
మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతే కాకుండా ఆదాయ పన్ను, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, యూపీఐ రూల్, అప్డేటెడ్ ఐటీఆర్ డెడ్‌లైన్ మొదలైనవాటికి కూడా అదే ఆఖరి రోజు కావడం గమనార్హం. కాబట్టి ఈ కథనంలో ఏప్రిల్ 1నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుంది. ఈ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది.
యూపీఐ రూల్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి.
ఐటీఆర్ డెడ్‌లైన్
భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31కు ముందే తమ అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR-U) దాఖలు చేసుకోవాలి. గడువులోపల ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే.. దాఖలు చేసిన రిటర్న్‌లకు 25% తక్కువ అదనపు పన్ను రేటు ఉంటుంది. గడువు దాటితే.. అదనపు పన్ను భారం మోయాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య భీమాకు సంబంధించిన ఏవైనా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటే మార్చి 31లోపల క్లియర్ చేసుకోవాలి. సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపును కోల్పోకుండా ఉండటానికి గడువు లోపల చెల్లింపులు పూర్తవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే గడువులోగా ప్రీమియంలు చెల్లించకపోతే ఆరోగ్య కవరేజీని కోల్పోయే ప్రమాదం ఉంది.
అడ్వాన్స్ ట్యాక్స్
అదనపు ఆదాయాలపై ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైన.. జీతం పొందుతున్న ఉద్యోగులు మార్చి 31 లోపల చెల్లించవచ్చు. పన్ను చెల్లింపుదారులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి అప్డేట్ చేయబడిన రిటర్న్(ITR-U)ను దాఖలు చేయడం ద్వారా గత ఆదాయపు పన్ను రిటర్న్‌లను సరిదిద్దవచ్చు. దీనికి కూడా మార్చి 31 చివరిరోజు.
ఇదీ చదవండి: మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్’.. ఈ యాప్ గురించి తెలుసా?
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్
పన్ను చెల్లింపుదారులు మార్చి 31 లోపల.. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్, డిక్లరేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన ప్లాన్ చేసుకుంటే గడువు లోపల పన్ను చెల్లించాలి. అయితే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునేవారే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్లు చేసుకోవచ్చు. కొత్త పన్న విధానానికి ఇది వర్తించదు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రూల్స్
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తోంది. ఎస్‌బీఐ తన క్లబ్ విస్తారా ఎస్‌బీఐ, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.