాగ్)లో ఇంక్యుబేషన్ సేవలు అందుకున్న డి–ఐవి ఎంటర్ప్రైజెస్ అనే స్టార్టప్ ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రంలో మూడు భాగాలు ఉంటాయి. ఛాంబర్, ప్లంగర్ రాడ్, స్టెయిన్లెస్ సిలెండర్. అడుగున ఒక గిన్నెలో ఛాంబర్‌ను ఉంచి, అందులో నూనె గింజలు పోసి, పైన ఉన్న హేండిల్‌ను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటే ప్లంగర్ రాడ్ కిందికి దిగుతూ గింజల్ని వత్తుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ సిలెండర్‌కు ఉన్న రంథ్రాలలో నుంచి నూనె బయటకు వస్తుంది. తక్కువ విద్యుత్ ఖర్చుతో అధిక నాణ్యత గల నూనెను ఈ విధంగా వెలికితీయవచ్చని ఐఐటి చెబుతోంది. దీన్ని నడపడానికి విద్యుత్తు అవసరం లేదు. ఒక వ్యక్తి పెద్ద శ్రమ లేకుండానే దీనితో నూనెను వెలికితీయవచ్చు. వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, సోయా తదితర నూనె గింజల నుంచి దీనితో నూనె తీయవచ్చు. సంవత్సరం క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ యంత్రం ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్లింది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే ఈ యంత్రం ధర రూ. 10,980 మాత్రమే. ఇతర యంత్రాలతో పోల్చితే దీని ఖరీదు చాలా తక్కువని ఐఐటి కాన్పూర్ రుటాగ్ అధిపతి డాక్టర్ అమన్‌దీప్ సింగ్ చెప్పారు. యంత్రం వీడియో లింక్: https://www.youtube.com/watch?v=0ZMNaZMMC5oయంత్రం తయారీదారు మెయిల్ఐడి: divakmse@gmail.com
ఫొటోలు


‘డియర్ ఉమ’ మూవీ హీరోయిన్ సుమయ రెడ్డి (ఫొటోలు)


MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


విశాఖపట్నం : అంగరంగ వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ జాతర (ఫొటోలు)


ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ‘45’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


హైదరాబాద్‌లో పలుచోట్ల వడగండ్ల వర్షం (ఫొటోలు)


పెళ్లిబంధంలోకి టాలీవుడ్ నటి అభియన.. గ్రాండ్‌గా వేడుకలు (ఫొటోలు)


పెళ్లిలో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)


ఒకప్పటి తెలుగు హీరోయిన్.. 44వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


మంచు లక్ష్మీ ఫ్యాషన్ షో.. వజ్రంలా మెరిసిపోయిన అనసూయ (ఫొటోలు)


పెళ్లయి అప్పుడే మూడేళ్లు.. ఆలియా క్యూట్ వెడ్డింగ్ (ఫొటోలు)
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం.

చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.

డీఐఈ చీఫ్ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డీఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. డీఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. భారత మూలాలున్న నీలా రాజేంద్రకు అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుంది. ఆమెను ఎలాగైనా అట్టిపెట్టుకునేందుకు నాసా చివరిదాకా విఫలయత్నం చేసింది. అందులో భాగంగా నీలను జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ విభాగం డీఈఐ పదవి నుంచి తప్పించడమే గాక ఆమె హోదాను ‘టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ (టీఈఈఎస్)’విభాగం చీఫ్‌గా మార్చేసింది. నీల కెరీర్ ప్రొఫైల్ నుంచి డీఈఐ బాధ్యతల నిర్వహణ తాలూకు రికార్డులను పూర్తిగా తొలగించింది. అయినా లాభం లేకపోయింది. ‘‘నీల ఇకపై మనతో పాటు పనిచేయబోరు. ఎంతో ఆవేదన నడుమ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విభాగం డైరెక్టర్ లారీ లేసిన్ వెల్లడించారు. ‘‘నాసాకు నీల ఎనలేని సేవలందించారు. తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు. అందుకు సంస్థ ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’’అని సంస్థ సిబ్బందికి రాసిన ఈ మెయిల్లో పేర్కొన్నారు. టీఈఈఎస్ను మానవ వనరుల విభాగంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. ఏమిటీ డీఈఐ డీఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనారిటీలు తదితరులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు కారణమవుతోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింట్లోనూ డీఈఐ విభాగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, డీఈఐ నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయినా నీలను మాత్రం అప్పట్లో సంస్థ అట్టిపెట్టుకుంది. ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇప్పుడామెను తొలగించక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఖనిజాలు బంద్
బీజింగ్/బ్యాంకాక్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ఈ మేరకు పేర్కొంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు కార్ల తయారీ కంపెనీ టెస్లా, టెక్ దిగ్గజం యాపిల్ వంటి ఎన్నో సంస్థలు చాలా రకాలైన కీలక ముడి పదార్థాల కోసం ప్రధానంగా చైనా ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఆయా ఖనిజ నిల్వలు అమెరికాలోనూ ఉన్నా అక్కడి పరిశ్రమల అవసరాలను అవి ఏమాత్రమూ తీర్చలేవు. దాంతో వాటి లోటును భర్తీ చేసుకోవడం అగ్ర రాజ్యానికి చాలా కష్టతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం వాటా చైనాదే. చైనా నిర్ణయంతో అమెరికాతో పాటు చాలా దేశాలు ప్రభావితం కానున్నాయి.ఢీ అంటే ఢీ అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికాపై చైనా 125 శాతం సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీనే ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేగాక ఆయనవి మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగు పెట్టింది. ‘‘ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికీ మేలు జరగదు. వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఉండరు. అమెరికా బెదిరింపులకు లొంగే సమస్యే లేదు’’ అని స్పష్టం చేసింది. అమెరికా ముందుకొస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసింది.చైనాయే దిక్కు అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్ర రాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇదే సమయంలో చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. అంతేగాక అమెరికా నుంచి పలు కీలక వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై చైనా ఆంక్షలు విధించనుంది. అగ్ర రాజ్యానికి ఇది కూడా కోలుకోలేని దెబ్బే. అమెరికా సోయాబీన్ ఎగుమతులు తదితరాల్లో 10 శాతానికి పైగా వాటా చైనాదే.
జాతీయం

