
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు దాని అత్యంత సరసమైన మోటార్‌సైకిల్.. హంటర్ 350ను కొత్త హంగులతో 2025 వెర్షన్‌గా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.
2025 హంటర్ 350 బైకులో అతిపెద్ద మార్పు సస్పెన్షన్ అప్‌గ్రేడ్. వెనుక భాగంలో మెరుగైన కంప్రెషన్ & రీబౌండ్ అనుభవాలను అందించే ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌లు లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో స్లిప్ అండ్ క్లచ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. కొత్త హ్యాండిల్‌బార్, ఫాస్ట్ USB ఛార్జింగ్, కొత్త సీటు, కొత్త ఎగ్జాస్ట్ రూటింగ్ మాత్రమే కాకుండా పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి ఇక్కడ చూడవచ్చు.
ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
పర్ఫామెన్స్ పరంగా, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఈ బైక్ మూడు కొత్త రంగులలో లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ. 1.50 లక్షలు, మిడ్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు, టాప్ ఎండ్ ధర రూ. 1.82 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్).