Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Subramanian Swamy Serious On TTD Chairman Over Goshala Row1
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

Infosys To Hire 20000 Fresh Engineering Graduates in FY262
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్‌ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్‌ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!

A Woman Hyderabad Creates Drama After Jumping pff MMTS3
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. విచారణలో షాకింగ్‌ విషయాలు చెప్పిన యువతి

హైదరాబాద్‌: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్‌ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్‌ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్‌ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ రిపేర్‌ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తెల్లాపూర్‌– మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్‌ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది.

IPL 2025: CSK Sign Dewald Brevis To Replace Injured Gurjapneet4
IPL 2025: సీఎస్‌కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ బ్యాటింగ్‌ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్‌ రుతురాజ్‌ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్‌ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్‌కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం​ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన గుర్జప్నీత్‌ సింగ్‌ ఈ సీజన్‌ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్‌ బ్రెవిస్‌తో భర్తీ చేసింది. బ్రెవిస్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో 75 లక్షల బేస్‌ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ అతనికి బంపరాఫర్‌ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్‌ సైన్‌ చేసుకుంది. వాస్తవానికి ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఓ ఓవర్సీస్‌ బెర్త్‌ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్‌మెంట్‌గా కాకుండానే బ్రెవిస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్‌ను ఈ సీజన్‌ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్‌ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్‌ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తారు. బ్రెవిస్‌ ఓవరాల్‌గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. బ్రెవిస్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్‌లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ బ్రెవిస్‌ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్‌ ఫామ్‌ కష్టాల్లో ఉన్న సీఎస్‌కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్‌ వాంఖడే వేదికగా ఏప్రిల్‌ 20న జరుగనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్‌ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆయుశ్‌ మాత్రే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ చేరికతో సీఎస్‌కే బ్యాటింగ్‌ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్‌లో సీఎస్‌కే బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్‌ గైర్హాజరీలో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌, రవీంద్ర జడేజా, ఖలీల్‌ అహ్మద్‌, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు.

Land Grabbing By Alliance Leaders In Jammalamadugu5
భూ దందా.. జమ్మలమడుగులో ‘బాబాయ్‌-అబ్బాయ్‌’ రాజ్యాంగం

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. తాము చెప్పిందే వేదమంటూ ప్రభుత్వ భూమిని టీడీపీ యువనేత ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. నిన్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ వివాదంలో బాబాయ్ ఎంట్రి ఇవ్వగా.. అది మరువక ముందే మరొక భూదందాకు అబ్బాయ్‌ తెరలేపారు. బాబాయ్, అబ్బాయ్‌లు కలిసి దోచేసుకుంటున్నారు.పెద్ద ముడియం మండలం పాపాయపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేయించిన టీడీపీ యువనేత.. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్‌ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జాకు తెరతీశారు. ఎకరా రూ.6 లక్షల చొప్పున సదరు కంపెనీకి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.ఎన్వోసీలు తీసుకురావడం, చదును చేయడం అంతా మా పనేనంటున్న యువనేత.. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపెనీ అప్పనంగా అమ్మేస్తున్నారు. ఆ 500 ఎకరాల్లో పేదలకిచ్చిన డీకేటీ పట్టాలున్నా, వాటిపై కోర్టులో కేసు ఉన్నా టీడీపీ యువనేత పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని తహశీల్దార్‌ చెబుతున్నారు. తమ భూములను దౌర్జన్యంగా చదును చేస్తున్నారంటు డీకేటీ పట్టాదారులు వాపోతున్నారు.

BJP MLA Raja Singh Skips BJP Meeting Again6
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్‌ చెప్పకపోవడంగా సమాచారం. ప్రత్యర్థి పార్టీలో సీఎంగా ఉన్న సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్‌ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

GVMC Motion Updates: YSRCP Coporators Shocks Kutami Leaders7
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు

విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Kesari Chapter 2 Ananya Panday  amzing saree Looks 8
Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్‌ కలర్‌ చీరలో అమేజింగ్‌ లుక్స్‌

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్‌ చీరను ధరించి స్పెషల్‌ లుక్‌లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్‌ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్‌ అండ్‌ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్‌ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్‌ కుమార్‌ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్‌ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.

Arjun son of Vyjayanthi Movie Review And Rating Telugu9
'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' మూవీ రివ్యూ

టైటిల్‌ : అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి, సయీ మంజ్రేకర్‌,పృథ్వి, సోహైల్‌ ఖాన్, శ్రీకాంత్‌ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌నిర్మాతలు: అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్‌ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సాసంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌విడుదల: ఏప్రిల్‌ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్‌ వేడుక సమయంలో ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్‌లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్‌ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్‌ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్‌కౌంటర్‌ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్‌) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్‌ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్‌ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్‌ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్‌ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్‌ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్‌ వ్యవస్థనే సవాల్‌ చేసేంతలా అర్జున్‌ గ్యాంగ్‌ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్‌ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్‌ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్‌ అయిన అర్జున్‌ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్‌కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్‌ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్‌ మాఫీయా అర్జున్‌ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్‌ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్‌ కమీషనర్‌గా శ్రీకాంత్‌ రావడంతో కథలో స్పీడ్‌ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్‌ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు.'అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్‌ కొ​ంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్‌ చేసిన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్‌ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్‌ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్‌ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్‌ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్‌ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్‌ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్‌ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ పోటీ పడి నటించారు. క్లైమాక్స్‌ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్‌ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్‌ బలం ఎమోషన్‌.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్‌ బాగా హిట్‌ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్‌ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్‌ లేకుండా స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్‌ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్‌ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్‌ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్‌ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Bhagavad Gita, Natyashastra get Unesco honour10
Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement