
చంద్రయాన్-3 సక్సెస్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చంద్రుడి దక్షృణ ధృవంపై అడిగిడిన తొలి దేశంగా భారత్ ఘనతను దక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇందంతా ఒక ఎత్తయితే యూ ట్యూబ్‌లో అత్యంత అధికమైన వ్యూయర్‌షిప్‌ను సాధించిన టాప్‌లో నిలచింది. దీనిపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్
క్రికెట్ కాదు. సినిమాలు కాదు. సైన్స్ & టెక్నాలజీ. చాలా గర్వంగా ఉంది. వ్యూస్ రేసులో పోడియం అగ్రస్థానంలో నిలిచింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Not Cricket. Not Movies. It was Science & Technology—and pride—that took the top of the podium in the viewership race. The future is bright… https://t.co/8eZZOy55Up
— anand mahindra (@anandmahindra) August 26, 2023