
మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.
దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.
రానున్న బ్యాంక్ సెలవుల జాబితా
» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.
» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.
» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.
ఈ సెలవులు ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.