
ఏప్రిల్ నెల ముగియనుంది. మే నెల వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. మే నెలలో శని, ఆదివారాలతో కలిపి మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉంటాయి.
మే నెలలో బ్యాంకు సెలవుల జాబితా
➤మే 1, 2025 – కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం
➤మే 4, 2025 – ఆదివారం
➤మే 9, 2025 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
➤మే 10, 2025 – రెండవ శనివారం
➤మే 11, 2025 – ఆదివారం
➤మే 12, 2025 – బుద్ధ పూర్ణిమ
➤మే 16, 2025 – సిక్కిం స్టేట్ డే
➤మే 18, 2025 – ఆదివారం
➤మే 24, 2025 – నాల్గవ శనివారం
➤మే 25, 2025 – ఆదివారం
➤మే 26, 2025 – కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు
➤మే 29, 2025 – మహారాణా ప్రతాప్ జయంతి
ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. ఎల్ఐసీ కీలక ప్రకటన
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).