‘ఆధార్‌ ఏటీఎం’ వచ్చేసింది..అదెలా పనిచేస్తుందంటే? | Ippb Introduced Online Aadhaar Atm Service At Home | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ఏటీఎం వచ్చేసింది..ఇంట్లో కూర్చొని డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు!

Published Tue, Apr 9 2024 7:46 PM | Last Updated on Tue, Apr 9 2024 9:55 PM

Ippb Introduced Online Aadhaar Atm Service At Home - Sakshi

మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంక్ లేదంటే ఏటీఎంకు వెళ్లేందుకు సమయం లేదా? మరేం ఫర్లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం( ఏఈపీఎస్‌) సేవను ఉపయోగించి ఇంటి నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ కనీస అవసరాల్ని తీర్చుకోవచ్చు.    
 
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. అందులో ‘అత్యవసర నగదు కావాలి కానీ బ్యాంక్‌కు వెళ్లేందుకు సమయం లేదా? చింతించకండి! ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ఆన్‌లైన్‌లో ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్‌) ద్వారా మీ ఇంటి నుంచే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మీకు సహాయం చేస్తారు.’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది. 

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్‌)
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్‌)తో ఒక వ్యక్తి తన బయోమెట్రిక్‌ని ఉపయోగించి నగదు తీసుకోవడానికి, ఆధార్-లింక్డ్ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఇతరులకు నగదు పంపుకోవచ్చు. కస్టమర్‌లు ఏటీఎం లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఏఈపీఎస్‌ని ఉపయోగించి చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది.  

ఏఈపీఎస్‌ అంటే 
ఏఈపీఎస్‌ అంటే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్‌) అనేది ఒక చెల్లింపు సేవ. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయడంతో పాటు ప్రాథమిక్‌ బ్యాంకింగ్‌ అవసరాలు అంటే బ్యాలెన్స్‌ ఎంక్వైరీ చేసుకోవడం, కొద్ది మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో బ్యాంక్‌ అకౌంట్‌కు పంపుకోవచ్చు.  

ఏఈపీఎస్‌ సేవల్ని పొందడం ఎలా? 

  • ఏఈపీఎస్‌ సర్వీసుల్ని పొందాలనుకునే కస్టమర్‌కు తప్పని సరిగా బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలి.   
  • ఆ బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ చేయాలి.  
  • బయోమెట్రిక్‌ను ఉపయోగించి డబ్బుల్ని పంపడం,విత్‌ డ్రాయిల్‌ వంటి సేవల్ని వినియోగించుకోవచ్చు.  
  • ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది.
  • ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement