
సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమదైన రంగాలలో రాణిస్తూనే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే నటుడు సునీల్ శెట్టి.. ఆయన అల్లుడు & భారత్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి థానే వెస్ట్‌లోని ఓవాలేలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్‌సైట్ ప్రకారం.. ఈ భూమి విలువ రూ. 9.85 కోట్లు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ.. 2025 మార్చిలో జరిగాయి. ఈ భూమి ఆనంద్ నగర్, కాసర్వాడవలి మధ్య ఉంది. ఇది థానే వెస్ట్‌ను తూర్పు, పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేకు సమీపంలో ఉండటం వల్ల వ్యాపార కనెక్టివిటీకి కూడా అనుకూలంగా ఉంటుంది.స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ. 68.96 లక్షలు అని, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 30,000 అని తెలుస్తోంది.
భారతదేశపు ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్.. జాతీయ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడారు. వైస్ కెప్టెన్‌గా పనిచేశారు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో జట్లకు నాయకత్వం వహించారు. సియట్ టి20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులతో గుర్తింపు పొందిన రాహుల్, భారతదేశంలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ఒకరుగా ఉన్నారు.
ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఇక నటుడు సునీల్ శెట్టి విషయానికి వస్తే.. ఈయన సుమారు 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి రాజీవ్ గాంధీ అవార్డు దక్కింది. సినిమాల్లో మాత్రమే కాకూండా ఫిట్‌నెస్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వెంచర్లలో కూడా సునీల్ శెట్టి రాణిస్తున్నారు.