
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి.
దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి.