
ఇంధన పరివర్తనలో భారతదేశ కృషికి తోడ్పడనున్న 5 MWh పవర్‌హౌస్
ఢిల్లీ: విద్యుత్ స్టోరేజీ ఉత్పత్తుల విభాగంలో అగ్రగామి, టూవీలర్ ఈ-మొబిలిటీ రంగంలో దిగ్గజమైన ప్యూర్ సంస్థ, బ్యాటరీ ఆధారిత 5 MWh గ్రిడ్ స్టోరేజీ ఉత్పత్తి ప్యూర్‌పవర్ గ్రిడ్‌ను (PuREPower Grid) ఢిల్లీలో ఆవిష్కరించింది. ఈ వినూత్నమైన ఉత్పత్తి, భారతదేశ విద్యుత్ మౌలిక సదుపాయాల్లో పరివర్తన తెచ్చేందుకు, గ్రిడ్ స్థిరత్వంపరంగా సాధికారత కల్పించేందుకు, రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను సమగ్రపర్చడాన్ని వేగవంతం చేసేందుకు తోడ్పడనుంది.
ఇన్-బిల్ట్ సోలార్, పీసీఎస్‌తో 5MWh కంటైనరైజ్డ్ ఉత్పత్తిగా రూపొందిన ప్యూర్‌పవర్ గ్రిడ్ ఇప్పటికే పరిశ్రమలో గణనీయంగా ఆమోదయోగ్యత పొందింది. 10కి పైగా దిగ్గజ రెన్యూవబుల్ ఎనర్జీ ఈపీసీ సంస్థలు & భారీ పరిశ్రమల నుంచి ప్యూర్‌కి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) వచ్చాయి.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంలకు (బీఈఎస్ఎస్) భారత్‌లో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2030 నాటికి దేశం నిర్దేశించుకున్న 500 GW పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని సాధించాలన్న లక్ష్యం, 200 GWh పైగా బీఈఎస్ఎస్ సామర్థ్యాల అవసరం నెలకొన్న నేపథ్యంలో ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ మార్కెట్ 36 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో దశాబ్దకాలంపైగా డిజైన్ సామర్థ్యాలు, మేకిన్ ఇండియా అనుభవం దన్నుతో గ్రిడ్-స్కేల్ సెగ్మెంట్లో ప్యూర్ చాలా తక్కువ ధరలో, అధునాతన ఉత్పత్తిని అందించగలుగుతోంది.
ప్యూర్‌పవర్ గ్రిడ్ అత్యధిక విద్యుత్ సాంద్రత గల బ్యాటరీలు, 5వ తరం పవర్ ఎలక్ట్రానిక్స్‌తో నిర్మించబడింది. నిరాటంకమైన రిమోట్ మానిటరింగ్, 100 శాతం అప్‌టైమ్, తక్కువ అవాంతరాలు, గరిష్ట నిర్వహణ సామర్థ్యాల కోసం ఇందులో క్లౌడ్ & ప్రెడిక్టివ్ ఏఐ పొందుపర్చబడింది.
ప్యూర్‌పవర్‌లో సెల్-స్థాయిలో నానో-పీసీఎం కూలింగ్, ప్యాక్-స్థాయి మరియు ర్యాక్-స్థాయిలో లిక్విడ్ కూలింగ్ సామర్థ్యాలతో గ్రిడ్ సమగ్రమైన మల్టీ-లెవెల్ థర్మల్ మేనేజ్‌మెంట్/కూలింగ్ సిస్టం కలిగి ఉంటుంది. శక్తి వృధా కాకుండా వేడిమి సక్రమంగా విస్తరించేందుకు, జీవితకాలం పెరిగేందుకు, మెరుగైన రౌండ్ ట్రిప్ సామర్ధ్యాలకు విశిష్టమైన ఈ డిజైన్ ఉపకరిస్తుంది. ప్రపంచ స్థాయి భద్రతను అందిస్తుంది. పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన ధరకు అందిస్తుండటం, స్థానికంగానే విడిభాగాలతో సర్వీసింగ్ సదుపాయం అందుబాటులో ఉండటం వల్ల భాగస్వాములకు మెరుగైన, సమర్ధవంతమైన అసెట్ మేనేజ్‌మెంట్ సేవలు పొందేందుకు వీలవుతుంది.
“ప్యూర్‌పవర్ గ్రిడ్ అనేది ఒక ఉత్పత్తి మాత్రమే కాదు. భారత ఇంధన పరివర్తనకు ఇదొక ఉత్ప్రేరకంలాంటిది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో అపార అనుభవంతో శక్తివంతమైన, తెలివైన, తక్కువ ధరకు లభించే గ్రిడ్-స్కేల్ ఉత్పత్తిని మేము రూపొందించాం. గ్రిడ్ స్థిరత్వానికి, రెన్యువబుల్స్‌ను నిరాటంకంగా సమగ్రపర్చడానికి ప్యూర్‌పవర్ గ్రిడ్ తోడ్పడుతుంది. ట్రాన్స్‌ఫార్మర్ అప్‌గ్రేడ్, రైట్ ఆఫ్ వే, డిస్ట్రిబ్యూషన్ అప్‌గ్రేడేషన్ వంటి వ్యయప్రయాలతో కూడుకున్న ప్రక్రియల భారం లేకుండా ఈఎస్ఎస్ ప్రోడక్టులను సమగ్రపర్చడం ద్వారా ఈవీలకు ఫాస్ట్ చార్జర్ల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్యూర్‌పవర్ గ్రిడ్ తోడ్పడుతుంది” అని Dr. నిశాంత్ దొంగారి తెలిపారు.
ప్యూర్ ఇప్పటికే గృహాలు, వ్యాపార సంస్థలకు తమ ప్యూర్‌పవర్ హోమ్, ప్యూర్‌పవర్ కమర్షియల్ ప్రోడక్టుల ద్వారా సేవలు అందిస్తుండగా, ఢిల్లీలో ఆవిష్కృతమైన 5 MWh ప్యూర్‌పవర్ గ్రిడ్, సౌర & పవన విద్యుత్ ప్రాజెక్టులు, భారీ కమర్షియల్ మరియు పారిశ్రామిక సంస్థలతో పాటు జాతీయ రహదారులపై ఏర్పాటు కాబోయే వేలకొద్దీ ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లకు దన్నుగా నిలవగలదు.