ఆలస్యంగా ఫుడ్‌ డెలివరీ.. ఆపై తీవ్ర దూషణలు! | late in receiving order in Zomato delivery boy started abusing | Sakshi

ఆలస్యంగా ఫుడ్‌ డెలివరీ.. ఆపై తీవ్ర దూషణలు!

Published Mon, Oct 21 2024 9:12 PM | Last Updated on Mon, Oct 21 2024 9:12 PM

late in receiving order in Zomato delivery boy started abusing

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో సేవలపై ఓ మహిళా కస్టమర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్‌ ఫుడ్‌ ఐటమ్‌ను ఆలస్యంగా అందించడమే కాకుండా దూర్భాషలాడినట్లు ఓ కస్టమర్‌ తెలిపారు. దీనిపై సంస్థ ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ను ట్యాగ్‌ చేశారు. అందుకు సంబంధించి తన ఎక్స్‌ ఖాతాలో వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన రాధిక బజాజ్‌ తన ఎక్స్‌ ఖాతాలో..‘జొమాటోలో ఫుట్‌ ఆర్డర్‌ పెట్టాను. నా తరఫు ఆర్డర్‌ రిసీవ్‌ చేసుకునేందుకు మా కంపెనీ ఆఫీస్‌బాయ్‌ను ఏర్పాటు చేశాను. ముందుగా నిర్ణయించిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ బాయ్‌ ఆర్డర్‌ డెలివరీ చేశాడు. ఆలస్యానికి కారణం అడిగిన మా ఆఫీస్‌ బాయ్‌ను తీవ్రంగా దూషించాడు. జొమాటో డెలివరీ బాయ్‌ల ప్రవర్తనను మెరుగుపరచడంపై కంపెనీ ప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టరు. ఇలా దుర్భాషలాడే హక్కు ఎవరికీ లేదు. డెలివరీ బాయ్‌కి అయినా.. లేదా కంపెనీ సీఈఓ అయినా గౌరవ మర్యాదలు ఒక్కటే విధంగా ఉంటాయి’ అని పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: గూగుల్‌ 15 జీబీ స్టోరేజ్‌ నిండిందా? ఇలా చేయండి..

ఈ వ్యవహారంపై జొమాటో సంస్థ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ‘ఇది ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. వెంటనే సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము త్వరలో మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం’ అని స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement