వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పని చేస్తాయి. ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులతోపాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. వచ్చే నెలలో దాదాపు 11 బ్యాంకులకు సెలవులు ఉంటాయి కాబట్టి, ఆ నెలలో బ్యాంక్ బ్రాంచ్‌ని సందరర్శించే పని ఉన్నవారు సెలవుల జాబితాను ఓ సారి చూసుకోవడం మంచిది. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు.
ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే..
- ఫిబ్రవరి 4 - ఆదివారం
- ఫిబ్రవరి 10- రెండవ శనివారం
- ఫిబ్రవరి 11- ఆదివారం
- ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సెలవు)
- ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు)
- ఫిబ్రవరి 18- ఆదివారం
- ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు)
- ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం
- ఫిబ్రవరి 25- ఆదివారం
- ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు)
Comments
Please login to add a commentAdd a comment