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.

నేషనల్ హెరాల్డ్ కేసు.. చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనకు సిద్ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.

అత్యాచార కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టుపై ‘సుప్రీం’ ఆగ్రహం
ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.మైనర్ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే?గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు. ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్‌లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.స్పందించిన సుప్రీం కోర్టు పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది.

రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఎన్ఆర్ఐ

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అబుదాబిలో ఘనంగా ఉగాది వేడుకలు..
సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యు.ఏ.ఈ లోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్వ్యర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నారుప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజధాని అబుదాబిలో కన్నుల పండుగగా జరిగింది. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి గార్లు తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి గారు లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి ఆర్ధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచర్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు .ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా గారు అందర్నీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ.. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తోంది. వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ..ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ.. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నారు. పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమ నిష్ఠలతో నిత్యం గాయత్రీదేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని పిలుపునిచ్చారుఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించింది. (చదవండి: Ugadi 2025: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..)
క్రైమ్

కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వస్తున్న విషయాన్ని గుర్తించారు.హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్‌పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నంచగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి యత్నంచారు . గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు.

ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!
మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనai ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణపాయ స్థితిలో ఉన్న 46 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రామ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తన భర్తకు ఈ సంఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనపై లైంగిక వేధింపుల గురించి ఏప్రిల్ 13న తన భర్తకు చెప్పగా అతను పోలీసులకు సమాచారం అందించాడు.ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమె కంపెనీ తరపున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి ఒక హోటల్లో బస చేసింది. ఈ సమయంలో, అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది, ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత, ఏప్రిల్ 5న, ఆమె భర్త ఆమెను చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మరొక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండగానే కొంతమంది సిబ్బంది ఆమెపై లైంగిక దాడి చేశారనీ, ఇద్దరు నర్సులు కూడా ఆమె చుట్టూ ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, భయపడ్డాని ఆమె పోలీసులకు తెలిపింది. ఏప్రిల్ 13న ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. తరువాత ఈ ఘటన గురించి భర్తకు తెలిపింది.ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియోతమ పోలీసు బృందం నిందితుడిని గుర్తించడానికి డ్యూటీ చార్ట్, సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. ఒక నిందితుడిని గుర్తించి అతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుమంటామని సందీప్ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి భద్రతా సిబ్బందిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటన గురించి తమకు తెలియ దన్నారు.

అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పబ్‌లో 16 మంది ముంబై అమ్మాయిలు.!
హైదరాబాద్: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి యువకులే టార్గెట్.. పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచి్చన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.
వీడియోలు


అమెరికాతో టారిఫ్ వార్ వేళ భారత్ కు చైనా స్నేహహస్తం


చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం


CPI Ramakrishna: దోచిపెట్టి మళ్ళీ అడుక్కోవడం ఎందుకు?


Vadde Sobhanadreeswara: హైపర్ లూప్ రైలు అమెరికా, జపాన్ దేశాల్లోనే లేదు.. కానీ అమరావతికి తెస్తాడంట ..


కూటమి పార్టీ నేతలు కుట్ర రాజకీయం చేస్తున్నారు


Director Sampath: రామ్ చరణ్‌కి కథ చెప్పడానికి ఇక వెళ్ళను..


"కేజీఎఫ్ 3" లోడింగ్ అంచనాలకు మించి: Prashanth Neel


చిరంజీవితో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది..


మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసుల షాక్


TDP కార్యకర్త మల్లేష్ పట్ల దురుసగా ప్రవర్తించిన MLA రమణపూర్తి పీఏ